Skip to main content

పదో తరగతి సైన్స్ పేపర్లు రెండింట్లో.. విజయం సాధించండిలా..

పదోతరగతి.. భవిష్యత్తు కెరీర్‌కు పునాది! ఇందులో సాధించే మార్కులే.. భవిష్యత్తు అవకాశాలకు బాటలు వేస్తాయి.

. ఇంతటి కీలకమైన పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి.. ఈ ఏడాది(2021) తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ షెడ్యూల్ ఖరారైంది. కరోనా కారణంగా ఆన్‌లైన్ క్లాస్‌లు,సిలబస్ కుదింపునకు అనుగుణంగా పరీక్షల విధానంలో పలు మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో.. సైన్స్లో 10/10 జీపీఏ సాధించేందుకు మార్గాలు ఇవే..

పేపర్-1- ఫిజికల్ సైన్స్..
ఫిజికల్ సైన్స్‌లో మంచి మార్కులు సాధించాలంటే.. అప్లికేషన్ అప్రోచ్‌తో చదవడం ఎంతో ముఖ్యం. ఆయా చాప్టర్లకు సంబంధించిన అంశాలను నిజ జీవిత సంఘట నలతో అన్వయించుకుంటూ.. ప్రిపరేషన్ సాగించాలి. తద్వారా విషయ పరిజ్ఞానం మరింతగా పెంపొందించుకోవచ్చు. ప్రశ్నించడం-పరికల్పన చేయడం; ప్రయోగాలు -క్షేత్ర పర్యటనలు; సమాచార నైపుణ్యాలు-ప్రాజెక్ట్ పనులు; పటాలు-వాటిద్వారా భావప్రసారం వంటి వాటిపైనా కృషిచేయాలి. కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, విద్యుత్ ప్రవాహం, రసాయన బంధం, పరమాణు నిర్మాణం, కార్బన్ సమ్మేళనాలపై పట్టు సాధించాలి. మూలకాల ధర్మాలు-వర్గీకరణ, రసాయన సమీకరణాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల లఘు, అతి స్వల్ప, బహుళైచ్ఛిక ప్రశ్నలకు సులువుగా సమాధానాలిచ్చే పట్టు లభిస్తుంది. ప్రశ్నను ఎలా అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభించి.. మంచి మార్కులు సొంతమవుతాయి.
- ఎ.నాగరాజశేఖర్, ఎస్‌ఏ-ఫిజిక్స్

పేపర్-2-నేచురల్ సెన్సైస్..
జీవశాస్త్రం సబ్జెక్ట్‌లోనూ అవగాహన, సొంత విశ్లేషణ నైపుణ్యాలు కీలకంగా మారుతున్నాయి. ఇందుకోసం ఫ్లోచార్ట్‌లు, బ్లాక్ డయాగ్రమ్స్‌లను సొంతంగా రూపొందించుకోవాలి. విశ్లేషణాత్మక, తులనాత్మక అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నేర్చుకున్న అంశాలను వాస్తవ పరిస్థితులతో అన్వయించే విధంగా చదవాలి. ప్రయోగాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ప్రయోగ నిర్వహణ ప్రక్రియపై అవగాహన పొందడం ఎంతో మేలు చేస్తుంది. చాప్టర్‌లో పేర్కొన్న అభ్యాసాలకు సంబంధించి విశ్లేషణ, కారణాలు, పోలికలు, బేధాలు తెలుసుకుంటూ చదవాలి. డయాగ్రమ్స్ విషయంలో భాగాలను గుర్తించడమే కాకుండా.. వాటి ప్రాముఖ్యతను వర్ణించగలిగే విధంగా ప్రాక్టీస్ చేయాలి.
-పి.నీలకంఠం, సబ్జెక్ట్ టీచర్

ఇంకా చదవండి: part 6: సమకాలీన అంశాలపైనా అవగాహన ఏర్పరచుకుంటూ.. పదో తరగతి సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ సాగించండిలా..

Published date : 15 Feb 2021 04:07PM

Photo Stories