Skip to main content

ఫిబ్రవరి 14న దేశవ్యాప్తంగా జామ్ 2021 పరీక్ష.. ఐఐఎస్సీ బెంగళూరుతోపాటు ఐఐటీల్లో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీకి..

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఐఐఎస్సీ, ఐఐటీల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి కోసం నిర్వహించే అర్హత పరీక్ష.. జాయింట్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ(జామ్).

ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఐఐటీల్లో ఎంఎస్సీ, జాయింట్ ఎంఎస్సీ పీహెచ్‌డీ, ఎంఎస్సీ పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ, ఐఐఎస్సీలో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలను కల్పిస్తారు. సంబంధిత కోర్సులో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. దీనికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఫిబ్రవరి 14వ తేదీన దేశవ్యాప్తంగా ఐఐఎస్సీ బెంగళూర్ జామ్ పరీక్షను నిర్వహించనుంది.

పరీక్ష విధానం..

  1. జామ్ 2021 పరీక్ష మొత్తం ఏడు పేపర్లలో ఆన్‌లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో జరుగుతుంది. మూడు సెక్షన్లలో మొత్తం 60 ప్రశ్నలు-100 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం మూడు గంటలు. పరీక్ష ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే జరుగుతుంది.
  2. పశ్న పత్రంలో సెక్షన్ ఏలో మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్(ఎంసీక్యూలు), సెక్షన్ బీలో మల్టిపుల్ సెలెక్ట్ కొశ్చన్స్(ఎంఎస్‌క్యూలు), సెక్షన్ సీలో న్యూమరికల్ ఆన్సర్ టైప్(ఎన్‌ఏటీలు) ఉంటాయి.
  3. సెక్షన్ ఏలో ప్రశ్నలకు నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల కోత విధిస్తారు. సెక్షన్ బీ, సెక్షన్ సీలో ప్రశ్నలకు నెగిటివ్ మార్కుల విధానం లేదు.


ఫోకస్ పెట్టాలి..
జామ్ పరీక్షలో విజయం కోసం ఇప్పటికే చాలామంది విద్యార్థులు ప్రిపరేషన్‌లో మునిగి తేలుతున్నారు. పరీక్షా సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రిపరేషన్ విషయంలో విద్యార్థులు కొంత ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇలాంటి వాటిని అధిగమిస్తూ ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. పాత ప్రశ్న పత్రాలు పరిశీలించి.. పరీక్ష ముందు ప్రాధాన్యం ఇవ్వాల్సిన టాపిక్స్‌పై బాగా ఫోకస్ పెట్టాలి.

ఇంకా చదవండి: part 2: జామ్ 2021 పరీక్ష ప్రిపరేషన్ సాగించండిలా..

Published date : 13 Feb 2021 10:23AM

Photo Stories