Skip to main content

‘స్పా’ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు అర్హతలు, ఎంపిక విధానం

స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(స్పా).. దేశంలో నాణ్యమైన ప్లానింగ్, ఆర్కిటెక్చర్, డిజైనింగ్ విద్యను అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ పరిధిలోని స్పా న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా... భోపాల్, విజయవాడల్లో క్యాంపస్‌లు కలిగి ఉంది.
ఆర్కిటెక్చర్, ప్లానింగ్, డిజైనింగ్‌పై ఆసక్తి గల అభ్యర్థులకోసం ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పా) డిగ్రీ, పీజీ, డాక్టోరల్ కోర్సులను అందిస్తోంది. 2020-21 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు స్పా ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. స్పా అందించే కోర్సులు, అర్హతలు, ప్రవేశ విధానం వివరాలు...

పీజీ ప్రోగ్రామ్స్.. అర్హతలు :
  • ఎంఆర్క్ ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్ అండ్ అర్బన్ డిజైన్: ఆర్కిటెక్చర్ లేదా ప్లానింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • ఇండస్ట్రియల్ డిజైన్: ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ డి గ్రీ పూర్తిచేసి ఉండాలి లేదా తత్సమాన విద్యార్హత అయిన డిజైనింగ్ లేదా ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. లేదా సంబంధిత స్ట్రీమ్‌లో వ్యాలిడ్ సీడ్ స్కోర్ సాధించాలి.
  • ఎంప్లాన్ ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్: ప్లానింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఆర్కిటెక్చర్ లేదా సివిల్ ఇంజనీర్, ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, జాగ్రఫీ, ఎకానమీ, సోషియాలజీ, ఎన్విరాన్‌మెంట్‌ల్ సైన్స్ లేదా ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తిచేయాలి.
  • హౌసింగ్: ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్లానింగ్, సివిల్, ఆర్కిటెక్చర్, మున్సిపల్, బిల్డింగ్‌ల్లో ఏదైనా ఒక దాంట్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. లేదా ఎంఏ ఇన్ సోషియాలజీ/ఎకనమిక్స్ ఉత్తీర్ణులవ్వాలి.
  • రీజనల్ అండ్ అర్బన్ ప్లానింగ్: ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్లానింగ్, సివిల్, ఆర్కిటెక్చర్, మున్సిపల్, బిల్డింగ్ ఇంజనీరింగ్‌ల్లో ఏదైనా ఒక దాంట్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఎంఏ ఇన్ సోషియాలజీ లేదా ఎకనమిక్స్ పూర్తిచేసి ఉండాలి.
  • ట్రాన్స్‌పోర్ట్ ప్లానింగ్: ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్లానింగ్, సివిల్, ఆర్కిటెక్చరర్ ఇంజనీరింగ్‌లలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. లేదా స్టాటిస్టిక్స్/ ఆపరేషన్ రీసెర్చ్, ఎకనమిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
  • ఎంబీఈఎం బిల్డింగ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్: ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్/బిల్డింగ్ ఇంజనీరింగ్, బిల్డింగ్ సైన్స్/ఆర్కిటెక్చరర్/ఆర్కిటెక్చర్ కలిగి ఉండాలి. డిప్లొమా అభ్యర్థులు కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీలో ఐదేళ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
  • మాస్టర్ ఆఫ్ ల్యాండ్ స్పేస్ ఆర్కిటెక్చర్: ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ల్యాండ్ స్పేస్ ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా ప్లానింగ్‌లో మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన పోస్ట్‌గ్రాడ్యుయేషన్ డిప్లొమా కలిగిన వారై ఉండాలి.
గమనిక: పైన తెలిపిన విద్యార్హతల్లో జనరల్ అభ్యర్థులు కనీసం 55శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 50 మార్కులు సాధిస్తే సరిపోతుంది.
 
 ఎంపిక ప్రక్రియ :
 ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి.. అభ్యర్థులను తుది ఎంపిక చేసి.. ఆయా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు.
 
 బ్యాచిలర్ డిగ్రీ :
 ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ఆఫ్ ప్లానింగ్ ప్రోగ్రామ్ కింద అందించే బ్యాచిలర్ ప్రోగ్రామ్‌లో బీప్లాన్, బీఆర్క్‌లో ప్రవేశాలను కల్పిస్తారు. ఈ కోర్సు కాల వ్యవధి ఐదేళ్లు. జేఈఈ మెయిన్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
 అర్హత: మ్యాథమెటిక్స్ తప్పనిసరి సబ్జెక్టుగా ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతను 50శాతం మార్కులతో పూర్తిచేసిన వారు అర్హులు.
 
 పీహెచ్‌డీ :
 ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో పీహెచ్‌డీ చేయాలనుకునే అభ్యర్థులు.. ఆర్కిటెక్చర్, ఫిజికల్ ప్లానింగ్, బిల్డింగ్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ డిజైన్, ల్యాండ్ స్పేస్ ఆర్కిటెక్చర్,ఆర్కిటెక్చరల్ కన్సర్వేషన్, అర్బన్‌డిజైన్, రీజినల్‌ప్లానింగ్, ఎన్విరాన్ మెంటల్ ప్లానింగ్, హౌసింగ్, ట్రాన్స్‌పోర్ట్ ప్లానింగ్ విభాగాలను ఎంచుకోవచ్చు.
 అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై, పని అనుభవం కలిగి ఉండాలి. లేదా బీఆర్క్/బీప్లాన్ పూర్తిచేసి ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. లేదా బ్యాచిలర్స్ ఇన్ అలైడ్ సబ్జెక్టు ఉత్తీర్ణులై ఉండి పదేళ్ల అనుభవం సొంతం చేసుకోవాలి.
 గమనిక:  పైన తెలిపిన అన్ని అర్హతల్లో కనీసం 55శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారే దరఖాస్తుకు అర్హులు .
 
ముఖ్యమైన సమాచారం :
దరఖాస్తుకు చివరి తేదీ
: 13 మార్చి 2020
పీజీ కోర్సులకు ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 30, 31, ఏప్రిల్ 01
ఎంపికైన అభ్యర్థుల జాబితా: 17 ఏప్రిల్ 2020
అకడమిక్ సెషన్ ప్రారంభం: 3 ఆగస్టు 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.spa.ac.in
Published date : 14 Mar 2020 05:51PM

Photo Stories