పరిశోధనలకు బెస్ట్ అయిన నెస్ట్ 2021కు నోటిఫికేషన్ విడుదల.. వివరాలు ఇవే..
మీ సమాధానం అవును అయితే.. మీకు చక్కటి మార్గం.. నెస్ట్!! నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్(నెస్ట్) ద్వారా.. జాతీయ స్థాయిలో పేరొందిన నైసర్, యూనివర్సిటీ ఆఫ్ ముంబై–డీఏఈ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్‌ల్లో ప్రవేశించి.. మీ కలలను సాకారం చేసుకోవచ్చు. తాజాగా నెస్ట్–2021కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. నెస్ట్‌కు అర్హతలు, ఎంపిక విధానం, కోర్సు తీరుతెన్నుల వివరాలు....
సైన్స్ పరిశోధనలు పెరగాలి. విద్యార్థులు.. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులే కాకుండా.. ప్యూర్ సైన్స్, బేసిక్ సైన్సెస్‌పై దృష్టి పెట్టాలి! ఇది దేశంలో విద్యావేత్తలు , నిపుణులు తరచూ చెబుతున్న మాటే!! సైన్స్ అవసరాన్ని గుర్తించిన భారత అణుశక్తి శాఖ.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–భువనేశ్వర్, యూని వర్సిటీ ఆఫ్ ముంబై–డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌లను దశాబ్దం కిందటే నెలకొ ల్పింది. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సును ప్రవేశ పెట్టింది. ఇంటర్మీడియెట్ ఎంపీసీ, బైపీసీ గ్రూపులు అర్హతగా పేర్కొన్న ఈ కోర్సులో ప్రవేశించాలంటే.. జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్(నెస్ట్)లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది.
నెస్ట్ స్వరూపం..
నెస్ట్ ఎంట్రన్స్‌ను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా నిర్వహిస్తారు. మొత్తం 230 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష వ్యవధి మూడున్నర గంటలు. మొత్తం ఐదు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి..
సెక్షన్ 1 | – | జనరల్ ఆప్టిట్యూడ్ | – | 30 మార్కులు. |
సెక్షన్ 2 | – | బయాలజీ | – | 50 మార్కులు |
సెక్షన్ 3 | – | కెమిస్ట్రీ | – | 50 మార్కులు |
సెక్షన్ 4 | – | మ్యాథమెటిక్స్ | – | 50 మార్కులు |
సెక్షన్ 5 | – | ఫిజిక్స్ | – | 50 మార్కులు |
జేఈఈ స్థాయి క్లిష్టత..
ఈ ఐదు విభాగాల్లో.. విద్యార్థులందరికీ సెక్షన్–1 (జనరల్ ఆప్టిట్యూడ్) తప్పనిసరి. మిగిలిన నాలుగు సెక్షన్లలో అభ్యర్థులు తమ ఆసక్తి మేరకు మూడు సెక్షన్లను ఎంపిక చేసుకోవాలి. ఆసక్తి ఉంటే నాలుగు సెక్షన్లు కూడా రాసే అవకాశం ఉంది. సబ్జెక్ట్ సెక్షన్లు (2–5)కు సంబంధించిన ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రశ్నల క్లిష్టత జేఈఈ స్థాయిలో ఉంటుంది.
ఇంకా చదవండి: part 2: నెస్ట్‌లో విజయం సాధించాలంటే.. ఇలా చదివితే మేలు..