క్యాట్‌లో విజయం సాధించాలంటే ఇవి ఎంతో కీలకం..
అభ్యర్థులు ‘గోల్ సెట్టింగ్ థియరీ’ ప్రకారం చదివితే విజయం సాధించగలరు. అంటే.. పరీక్షలో మూడు సెక్షన్లతో పాటు ‘టైమ్ మేనేజ్‌మెంట్’ను నాలుగో విభాగంగా పరిగణించాలని గతేడాది క్యాట్ టాపర్ లక్ష్యకుమార్ చెబుతున్నారు. నిర్ణీత సమయంలో ఆయా సెక్షన్‌ల ప్రకారం ప్రశ్నలను విభజించుకొని చదవాలి. అభ్యర్థులకు ప్రతి విభాగానికి కేవలం 40 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది.
బలాబలాలు తెలుసుకోవాలి..
ఇతర పోటీ పరీక్షలతో పోలిస్తే క్యాట్ విభిన్నంగా ఉంటుంది. ర్యాంకు సాధించాలంటే.. ప్రశ్నలను ఖచ్చితత్వంతోపాటు అత్యంత వేగంగా పరిష్కరించగలగాలి. ఈ పరీక్ష రాసే అభ్యర్థులకు టైమ్ మేనేజ్‌మెంట్ చాలా అవసరం. పరిమిత కాలంలో క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం అంత తేలికకాదు. సమయ ఒత్తిడిలో తెలిసిన వాటికి కూడా పొరపాట్లు చేస్తుంటారు. కాబట్టి అభ్యర్థులు తమ శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకొని.. అందుకు అనుగుణంగా పరీక్షకు సంసిద్ధులు కావాలి. ఏ విభాగంలో వెనుకబడి ఉన్నారో.. ఏ విభాగాన్ని వేగంగా చేయగలుగుతున్నారో గుర్తించాలి. వెనుకంజలో ఉన్న విభాగంలో ఇప్పటికే ప్రాక్టీస్ చేసిన నమూనా ప్రశ్నలను మరోసారి పరిష్కరించాలి. ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించామనేదానికంటే.. ఎన్నింటికి కచ్చితమైన జవాబులు ఇచ్చామనేది ముఖ్యం.
ఇంకా చదవండి: part 3: క్యాట్ సాధించాలంటే.. మాక్ టెస్టులు ఎంతో కీలకం..