లేటరల్ ఎంట్రీ విధానంలో... ఎంబీబీఎస్
Sakshi Education
బీడీఎస్, బీఎస్సీ-నర్సింగ్ విద్యార్థులు.. ఎంబీబీఎస్‌లో చేరొచ్చా? ఎంబీబీఎస్‌లో.. మొదటి రెండేళ్లు కామన్ సిలబస్ అమలు కానుందా? సైన్స్ గ్రాడ్యుయేట్లకు వైద్య విద్య కోర్సుల్లో చేరే అవకాశం లభించనుందా..?!అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది!! ఇటీవల కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటీ.. జాతీయ నూతన విద్యా విధానం ముసాయిదాలో వైద్యవిద్యకు సంబంధించి పలు కీలక సిఫార్సులు చేసింది. నూతన విద్యా విధానం ముసాయిదా సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో వైద్యవిద్యపై కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సులపై ప్రత్యేక కథనం...
‘దేశంలో అల్లోపతి (ఎంబీబీఎస్) వైద్యుల సంఖ్య పెరగాలి. అన్ని ప్రాంతాల్లోనూ అల్లోపతి వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. అందుకోసం ఎంబీబీఎస్ కళాశాలల సంఖ్య పెంచాలి. రూరల్ ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేయాలి’
- దేశంలో వైద్యుల కొరతకు సంబంధించి వివిధ వర్గాలు, వైద్య రంగ నిపుణుల అభిప్రాయాలు ఇవి!
ఎంబీబీఎస్‌లోకి లేటరల్ ఎంట్రీ :
కస్తూరి రంగన్ కమిటీ.. బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సు విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ విధానంలో ఎంబీబీఎస్‌లోకి ప్రవేశం కల్పించాలనే ప్రతిపాదన చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా మెడికల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ విధానం ప్రకారం ఎంబీబీఎస్‌లో మొదటి ఏడాది లేదా మొదటి రెండేళ్లు కామన్ సిలబస్ విధానం(ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్) అమలు చేయాలి. ఫలితంగా బీడీఎస్, నర్సింగ్ నుంచి లేటరల్ ఎంట్రీ విధానంలో ఎంబీబీఎస్‌లోకి వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే.. బీడీఎస్, లేదా బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు కోర్సులో చేరిన రెండేళ్ల తర్వాత ఎంబీబీఎస్‌పై ఆసక్తి ఉంటే అందులో చేరొచ్చు. అలా చేరాక మిగతా సంవత్సరాల ఎంబీబీఎస్ కోర్సును పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇలా లేటరల్ ఎంట్రీ విధానంలో ఎంబీబీఎస్‌లోకి ప్రవేశం కోసం నీట్ వంటి ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించాలా? లేదా సంబంధిత కోర్సులో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశ కల్పిస్తారా?.. అడ్మిషన్ నిబంధనలు ఎలా ఉంటాయి అనే దానిపై స్పష్టతలేదు. అదేవిధంగా సైన్స్ గ్రాడ్యుయేట్లకు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం లేదా మొదటి రెండేళ్ల ఉమ్మడి సిలబస్‌ను బోధించి(కామన్ ఫౌండేషనల్ కోర్సెస్).. తర్వాత వారి ఆసక్తి ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశం కల్పించాలని మరో సిఫార్సు చేసింది.
ఆయుష్.. ప్రధాన వైద్య విధానం :
ఆయుష్ కోర్సులను ప్రత్యామ్నాయ వైద్య విధానాలుగా కాకుండా.. ప్రధాన వైద్య కోర్సులుగా రూపొందించాలని కమిటీ సిఫార్సు చేసింది. వీటిని పూర్తిచేసిన అభ్యర్థులను ప్రైమరీ హెల్త్‌కేర్ సెంటర్స్(ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు), కమ్యూనిటీ హెల్త్‌కేర్ సెంటర్స్‌లో.. వైద్యులుగా నియమించాలని ప్రతిపాదించింది. ఈ సిఫార్సుపై సానుకూలత కంటే ప్రతికూలతే ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను తెలియజేసింది.
డెరైక్ట్ ఎంట్రీ ప్రాధాన్యం తగ్గనుందా ?
లేటరల్ ఎంట్రీ విధానం అమల్లోకి వస్తే.. ఇంటర్మీడియెట్ బైపీసీ విద్యార్థులు భవిష్యత్తులో ఎంబీబీఎస్ కోర్సులోకి నేరుగా ప్రవేశించే విధానం కనుమరుగవుతుందా అంటే..? పలువురు అవుననే అంటున్నారు. ఇందుకు కమిటీ సిఫార్సులను వారు ప్రస్తావిస్తున్నారు. కమిటీ ఎంబీబీఎస్ కోర్సు కరిక్యులంలో మొదటి ఒకటి లేదా రెండేళ్లు ఉమ్మడి సిలబస్ రూపొందించాలి. ఆ తర్వాత.. విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్.. వీటిలో ఏదో ఒక కోర్సును ఎంపిక చేసుకుని అందులో అడుగుపెట్టే అవకాశం కల్పించాలి. దీని వల్ల ప్రస్తుతం బైపీసీ విద్యార్థులు నీట్ ద్వారా డెరైక్ట్ ఎంట్రీ విధానంలో ఎంబీబీఎస్‌లో చేరే విధానానికి ప్రాధాన్యం తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
డెంటల్ కౌన్సిల్ నివేదిక :
బీడీఎస్ విద్యార్థులు తమ కోర్సులో తొలి మూడేళ్లు ఎంబీబీఎస్ సిలబస్‌లో పేర్కొన్న అంశాలనే చదువుతారని.. కాబట్టే లేటరల్ ఎంట్రీ సిఫార్సు తెరపైకి వచ్చిందని మరికొంత మంది పేర్కొంటున్నారు. మరోవైపు బీడీఎస్ అభ్యర్థులు సైతం అల్లోపతి వైద్యం అందించేందుకు వీలు కల్పించాలంటూ.. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించింది.
ఐఎంఏ వర్గాల నుంచి నిరసన..
డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు, కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సులపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (అల్లోపతి వైద్యుల సంఘం) నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఐఎంఏ వర్గాల ప్రకారం ఏటా దేశంలో దాదాపు అరవై మూడు వేల మంది ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు పట్టాలతో బయటికి వస్తున్నారు. కానీ.. దేశవ్యాప్తంగా 23,700 పీజీ సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే.. మెడికల్ బ్యాచిలర్ డిగ్రీ పట్టభద్రులు, పీజీ విద్యలో అడుగుపెట్టే వారి మధ్య దాదాపు నలభై వేల వ్యత్యాసం ఉంది. ఈ నలభై వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించకుండా.. బ్రిడ్జ్ కోర్సు పేరుతో బీడీఎస్ విద్యార్థులను అల్లోపతి వైద్యం చేసేందుకు అనుమతించడం సరికాదన్నది ఐఎంఏ వర్గాల వాదన.
కావాలి ఎంబీబీఎస్‌లు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక డాక్టర్ (1000:1 నిష్పత్తిలో) ఉండాలి. కానీ, మన దేశంలో ప్రస్తుతం ఈ సంఖ్య 1700:1 గా ఉందనేది అంచనా. ఐఎంఏ వర్గాల అంచనా ప్రకారం.. 30 శాతం జనాభా ఉన్న పట్టణ ప్రాంతాల్లో దాదాపు 65 శాతం మంది అల్లోపతి వైద్య నిపుణులు అందుబాటులో ఉంటే.. 70 శాతం జనాభా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కేవలం 33 శాతం మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. కాబట్టి పీజీ వైద్య విద్యలో ప్రవేశం లభించని ఎంబీబీఎస్‌లను హెల్త్ సెంటర్లలో ఫిజిషియన్లుగా నియమించి ఉద్యోగావకాశాలు కల్పించాలని ఐఎంఏ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి భిన్నంగా బీడీఎస్, నర్సింగ్ విద్యార్థులను బ్రిడ్జ్ కోర్సు ఆధారంగా ఎంబీబీఎస్‌లోకి ప్రవేశం కల్పించడం సరికాదని ఆ స్పష్టం చేస్తున్నాయి.
నీతి ఆయోగ్ సిఫార్సులు:
దేశంలో ఎంబీబీఎస్ వైద్యుల కొరత దృష్ట్యా.. ఇతర వైద్య విభాగాలకు చెందిన వారికి అల్లోపతి వైద్యం చేసే అవకాశం కల్పించాలనే అంశంపై గత రెండేళ్లుగా చర్చ జరుగుతోంది. ముందుగా ఆయుష్ వైద్యులకు ఎంబీబీఎస్ చదివే అవకాశం కల్పించాలని.. ఇందుకు బ్రిడ్జ్ కోర్స్ విధానం ప్రవేశపెట్టాలని నీతిఆయోగ్, ఇండియన్ మెడికల్ కమిషన్ బిల్-2018లో సిఫార్సు చేశాయి. అప్పట్లో దీనిపై ఐఎంఏ వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. తాజాగా మరోసారి కస్తూరి రంగన్ కమిటీ ఎంబీబీఎస్‌లోకి లేటరల్ ఎంట్రీ విధానం గురించి సిఫార్సులు చేయడంతో మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
ఎగ్జిట్ ఎగ్జామ్.. మరోసారి తెరపైకి :
కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సుల నేపథ్యంలో ఎగ్జిట్ ఎగ్జామ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఎంబీబీఎస్ పూర్తిచేసిన విద్యార్థులకు వార్షికంగా జరిపే పరీక్షలకు బదులు జాతీయస్థాయిలో ఉమ్మడిగా ఎగ్జిట్ పరీక్ష నిర్వహించాలని కమిటీ సూచించింది. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉన్నత విద్య, ప్రాక్టీస్ పరంగా అనుమతి ఇవ్వాలనే సిఫార్సు చేసింది. వాస్తవానికి ఈ సిఫార్సు కూడా గత కొన్నేళ్లుగా నీతి ఆయోగ్, గత రెండేళ్లుగా ఐఎంసీ బిల్లులో నానుతూనే ఉంది.
అనుకూలమా, ప్రతికూలమా?
తాజా సిఫార్సులు విద్యార్థులకు అనుకూలమా, ప్రతికూలమా అంటే రెండు రకాల అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
అనుకూలతలు:
నూతన విద్యా విధానం:
ముఖ్యాంశాలు..

- నిపుణుల సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకున్న కస్తూరి రంగన్ కమిటీ.. జాతీయ నూతన విద్యా విధానం ముసాయిదాలో పలు కీలక సిఫార్సులు చేసింది.

- బీడీఎస్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మూడేళ్ల బ్రిడ్జ్ కోర్సు నిర్వహించాలి. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఎంబీబీఎస్ సర్టిఫికెట్ అందించాలి.
- ఈ బ్రిడ్జ్ కోర్సులో ప్రవేశానికి ప్రత్యేక ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలి. లేదా బీడీఎస్‌లో పొందిన మార్కులు/గ్రేడ్ పాయింట్లను పరిగణనలోకి తీసుకొని మెరిట్ జాబితా ఆధారంగా ప్రవేశం కల్పించాలి. లేదా ఈ రెండు విధానాలను(బ్రిడ్జ్ కోర్సులోకి ఎంట్రన్స్ టెస్ట్, బీడీఎస్ మెరిట్) పరిగణనలోకి తీసుకోవాలి. బ్రిడ్జ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారికి జనరల్ ఫిజిషియన్స్‌గా పనిచేసేందుకు అవకాశం కల్పించాలి. ఇలా చేయడం వల్ల దేశంలో అల్లోపతి వైద్యుల కొరత తగ్గుతుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు అందుబాటులోకి వస్తారని డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఐఎంఏ వర్గాల నుంచి నిరసన..
డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు, కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సులపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (అల్లోపతి వైద్యుల సంఘం) నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఐఎంఏ వర్గాల ప్రకారం ఏటా దేశంలో దాదాపు అరవై మూడు వేల మంది ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు పట్టాలతో బయటికి వస్తున్నారు. కానీ.. దేశవ్యాప్తంగా 23,700 పీజీ సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే.. మెడికల్ బ్యాచిలర్ డిగ్రీ పట్టభద్రులు, పీజీ విద్యలో అడుగుపెట్టే వారి మధ్య దాదాపు నలభై వేల వ్యత్యాసం ఉంది. ఈ నలభై వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించకుండా.. బ్రిడ్జ్ కోర్సు పేరుతో బీడీఎస్ విద్యార్థులను అల్లోపతి వైద్యం చేసేందుకు అనుమతించడం సరికాదన్నది ఐఎంఏ వర్గాల వాదన.
కావాలి ఎంబీబీఎస్‌లు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక డాక్టర్ (1000:1 నిష్పత్తిలో) ఉండాలి. కానీ, మన దేశంలో ప్రస్తుతం ఈ సంఖ్య 1700:1 గా ఉందనేది అంచనా. ఐఎంఏ వర్గాల అంచనా ప్రకారం.. 30 శాతం జనాభా ఉన్న పట్టణ ప్రాంతాల్లో దాదాపు 65 శాతం మంది అల్లోపతి వైద్య నిపుణులు అందుబాటులో ఉంటే.. 70 శాతం జనాభా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కేవలం 33 శాతం మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. కాబట్టి పీజీ వైద్య విద్యలో ప్రవేశం లభించని ఎంబీబీఎస్‌లను హెల్త్ సెంటర్లలో ఫిజిషియన్లుగా నియమించి ఉద్యోగావకాశాలు కల్పించాలని ఐఎంఏ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి భిన్నంగా బీడీఎస్, నర్సింగ్ విద్యార్థులను బ్రిడ్జ్ కోర్సు ఆధారంగా ఎంబీబీఎస్‌లోకి ప్రవేశం కల్పించడం సరికాదని ఆ స్పష్టం చేస్తున్నాయి.
నీతి ఆయోగ్ సిఫార్సులు:
దేశంలో ఎంబీబీఎస్ వైద్యుల కొరత దృష్ట్యా.. ఇతర వైద్య విభాగాలకు చెందిన వారికి అల్లోపతి వైద్యం చేసే అవకాశం కల్పించాలనే అంశంపై గత రెండేళ్లుగా చర్చ జరుగుతోంది. ముందుగా ఆయుష్ వైద్యులకు ఎంబీబీఎస్ చదివే అవకాశం కల్పించాలని.. ఇందుకు బ్రిడ్జ్ కోర్స్ విధానం ప్రవేశపెట్టాలని నీతిఆయోగ్, ఇండియన్ మెడికల్ కమిషన్ బిల్-2018లో సిఫార్సు చేశాయి. అప్పట్లో దీనిపై ఐఎంఏ వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. తాజాగా మరోసారి కస్తూరి రంగన్ కమిటీ ఎంబీబీఎస్‌లోకి లేటరల్ ఎంట్రీ విధానం గురించి సిఫార్సులు చేయడంతో మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
ఎగ్జిట్ ఎగ్జామ్.. మరోసారి తెరపైకి :
కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సుల నేపథ్యంలో ఎగ్జిట్ ఎగ్జామ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఎంబీబీఎస్ పూర్తిచేసిన విద్యార్థులకు వార్షికంగా జరిపే పరీక్షలకు బదులు జాతీయస్థాయిలో ఉమ్మడిగా ఎగ్జిట్ పరీక్ష నిర్వహించాలని కమిటీ సూచించింది. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉన్నత విద్య, ప్రాక్టీస్ పరంగా అనుమతి ఇవ్వాలనే సిఫార్సు చేసింది. వాస్తవానికి ఈ సిఫార్సు కూడా గత కొన్నేళ్లుగా నీతి ఆయోగ్, గత రెండేళ్లుగా ఐఎంసీ బిల్లులో నానుతూనే ఉంది.
అనుకూలమా, ప్రతికూలమా?
తాజా సిఫార్సులు విద్యార్థులకు అనుకూలమా, ప్రతికూలమా అంటే రెండు రకాల అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
అనుకూలతలు:
- ఎంబీబీఎస్ స్వప్నం నెరవేరక ప్రత్యామ్నాయ వైద్యవిద్య కోర్సులపై దృష్టిపెడుతున్న అభ్యర్థులకు.. ఎంబీబీఎస్ కల నెరవేరే అవకాశం లభిస్తుంది.
- ఇప్పటి వరకు తాము చదివిన విభాగాల్లోనే(డెంటల్, నర్సింగ్) ఉపాధి అవకాశాలు పొందుతున్న వారికి.. కొత్తగా వాటితోపాటు అల్లోపతి వైద్యం చేసే వీలు కలుగుతుంది.
- నర్సింగ్ విద్యార్థుల విషయంలో ఇది అత్యంత అనుకూలించే అంశంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్నత విద్య పరంగా ఎన్ని కోర్సులు చదివినా వారు నర్సింగ్ విభాగానికే పరిమితం అవుతున్నారు. తాజా సిఫార్సులు అమలైతే వారు కూడా వైద్యులుగా సేవలందించడానికి అవకాశం లభిస్తుంది.
- అప్పటికే అయిదేళ్లపాటు డెంటల్ కోర్సు చదివిన విద్యార్థులు మరో మూడేళ్లు బ్రిడ్జ్ కోర్సు చదివినా.. ఎంబీబీఎస్ పట్టా మాత్రమే అందుతుంది. దానికి బదులుగా ఈ వ్యవధిలో డెంటల్ పీజీ పూర్తిచేసుకునే అవకాశం ఉంటుంది.
- భవిష్యత్తులో బీడీఎస్, నర్సింగ్ కోర్సులకు కూడా ఎంబీబీఎస్ మాదిరిగా రూ. లక్షలు ఫీజులు చెల్లించి చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
- తాజా సిఫార్సులు అమలైతే.. బీడీఎస్ ఫీజులు ప్రైవేటు కళాశాలల్లో అమాంతం పెరిగే ఆస్కారముంది.
నూతన విద్యా విధానం:
ముఖ్యాంశాలు..
- బీడీఎస్, నర్సింగ్ విద్యార్థులకు ఎంబీబీఎస్‌లోకి లేటరల్ ఎంట్రీ విధానంలో అనుమతి.
- సైన్స్ గ్రాడ్యుయేట్లకు ఎంబీబీఎస్ తొలి ఏడాది లేదా రెండేళ్లు ఉమ్మడి సిలబస్ బోధించి.. తర్వాత వారి ఆసక్తి ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశం కల్పించడం.
- ఎంబీబీఎస్ తర్వాత అకడమిక్ వార్షిక పరీక్షలకు బదులు జాతీయస్థాయిలో ఏకరూప రీతిలో ఎగ్జిట్ ఎగ్జామ్ నిర్వహించడం.
ఈ సిఫార్సులు సరికాదు : బీడీఎస్, నర్సింగ్ విద్యార్థులను లేటరల్ ఎంట్రీ విధానంలో ఎంబీబీఎస్‌లోకి ప్రవేశం కల్పించాలనే సిఫార్సు.. అదే విధంగా ఫౌండేషన్ కోర్సు విధానం వంటి ప్రతిపాదనలు సరికాదు. ప్రస్తుతం ప్రభుత్వం అల్లోపతి వైద్యం పరంగా ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారందరికీ ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటే మేలు. దానిద్వారా ఇప్పుడున్న పేషెంట్-డాక్టర్ నిష్పత్తి మధ్య తేడాను గణననీయంగా తగ్గించొచ్చు. - డాక్టర్ ఆర్.వి.అశోకన్, సెక్రటరీ జనరల్, ఐఎంఏ. |
బ్రిడ్జ్ కోర్సు పేరిట మరో మూడేళ్లు... తాజా సిఫార్సులతో రానున్న రోజుల్లో అల్లోపతి వైద్యం విస్తృతంగా అందుబాటులోకి వస్తుందనే మాట నిజమే. కానీ, అప్పటికే అయిదేళ్లపాటు బీడీఎస్ చదివిన విద్యార్థులు బ్రిడ్జ్ కోర్సు పేరిట మరో మూడేళ్లు సమయం అదనంగా వెచ్చించినా.. ఎంబీబీఎస్ పట్టా మాత్రమే లభిస్తుంది. ఇది బీడీఎస్ విద్యను కూడా కమర్షియల్ చేసే ప్రమాదం ఉంది. - డాక్టర్ కె.శ్రీనాథ్ రెడ్డి, ప్రెసిడెంట్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. |
Published date : 25 Jun 2019 03:56PM