క్యాట్-2019 పిపరేషన్ టిప్స్...
Sakshi Education
క్యాట్.. దేశంలోని ప్రతిష్టాత్మక బీస్కూల్స్ ఐఐఎంల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష. కామన్ అడ్మిషన్ టెస్టు(క్యాట్)-2019 నోటిఫికేషన్ వెలువడింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం), కోజికోడ్ ఈ
ఏడాది క్యాట్ నిర్వహణను చేపట్టింది. కొద్దిరోజుల క్రితం పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతోపాటు ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో.. క్యాట్ 2019 నోటిఫికేషన్ వివరాలు.. పరీక్షా విధానం.. ఎంపిక ప్రక్రియ.. ప్రిపరేషన్ గెడైన్స్.. క్యాట్‌తో ప్రయోజనాలపై ప్రత్యేక కథనం...
అర్హతలు:
కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు సైతం క్యాట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
20 ఐఐఎంలు :
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లకు ప్రముఖ బీస్కూల్స్‌గా, టాప్ విద్యా సంస్థలుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం అహ్మదాబాద్, అమృత్‌సర్, బెంగళూరు, బోధ్‌గయ, కలకత్తా, ఇండోర్, జమ్మూ, కాశీపూర్, కోజికోడ్, లక్నో, నాగ్‌పూర్, రాయ్‌పూర్, రాంచీ, రోహ్‌తక్, సంబల్‌పూర్, షిల్లాంగ్, సిర్మౌర్, త్రిచీ, షిల్లాంగ్, ఉదయ్‌పూర్, విశాఖపట్నాల్లో మొత్తం 20 ఐఐఎంలు ఉన్నాయి. వీటిలో పీజీపీ(2020-2022), ఇతర మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశించాలంటే.. క్యాట్‌లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
ఐఐఎంల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి క్యాట్ స్కోరు ప్రధాన కొలమానం. దీంతోపాటు గ్రూప్ డిస్కషన్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూల్లో విద్యార్థులు చూపిన ప్రతిభ, అకడెమిక్ రికార్డు, వర్క్‌ఎక్స్‌పీరియన్స్ తదితరాలను సైతం పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ప్రతి ఐఐఎంకు సొంత ఎంపిక విధానాన్ని అనుసరించే వెసులుబాటు ఉంది. ఆయా ఐఐఎంల వెబ్‌సైట్‌ల ద్వారా సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌ల ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవచ్చు.
పరీక్షా విధానం :
పరీక్ష విధానం గురించి ప్రకటించకపోయినప్పటికీ.. ఈ ఏడాది సైతం గతేడాది తరహాలోనే క్యాట్‌ను నిర్వహించే అవకాశముంది. గతేడాది క్యాట్ పరీక్షా విధానం ప్రకారం- వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రెహెన్షన్ నుంచి 34 ప్రశ్నలు -102 మార్కులకు.. డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ విభాగంలో 32 ప్రశ్నలు-96 మార్కులకు.. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్‌లో 34 ప్రశ్నలు 102 మార్కులకు అడగటం జరిగింది. అంటే.. మొత్తం 100 ప్రశ్నలు-300 మార్కులకు క్యాట్‌పరీక్ష నిర్వహించే అవకాశముంది. పరీక్ష సమయం మూడు గంటలు.
డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్ (డీఐఎల్‌ఆర్) :
వెర్బల్ రీజనింగ్ అండ్ రీడింగ్ కాంప్రెహెన్షన్ (వీఏఆర్‌సీ) :
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్:
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కి సంబంధించి మంచి పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా కాన్సెప్ట్యుల్ అవగాహన పెంచుకోవచ్చు. ఈ విభాగంలో అర్థమెటిక్, అల్‌జీబ్రా, జామెట్రీ, మోడ్రన్ మ్యాథ్స్ తదితరాలు ముఖ్య టాపిక్స్. బేసిక్స్‌పై పట్టుసాధిం చగలిగితే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో మంచి మార్కులు సాధించొచ్చు.
నాన్ ఎంసీక్యూస్ :
2015 నుంచి నాన్ ఎంసీక్యూ ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ ప్రశ్నలకు ఎలాంటి ఆప్షన్లు ఉండవు. వీటికి సమాధానాన్ని మౌస్‌ని ఉపయోగించి వర్చువల్ కీబోర్డ్ ఆధారంగా టైప్ చేయాల్సి ఉంటుంది. ప్రతి విభాగంలో నాన్ ఎంసీక్యూస్ ఉంటున్నాయి. కానీ వీటి సంఖ్యపై మాత్రం ఎలాంటి నిర్దిష్టత లేదు. క్యాట్‌లో బేసిక్ కంప్యూటేషన్‌లో ఉపయోగపడేలా నాన్ సైంటిఫిక్ ఆన్ స్క్రీన్ క్యాల్‌కులేటర్ అందుబాటులో ఉంది.
ముఖ్యసమాచారం
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 18
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: అక్టోబర్ 23-నవంబర్ 24
క్యాట్ నిర్వహణ తేదీ: నవంబర్ 24
ఫలితాల వెల్లడి: 2020, జనవరి రెండో వారం
దరఖాస్తు ఫీజు: రూ.1900, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.900
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://iimcat.ac.in
ప్రిపరేషన్.. టిప్స్
క్యాట్‌కి ప్రిపేరయ్యే అభ్యర్థులు ప్రశ్నకు సమాధానాలు గుర్తించే క్రమంలో కోర్ కాన్సెప్ట్‌పై అవగాహనతోనే ముందుకెళ్తున్నామా? లేదా? అనే విషయాన్ని గుర్తించాలి. కాన్సెప్ట్యువల్ అవగాహన లేమితో సమాధానాలు గుర్తించలేకపోయిన ప్రశ్నలను నోట్ చేసుకొని.. వెంటనే పుస్తకాలు లేదా క్యాట్ మెటీరియల్‌ను రిఫర్ చేయాలి. క్యాట్‌కి ప్రిపేరయ్యే అభ్యర్థులంతా మొదట స్వీయ బలాలు, బలహీనతలను గుర్తించాలి. అందుబాటులో ఉన్న సమయాన్ని విభాగాల వారీగా విభజించుకొని.. పట్టున్న విభాగాన్ని త్వరగా పూర్తి చేయాలి. అలాగే బలహీనంగా ఉన్న విభాగాలకు ఎక్కువ సమయం కేటాయించాలి.
మాక్ టెస్టులతో మేలు:
క్యాట్ ప్రిపరేషన్‌లో ఆన్‌లైన్ మాక్ టెస్టులది కీలక స్థానం. కంప్యూటర్ బేస్డ్ మాక్ టెస్టులకు హాజరవడం వల్ల అభ్యర్థులకు వాస్తవ పరీక్షా పరిస్థితులపై అవగాహన ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనన్ని ఆన్‌లైన్ మాక్ టెస్టులకు హాజరవ్వాలి. దీంతోపాటు గత ప్రశ్నపత్రాల సాధనతో స్వీయ సామర్థ్యం, భవిష్యత్ ప్రిపరేషన్‌పై అంచనాకి రావొచ్చు. అభ్యర్థులు రోజూ స్వీయ పరీక్ష నిర్వహించుకొని.. క్యాట్ నమూనా పశ్నపత్రాలను సాధన చేస్తే సానుకూల ఫలితాలు ఉంటాయి. విభిన్న క్యాట్ మాక్‌టెస్ట్‌లకు హాజరవ్వడం వల్ల అన్ని విధాలా సన్నద్ధత లభిస్తుంది.
ప్రాక్టీస్ మంత్ర :
అభ్యర్థులు ప్రాక్టీస్ ఎంత ఎక్కువగా చేస్తే పరీక్ష రోజు ప్రశ్నలతో అంత త్వరగా కనెక్ట్ అవగలుగుతారు. షెడ్యూల్ ప్రకారం ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రశ్నలను వేగంగా పరిష్కరించగలిగే నేర్పు, కూర్చుని ఏకధాటిగా మూడు గంటలపాటు పరీక్షకు ఎదుర్కొనే సామర్థ్యం అలవడుతాయి. క్యాట్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఓపెన్ మైండ్‌తో ఉండటం మంచిది. ముఖ్యంగా బలంగా ఉన్న విభాగాల్లోని అన్ని పశ్నలను అటెంప్ట్ చేసేందుకు ప్రయత్నించాలి. అలాగే ప్రతి విభాగంలో 20 వరకు ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగేలా ప్రిపేరయితే మంచి పర్సంటైల్ సాధించొచ్చు.
టైం మేనేజ్‌మెంట్ :
క్యాట్‌లో సెక్షనల్ టైమ్ లిమిట్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు వేగంగా ప్రశ్నలను సాధించే నైపుణ్యాలను అలవరచుకోవాలి. చూడగానే డౌట్‌గా అనిపించే ప్రశ్నలను తొలి విడతలో విడిచిపెట్టి.. ఆయా ప్రశ్నలకు రెండో రౌండ్‌లో సమాధానాలు గుర్తించేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే.. పరీక్ష ప్రారంభించిన వెంటనే వేగంగా కొన్ని ప్రశ్నలను సాధించడం ద్వారా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అదే ఉత్సాహంతో రెండో రౌండ్‌లో క్లిష్టమైన ప్రశ్నలను సాల్వ్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.
ప్రత్యామ్నాయాలు..
సెకండ్ రౌండ్ అటెంప్ట్‌లో క్లిష్టంగా అనిపించే ప్రశ్నల విషయంలో ప్రత్యామ్నాయ వ్యూహాన్ని అమలుచేయాలి. ఇందులో భాగంగా ముందు ఆప్షన్లను స్కాన్ చేయాలి. కొన్నిసార్లు ప్రశ్న కింద ఇచ్చిన ఆప్షన్లు.. ప్రశ్న సాధనకు కావాల్సిన ఆలోచనను రేకిత్తిస్తాయి. ఈ దిశగా ముందు అన్ రిలేటెడ్ ఆప్షన్లను ఎలిమినేట్ చేయాలి. తద్వారా ఆప్షన్ల సంఖ్య తగ్గి.. సరైన సమాధానం ఎంచుకొనే అవకాశాలు పెరుగుతాయి.

- ఈ విభాగంలో బార్‌గ్రాఫ్స్, కేస్‌లెట్స్, కాలమ్‌గ్రాఫ్స్, టేబుల్స్, లైన్‌ఛార్ట్స్, వెన్ డయాగ్రామ్స్, పై ఛార్ట్స్, కాంబినేషన్ ఆఫ్ టు ఆర్ మోర్ టైప్స్ లింక్డ్ టు ఈచ్ అదర్, బ్లడ్ రిలేషన్స్, క్యాలెండర్స్, క్యూబ్స్, క్లాక్స్, నంబర్ అండ్ లెటర్ సిరీస్, బైనరీ లాజిక్, సీటింగ్ అరేంజ్‌మెంట్ తదితర టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశముంది.
- అభ్యర్థులు డీఐఎల్‌ఆర్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చాలామంది మొత్తంగా మంచి పర్సంటైల్ సాధించినప్పటికీ.. ఈ విభాగంలో కటాఫ్ మార్కులు సాధించలేకపోవడంతో ఐఐఎంల నుంచి పిలుపు అందుకోలేకపోతున్నారు. కాబట్టి అభ్యర్థులు సెక్షనల్ కటాఫ్‌పైనా ప్రత్యేక దృష్టిపెట్టి ప్రిపరేషన్ సాగించాలి. గత క్యాట్‌ల డీఐ ప్రశ్నల శైలిని పరిశీలించడం, డేటా ఇంటర్‌ప్రిటేషన్స్ సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను చదవడం లాభిస్తుంది.
- లాజికల్ రీజనింగ్: అభ్యర్థుల అనలిటికల్, లాజికల్ స్కిల్స్‌ని పరీక్షించడమే ఈ విభాగం ప్రధాన ఉద్దేశం. లాజికల్ రీజనింగ్ ద్వారా అభ్యర్థుల్లోని సిస్టమాటిక్ థాట్ ప్రాసెస్‌ని అంచనా వేస్తారు. లేటెస్ట్ ట్రెండ్స్ ఫాలో అవడం ద్వారా ఈ విభాగంలో మంచి మార్కులు పొందవచ్చు.
వెర్బల్ రీజనింగ్ అండ్ రీడింగ్ కాంప్రెహెన్షన్ (వీఏఆర్‌సీ) :
- వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగంలో.. సినానిమ్స్, ఆంటోనిమ్స్, ఇంగ్లిష్ యూసేజ్ ఆఫ్ గ్రామర్, జంబల్డ్ పారాగ్రాఫ్, క్లోజ్ పాసేజ్, వెర్బల్ రీజనింగ్, ఫ్యాక్ట్స్,-ఇన్ఫీరియెన్సెస్,-జడ్జ్‌మెంట్స్ అంశాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశముంది.
- 2015 నుంచి క్యాట్ ప్రశ్నపత్రంలో వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రెహెన్షన్ కీలక విభాగంగా ఉంటోంది. ఇందులో అభ్యర్థుల భాషా (ఇంగ్లిష్) పొందిక, భాష వాడుకలో కచ్చితత్వం (పర్ఫెక్షన్)ను పరీక్షిస్తారు. ఈ విభాగంలో మంచి మార్కులు సాధించాలంటే.. పారాసమ్మరీ, జంబల్డ్ పారాగ్రాఫ్, పికింగ్ ఆడ్ సెంటెన్స్ ఔట్ ఆఫ్ జంబల్డ్ పారాగ్రాఫ్ తదితరాలపై దృష్టిపెట్టాలి.
- క్యాట్ ఔత్సాహికుల్లో ఎక్కువ మంది క్లిష్టంగా భావించే విభాగం రీడింగ్ కాంప్రెహెన్షన్. ఇందులో అడిగే ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ఛాయిస్ విధానంలో ఉంటాయి. ఆన్‌లైన్ ప్రాక్టీస్, పాసేజ్ భావాన్ని అర్థంచేసుకోవడం ద్వారా ఆర్‌సీ ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. దీన్నుంచి రీజనింగ్, అసంప్షన్, ట్రూ ఆర్ ఫాల్స్ కోణంలోనూ ప్రశ్నలు వస్తున్నాయి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్:
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కి సంబంధించి మంచి పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా కాన్సెప్ట్యుల్ అవగాహన పెంచుకోవచ్చు. ఈ విభాగంలో అర్థమెటిక్, అల్‌జీబ్రా, జామెట్రీ, మోడ్రన్ మ్యాథ్స్ తదితరాలు ముఖ్య టాపిక్స్. బేసిక్స్‌పై పట్టుసాధిం చగలిగితే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో మంచి మార్కులు సాధించొచ్చు.
నాన్ ఎంసీక్యూస్ :
2015 నుంచి నాన్ ఎంసీక్యూ ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ ప్రశ్నలకు ఎలాంటి ఆప్షన్లు ఉండవు. వీటికి సమాధానాన్ని మౌస్‌ని ఉపయోగించి వర్చువల్ కీబోర్డ్ ఆధారంగా టైప్ చేయాల్సి ఉంటుంది. ప్రతి విభాగంలో నాన్ ఎంసీక్యూస్ ఉంటున్నాయి. కానీ వీటి సంఖ్యపై మాత్రం ఎలాంటి నిర్దిష్టత లేదు. క్యాట్‌లో బేసిక్ కంప్యూటేషన్‌లో ఉపయోగపడేలా నాన్ సైంటిఫిక్ ఆన్ స్క్రీన్ క్యాల్‌కులేటర్ అందుబాటులో ఉంది.
ముఖ్యసమాచారం
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 18
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: అక్టోబర్ 23-నవంబర్ 24
క్యాట్ నిర్వహణ తేదీ: నవంబర్ 24
ఫలితాల వెల్లడి: 2020, జనవరి రెండో వారం
దరఖాస్తు ఫీజు: రూ.1900, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.900
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://iimcat.ac.in
ప్రిపరేషన్.. టిప్స్
క్యాట్‌కి ప్రిపేరయ్యే అభ్యర్థులు ప్రశ్నకు సమాధానాలు గుర్తించే క్రమంలో కోర్ కాన్సెప్ట్‌పై అవగాహనతోనే ముందుకెళ్తున్నామా? లేదా? అనే విషయాన్ని గుర్తించాలి. కాన్సెప్ట్యువల్ అవగాహన లేమితో సమాధానాలు గుర్తించలేకపోయిన ప్రశ్నలను నోట్ చేసుకొని.. వెంటనే పుస్తకాలు లేదా క్యాట్ మెటీరియల్‌ను రిఫర్ చేయాలి. క్యాట్‌కి ప్రిపేరయ్యే అభ్యర్థులంతా మొదట స్వీయ బలాలు, బలహీనతలను గుర్తించాలి. అందుబాటులో ఉన్న సమయాన్ని విభాగాల వారీగా విభజించుకొని.. పట్టున్న విభాగాన్ని త్వరగా పూర్తి చేయాలి. అలాగే బలహీనంగా ఉన్న విభాగాలకు ఎక్కువ సమయం కేటాయించాలి.
మాక్ టెస్టులతో మేలు:
క్యాట్ ప్రిపరేషన్‌లో ఆన్‌లైన్ మాక్ టెస్టులది కీలక స్థానం. కంప్యూటర్ బేస్డ్ మాక్ టెస్టులకు హాజరవడం వల్ల అభ్యర్థులకు వాస్తవ పరీక్షా పరిస్థితులపై అవగాహన ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనన్ని ఆన్‌లైన్ మాక్ టెస్టులకు హాజరవ్వాలి. దీంతోపాటు గత ప్రశ్నపత్రాల సాధనతో స్వీయ సామర్థ్యం, భవిష్యత్ ప్రిపరేషన్‌పై అంచనాకి రావొచ్చు. అభ్యర్థులు రోజూ స్వీయ పరీక్ష నిర్వహించుకొని.. క్యాట్ నమూనా పశ్నపత్రాలను సాధన చేస్తే సానుకూల ఫలితాలు ఉంటాయి. విభిన్న క్యాట్ మాక్‌టెస్ట్‌లకు హాజరవ్వడం వల్ల అన్ని విధాలా సన్నద్ధత లభిస్తుంది.
- మాక్‌టెస్టుకు హాజరైన వెంటనే అభ్యర్థులు పరీక్షలో చూపిన ప్రదర్శనను విశ్లేషించుకోవాలి. క్యాట్ పరీక్షా విధానాన్ని దృష్టిలో పెట్టుకొని విభాగాల వారీగా స్కోరింగ్ ఏరియాస్‌పై నిర్ణయానికి రావాలి. మాక్ టెస్టుల్లో కొన్నిసార్లు ఎక్కువ మార్కులు రావొచ్చు. కొన్నిసార్లు మరీ తక్కువమార్కులు రావొచ్చు. ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు అతివిశ్వాసం ప్రదర్శించడం; తక్కువ మార్కులు వచ్చినప్పుడు కుంగిపోవడం సరికాదు. నిలకడతో కూడిన స్మార్ట్‌వర్క్‌తోనే క్యాట్‌లో సక్సెస్ కాగలరని గుర్తించాలి.
ప్రాక్టీస్ మంత్ర :
అభ్యర్థులు ప్రాక్టీస్ ఎంత ఎక్కువగా చేస్తే పరీక్ష రోజు ప్రశ్నలతో అంత త్వరగా కనెక్ట్ అవగలుగుతారు. షెడ్యూల్ ప్రకారం ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రశ్నలను వేగంగా పరిష్కరించగలిగే నేర్పు, కూర్చుని ఏకధాటిగా మూడు గంటలపాటు పరీక్షకు ఎదుర్కొనే సామర్థ్యం అలవడుతాయి. క్యాట్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఓపెన్ మైండ్‌తో ఉండటం మంచిది. ముఖ్యంగా బలంగా ఉన్న విభాగాల్లోని అన్ని పశ్నలను అటెంప్ట్ చేసేందుకు ప్రయత్నించాలి. అలాగే ప్రతి విభాగంలో 20 వరకు ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగేలా ప్రిపేరయితే మంచి పర్సంటైల్ సాధించొచ్చు.
టైం మేనేజ్‌మెంట్ :
క్యాట్‌లో సెక్షనల్ టైమ్ లిమిట్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు వేగంగా ప్రశ్నలను సాధించే నైపుణ్యాలను అలవరచుకోవాలి. చూడగానే డౌట్‌గా అనిపించే ప్రశ్నలను తొలి విడతలో విడిచిపెట్టి.. ఆయా ప్రశ్నలకు రెండో రౌండ్‌లో సమాధానాలు గుర్తించేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే.. పరీక్ష ప్రారంభించిన వెంటనే వేగంగా కొన్ని ప్రశ్నలను సాధించడం ద్వారా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అదే ఉత్సాహంతో రెండో రౌండ్‌లో క్లిష్టమైన ప్రశ్నలను సాల్వ్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.
ప్రత్యామ్నాయాలు..
సెకండ్ రౌండ్ అటెంప్ట్‌లో క్లిష్టంగా అనిపించే ప్రశ్నల విషయంలో ప్రత్యామ్నాయ వ్యూహాన్ని అమలుచేయాలి. ఇందులో భాగంగా ముందు ఆప్షన్లను స్కాన్ చేయాలి. కొన్నిసార్లు ప్రశ్న కింద ఇచ్చిన ఆప్షన్లు.. ప్రశ్న సాధనకు కావాల్సిన ఆలోచనను రేకిత్తిస్తాయి. ఈ దిశగా ముందు అన్ రిలేటెడ్ ఆప్షన్లను ఎలిమినేట్ చేయాలి. తద్వారా ఆప్షన్ల సంఖ్య తగ్గి.. సరైన సమాధానం ఎంచుకొనే అవకాశాలు పెరుగుతాయి.
ప్రతి మార్కు కీలకమే.. క్యాట్ పరీక్షలో ప్రాథమిక అంశాలకు సంబంధించిన అప్లికేషన్స్‌పై అభ్యర్థుల పరిజ్ఞానాన్ని అంచనావేస్తారు. సరైన దిశలో నైపుణ్యాలను పెంపొందించుకోవడం, కాన్సెప్ట్యువల్ అవగాహన-అప్లికేషన్లపై పట్టు పెంచుకుంటే క్యాట్‌లో విజయావకాశాలు మెరుగవుతాయి. క్యాట్ ఔత్సాహికులకు స్మార్ట్ క్వశ్చన్ సెలక్షన్/జడ్జిమెంట్‌తోపాటు మూడు గంటలపాటు ఫోకస్డ్‌గా కూర్చొగలిగే సామర్థ్యం ఉండాలి. ఎఫ్‌ఎంఎస్ ఢిల్లీ, ఎస్‌పీజేఐఎంఆర్ ముంబై, జేబీఐఎంఎస్ ముంబై, ఎండీఐ గుర్‌గావ్ తదితర ఇన్‌స్టిట్యూట్‌లు సొంతంగా పరీక్షలు నిర్వహిస్తున్నా.. ఎంపిక ప్రక్రియలో క్యాట్ స్కోరును కూడా పరిగణలోకి తీసుకుంటున్నాయి. అభ్యర్థులు ఒక పద్ధతి ప్రకారం ప్రిపరేషన్‌ని ప్లాన్ చేసుకొని... పరీక్షకు సిద్ధిమైతే క్యాట్ విజయావకాశాలు మెరుగవుతాయి. -రామ్‌నాథ్ కే, టైమ్, క్యాట్ కోర్సు డెరైక్టర్ |
Published date : 17 Aug 2019 12:58PM