Skip to main content

కస్టమ్స్ బ్రోకర్స్‌గా కెరీర్ ప్రారంభించాలనుకునేవారికి అవకాశం.. సీబీఎల్‌ఆర్ ఎగ్జామినేషన్-2021 నోటిఫికేషన్ విడుదల..

కస్టమ్ బ్రోకర్స్‌గా పనిచేయాలనుకునే వారి కోసం నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డెరైక్ట్ టాక్స్‌స్ అండ్ నార్కోటిక్స్(ఎన్‌ఏసీఐఎన్).. కస్టమ్స్ బ్రోకర్ల లెసైన్సింగ్ ఎగ్జామినేషన్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కస్టమ్స్ బ్రోకర్స్ లెసైన్సింగ్ రెగ్యూలేషన్స్(సీబీఎల్‌ఆర్) కింద ఈ వృత్తిలో కొనసాగడానికి వ్యాలిడ్ లెసైన్స్‌ను పొందుతారు. స్క్రీనింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

కస్టమ్స్ బ్రోకర్స్ ఎగ్జామినేషన్..
భారత దేశంలో కస్టమ్స్ బ్రోకర్‌గా పనిచేయాలనుకుంటే.. నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డెరైక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నిర్వహించే కస్టమ్స్ బ్రోకర్స్ ఎగ్జామినేషన్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. కస్టమర్లకు, కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌కు మధ్య ఏర్పడే కస్టమ్స్ డ్యూటీ సమస్యలను పరిష్కరించేందుకు మధ్యవర్తులుగా పని చేసేవారే..ఈ కస్టమ్స్ బ్రోకర్స్. కస్టమ్స్ బ్రోకర్లు ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు కావచ్చు. ఈ లెసైన్స్ ఉన్న వారికి మాత్రమే కస్టమ్స్ బ్రోకర్లుగా పనిచేయడానికి అర్హత లభిస్తుంది. సీఐబీసీ కస్టమ్స్ బ్రోకర్ల కోసం కస్టమ్స్ బ్రోకర్ల లెసైన్సింగ్ రెగ్యులేషన్ ఎగ్జామినేషన్ 2021 నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హతలు..
కస్టమ్స్ బ్రోకర్స్ లెసైన్సింగ్ రెగ్యూలేషన్స్ (సీబీఎల్‌ఆర్), 2018 ప్రకారం- ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా భారతీయ పౌరులై ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే ప్రొఫెషనల్ కోర్సులైన సీఏ/సీఎ్‌స్/ఎల్‌ఎల్‌ఎం/ఎంబీఏ వంటివి పూర్తి చేయాలి. లేదా రెండేళ్లు కస్టమ్స్ బ్రోకర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం..
ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. సీబీఎల్‌ఆర్, 2018లో ఫారం ఏ లభిస్తుంది. ఫారం ఎతోపాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, ఆధార్/పాస్‌పోర్ట్/ ఓటర్ ఐడీ, విద్యార్హత సర్టిఫికెట్లు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని వాటితోపాటు జతచేసి సదరు చిరునామాకు పంపించాలి. రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం..
స్ర్కీనింగ్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సీబీఎల్‌ఆర్, 2018లోని 6(7) ప్రకారం-రాత పరీక్ష సిలబస్ ఉంటుంది. పరీక్షకు హాజరు కావడానికి అర్హులైన అభ్యర్థుల పేర్లను 17.02.2021 నాటికి నోటీస్ బోర్డు లేదా సంబంధిత కమిషనరేట్ వెబ్‌సైట్ లో పొందుపరుస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.

ఇంకా చదవండి: part 2: కస్టమ్స్ బ్రోకర్స్ ఎగ్జామినేషన్-2021.. పరీక్ష విధానం ఇలా..

Published date : 15 Jan 2021 05:25PM

Photo Stories