Skip to main content

కంబైన్డ్ జియోసైంటిస్ట్ ఎగ్జామ్-2020 సిలబస్..పరీక్ష విధానం

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) కంబైన్డ్ జియోసైంటిస్ట్ ఎగ్జామ్- 2020కు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో విజయం సాధిస్తే జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో గ్రూప్ ఏ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో గ్రూప్ బి ఉద్యోగాలను కైవసం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఔత్సాహికులకు ఉపయోగపడేలా నోటిఫికేషన్ వివరాలతోపాటు పరీక్ష విధానం, సిలబస్‌లపై సమగ్ర కథనం...

భర్తీ చేసే ఉద్యోగాలు :
కేటగిరీ 1 :
1. జియాలజిస్టు(గ్రూప్ ఎ)-79
2. జియోఫిజిస్టు(గ్రూపు ఎ)-5
3. కెమిస్టు(గ్రూపు ఎ)- 15

కేటగిరీ 2 :
l జూనియర్ హైడ్రాలజిస్టు(గ్రూపు బి)- 3

విద్యార్హతలు:
జియాలజిస్టు: జియాలాజికల్ సైన్స్/అప్లయిడ్ జియాలజీ/జియో ఎక్స్‌ప్లొరేషన్/మినరల్ ఎక్స్‌ప్లొరేషన్/ఇంజనీరింగ్ జియాలజీ/మెరైన్ జియాలజీ/ఎర్త్‌సైన్స్ అండ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్/ఓషినోగ్రఫీ, కోస్టల్ ఏరియాస్ స్టడీస్/పెట్రోలియం జియోసెన్సైస్/పెట్రోలియం ఎక్స్‌ప్లొరేషన్ /జియోకెమిస్ట్రీ/జియోలాజికల్ టెక్నాలజీల్లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
జియోఫిజిస్టు: ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్/జియోఫిజిక్స్ స్పెషలైజేషన్స్/ అప్లయిడ్ జియోఫిజిక్స్/ మెరైన్ జియోఫిజిక్స్ స్పెషలైజేషన్స్‌తో ఎంఎస్సీ లేదా ఎంఎస్సీ (టెక్) అప్లయిడ్ జియోఫిజిక్స్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ (ఎక్స్‌ప్లొరేషన్ జియోఫిజిక్స్) ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు.
కెమిస్టు: కెమిస్ట్రీ/అప్లయిడ్ కెమిస్ట్రీ/అనలిటికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్స్‌తో ఎంఎస్సీ ఉత్తీర్ణత.
జూనియర్ హైడ్రాలజిస్టు: జియాలజీ/అప్లయిడ్ జియాలజీ/మెరైన్ జియాలజీల్లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు :
జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలోని గ్రూప్ ఎ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే... జనవరి 1, 2020 నాటికి 21 నుంచి 32 ఏళ్లలోపు ఉండాలి. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులోని గ్రూప్ బి పోస్టులకు జనవరి 1, 2020 నాటికి 21 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోసడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ :
  • కంబైన్డ్ జియోసైంటిస్ట్ ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది.
  • మొదటి దశ ప్రిలిమినరీ పరీక్షలో ఆబ్జెక్టివ్ తరహాలో రెండు పేపర్లు ఉంటాయి. దీన్ని ఆన్‌లైన్(కంప్యూటర్ బేస్డ్) విధానంలో నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
  • ప్రిలిమినరీలో చూపిన ప్రతిభ ఆధారంగా మెయిన్ పరీక్షలకు ఎంపిక చేస్తారు.
  • మెయిన్ డిస్క్రిప్టివ్ తరహాలో ప్రతి స్ట్రీమ్ (విభాగం) నుంచి మూడు పేపర్లు ఉంటాయి.
  • మెయిన్‌లో పొందిన మార్కుల ఆధారంగా పర్సనల్ ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.
  • తుది ఎంపికలో ప్రిలిమినరీ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు.
ప్రిలిమినరీ (మొదటి దశ) :
స్ట్రీమ్ 1:
జియాలజిస్ట్, జూనియర్ హైడ్రోజియాలజిస్ట్ :
సబ్జెక్టు సమయం మార్కులు
పేపర్ 1: జనరల్ స్టడీస్ 2 గంటలు 100
పేపర్ 2: జియాలజీ/
హైడ్రోజియాలజీ 2 గంటలు 300
మొత్తం 400
స్ట్రీమ్ 2: జియోఫిజిసిస్ట్
పేపర్ 1: జనరల్ స్టడీస్ 2 గంటలు 100
పేపర్ 2: జియోఫిజిక్స్ 2 గంటలు 300
మొత్తం 400

స్ట్రీమ్ 3: కెమిస్ట్
పేపర్ 1: జనరల్ స్టడీస్ 2 గంటలు 100
పేపర్ 2: కెమిస్ట్రీ 2 గంటలు 300
మొత్తం 400

మెయిన్ (2వ దశ):
స్ట్రీమ్ 1: జియాలజిస్ట్: డిస్క్రిప్టివ్ తరహాలో మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు చొప్పున కేటాయించారు. మొత్తం మార్కులు 600. పరీక్ష వ్యవధి(పేపర్‌కు) మూడు గంటలు.
స్ట్రీమ్ 2: జియోఫిజిస్ట్: డిస్క్రిప్టివ్ తరహాలో మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు చొప్పున కేటాయించారు. మొత్తం మార్కులు 600. పరీక్ష వ్యవధి(పేపర్‌కు) మూడు గంటలు.
స్ట్రీమ్ 3: కెమిస్ట్: డిస్క్రిప్టివ్ తరహాలో మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు కేటాయించారు. మొత్తం మార్కులు 600. పరీక్ష వ్యవధి(పేపర్‌కు) మూడు గంటలు.
స్ట్రీమ్ 4: జూనియర్ హైడ్రోజియాలజిస్ట్: ఈ స్ట్రీమ్‌లో జియాలజీ నుంచి రెండు పేపర్లు; హైడ్రోజియాలజీ నుంచి ఒక పేపర్ ఉంటుంది. ఒక్కో పేపర్‌కి 200 మార్కుల చొప్పున కేటాయించారు. మొత్తం మార్కులు 600. పరీక్ష కాలవ్యవధి(పేపర్‌కి) మూడు గంటలు.

మూడో దశ :
పర్సనాలిటీ టెస్ట్: 200 మార్కులకు ఉంటుంది.


సిలబస్ :
జనరల్ స్టడీస్ (పేపర్ 1) :
  • తాజా జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యాంశాలు.
  • భారతదేశ చరిత్ర, భారత స్వాతంత్య్రోద్యమం.
  • భారత, ప్రపంచ భౌగోళిక, సాంఘిక, ఆర్థిక, సామాజిక స్థితిగతులు.
  • ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్-రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ, పబ్లిక్ పాలసీ, హక్కులకు సంబంధించిన సమస్యలు.
  • ఆర్థిక, సామాజిక అభివృద్ధి-సుస్థిర అభివృద్ధి, పేదరికం, ఇంక్లూజన్, డెమోగ్రాఫిక్స్, సాంఘిక రంగ కార్యక్రమాలు తదితరం.
  • ఎన్విరాన్‌మెంటల్ ఎకాలజీ-జనరల్ ఇష్యూస్, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ ఛేంజ్.
  • జనరల్ సైన్స్.
స్టేజ్ 1 (ఆబ్జెక్టివ్ టైప్) :
 పేపర్ 2: జియాలజీ/హైడ్రాలజీ

 ఫిజికల్ జియాలజీ; స్ట్రక్చురల్ జియాలజీ; మినరాలజీ; ఇగ్నియస్ పెట్రోలజీ; మెటామార్ఫిక్ పెట్రోలజీ; సెడిమెంటాలజీ; పాలియంటాలజీ;స్ట్రాటిగ్రఫీ; ఎకనామిక్ జియాలజీ; హైడ్రోజియాలజీ.
 పేపర్ 2: జియోఫిజిక్స్
 సాలిడ్ ఎర్త్ జియోఫిజిక్స్; మ్యాథమెటికల్ మెథడ్స్ ఇన్ జియోఫిజిక్స్; ఎలక్ట్రోమాగ్నటిజమ్; జియోఫిజికల్ ప్రాస్పెక్టింగ్; రిమోట్ సెన్సింగ్ అండ్ థర్మోడైనమిక్స్; న్యూక్లియర్ ఫిజిక్స్ అండ్ రేడియోమెట్రీ.
 పేపర్ 2: కెమిస్ట్రీ
 కెమికల్ పిరియాడిసిటీ, కెమికల్ బాండింగ్ అండ్ స్ట్రక్చర్(ఐయానిక్, కోవలెంట్, కోఆర్డినేట్ బాండింగ్); యాసిడ్స్ అండ్ బేసెస్; థియరాటికల్ బేసిస్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఇనార్గానిక్ అనాలసిస్(వాల్యుమెట్రిక్ అనాలసిస్); కెనైటిక్ థియరీ అండ్ గ్యాసియస్ స్టేట్, కెమికల్ థర్మోడైనమిక్స్ అండ్ కెమికల్ ఈక్విలిబ్రియమ్, సొల్యూషన్ ఆఫ్ నాన్ ఎలక్ట్రోలైట్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, స్టీరియో కెమిస్ట్రీ, టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్, మాలిక్యులర్ రీ- అరేంజ్‌మెంట్స్. 
 
 మెయిన్ (డిస్క్రిప్టివ్):
 జియాలజీ పేపర్ 1 :
  సెక్షన్ ఎ: ఫిజికల్ జియాలజీ అండ్ రిమోట్ సెన్సింగ్. 
 సెక్షన్ బి: స్ట్రక్చరల్ జియాలజీ 
 సెక్షన్ సి: సెడిమెంటాలజీ
 సెక్షన్ డి: పాలియంటాలజీ
 సెక్షన్ ఇ: స్ట్రాటిగ్రఫీ
 
 జియాలజీ పేపర్ 2 :
  సెక్షన్ ఎ: మినరాలజీ
 సెక్షన్ బి: జియోకెమిస్ట్రీ అండ్ ఐసోటోప్ జియాలజీ
 సెక్షన్ సి: ఇగ్నియస్ పెట్రోలజీ 
 సెక్షన్ డి: మెటామార్ఫిక్ పెట్రోలజీ
 సెక్షన్ ఇ: జియోడైనమిక్స్
 
 జియాలజీ పేపర్ 3 :
 సెక్షన్ ఎ: ఎకనామిక్ జియాలజీ 
 సెక్షన్ బి: ఇండియన్ మినరల్ డిపాజిట్స్ అండ్ మినరల్ ఎకనామిక్స్
 సెక్షన్ సి: మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ 
 సెక్షన్ డి: ఫ్యూయల్ జియాలజీ అండ్ ఇంజనీరింగ్ జియాలజీ
 సెక్షన్ ఇ: ఎన్విరాన్‌మెంటల్ జియాలజీ అండ్ నేచురల్ హజార్డ్స్
 
 హైడ్రోజియాలజీ (స్టేజ్ 2):
 సెక్షన్ ఎ: అక్కరెన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ 
 సెక్షన్ బి: గ్రౌండ్ వాటర్ మూవ్‌మెంట్ అండ్ వెల్ హైడ్రాలిక్స్
 సెక్షన్ సి: వాటర్ వెల్స్ అండ్ గ్రౌండ్ వాటర్ లెవల్స్ 
 సెక్షన్ డి: గ్రౌండ్ వాటర్ ఎక్స్‌ప్లొరేషన్
 
 జియోఫిజిక్స్ పేపర్ 1 :
 పార్ట్ ఎ: సాలిడ్ ఎర్త్ జియోఫిజిక్స్, ఎర్త్‌క్వేక్ సీస్మాలజీ, మ్యాథమెటికల్ మెథడ్స్ ఇన్ జియోఫిజిక్స్, జియోఫిజికల్ ఇన్వెర్షన్.
 పార్ట్ బి: మ్యాథమెటికల్ మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్, ఎలక్ట్రోడైనమిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, ఇంట్రడక్టరీ అట్మాస్పియరిక్ అండ్ స్పేస్ ఫిజిక్స్.
 
 జియోఫిజిక్స్ పేపర్ 2 :
 పొటెన్షియల్ ఫీల్డ్(గ్రావిటీ అండ్ మ్యాగ్నటిక్) మెథడ్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మెథడ్స్, సీస్మిక్ ప్రాస్పెక్టింగ్, బోర్‌హోల్ జియోఫిజిక్స్.
 పార్ట్ బి: క్లాసికల్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ ఫిజిక్స్, అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ మెటీరయల్స్, న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్.
 
 జియోఫిజిక్స్ పేపర్ 3 :
 పార్ట్ ఎ: రేడియోమెట్రిక్ అండ్ ఎయిర్‌బోర్న్ జియోఫిజిక్స్, మెరైన్ జియోఫిజిక్స్, జియోఫిజికల్ సిగ్నల్ ప్రాసెసింగ్, రిమోట్‌సెన్సింగ్ అండ్ జియోహైడ్రాలజీ.
 పార్ట్ బి: సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్, లేజర్ సిస్టమ్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, రేడార్ సిస్టమ్స్, శాటిలైట్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ మెకానిక్స్.
 
 కెమిస్ట్రీ పేపర్ 1 :
 ఇనార్గానిక్ సాలిడ్స్, కెమిస్ట్రీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, యాసిడ్, బేస్ టైట్రేషన్స్, గ్రావిమెట్రిక్ అనాలసిస్, రిడాక్స్ టైట్రేషన్, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్, ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్, న్యూక్లియర్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ ఆఫ్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్.
 కెమిస్ట్రీ పేపర్ 2 :
 కైనటిక్ థియరీ అండ్ ది గ్యాసియస్ స్టేట్, సాలిడ్స్, కెమికల్ థర్మోడైనమిక్స్ అండ్ కెమికల్ ఈక్విలిబ్రియమ్, కెమికల్ కైనటిక్స్ అండ్ కెటాలసిస్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, క్వాంటమ్ కెమిస్ట్రీ, బేసిక్ ప్రిన్సిపుల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ స్పెక్ట్రోస్కోపీ, ఫోటోకెమిస్ట్రీ.
 కెమిస్ట్రీ పేపర్ 3 :
 పార్ట్ ఎ (అనలిటికల్ కెమిస్ట్రీ): ఎర్రర్స్ ఇన్ క్వాంటిటేటివ్ అనాలసిస్, సెపరేషన్ మెథడ్స్, స్పెక్ట్రోస్కోపిక్ మెథడ్స్ ఆఫ్ అనాలసిస్, థర్మల్ మెథడ్స్ ఆఫ్ అనాలసిస్, ఎక్స్‌రే మెథడ్స్ ఆఫ్ అనాలసిస్,ఇండక్టివ్లీ కపుల్డ్ ప్లాస్మా స్పెక్ట్రోస్కోపీ, అనాలసిస్ ఆఫ్ జియలాజికల్ మెటీరియల్స్.
 పార్ట్ బి (ఆర్గానిక్ కెమిస్ట్రీ): అన్ స్టేబుల్ అండ్ అన్‌చార్జ్‌డ్ ఇంటర్‌మీడియెట్స్, అడిషన్ రియాక్షన్స్, రియాక్షన్ ఎట్ ది కార్బోనైల్ గ్రూప్, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, స్పెక్ట్రోస్కోపిక్ మెథడ్స్ ఆఫ్ అనాలసిస్.
 
 ముఖ్యసమాచారం :
 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబరు 15, 2019
 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తేదీ: జనవరి 19, 2020
 మెయిన్ ఎగ్జామినేషన్ తేదీ: జూన్ 27, 28, 2020
 దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు ఉంది.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేంద్రం (తెలుగు రాష్ట్రాలు): హైదరాబాద్
Published date : 15 Oct 2019 05:28PM

Photo Stories