టైమ్స్ ర్యాంకింగ్స్‌లో మనదేశ విద్యాసంస్థలు
Sakshi Education
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్.. ఇన్‌స్టిట్యూట్‌లకు ర్యాంకులు కేటాయించడంలో అంతర్జాతీయంగా పేరు పొందిన సంస్థ! ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్‌లకు పలు ప్రామాణికాల ఆధారంగా ఏటా ర్యాంకులు కేటాయిస్తోంది. తాజాగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్- 2019ను విడుదల చేసింది! అంతర్జాతీయంగా ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, స్టాన్‌ఫోర్డ్, మిట్ వరుసగా... మొదటి నాలుగు స్థానాలు కైవసం చేసుకున్నాయి. భారత్ నుంచి ఎప్పటి మాదిరిగానే ఐఐఎస్సీ బెంగళూరు టాప్‌లో నిలిచింది. ఈ నేపథ్యంలో టైమ్స్ ర్యాంకింగ్‌లో చోటు సంపాదించుకున్న భారత్ విద్యాసంస్థలు.. ర్యాంకుల కేటాయింపునకు పరిగణనలోకి తీసుకున్న ప్రమాణాలు.. ఇన్‌స్టిట్యూట్‌ల ర్యాంకులతో విద్యార్థులకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...
గత కొన్నేళ్లుగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు ర్యాంకింగ్స్ విడుదల చేస్తోంది. ఈ ఏడాది కూడా ఇటీవల టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్-2019 జాబితా వెలువడింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1,258 ఇన్‌స్టిట్యూట్‌లను సంప్రదించి నిర్దిష్ట మెథడాలజీ ఆధారంగా ఈ ర్యాంకింగ్స్‌ను రూపొందించారు.
తొలి స్థానంలో ఐఐఎస్సీ:
అంతర్జాతీయంగా గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తొలి ర్యాంకును ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, రెండో ర్యాంకును కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు సొంతం చేసుకోవడం విశేషం. మన దేశానికి సంబంధించి ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు తొలి స్థానంలో నిలిచింది. 251-300 శ్రేణిలో నిలిచిన ఈ ఇన్‌స్టిట్యూట్ టీచింగ్, రీసెర్చ్, సైటేషన్స్, ఇంటర్నేషనల్ ఔట్‌లుక్, ఇండస్ట్రీ ఇన్‌కమ్ వంటి పారామీటర్స్‌లో ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలకు దీటుగా నిలిచింది. ఐఐఎస్సీ ఆయా పరామితుల పరంగా గతేడాది కంటే మెరుగైన స్కోర్లు సొంతం చేసుకోవడం విశేషం.
ఐఐటీలు.. ఏడు నుంచి పదికి :
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఐఐటీలకు గతేడాది కంటే కొంత మెరుగైన గుర్తింపు లభించింది. గత ర్యాంకుల జాబితాలో ఏడు ఐఐటీలే నిలవగా.. ఈసారి మొత్తం పది ఐఐటీలకు ర్యాంకింగ్స్‌లో చోటు దక్కింది. ఐఐటీ హోదా పొందిన ఐఎస్‌ఎం-ధన్‌బాద్‌ను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య పదకొండు. గతేడాది ఐఐఎస్సీ తర్వాత స్థానంలో ఉన్న ఐఐటీ-ముంబైను వెనక్క నెట్టి.. ఐఐటీ-ఇండోర్ ఆ స్థానాన్ని సొంతం చేసుకోవడం విశేషం.
తొలిసారి ఐఐటీ-హైదరాబాద్ :
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకుల్లో తొలిసారిగా ఐఐటీ-హైదరాబాద్‌కు చోటు లభించింది. ఐఐటీ హైదరాబాద్‌తోపాటు ఇండోర్, భువనేశ్వర్‌లు కూడా ఈ ఏడాది తొలిసారిగా చోటు దక్కించుకున్నాయి. ఐఐటీ ఇండోర్ తొలిసారి చోటు సాధించడమే కాకుండా.. ఏకంగా భారత ఇన్‌స్టిట్యూట్‌ల ర్యాంకుల పరంగా రెండో స్థానంలో నిలవడం విశేషం. దీన్నిబట్టి ఐఐటీల్లో ప్రమాణాలు మెరుగవుతున్నాయని, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందే దిశగా కృషి చేస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
42 నుంచి 49
ఈ ఏడాది మన దేశం నుంచి మొత్తం 49 ఇన్‌స్టిట్యూట్‌లు/వర్సిటీలకు టైమ్స్ ర్యాంకుల జాబితాలో చోటు లభించింది. గత సంవత్సరం ఈ సంఖ్య 42 మాత్రమే. ఈ సంవత్సరం ర్యాంకుల జాబితాలో ఐఐఎస్‌ఈఆర్ వంటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలతోపాటు రాష్ట్రాల స్థాయిలోని వర్సిటీలు, ప్రైవేటు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి.
టాప్-10 వరల్డ్ యూనివర్సిటీలు..
తెలుగు రాష్ట్రాల నుంచి నాలుగు:
తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) నుంచి నాలుగు ప్రభుత్వ యూనివర్సిటీలకు టైమ్స్ ర్యాంకింగ్స్‌లో స్థానం లభించింది. ఏపీ నుంచి ఏయూ, ఏఎన్‌యూ, ఎస్‌వీయూ, తెలంగాణ నుంచి ఉస్మానియా యూనివర్సిటీలకు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలు 801- 1000 శ్రేణిలో నిలిచాయి. ఆంధ్రా యూనివర్సిటీ 1000+ శ్రేణిలో ర్యాంకుల జాబితాలో నిలిచింది. తెలంగాణ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రమే (801-1000 శ్రేణి) ర్యాంకుల జాబితాలో చోటు దక్కించుకుంది.
నాలుగు పరామితుల ఆధారంగానే..
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకుల రూప కల్పనలో నాలుగు పరామితులనే పరిగణనలోకి తీసుకున్నారు. అవి.. టీచింగ్; రీసెర్చ్, సైటేషన్స్ (రీసెర్చ్ ప్రచురణలు), ఇంటర్నేషనల్ ఔట్‌లుక్ (అంతర్జాతీయ గుర్తింపు), ఇండస్ట్రీ ఇన్‌కమ్ (కొలాబరేషన్స్, స్పాన్సర్డ్ రీసెర్చ్ ద్వారా లభించే ఆదాయం ఆధారంగా). ఈ పరామితులకు ఒక్కోదానికి నిర్దిష్ట వెయిటేజీ కల్పించారు. టీచింగ్-లెర్నింగ్‌కు 30 శాతం; రీసెర్చ్‌కు 30 శాతం; సైటేషన్స్‌కు 30 శాతం; ఇంటర్నేషనల్ ఔట్‌లుక్‌కు 7.5 శాతం; ఇండస్ట్రీ ఇన్‌కమ్‌కు 2.5 శాతం వెయిటేజీ చొప్పున కేటాయించింది. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో ఈ పరామితులకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని.. దానికి అనుగుణంగా ర్యాంకుల నిర్ధారణ జరిగింది. ఒక్కో పారామీటర్‌కు కేటాయించిన వెయిటేజీ శాతంలో దానికి అనుబంధ అంశాలకు కూడా నిర్దిష్ట స్కోర్లు కేటాయించి.. వాటిని సదరు సైటేషన్‌కు పేర్కొన్న వెయిటేజీ శాతానికి కలిపారు. ఉదాహరణకు 30 శాతం వెయిటేజీ ఇచ్చిన టీచింగ్ పారామీటర్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. ఇందులో మరో అయిదు అనుబంధ అంశాలు(రెప్యుటేషన్ సర్వే-15 శాతం; స్టాఫ్-స్టూడెంట్ నిష్పత్తి-4.5 శాతం; డాక్టొరేట్ టు బ్యాచిలర్స్ నిష్పత్తి-2.25 శాతం; డాక్టొరేట్ అవార్డ్ పొందిన బోధన సిబ్బంది నిష్పత్తి-6 శాతం; ఇన్‌స్టిట్యూషనల్ ఇన్‌కమ్-2.25 శాతం)ను బేరీజు వేసి.. ఆయా అంశాల్లో ఒక ఇన్‌స్టిట్యూట్‌కు లభించిన స్కోర్‌ను క్రోడీకరించి.. సంబంధిత పారామీటర్‌లో స్థూల స్కోర్‌ను పేర్కొన్నారు. ఇదే విధానాన్ని ఇతర పారామీటర్స్ విషయంలోనూ అనుసరించారు.
అదే సమస్య..
భారత ఇన్‌స్టిట్యూట్‌లు గతేడాదితో పోల్చితే మెరుగ్గా కనిపించినప్పటికీ.. నిర్దిష్ట పారామీటర్స్ పరంగా మరింత మెరుగవ్వాల్సి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, రీసెర్చ్, సైటేషన్స్ పారామీటర్స్ విషయంలో ఇన్‌స్టిట్యూట్‌లు వెనుకంజలో ఉండటం మొత్తం ర్యాంకులపై ప్రభావం చూపుతోంది. ఉదాహరణకు 30 శాతం వెయిటేజీ ఉన్న టీచింగ్-లెర్నింగ్ పారామీటర్‌లో.. ఫ్యాకల్టీ అర్హతల పరంగా డాక్టొరేట్ పొందిన ఫ్యాకల్టీ సంఖ్య తక్కువగా ఉండటం పూర్తిస్థాయిలో స్కోర్ పొందకపోవడానికి కారణమని చెప్పొచ్చు. ఇదే పారామీటర్‌లో మరో ఉప కొలమానంగా పేర్కొన్న మేల్-ఫిమేల్ స్టూడెంట్ నిష్పత్తి విషయంలోనూ మహిళా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం కూడా సమస్యగా మారింది.
రీసెర్చ్, సైటేషన్స్ :
ర్యాంకుల కేటాయింపులో 30 శాతం చొప్పున వెయిటేజీ ఉన్న రీసెర్చ్, సైటేషన్స్ పరంగా కొన్ని ఐఐటీలు, ఐఐఎస్సీ మినహా మిగతా ఇన్‌స్టిట్యూట్‌లు 50 శాతం కూడా స్కోర్ సాధించలేకపోయాయి. వాస్తవానికి గతేడాది ఐఐఎస్సీ కూడా 50 శాతం లోపే (48.6 శాతం) స్కోర్ సాధించగా.. ఈ ఏడాది పరిస్థితి కొంత మెరుగై రీసెర్చ్ వెయిటేజీ స్కోర్ 51.4 శాతానికి చేరింది. మిగతా ఇన్‌స్టిట్యూట్‌లలో ఈ స్కోర్ కనిష్టంగా 19.3 శాతం; గరిష్టంగా 33 శాతం నమోదవడం గమనార్హం. ఈ గణాంకాలను పరిశీలిస్తే రీసెర్చ్ కార్యకలాపాలు మరింత పెరగాలని అర్థమవుతోంది.
టీచింగ్‌లో కొంత మెరుగు..
గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం భారత ఇన్‌స్టిట్యూట్‌లు టీచింగ్ పారామీటర్‌లో కాసింత మెరుగైన స్కోర్ సొంతం చేసుకున్నాయి. అదే విధంగా ఇతర పారామీటర్స్‌లోనూ ఐఐఎస్సీ, ఐఐటీలు కొంత మెరుగైన స్కోర్ సాధించడం విశేషం. ఒక్క ఇన్‌స్టిట్యూట్ కూడా పరిశోధనల పారామీటర్‌లో 50 శాతం స్కోర్ కూడా పొందలేకపోయాయి. సైటేషన్స్ విషయంలో నైతే ఐఐటీ రూర్కీ మినహా ఏ ఇన్‌స్టిట్యూట్ కూడా 50 శాతం మార్కును అందుకోలేకపోవడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల ఇన్‌స్టిట్యూట్‌లు..
తెలుగు రాష్ట్రాల నుంచి 1000 లోపు ర్యాంకులతో 800-1000 శ్రేణిలో నిలిచిన నాలుగు యూని వర్సిటీల్లో.. ర్యాంకుల పారా మీటర్స్‌లో పేర్కొన్న అన్ని పారామీటర్స్ విషయంలోనూ వెనుకంజలో ఉన్నాయి. ముఖ్యం గా టీచింగ్ పారామీటర్‌లో ఫ్యాకల్టీ కొరత సమస్య ఈ యూనివర్సిటీలు ర్యాంకుల శ్రేణిలో ముందంజలో నిలవకపోవడానికి ప్రధాన సమస్యగా మారింది. రీసెర్చ్ కోణంలో నాలుగు యూనివర్సిటీలు కూడా పది శాతంలోపే స్కోర్ పొందాయి.
టైమ్స్ ర్యాంకింగ్స్‌లో నిలిచిన ఐఐటీలు, వాటి ర్యాంకుల శ్రేణి వివరాలు..
ర్యాంకుల ప్రయోజనాలు..
‘‘ఇన్‌స్టిట్యూట్‌లకు ర్యాంకులు కేటాయించేటప్పుడు సదరు సంస్థల్లో బోధన, పరిశోధనలు, సైటేషన్స్ వంటి పలు ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఫలితంగా విద్యార్థులకు సదరు ఇన్‌స్టిట్యూట్‌లు లేదా యూనివర్సిటీల్లో చదువుల నాణ్యతపై అవగాహన వస్తుంది. తద్వారా విద్యార్థులు మెరుగైన విద్యాసంస్థను ఎంపిక చేసుకోవచ్చు. ఇన్‌స్టిట్యూట్‌లకు ర్యాంకుల కేటాయింపు వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనం ఇదే ’.. - ఇన్‌స్టిట్యూట్స్‌కు ర్యాంకింగ్స్‌పై విద్యావేత్తల అభిప్రాయం! |
గత కొన్నేళ్లుగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు ర్యాంకింగ్స్ విడుదల చేస్తోంది. ఈ ఏడాది కూడా ఇటీవల టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్-2019 జాబితా వెలువడింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1,258 ఇన్‌స్టిట్యూట్‌లను సంప్రదించి నిర్దిష్ట మెథడాలజీ ఆధారంగా ఈ ర్యాంకింగ్స్‌ను రూపొందించారు.
తొలి స్థానంలో ఐఐఎస్సీ:
అంతర్జాతీయంగా గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తొలి ర్యాంకును ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, రెండో ర్యాంకును కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు సొంతం చేసుకోవడం విశేషం. మన దేశానికి సంబంధించి ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు తొలి స్థానంలో నిలిచింది. 251-300 శ్రేణిలో నిలిచిన ఈ ఇన్‌స్టిట్యూట్ టీచింగ్, రీసెర్చ్, సైటేషన్స్, ఇంటర్నేషనల్ ఔట్‌లుక్, ఇండస్ట్రీ ఇన్‌కమ్ వంటి పారామీటర్స్‌లో ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలకు దీటుగా నిలిచింది. ఐఐఎస్సీ ఆయా పరామితుల పరంగా గతేడాది కంటే మెరుగైన స్కోర్లు సొంతం చేసుకోవడం విశేషం.
ఐఐటీలు.. ఏడు నుంచి పదికి :
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఐఐటీలకు గతేడాది కంటే కొంత మెరుగైన గుర్తింపు లభించింది. గత ర్యాంకుల జాబితాలో ఏడు ఐఐటీలే నిలవగా.. ఈసారి మొత్తం పది ఐఐటీలకు ర్యాంకింగ్స్‌లో చోటు దక్కింది. ఐఐటీ హోదా పొందిన ఐఎస్‌ఎం-ధన్‌బాద్‌ను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య పదకొండు. గతేడాది ఐఐఎస్సీ తర్వాత స్థానంలో ఉన్న ఐఐటీ-ముంబైను వెనక్క నెట్టి.. ఐఐటీ-ఇండోర్ ఆ స్థానాన్ని సొంతం చేసుకోవడం విశేషం.
తొలిసారి ఐఐటీ-హైదరాబాద్ :
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకుల్లో తొలిసారిగా ఐఐటీ-హైదరాబాద్‌కు చోటు లభించింది. ఐఐటీ హైదరాబాద్‌తోపాటు ఇండోర్, భువనేశ్వర్‌లు కూడా ఈ ఏడాది తొలిసారిగా చోటు దక్కించుకున్నాయి. ఐఐటీ ఇండోర్ తొలిసారి చోటు సాధించడమే కాకుండా.. ఏకంగా భారత ఇన్‌స్టిట్యూట్‌ల ర్యాంకుల పరంగా రెండో స్థానంలో నిలవడం విశేషం. దీన్నిబట్టి ఐఐటీల్లో ప్రమాణాలు మెరుగవుతున్నాయని, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందే దిశగా కృషి చేస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
42 నుంచి 49
ఈ ఏడాది మన దేశం నుంచి మొత్తం 49 ఇన్‌స్టిట్యూట్‌లు/వర్సిటీలకు టైమ్స్ ర్యాంకుల జాబితాలో చోటు లభించింది. గత సంవత్సరం ఈ సంఖ్య 42 మాత్రమే. ఈ సంవత్సరం ర్యాంకుల జాబితాలో ఐఐఎస్‌ఈఆర్ వంటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలతోపాటు రాష్ట్రాల స్థాయిలోని వర్సిటీలు, ప్రైవేటు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి.
టాప్-10 వరల్డ్ యూనివర్సిటీలు..
ఇన్‌స్టిట్యూట్ | ర్యాంకు | స్కోర్ |
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ | 1 | 96.0 |
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ | 2 | 94.8 |
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ | 3 | 94.7 |
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | 4 | 94.2 |
కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | 5 | 94.1 |
హార్వర్డ్ యూనివర్సిటీ | 6 | 93.6 |
ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ | 7 | 92.3 |
యేల్ యూనివర్సిటీ | 8 | 91.3 |
ఇంపీరియల్ కాలేజ్ లండన్ | 9 | 90.3 |
యూనివర్సిటీ ఆఫ్ షికాగో | 10 | 90.2 |
తెలుగు రాష్ట్రాల నుంచి నాలుగు:
తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) నుంచి నాలుగు ప్రభుత్వ యూనివర్సిటీలకు టైమ్స్ ర్యాంకింగ్స్‌లో స్థానం లభించింది. ఏపీ నుంచి ఏయూ, ఏఎన్‌యూ, ఎస్‌వీయూ, తెలంగాణ నుంచి ఉస్మానియా యూనివర్సిటీలకు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలు 801- 1000 శ్రేణిలో నిలిచాయి. ఆంధ్రా యూనివర్సిటీ 1000+ శ్రేణిలో ర్యాంకుల జాబితాలో నిలిచింది. తెలంగాణ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రమే (801-1000 శ్రేణి) ర్యాంకుల జాబితాలో చోటు దక్కించుకుంది.
నాలుగు పరామితుల ఆధారంగానే..
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకుల రూప కల్పనలో నాలుగు పరామితులనే పరిగణనలోకి తీసుకున్నారు. అవి.. టీచింగ్; రీసెర్చ్, సైటేషన్స్ (రీసెర్చ్ ప్రచురణలు), ఇంటర్నేషనల్ ఔట్‌లుక్ (అంతర్జాతీయ గుర్తింపు), ఇండస్ట్రీ ఇన్‌కమ్ (కొలాబరేషన్స్, స్పాన్సర్డ్ రీసెర్చ్ ద్వారా లభించే ఆదాయం ఆధారంగా). ఈ పరామితులకు ఒక్కోదానికి నిర్దిష్ట వెయిటేజీ కల్పించారు. టీచింగ్-లెర్నింగ్‌కు 30 శాతం; రీసెర్చ్‌కు 30 శాతం; సైటేషన్స్‌కు 30 శాతం; ఇంటర్నేషనల్ ఔట్‌లుక్‌కు 7.5 శాతం; ఇండస్ట్రీ ఇన్‌కమ్‌కు 2.5 శాతం వెయిటేజీ చొప్పున కేటాయించింది. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో ఈ పరామితులకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని.. దానికి అనుగుణంగా ర్యాంకుల నిర్ధారణ జరిగింది. ఒక్కో పారామీటర్‌కు కేటాయించిన వెయిటేజీ శాతంలో దానికి అనుబంధ అంశాలకు కూడా నిర్దిష్ట స్కోర్లు కేటాయించి.. వాటిని సదరు సైటేషన్‌కు పేర్కొన్న వెయిటేజీ శాతానికి కలిపారు. ఉదాహరణకు 30 శాతం వెయిటేజీ ఇచ్చిన టీచింగ్ పారామీటర్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. ఇందులో మరో అయిదు అనుబంధ అంశాలు(రెప్యుటేషన్ సర్వే-15 శాతం; స్టాఫ్-స్టూడెంట్ నిష్పత్తి-4.5 శాతం; డాక్టొరేట్ టు బ్యాచిలర్స్ నిష్పత్తి-2.25 శాతం; డాక్టొరేట్ అవార్డ్ పొందిన బోధన సిబ్బంది నిష్పత్తి-6 శాతం; ఇన్‌స్టిట్యూషనల్ ఇన్‌కమ్-2.25 శాతం)ను బేరీజు వేసి.. ఆయా అంశాల్లో ఒక ఇన్‌స్టిట్యూట్‌కు లభించిన స్కోర్‌ను క్రోడీకరించి.. సంబంధిత పారామీటర్‌లో స్థూల స్కోర్‌ను పేర్కొన్నారు. ఇదే విధానాన్ని ఇతర పారామీటర్స్ విషయంలోనూ అనుసరించారు.
అదే సమస్య..
భారత ఇన్‌స్టిట్యూట్‌లు గతేడాదితో పోల్చితే మెరుగ్గా కనిపించినప్పటికీ.. నిర్దిష్ట పారామీటర్స్ పరంగా మరింత మెరుగవ్వాల్సి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, రీసెర్చ్, సైటేషన్స్ పారామీటర్స్ విషయంలో ఇన్‌స్టిట్యూట్‌లు వెనుకంజలో ఉండటం మొత్తం ర్యాంకులపై ప్రభావం చూపుతోంది. ఉదాహరణకు 30 శాతం వెయిటేజీ ఉన్న టీచింగ్-లెర్నింగ్ పారామీటర్‌లో.. ఫ్యాకల్టీ అర్హతల పరంగా డాక్టొరేట్ పొందిన ఫ్యాకల్టీ సంఖ్య తక్కువగా ఉండటం పూర్తిస్థాయిలో స్కోర్ పొందకపోవడానికి కారణమని చెప్పొచ్చు. ఇదే పారామీటర్‌లో మరో ఉప కొలమానంగా పేర్కొన్న మేల్-ఫిమేల్ స్టూడెంట్ నిష్పత్తి విషయంలోనూ మహిళా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం కూడా సమస్యగా మారింది.
రీసెర్చ్, సైటేషన్స్ :
ర్యాంకుల కేటాయింపులో 30 శాతం చొప్పున వెయిటేజీ ఉన్న రీసెర్చ్, సైటేషన్స్ పరంగా కొన్ని ఐఐటీలు, ఐఐఎస్సీ మినహా మిగతా ఇన్‌స్టిట్యూట్‌లు 50 శాతం కూడా స్కోర్ సాధించలేకపోయాయి. వాస్తవానికి గతేడాది ఐఐఎస్సీ కూడా 50 శాతం లోపే (48.6 శాతం) స్కోర్ సాధించగా.. ఈ ఏడాది పరిస్థితి కొంత మెరుగై రీసెర్చ్ వెయిటేజీ స్కోర్ 51.4 శాతానికి చేరింది. మిగతా ఇన్‌స్టిట్యూట్‌లలో ఈ స్కోర్ కనిష్టంగా 19.3 శాతం; గరిష్టంగా 33 శాతం నమోదవడం గమనార్హం. ఈ గణాంకాలను పరిశీలిస్తే రీసెర్చ్ కార్యకలాపాలు మరింత పెరగాలని అర్థమవుతోంది.
టీచింగ్‌లో కొంత మెరుగు..
గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం భారత ఇన్‌స్టిట్యూట్‌లు టీచింగ్ పారామీటర్‌లో కాసింత మెరుగైన స్కోర్ సొంతం చేసుకున్నాయి. అదే విధంగా ఇతర పారామీటర్స్‌లోనూ ఐఐఎస్సీ, ఐఐటీలు కొంత మెరుగైన స్కోర్ సాధించడం విశేషం. ఒక్క ఇన్‌స్టిట్యూట్ కూడా పరిశోధనల పారామీటర్‌లో 50 శాతం స్కోర్ కూడా పొందలేకపోయాయి. సైటేషన్స్ విషయంలో నైతే ఐఐటీ రూర్కీ మినహా ఏ ఇన్‌స్టిట్యూట్ కూడా 50 శాతం మార్కును అందుకోలేకపోవడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల ఇన్‌స్టిట్యూట్‌లు..
తెలుగు రాష్ట్రాల నుంచి 1000 లోపు ర్యాంకులతో 800-1000 శ్రేణిలో నిలిచిన నాలుగు యూని వర్సిటీల్లో.. ర్యాంకుల పారా మీటర్స్‌లో పేర్కొన్న అన్ని పారామీటర్స్ విషయంలోనూ వెనుకంజలో ఉన్నాయి. ముఖ్యం గా టీచింగ్ పారామీటర్‌లో ఫ్యాకల్టీ కొరత సమస్య ఈ యూనివర్సిటీలు ర్యాంకుల శ్రేణిలో ముందంజలో నిలవకపోవడానికి ప్రధాన సమస్యగా మారింది. రీసెర్చ్ కోణంలో నాలుగు యూనివర్సిటీలు కూడా పది శాతంలోపే స్కోర్ పొందాయి.
టైమ్స్ ర్యాంకింగ్స్‌లో నిలిచిన ఐఐటీలు, వాటి ర్యాంకుల శ్రేణి వివరాలు..
ఐఐటీ | ర్యాంకుల శ్రేణి |
ఐఐటీ-ఇండోర్ | 351-400 |
ఐఐటీ-ముంబై | 401-500 |
ఐఐటీ-రూర్కీ | 401-500 |
ఐఐటీ-ఢిల్లీ | 501-600 |
ఐఐటీ-కాన్పూర్ | 501-600 |
ఐఐటీ-ఖరగ్‌పూర్ | 501-600 |
ఐఐటీ-గువహటి | 601-800 |
ఐఐటీ-చెన్నై | 601-800 |
ఐఐటీ-భువనేశ్వర్ | 601-800 |
ఐఐటీ-హైదరాబాద్ | 601-800 |
ర్యాంకుల ప్రయోజనాలు..
- ఇన్‌స్టిట్యూట్‌లో టీచింగ్, లెర్నింగ్, రీసెర్చ్ తదితర అంశాలపై అవగాహన.
- వాస్తవ పరిస్థితులు తెలుసుకునే అవకాశం.
- వీటి ఆధారంగా తమ లక్షిత యూనివర్సిటీల విషయంలో స్పష్టత.
పరిస్థితిలో క్రమేణా మెరుగుదల.. ఇన్‌స్టిట్యూట్‌లకు ర్యాంకులకు సంబంధించి నిర్దేశించిన పారామీటర్స్ విషయంలో ఐఐటీల్లో క్రమేణా మెరుగుదల కనిపిస్తోంది. కొత్తగా మూడు ఐఐటీలు ఈ జాబితాలో చోటు సాధించడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొనొచ్చు. ఇంటర్నేషనల్ స్టూడెంట్, ఫ్యాకల్టీ, రీసెర్చ్ పారామీటర్స్ పరంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటే మరింత మంచి ర్యాంకులు సొంతం చేసుకునే అవకాశముంది. - ప్రొఫెసర్ ఆర్.వి.రాజ్‌కుమార్, డెరైక్టర్, ఐఐటీ-భువనేశ్వర్. |
ఆ రెండూ ప్రధానం : ర్యాంకింగ్స్‌లో ఒక ఇన్‌స్టిట్యూట్ మంచి ర్యాంకు సొంతం చేసుకోవాలంటే ప్రధానంగా రెండు అంశాలు ప్రభావితం చేస్తాయి. అవి.. ఇండస్ట్రీ ఇన్‌కమ్, రీసెర్చ్. రాష్ట్రాల స్థాయిలోని యూనివర్సిటీలతో కలిసి పని చేసేందుకు ఇండస్ట్రీ వర్గాలు ముందుకు వస్తే మరింత మెరుగైన ర్యాంకులు రావడం ఖాయం. 1000+ శ్రేణి నుంచి ఇంకా మంచి ర్యాంకు సాధించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం. - ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం, వీసీ, ఉస్మానియా యూనివర్సిటీ |
Published date : 05 Oct 2018 05:21PM