ప్రపంచ వ్యాప్తంగా టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌లో మేనేజ్‌మెంట్ చదివే అవకాశం కల్పించే ఈ పరీక్ష గురించి తెలుసుకోండిలా..
Sakshi Education
జీమ్యాట్..గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్. ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీలు, బిజినెస్ స్కూల్స్‌తోపాటు దేశంలోని పలు ప్రముఖ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో.. జీమ్యాట్ ద్వారా అడ్మిషన్ లభిస్తుంది.
ఇందులో వచ్చిన స్కోరు ఆధారంగా..దేశ విదేశాల్లోని బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. జీమ్యాట్‌లో కొత్తగా ‘అనలిటికల్ రైటింగ్ అనాలసిస్’(ఏడబ్ల్యూఏ)ను ప్రవేశపెట్టారు. జీమ్యాట్ పరీక్షలో టాప్ స్కోర్ సాధనలో కీలకంగా మారనున్న ‘ఏడబ్ల్యూఏ’ను ఎలా ఎదుర్కోవాలో చూద్దాం..
గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(జీమ్యాట్) పరీక్ష మొత్తం 3.07 గంటల పాటు ఉంటుంది. ఇందులో ప్రధానంగా నాలుగు (4) విభాగాలు ఉంటాయి. వీటిలో మూడు విభాగాల నుంచి మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు.
విభాగాల వారీగా..
- వెర్బల్ రీజనింగ్– 36 ప్రశ్నలు 65 నిమిషాల్లో పూర్తి చేయాలి.
- క్వాంటిటేటివ్ రీజనింగ్–31 ప్రశ్నలను 62 నిమిషాల్లో పూర్తి చేయాలి.
- ఇంటిగ్రేటెడ్ రీజనింగ్–12 ప్రశ్నలకు 30 నిమిషాల్లో జవాబులు గుర్తించాలి.
- చివరిగా చెప్పుకోవాల్సింది.. కొత్తగా ప్రవేశపెట్టిన విభాగం ‘అనలిటికల్ రైటింగ్ అనాలసిస్’ (విశ్లేషణాత్మక రచన) విభాగం. ఇందులో ఒక టాపిక్‌ను ఎంచుకొని.. దానికి 30 నిమిషాల్లో సమాధానం రాయాలి. పై మూడు విభాగాలు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు కావడంతో జాగ్రత్తగా రాసిన ప్రతి అభ్యర్థికి పూర్తిస్థాయి మార్కులు వచ్చే అవకాశం ఉంది. కానీ నాలుగో విభాగంలోని అనలిటికల్ రైటింగ్ అనాలసిస్ మాత్రం అభ్యర్థి వాస్తవ ప్రతిభను గుర్తించేలా ఉంటుంది, ఇందులో వచ్చిన మార్కులు మొత్తం స్కోరును మార్చేస్తుందనడంలో సందేహం లేదు.
ఇంకా చదవండి: part 2: జీమ్యాట్ పరీక్ష ద్యారా అభ్యర్థుల్లో పరీక్షించే నైపుణ్యాల గురించి తెలుసుకోండిలా..
Published date : 25 Feb 2021 05:56PM