టెక్నికల్ కోర్సుల్లో ఇంటర్‌డిసిప్లినరీ అప్రోచ్‌కు ప్రాధాన్యం.. అసలేంటి ఈ అప్రోచ్ తెలుసుకోండిలా..
Sakshi Education
ప్రస్తుతం అంతర్జాతీయంగా వస్తున్న సామాజిక, ఆర్థిక, సాంకేతిక మార్పులను పరిగణనలోకి తీసుకుంటే.. టెక్నికల్ కోర్సుల విద్యార్థులకు ఇంటర్‌డిసిప్లినరీ అప్రోచ్ చాలా అవసరం. ఇందుకోసం టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్ చర్యలు తీసుకోవాలి.
ఇంటర్‌డిసిప్లినరీ విధానాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతోనే.. గేట్-2021లో హ్యుమానిటీస్ అభ్యర్థులకూ అవకాశం కల్పించాం.. అంటున్నారు.. ఐఐటీ-ముంబై డెరైక్టర్ ప్రొఫెసర్ శుభాశిష్ చౌధురి. గేట్‌లో పలు మార్పులు చేపట్టిన తరుణంలో గేట్ నిర్వాహక ఇన్‌స్టిట్యూట్ ఐఐటీ ముంబై డెరైక్టర్ ప్రొఫెసర్ శుభాశిష్ చౌధురితో ఈ వారం గెస్ట్ కాలం..
ఇప్పటికే పలు కోర్సులు..
గేట్-2021లో హ్యుమానిటీస్ పేపర్‌ను ప్రవేశ పెట్టడం కొత్తగా కనిపిస్తున్నప్పటికీ.. వాస్తవానికి ఐఐటీల్లో ఇప్పటికే ఈ విభాగాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి పీజీ, పీహెచ్‌డీ స్థాయి కోర్సుల్లో ప్రవేశాలు కూడా కల్పిస్తున్నాం. ఇప్పటివరకు ఆయా కోర్సుల్లో ప్రవేశాలకుసదరు ఇన్‌స్టిట్యూట్‌లు వేర్వేరుగా ఎంపిక ప్రక్రియ చేపట్టేవి. వీటిని ఒకే గొడుగు కిందకి తీసుకువచ్చేలా గేట్‌లో హ్యుమానిటీస్ పేపర్‌ను ప్రవేశ పెట్టడం జరిగింది. ఇక నుంచి ఐఐటీలు ఆ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకొని.. హ్యుమానిటీస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నాయి.
ఇంటర్ డిసిప్లినరీ..
ఇంజనీరింగ్, టెక్నాలజీ విద్యార్థులకు ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఉండాలనే అభిప్రాయం ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఇప్పటివరకు ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో కోర్ సబ్జెక్ట్‌లోనే కోర్సు పూర్తి చేసే విధంగా కరిక్యులం అమలవుతోంది. అందుకే ఇంటర్‌డిసిప్లినరీ అప్రోచ్‌ను అకడమిక్ స్థాయిలోనే పెంచాలనే ఉద్దేశంతోనే రెండు పేపర్ల విధానానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే కొన్ని ఐఐటీలు, ఎన్‌ఐటీలు.. మేజర్ సబ్జెక్ట్‌గా కోర్‌తోపాటు ఇతర సబ్జెక్ట్‌ను మైనర్‌గా ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. ఇక నుంచి పూర్తి స్థాయిలో అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న ఇతర సబ్జెక్ట్‌ను అభ్యసించే వీలు కల్పిస్తూ తాజా నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా వీటికి క్రెడిట్స్ ఇచ్చే విధానం కూడా ఉంటుంది.
కొనసాగింపు: విద్యార్థుల్లో సామాజిక దృక్పథం పెరిగేలా ప్రోత్సాహం

Published date : 25 Sep 2020 02:42PM