నైపర్ జేఈఈ–2020
ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఏడు నైపర్లలో ఆయా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తుంది. నైపర్ జేఈఈ 2020 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పూర్తి వివరాలు...
ప్రవేశం కల్పించే కోర్సులు..
మాస్టర్స్ ఇన్ ఫార్మసీ (ఎంఫార్మ్), మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్ ఫార్మ్), మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్ ఫార్మ్), ఎంబీఏ ఫార్మ, పీహెచ్డీ కోర్సులు.
అర్హతలు..
అభ్యర్థి సంబంధిత డిగ్రీ కోర్సు(బీఫార్మసీ)లో కనీసం 60 శాతం మార్కులు లేదా సీజీపీఏ 6.75 (10 పాయింట్ల స్కేలుపై) పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు లేదా 6.25 ïసీజీపీఏ సాధించాలి. శారీరక వికలాంగ అభ్యర్ధులకు 50 శాతం మార్కులు లేదా 5.75 సీజీపీఏ తప్పనిసరి. ఆయా స్పెషలైజేషన్ను అనుసరించి ఎంఎస్సీ బయలాజికల్ సైన్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బీవీఎస్సీ, ఎంబీబీఎస్ తదితర కోర్సుల అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశపరీక్ష విధానం..
నైపర్ జేఈఈ కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష. ఇంగ్లీష్ మాధ్యమంలో ప్రశ్న పత్రం ఉంటుంది. ఆయా కోర్సులకు సంబంధించి మల్టిపుల్ చాయిస్ విధానంలో 200 ప్రశ్నలు– 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు లభిస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి –0.25 నెగిటివ్ మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు.
ముఖ్య సమాచారం
- ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేది: 1 ఏప్రిల్ 2020
- ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15 మే 2020
- హాల్టికెట్ల విడుదల: 2 జూన్ 2020
- ఆన్లైన్ పరీక్ష: 14 జూన్ 2020
- పరీక్ష ఫలితాలు: 18 జూన్ 2020
- పూర్తి వివరాలకు వెబ్సైట్: niper.ac.in