ప్రపంచాన్నే కుగ్రామంగా మార్చిన ఇంటర్నెట్.. ఉద్యోగావకాశాలు అందుకునేలా ఇంజనీరింగ్‌లో కొత్త కోర్సు ప్రారంభం..!
Sakshi Education
ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ఒక కుగ్రామంగా మార్చేసిన ఘనత ఇంటర్నెట్‌కు దక్కుతుంది. సమాచార వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మకతకు ముఖ్య కారణం ఇంటర్నెట్ అనడంలో సందేహం లేదు.
దీని ప్రభావం మరింత పెరిగి.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) తెరపైకి వచ్చింది. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులో ఐఓటీ కూడా ఒకటి.
- ఐఓటీ అంటే: భవిష్యత్తులో ప్రపంచం మొత్తం ఒక స్మార్ట్ నగరం గా మారడానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఉపయోగపడు తుంది. మనుషుల జీవితాలను మరింత సుఖమయం చేయడా నికి ఇది తోడ్పడుతుంది. మనుషుల మాదిరిగానే యంత్రాలు, యంత్ర పరికరాలు అన్ని ఇంటర్నెట్ ఆధారంగా అనుసంధా నంగా ఉండి.. ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడి పనిచేయడాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. అంటే.. మనుషులు తమలో తాము ఎలాగైతే ఒకరితో ఒకరు మాట్లాడుకొని పనులు చేస్తారో.. యంత్రాలు కూడా ఒక దానితో ఒకటి సమాచార మార్పిడి చేసుకొని పనిచేస్తాయి. ప్రతి వస్తువు ఇంటర్నెట్‌తో అనుసం దానంగా ఉండి.. వివిధ రకాల కార్యకలాపాలను కచ్చితమైన సమయంలో సమర్థవంతంగా పూర్తిచేస్తాయి.
- కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్ స్థాయిలో నాలుగేళ్ల బీటెక్ ఇన్ ఐఓటీ అండ్ అప్లికేషన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
- జాబ్ ప్రొఫైల్: ఇంజనీరింగ్‌లో ఐఓటీ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ఐఓటీ ఇంజనీర్, ఐఓటీ యాప్ డెవలపర్, ఐఓటీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, సిటిజన్ ఐఓటీ సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ఐఓటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లుగా విధులు నిర్వహిస్తారు.
Published date : 17 Nov 2020 04:39PM