సీమ్యాట్-2019కు ప్రిపరేషన్ టిప్స్..
Sakshi Education
కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్) 2019కు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంతకాలం సీమ్యాట్‌ను ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏడాది నుంచి ఆ బాధ్యతలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) చేపట్టింది. మేనేజ్‌మెంట్ విద్యను అభ్యసించాలనకునే వారికి జాతీయస్థాయిలో క్యాట్ తర్వాత సీమ్యాట్ చక్కని అవకాశం. ఇందులో ప్రతిభ చూపడం ద్వారా ప్రముఖ విశ్వవిద్యాలయాలు, బీస్కూల్స్‌లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), పోస్ట్ గ్రాడ్యుయేట్ పోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీపీఎం), పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్(పీజీడీఎం) కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. సీమ్యాట్-2019 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. పరీక్షా విధానం, ప్రిపరేషన్ టిప్స్..
అర్హత:
ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. 10+2+3 విధానంలో డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు సైతం పరీక్షకు హాజరవ్వొచ్చు. దరఖాస్తుకు ఎలాంటి గరిష్ట వయోపరిమితిలేదు.
సీమ్యాట్ స్కోర్ :
సీమ్యాట్ స్కోరు ద్వారా దేశంలోని వెయ్యికిపైగా బీస్కూల్స్/ ఇన్‌స్టిట్యూట్స్‌లో మేనేజ్‌మెంట్ పీజీ కోర్సుల్లో ప్రవేశం పొం దొచ్చు. సీమ్యాట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు.. ఆయా ఇన్‌స్టి ట్యూట్‌లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉం టుంది. ఆయా బీస్కూల్స్ ప్రవేశాలకు సంబంధించి స్వీయ కటాఫ్‌ను నిర్దేశిస్తున్నాయి. సదరు కటాఫ్ మార్కులు సాధించిన విద్యార్థుల జాబితాను రూపొందించి వారికి గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి.. తుది ప్రవేశాలను ఖరారు చేస్తున్నాయి.
ఆన్‌లైన్ పరీక్ష విధానం :
ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధా నానికి ఒక మార్కు కోత విధిస్తారు.
సన్నద్ధత...
లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్
యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ , యూసేజ్ ఆఫ్ నౌన్స్ అండ్ ప్రొనౌ న్స్, టెన్సెస్, ప్రిపోజిషన్స్ వంటి గ్రామర్ అంశాలపై ప్రశ్న లుంటాయి. వాటితోపాటు జంబుల్డ్ పారాగ్రాఫ్స్, పేరా గ్రాఫ్ ఆధారిత ప్రశ్నలు అడిగే అవకాశముంది. ప్రామాణిక ఇంగ్లిష్ దినపత్రికలను రోజూ చదువుతూ... వొకాబ్యులరీ పెంచుకోవాలి. సెంటెన్స్ ఫార్మేషన్‌పై పట్టుసాధించాలి.
క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ :
రేషియో-ప్రపోర్షన్స్, మిక్చర్స్, వర్క్, యావరేజెస్, పర్సంటే జెస్, టైమ్ అండ్ స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ తదితర అం శాలు కీలకమైనవి. వీటితోపాటు టేబుల్ అండ్ పై ఛార్ట్స్, బార్ డయాగ్రామ్స్ అండ్ గ్రాఫ్స్, ఛార్ట్స్‌ను ప్రశ్నలు అడిగే అవకాశముంది. ఇవన్నీ పదో తరగతి వరకూ చదివిన అంశాలే అయినా... కాన్సెప్ట్‌లపై మరోసారి స్పష్టత తెచ్చుకోవడం మేలు.
లాజికల్ రీజనింగ్ :
ఈ విభాగంలో సీటింగ్ అరేంజ్‌మెంట్స్, సీక్వెన్సింగ్, కోడింగ్-డీకోడింగ్, స్టేట్‌మెంట్-కంక్లూజన్, లాజికల్ పజిల్, న్యూమరికల్ పజిల్, వెన్ డయాగ్రామ్; ట్రూ, ఫాల్స్ స్టేట్‌మెంట్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ఈ విభాగంలో మంచి మార్కుల సాధనకు తార్కిక ఆలోచన విధానం పెంపొందించుకోవడం ఒక్కటే మార్గం.
జనరల్ అవేర్‌నెస్ :
కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకేతోపాటు పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో సమస్యలు, ఆర్థిక వృద్ధి, జాతీయ, అంతర్జాతీయ అంశాలు, వార్తల్లో వ్యక్తులు, భారత రాజ్యాంగం, వివిధ దేశాలు-కరెన్సీలు; ద్రవ్య, కోశ గణాంకాలు, వడ్డీరేట్లు, సీఆర్‌ఆర్, ఎస్‌ఎల్‌ఆర్ తదితర అంశాలపై అవగాహన పెంచుకోవడం లాభిస్తుంది. దినపత్రికల్లోని బిజినెస్ పేజీలను చదవడం మేలు.
ముఖ్య సమాచారం :
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 30, 2018.
ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: డిసెంబర్ 1, 2018.
సీమ్యాట్ 2019 నిర్వహణ: జనవరి 28, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : https://ntacmat.nic.in/ntacmatcms/public/home.aspx

- సీమ్యాట్ స్కోరును ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లు/ డిపార్ట్‌మెంట్లు/స్వయంప్రతిపత్తి కలిగిన కాలేజీలు/యూనివర్సిటీల అనుబంధ కాలేజీలు పరిగణలోకి తీసుకుంటున్నాయి.
ఆన్‌లైన్ పరీక్ష విధానం :
ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధా నానికి ఒక మార్కు కోత విధిస్తారు.
విభాగం | ప్రశ్నలు | మార్కులు |
క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ | 25 | 100 |
లాజికల్ రీజనింగ్ | 25 | 100 |
లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ | 25 | 100 |
జనరల్ అవేర్‌నెస్ | 25 | 100 |
మొత్తం | 100 | 400 |
సన్నద్ధత...
లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్
యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ , యూసేజ్ ఆఫ్ నౌన్స్ అండ్ ప్రొనౌ న్స్, టెన్సెస్, ప్రిపోజిషన్స్ వంటి గ్రామర్ అంశాలపై ప్రశ్న లుంటాయి. వాటితోపాటు జంబుల్డ్ పారాగ్రాఫ్స్, పేరా గ్రాఫ్ ఆధారిత ప్రశ్నలు అడిగే అవకాశముంది. ప్రామాణిక ఇంగ్లిష్ దినపత్రికలను రోజూ చదువుతూ... వొకాబ్యులరీ పెంచుకోవాలి. సెంటెన్స్ ఫార్మేషన్‌పై పట్టుసాధించాలి.
క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ :
రేషియో-ప్రపోర్షన్స్, మిక్చర్స్, వర్క్, యావరేజెస్, పర్సంటే జెస్, టైమ్ అండ్ స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ తదితర అం శాలు కీలకమైనవి. వీటితోపాటు టేబుల్ అండ్ పై ఛార్ట్స్, బార్ డయాగ్రామ్స్ అండ్ గ్రాఫ్స్, ఛార్ట్స్‌ను ప్రశ్నలు అడిగే అవకాశముంది. ఇవన్నీ పదో తరగతి వరకూ చదివిన అంశాలే అయినా... కాన్సెప్ట్‌లపై మరోసారి స్పష్టత తెచ్చుకోవడం మేలు.
లాజికల్ రీజనింగ్ :
ఈ విభాగంలో సీటింగ్ అరేంజ్‌మెంట్స్, సీక్వెన్సింగ్, కోడింగ్-డీకోడింగ్, స్టేట్‌మెంట్-కంక్లూజన్, లాజికల్ పజిల్, న్యూమరికల్ పజిల్, వెన్ డయాగ్రామ్; ట్రూ, ఫాల్స్ స్టేట్‌మెంట్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ఈ విభాగంలో మంచి మార్కుల సాధనకు తార్కిక ఆలోచన విధానం పెంపొందించుకోవడం ఒక్కటే మార్గం.
జనరల్ అవేర్‌నెస్ :
కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకేతోపాటు పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో సమస్యలు, ఆర్థిక వృద్ధి, జాతీయ, అంతర్జాతీయ అంశాలు, వార్తల్లో వ్యక్తులు, భారత రాజ్యాంగం, వివిధ దేశాలు-కరెన్సీలు; ద్రవ్య, కోశ గణాంకాలు, వడ్డీరేట్లు, సీఆర్‌ఆర్, ఎస్‌ఎల్‌ఆర్ తదితర అంశాలపై అవగాహన పెంచుకోవడం లాభిస్తుంది. దినపత్రికల్లోని బిజినెస్ పేజీలను చదవడం మేలు.
ముఖ్య సమాచారం :
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 30, 2018.
ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: డిసెంబర్ 1, 2018.
సీమ్యాట్ 2019 నిర్వహణ: జనవరి 28, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : https://ntacmat.nic.in/ntacmatcms/public/home.aspx
Published date : 14 Nov 2018 02:54PM