స్వయం ప్రతిపత్తి...విద్యార్థులకు నైపుణ్యాల ప్రాప్తి
Sakshi Education
దేశవ్యాప్తంగా ఐదు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు సహా 52 యూనివర్సిటీలతోపాటు మరో ఎనిమిది కళాశాలలకు యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) స్వయంప్రతిపత్తి కల్పించింది.
తద్వారా కొత్త కోర్సుల ప్రారంభం..సిలబస్ రూపకల్పన.. ఆఫ్-క్యాంపస్ సెంటర్ల ఏర్పాటు.. విదేశీ ఇన్‌స్టిట్యూట్స్‌తో ఒప్పందాలు తదితర మరెన్నో అంశాల్లో ఆయా వర్సిటీలకు స్వేచ్ఛ లభించనుంది. యూజీసీ (కేటగిరైజేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఫర్ గ్రాంట్ ఆఫ్ గ్రేడెడ్ అటానమీ) రెగ్యులేషన్స్-2018కు అనుగుణంగా కల్పించిన స్వయం ప్రతిపత్తితో ఇన్‌స్టిట్యూట్‌లకు, విద్యార్థులకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఒక యూనివర్సిటీ కొత్త కోర్సును ప్రారంభించాలంటే.. అకడమిక్ సెనేట్ అనుమతి.. ఆ తర్వాత బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆధ్వర్యంలో కరిక్యులం రూపకల్పన.. వాటికి అనుమతి కోసం యూజీసీ తలుపు తట్టడం.. ఇప్పటివరకు అమలవుతున్న విధానం! దీనివల్ల జాబ్‌మార్కెట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం, సరికొత్త సిలబస్‌కు రూపకల్పన ఆలస్యం అవుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే.. దేశంలో ఉన్నత విద్యలో సంస్కరణలు తేవాలని, ఇందుకు నిబంధనలను సరళీకృతం చేయడమే మార్గమని భావించి అమల్లోకి తెచ్చిన కొత్త విధానమే.. యూజీసీ (కేటగిరైజేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఫర్ గ్రాంట్ ఆఫ్ గ్రేడెడ్ అటానమీ) రెగ్యులేషన్స్-2018. దీని ప్రకారం..అటానమీ పొందిన యూనివర్సిటీలు అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ పరంగా స్వతంత్రంగా వ్యవహరించే వీలుంటుంది.
నీతి ఆయోగ్ సిఫార్సులు..
నీతి ఆయోగ్ సిఫార్సులతోనే యూజీసీ కొత్త రెగ్యులేషన్స్‌కు శ్రీకారం చుట్టింది. దేశంలో ఉన్నత విద్యలో సంస్కరణల దిశగా సలహాలు అందించేందుకు నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా ఆధ్వర్యంలో 2017లో ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ సూచనలకు అనుగుణంగానే యూజీసీ(కేటగిరైజేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఫర్ గ్రాంట్ ఆఫ్ గ్రేడెడ్ అటానమీ) రెగ్యులేషన్స్-2018కు రూపకల్పన జరిగింది. దీనికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమోదం లభించింది.
52 వర్సిటీలకు అటానమీ :
యూజీసీ గ్రేడెడ్ అటానమీ రెగ్యులేషన్స్‌కు ఆమోదం లభించిన నేపథ్యంలో.. తాజాగా కేంద్ర మానవ వనరుల శాఖ జాతీయ స్థాయిలో 52 యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి కల్పించింది. ఈ 52 యూనివర్సిటీల్లో 5 కేంద్రీయ విశ్వ విద్యాలయాలు; 21 రాష్ట్రస్థాయి యూనివర్సిటీలు, 24 డీమ్డ్ టు బి యూనివర్సిటీలు, రెండు ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయి. వీటితోపాటు మరో ఎనిమిది కళాశాలలకు కూడా స్వయం ప్రతిపత్తి హోదా లభించింది.
న్యాక్ రేటింగ్ ఆధారంగా..
న్యాక్ రేటింగ్స్ ఆధారంగా యూజీసీ యూనివర్సిటీలను రెండు కేటగిరీలు (కేటగిరీ-1, కేటగిరీ-2) గా విభజించింది. ఈ కేటగిరీల్లో నిలవడానికి నిర్దేశిత అర్హత నిబంధనలు రూపొందించింది. ఆ వివరాలు..
కేటగిరీ-1 :
న్యాక్ రేటింగ్స్‌లో 3.51 అంతకంటే ఎక్కువ రేటింగ్ పొందిన వర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్‌లు.
(లేదా)
యూజీసీ నియమించిన కమిటీ మంచి గ్రేడ్ లేదా స్కోర్ ఇచ్చి ఉండాలి.
(లేదా)
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్, క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ వంటి అంతర్జాతీయ ఇన్‌స్టిట్యూట్స్ ర్యాంకుల జాబితాలో టాప్-500లో నిలవడం.
కేటగిరీ-2 :
న్యాక్ రేటింగ్ 3.26 నుంచి 3.5 మధ్యలో నిలిచిన యూనివర్సిటీలు/ ఇన్‌స్టిట్యూట్‌లు
(లేదా)
యూజీసీ నియమించిన కమిటీ మంచి గ్రేడ్ లేదా స్కోర్ ఇచ్చి ఉండాలి.
కేటగిరీ-1.. అన్ని విషయాల్లో స్వేచ్ఛగా

- న్యాక్ రేటింగ్ ఆధారంగా అటానమస్ గ్రేడింగ్‌లో కేటగిరీ-1లో నిలిచిన యూనివర్సిటీలు అన్ని విషయాల్లోనూ పూర్తి స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం లభిస్తోంది.
- కేటగిరీ-1 పరిధిలోని విద్యా సంస్థలు అన్నీ 12(బి) పరిధిలోకి వచ్చేస్తాయి.
- యూజీసీ అనుమతి అవసరం లేకుండానే అప్పటికే తమ యూనివర్సిటీ పరిధిలో ఉన్న విభాగాల్లో కొత్త కోర్సులు, డిపార్ట్‌మెంట్స్, స్కూల్స్, సెంటర్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
- ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీమ్డ్ టు బి యూనివర్సిటీలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానంలో కొత్త కోర్సులు ప్రారంభిస్తూ నిధులు కోరితే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.
- తాజా పరిస్థితులకు అనుగుణంగా డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించొచ్చు. వీటికి ఆయా నియంత్రణ సంస్థల అనుమతి పొందాలి.
- యూనివర్సిటీ భౌగోళిక పరిమితికి లోబడి ఆఫ్-క్యాంపస్ సెంటర్లను, అనుబంధ విభాగాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే వీటికి నిధులు సొంతంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
- స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు ప్రారంభించొచ్చు.
- రీసెర్చ్ పార్క్స్, ఇంక్యుబేషన్ సెంటర్స్, యూనివర్సిటీ-సొసైటీ అనుసంధాన కేంద్రాలు ప్రారంభించొచ్చు.
- మొత్తం ఫ్యాకల్టీలో 20 శాతం వరకు విదేశీ ఫ్యాకల్టీని నియమించుకునే అవకాశముంది. అదే విధంగా మొత్తం విద్యార్థుల్లో 20 శాతం మేర విదేశీ విద్యార్థులకు ప్రవేశం కల్పించొచ్చు.
- ఫ్యాకల్టీకి పనితీరుకు అనుగుణంగా ఆకర్షణీయ వేతనాలు అందించే వెసులుబాటు ఉంటుంది.
- యూజీసీ అనుమతి లేకుండానే.. టాప్-500 జాబితాలో నిలిచిన యూనివర్సిటీలతో అకడమిక్ ఒప్పందాలు చేసుకోవచ్చు.
- ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సులను ఆఫర్ చేసే స్వేచ్ఛ ఉంటుంది.
- యూజీసీ నిరంతర తనిఖీల నుంచి విముక్తి లభిస్తుంది.
- కేటగిరీ-2లోని యూనివర్సిటీలకు చాలా అంశాల్లో.. కేటగిరీ-1 పరిధిలోని యూనివర్సిటీలకు లభించిన విధంగానే స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. కాని కొన్ని అంశాల్లో మాత్రం యూజీసీ, ఇతర నియంత్రణ సంస్థల అనుమతి తప్పనిసరి.
- ఆఫ్-క్యాంపస్ సెంటర్ల ఏర్పాటులో డీమ్డ్ టు బి యూనివర్సిటీలకు యూజీసీ తనిఖీల నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ.. ఆ మినహాయింపును అయిదేళ్లలో రెండు సెంటర్ల ఏర్పాటుకే పరిమితం చేసింది.
- ఇంక్యుబేషన్ సెంటర్స్, రీసెర్చ్ పార్క్స్, సొసైటీ అనుసంధాన సెంటర్ల ఏర్పాటుకు యూజీసీ అనుమతి తప్పనిసరి.
- ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో కోర్సులు ప్రారంభించేందుకు యూజీసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
- టాప్-500 యూనివర్సిటీలతో ఒప్పందాల విషయంలోనూ యూజీసీ అనుమతి పొందాలి.
నిధుల సమీకరణ :
యూనివర్సిటీలకు అటానమస్ హోదా కల్పించినప్పటికీ.. కొన్ని అంశాల పరంగా (ఇంక్యుబేషన్ సెంటర్స్, రీసెర్చ్ పార్క్స్ స్థాపన; ఆఫ్ క్యాంపస్ సెంటర్లు ఏర్పాటు; ఆకర్షణీయ వేతనాలు అందించడం వంటివి) సొంతంగా నిధులు సమీకరించుకోవాలని యూజీసీ మార్గదర్శకాల్లో పేర్కొనడంపై ప్రతికూల అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనివల్ల విద్యార్థులపై ఫీజుల భారం పెరిగే ఆస్కారముందనే వాదన వినిపిస్తోంది.
స్వయం ప్రతిపత్తి ...ప్రయోజనాలు

- తాజా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కోర్సులు ప్రారంభించే అవకాశం.
- అంతర్జాతీయ ఫ్యాకల్టీని నియమించుకునేందుకు మార్గం.
- విద్యార్థులకు సరికొత్త నైపుణ్యాలు అందించే వీలు కలుగుతుంది.
- వ్యక్తిగతంగా పరిశోధనలు చేసే ఫ్యాకల్టీకి ప్రభుత్వం కేటాయించే నిధులు పెరిగే అవకాశం.
- అధిక శాతం సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానం కారణంగా విద్యార్థులపై ఫీజుల భారం పెరిగే ఆస్కారం.
- అంతర్జాతీయ ఫ్యాకల్టీని ఆకర్షించుకునేందుకు భారీగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి.
- రాష్ట్రాల స్థాయి యూనివర్సిటీలు.. విదేశీ ఫ్యాకల్టీ, విద్యార్థులను ఆకర్షించడంలో కొంత ఇబ్బంది.
- కొత్త కోర్సులు రూపొందించినా ఆ మేరకు బోధన నైపుణ్యాలున్న ఫ్యాకల్టీ లభ్యతపై సందేహం.
Published date : 07 Apr 2018 12:39PM