జోసా-2019 కౌన్సెలింగ్ ప్రక్రియ ఇలా...
Sakshi Education
ఐఐటీల్లో చేరాలని లక్షల మంది విద్యార్థులు కలలు కంటుంటారు. అందుకోసం అహోరాత్రులు శ్రమిస్తుంటారు. అయినా కొద్ది మందికే సీటు లభిస్తుంది. 23 ఐఐటీల్లోని 13,589 సీట్ల కోసం రెండున్నర లక్షల మంది ప్రతిభావంతులు పోటీపడుతుంటారు. దేశంలో ఉన్నత ప్రమాణాలతో సాంకేతిక విద్యను అందించేందుకు ఐఐటీలకు అంకురార్పణ జరిగింది. మొట్టమొదటి ఐఐటీ.. 1951లో ఖరగ్‌పూర్‌లో ఏర్పాటైంది. ఆ తర్వాత బాంబే, మద్రాస్, కాన్పూర్, ఢిల్లీల్లో ఐఐటీలకు శ్రీకారం చుట్టారు. అలా ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు స్థాపించారు. ఆయా ఐఐటీల్లో బీటెక్, ఎంటెక్ కోర్సులతోపాటు సైన్స్, మేనేజ్‌మెంట్, లా, హ్యుమానిటీస్, లిబరల్ ఆర్ట్స్, డిజైన్ తదితర విభాగాల్లో కోర్సులను అందిస్తున్నారు. ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు వీలుకల్పించే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెలువడటంతో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జోసా-2019 కౌన్సెలింగ్ వివరాలతోపాటు దేశంలో ఇంజనీరింగ్ విద్యకు పెట్టింది పేరైన ఐఐటీలు.. అందిస్తున్న కోర్సులు, ఆయా ఇన్‌స్టిట్యూట్‌లకు లభించిన 2019 ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్ గురించి తెలుసుకుందాం...
జోసా 2019 కౌన్సెలింగ్ విధానం...
జూన్ 14న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటికే జేఈఈ మెయిన్ ఫలితాలు ప్రకటించడం తెలిసిందే. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలు, 31 నిట్‌లు, 25 ట్రిపుల్‌ఐటీలు, 28 జీఎఫ్‌టీఐ (కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర సంస్థలు)ల్లో 2019-20 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం జూన్ 16 నుంచి జోసా(జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జోసాను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. జోసా అనేది ఈ మొత్తం 107 ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్ అందించే కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏర్పాటు చేసిన ఉమ్మడి వేదిక. జేఈఈ మెయిన్ 2019/జేఈఈ అడ్వాన్స్‌డ్ 2019లో అర్హత సాధించిన విద్యార్థులు జోసా 2019లో పాల్గొనేందుకు అర్హులు.
రిజిస్ట్రేషన్:
జోసా 2019 కౌన్సెలింగ్ షెడ్యూల్ :
https://josaa.nic.in/webinfocms/Public/home.aspx
జోసా 2019లో పాల్గొనే ఇన్‌స్టిట్యూట్స్, సీట్ల వివరాలు...
ఐఐటీల సంఖ్య: 23.
ఐఐటీల్లో నాలుగేళ్ల బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్ ప్రోగ్రామ్‌లో సీట్ల సంఖ్య: 13,589 (మహిళా సూపర్ న్యూమరరీ, ఈడ బ్ల్యూఎస్ కోటా అన్నీ కలుపుకొని).
ఎన్‌ఐటీల సంఖ్య: 31
ఎన్‌ఐటీల్లో నాలుగేళ్ల బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్ ప్రోగ్రామ్‌లో కలిపి మొత్తం సీట్ల సంఖ్య: 21,142.
ట్రిపుల్ ఐటీల సంఖ్య: 25.
ట్రిపుల్ ఐటీల్లో మొత్తం సీట్లు: 4,713.
జీఎఫ్‌టీఐల సంఖ్య: 28.
జీఎఫ్‌టీఐల్లో మొత్తం సీట్ల సంఖ్య: 5,806
అదిరేటి ఐఐటీలు..!
ఐఐటీ గాంధీనగర్:
2008లో సబర్మతి నది ఒడ్డున ఏర్పాటైంది. ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధిత కోర్సులను అందించడంలో అత్యుత్తమంగా నిలుస్తోంది. కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లో బీటెక్, ఎంటెక్ కోర్సులను అందిస్తోంది. వీటితోపాటు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కాగ్నిటివ్ సైన్స్‌ల్లో ఎంఎస్సీ ప్రోగ్రామ్‌లో కూడా అడ్మిషన్ కల్పిస్తోంది. అంతేకాకుండా ఎంఏ ఇన్ సొసైటీ అండ్ కల్చర్‌నూ అందిస్తోంది. ఉన్నత విద్య పరంగా కెమికల్, బయోమెడికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఎర్త్‌సైన్స్, కాగ్నిటివ్ సైన్స్‌ల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో సైతం ఐఐటీ గాంధీనగర్ ప్రవేశం కల్పిస్తోంది. అదేవిధంగా ఇక్కడ లిటరేచర్, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, సోషియల్ ఎపిడిమియోలజీలోనూ పీహెచ్‌డీ చేసే వీలుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 24వ ర్యాంకు, మొత్తంగా 51వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitgn.ac.in
ఐఐటీ భువనేశ్వర్:
ఐఐటీ భువనేశ్వర్‌ను 2008లో ప్రారంభించారు. బీటెక్(సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెట్లర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్), డ్యూయల్ డిగ్రీ, ఎంటెక్, ఎంఎస్సీ, పీహెచ్‌డీ, ప్రోగ్రామ్స్‌ను ఆఫర్‌చేస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 17వ ర్యాంకు, మొత్తంగా 46వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitbbs.ac.in
ఐఐటీ మద్రాస్:
ఉన్నత సాంకేతిక విద్య, బేసిక్ అండ్ అప్లయిడ్ రీసెర్చ్ పరంగా దేశంలోనే అత్యుత్తమ, జాతీయ ప్రాధాన్యతా ఇన్‌స్టిట్యూట్‌గా గుర్తింపు పొందింది. దీన్ని 1959లో పశ్చిమ జర్మనీ సహకారంతో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 16 అకడెమిక్ డిపార్ట్‌మెంటులు, ఇంజనీరింగ్, ప్యూర్‌సైన్స్‌కు సంబంధించి పలు అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. వివిధ స్పెషలైజేషన్లతో బీటెక్, డ్యూయల్ డిగ్రీ, ఎంటెక్, ఎంఏ, ఎంబీఏ, ఎంఎస్సీ, ఈఎంబీఏ, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంతోపాటు మొత్తంగా మొదటి ర్యాంకు సొంతం చేసుకుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ టాపర్స్ బాగా ఆసక్తి చూపే ఇన్‌స్టిట్యూట్స్‌లో ఐఐటీ మద్రాస్ ముందుంటుంది.
వెబ్‌సైట్: www.iitm.ac.in
ఐఐటీ గువహటి:
1994లో ఆరో ఐఐటీగా గువహటిలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున ప్రారంభించారు. 1995 నుంచి అకడమిక్ ప్రోగ్రామ్స్‌ను ఆఫర్‌చేస్తోంది. ఈ ఐఐటీలో 11 డిపార్ట్‌మెంటులు, 5 ఇంటర్ డిసిప్లినరీ సెంటర్స్ ఉన్నాయి. బీటెక్(బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, మెకానికల్ ఇంజనీరింగ్); బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, ఎంఏ, మాస్టర్ ఆఫ్ డిజైన్, ఎంటెక్, ఎంఎస్, పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్‌చేస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 7వ ర్యాంకు, మొత్తంగా 9వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitg.ac.in
ఐఐటీ ఇండోర్:
ఐఐటీ ఇండోర్‌ను 2009లో ప్రారంభించారు. నూతనంగా ప్రారంభించిన 8 ఐఐటీల్లో ఇదొకటి. బీటెక్(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెట్లర్జికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్స్); ఎంటెక్, ఎంఎస్సీ, బీటెక్+ఎంటెక్, ఎంఎస్(రీసెర్చ్), పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 13వ ర్యాంకు పొందింది. రీసెర్చ్ విభాగం బలంగా ఉండటంతో ఐఐటీ ఇండోర్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటుతోంది.
వెబ్‌సైట్: www.iiti.ac.in
ఐఐటీ కాన్పూర్:
తొలి తరం ఐఐటీల్లో ఇదొకటి. మొదటి పదేళ్ల కాలంలో మిట్, కాలిఫోర్నియా, బెర్కలీ, ప్రిన్స్‌టన్ వంటి పది అమెరికా విశ్వవిద్యాలయాలు అకడమిక్ ప్రోగ్రామ్స్, రీసెర్చ్ ల్యాబ్స్ ఏర్పాటుకు సహకరించాయి. దీంతోపాటు భారత్‌లో కంప్యూటర్ కోర్సులను అందించిన తొలి ఇన్‌స్టిట్యూట్(1963)గా గుర్తింపు పొందింది. బీటెక్, బీఎస్(బ్యాచిలర్ ఆఫ్ సైన్స్), ఎంటెక్, ఎంఎస్, మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎంఎస్సీ, ఎంఎస్సీ-పీహెచ్‌డీ, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్, మల్టీడిసిప్లినరీ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 5వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitk.ac.in
ఐఐటీ ఖరగ్‌పూర్:
ఐఐటీలోకెల్ల్లా ప్రత్యేక స్థానం కలిగుంది. 1951లో దేశంలోనే తొలి ఐఐటీగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 19 అకడెమిక్ డిపార్ట్‌మెంట్‌లు, 8 మల్టిడిసిప్లినరీ సెంటర్లు, 13 ఎక్సలెన్స్ స్కూళ్లు, 25కు పైగా సెంట్రల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ యూనిట్లు ఉన్నాయి. బీటెక్, బీఆర్క్, అయిదేళ్ల డ్యూయల్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులను ఆఫర్‌చేస్తోంది. వీటితోపాటు లా, బిజినెస్ మేనేజ్‌మెంట్, డాక్టోరల్ కోర్సులను అందిస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 4వ ర్యాంకు, మొత్తంగా 5వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitkgp.ac.in
ఐఐటీ జోధ్‌పూర్:
2008లో ఐఐటీ కాన్పూర్ క్యాంపస్‌లో ఏర్పాటుచేశారు. అనంతరం జోధ్‌పూర్‌లోని తాత్కాలిక క్యాంపస్‌కు.. 2017లో 852 ఎకరాల్లో ఏర్పాటుచేసిన శాశ్వత క్యాంపస్‌కు ఐఐటీ జోధ్‌పూర్ తరలింది. బీటెక్(బయో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్), ఎంటెక్, ఎంఎస్సీ, ఎంఎస్సీ-ఎంటెక్, ఎంటెక్-పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది. ప్రస్తుతం బయోసెన్సైస్ అండ్ బయో ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్, మెట్లర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ వంటి వివిధ విభాగాల్లో కోర్సులను ఆఫర్‌చేస్తుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 50వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitj.ac.in
ఐఐటీ పాట్నా:
దీన్ని 2008లో ప్రారంభించారు. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, కెమికల్ బ్రాంచ్‌ల్లో బీటెక్ ప్రోగ్రామ్‌ను ఆఫర్‌చేస్తోంది. దీంతోపాటు మల్టిడిసిప్లినరీ స్ట్రీమ్స్(ఎనిమిది స్పెషలైజేషన్స్)తో ఎంటెక్‌ను ఆఫర్‌చేస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 22వ ర్యాంకు, మొత్తంగా 58వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitp.ac.in
ఐఐటీ హైదరాబాద్:
దీన్ని 2008లో ప్రారంభించారు. పరిశోధనలకు, ప్రచురణలకు పేరుగాంచింది. బీటెక్ (కెమికల్, సివిల్, సీఎస్‌ఈ, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ సైన్స్, మెటీరియల్ సైన్స్ అండ్ మెట్లర్జికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, మెకానికల్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), మాస్టర్ ఆఫ్ సైన్స్, ఎంటెక్ కోర్సును అందిస్తోంది. దీంతోపాటు సెన్సైస్, లిబరల్ ఆర్ట్స్‌లో రీసెర్చ్ డిగ్రీలను ఆఫర్ చేస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 8వ ర్యాంకు, మొత్తంగా 22వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iith.ac.in
ఐఐటీ బాంబే:
ఐఐటీల్లో దీనికుండే క్రేజ్ అంతా ఇంతా కాదు! జేఈఈ అడ్వాన్స్‌డ్ టాపర్లంతా కోరుకునే ఇన్‌స్టిట్యూట్ ఐఐటీ బాంబే. యునెస్కో, సోవియట్ యూనియన్‌ల సహకారంతో దేశంలోనే రెండో ఐఐటీగా 1958లో ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం 2018లో దీనికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా ఇచ్చింది. ఐఐటీ ముంబైలో 15 డిపార్ట్‌మెంట్‌లు, 20 మల్టిడిసిప్లినరీ సెంటర్లు, 1 స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఉన్నాయి. బీటెక్, డ్యూయల్ డిగ్రీ, నాలుగేళ్ల బీఎస్ ప్రోగ్రామ్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్, రెండేళ్ల ఎంఎస్సీ ప్రోగ్రామ్, ఎంఎస్సీ, పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్, ఎంటెక్/ఎంటెక్+పీహెచ్‌డీ(డుయల్ డిగ్రీ), మాస్టర్ ఆఫ్ డిజైన్, ఎంఫిల్, ఎంబీఏ, ఎంబీఏ(ఎగ్జిక్యూటివ్), ఎంఎస్సీ-పీహెచ్‌డీ, పీహెచ్‌డీ తదితర కోర్సులను అందిస్తోంది. ఐఐటీ బాంబే క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్(2019)లో 162 ర్యాంకు పొందింది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 3వ ర్యాంకు, మొత్తంగా 4వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitb.ac.in
ఐఐటీ ఢిల్లీ:
1961లో ప్రారంభించారు. ఐఐటీ ఢిల్లీలో 15 డిపార్ట్‌మెంట్‌లు, 11 మల్టిడిసిప్లినరీ సెంటర్లు, 5 ఎక్స్‌లెన్స్ స్కూల్స్, 14 ఎక్స్‌లెన్స్ సెంటర్లు ఉన్నాయి. బీటెక్, డ్యూయల్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, పీహెచ్‌డీ, ఎంటెక్, ఎంఎస్(ఆర్), ఎంబీఏ, ఎండీఈఎస్, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 2వ ర్యాంకు, మొత్తంగా 3వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitd.ac.in
ఐఐటీ రోపార్:
ఐఐటీ రోపార్‌ను 2008లో ప్రారంభించారు. తాత్కాలిక క్యాంపస్ నుంచి 2018లో శాశ్వత క్యాంపస్‌కు మారింది. 10 అకడెమిక్ డిపార్ట్‌మెంట్‌లు, ఒక మల్టీడిసిప్లినరీ సెంటర్ ఉన్నాయి. బీటెక్(సివిల్, కెమికల్, సీఎస్‌ఈ, ఎలక్ట్రికల్, మెకానికల్, మెట్లర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్), అయిదేళ్ల బీటెక్-ఎంటెక్ (మెకానికల్) డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్, ఎంటెక్, పీహెచ్‌డీ అందిస్తోంది. వీటితోపాటు హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్‌లో పీహెచ్‌డీకి అవకాశం కల్పిస్తోంది ఐఐటీ రోపార్. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 29వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్ : www.iitrpr.ac.in
ఐఐటీ మండి:
ఐఐటీ మండిని 2009లో ప్రారంభించారు. 2015లో శాశ్వత క్యాంపస్‌కు మారింది. కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ స్పెషలైజేషన్స్‌తో బీటెక్ ఆఫర్‌చేస్తోంది. వీటితోపాటు ఎంఎస్, పీహెచ్‌డీ, ఎంటెక్, ఎంఎస్సీ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 20వ ర్యాంకు, మొత్తంగా 44వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: students.iitmandi.ac.in
ఐఐటీ రూర్కీ:
యూనివర్సిటీ ఆఫ్ రూర్కీని 2001లో ఐఐటీగా మార్చారు. ఇంజనీరింగ్, టెక్నాలజీ, అప్లయిడ్ సెన్సైస్, మేనేజ్‌మెంట్‌లో అకడమిక్ ప్రోగ్రామ్స్‌ను ఆఫర్‌చేస్తోంది. బీటెక్(బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెట్లర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ ఫిజిక్స్); ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 6వ ర్యాంకు, మొత్తంగా 8వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitr.ernet.in
ఐఐటీ వారణాసి:
2012లో బనారస్ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌యూ)కి ఐఐటీ హోదా కల్పించారు. బీటెక్(సిరామిక్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సీఎస్‌ఈ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెట్లర్జికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ), అయిదేళ్ల డ్యూయల్ డిగ్రీ(బీటెట్-ఎంటెక్), రెండేళ్ల ఎంటెక్, ఎంఫార్మ్, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 11వ ర్యాంకు, మొత్తంగా 10వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: iitbhu.ac.in
ఐఐటీ జమ్మూ:
ఐఐటీ జమ్మూలో మొదటి బ్యాచ్ 82 మంది విద్యార్థులతో 2016లో ప్రారంభమైంది. కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెటీరియల్ సైన్స్, మెకానికల్ బ్రాంచ్‌లో బీటెక్‌ను అందిస్తోంది. దీంతోపాటు పలు స్పెషలైజేషన్లతో ఎంటెక్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ను ఆఫర్‌చేస్తోంది.
వెబ్‌సైట్: http://iitjammu.ac.in
ఐఐటీ పాలక్కాడ్:
ఐఐటీ పాలక్కాడ్‌లో 2015-16 విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించారు. ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్‌లో నడుస్తోంది. సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్‌సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లో బీటెక్ కోర్సును అందిస్తోంది. 2017లో ఎంఎస్(రీసెర్చ్), పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ను ప్రారంభించింది. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, హ్యూమానిటీస్ విభాగాల్లో ఈ కోర్సులను అందిస్తోంది.
వెబ్‌సైట్: iitpkd.ac.in
ఐఐటీ తిరుపతి:
ఐఐటీ తిరుపతిలో 2015-16 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించారు. దీనికి మద్రాస్ ఐఐటీ మెంటార్‌గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్‌లో నడుస్తోంది. ఇది కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ బ్రాంచ్‌ల్లో బీటెక్‌ను అందిస్తోంది. వీటితోపాటు ఎంటెక్, ఎంఎస్(రీసెర్చ్), ఎంఎస్సీ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ను ఆఫర్‌చేస్తోంది.
వెబ్‌సైట్: iittp.ac.in
ఐఐటీ గోవా:
ఐఐటీ గోవాను 2016లో ప్రారంభించారు. ప్రస్తుతం గోవా ఇంజనీరింగ్ కాలేజ్‌లో తాత్కాలిక క్యాంపస్‌లో కొనసాగుతోంది. దీనికి ఐఐటీ బాంబే మెంటార్‌గా వ్యవహరిస్తోంది. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో బీటెక్ కోర్సును అందిస్తోంది. దీంతోపాటు పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 87వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitgoa.ac.in
ఐఐటీ భిలాయ్:
ఐఐటీ భిలాయ్‌ను 2016లో ప్రారంభించారు. ప్రస్తుతం రాయ్‌పూర్‌లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలోని తాత్కాలిక క్యాంపస్‌లో కొనసాగుతోంది. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ స్ట్రీముల్లో బీటెక్‌ను అందిస్తోంది. అలాగే ఎంటెక్‌తోపాటు కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఫిజిక్స్‌లో ఎంఎస్సీ; కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, లిబరల్ ఆర్ట్స్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ను ఆఫర్‌చేస్తోంది.
వెబ్‌సైట్: www.iitbhilai.ac.in
ఐఐటీ ధార్వాడ్:
ఐఐటీ ధార్వాడ్‌ను 2016లో ప్రారంభించారు. దీనికి ఐఐటీ బాంబే మెంటార్‌గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్‌లో కొనసాగుతున్న ఐఐటీ శాశ్వత భవనాల నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం 500 ఎకరాలు కేటాయించింది. ప్రస్తుతం ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ స్ట్రీముల్లో బీటెక్‌ను అందిస్తోంది. దాంతోపాటు ఎంఎస్, పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.iitdh.ac.in
ఐఐటీ ధన్‌బాద్:
2016లో ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌ను ఐఐటీ ధన్‌బాద్‌గా మార్చారు. కెమికల్ అండ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్, మినరల్ ఇంజనీరింగ్, మెకానికల్, మైనింగ్ ఇంజనీరింగ్, మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, స్పెషలైజేషన్స్‌తో బీటెక్ ప్రోగ్రామ్‌ను ఆఫర్‌చేస్తోంది. దీంతోపాటు బీటెక్+ఎంటెక్, ఎంబీఏ డ్యూయల్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఎంఎస్సీ, ఎంఎస్సీ-టెక్, ఎంబీఏ, ఎంటెక్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. దీంతోపాటు బేసిక్ సెన్సైస్, సోషల్ సెన్సైస్, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పలు కోర్సులను అందిస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 15వ ర్యాంకు, మొత్తంగా 25వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitism.ac.in.

- జేఈఈ అడ్వాన్స్‌డ్ 2019లో అర్హత సాధించినట్లు ప్రకటించిన అభ్యర్థులు.. జోసాలో పాల్గొనే అన్ని ఇన్‌స్టిట్యూట్స్ (ఐఐటీలు, నిట్‌లు, ఐఐఐటీలు, జీఎఫ్‌ఐటీలు)కు దరఖాస్తు చేసుకోవచ్చు.
- జేఈఈ మెయిన్ 2019లో అర్హత సాధించిన విద్యార్థులు నిట్‌లు తదితర ఇన్‌స్టిట్యూట్స్‌ల్లో చేరేందుకు అర్హులు (ఐఐటీలు మినహా).
- ఫిల్లింగ్ ఇన్ ఛాయిస్: అభ్యర్థులు తమకు ఇష్టమైన ఇన్‌స్టిట్యూట్స్, బ్రాంచ్‌ల ప్రాథమ్యాల జాబితాను పేర్కొనాలి. సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాథమ్యాలను ఇవ్వాలి.
- లాకింగ్ ఆఫ్ ఛాయిస్: అభ్యర్థులు తమ ప్రాథమ్యాల జాబితాను పొందుపరిచాక.. దాన్ని ‘లాక్’ చేయాలి. అలా లాక్ చేయకుంటే.. ఫిల్లింగ్ చాయిస్ కోసం అందుబాటులో ఉంచిన టైమ్ విండో ముగిసినప్పుడు అభ్యర్థులు తాము పొందుపరిచి, చివరగా సేవ్ చేసిన ప్రాథమ్యాలు వాటంతట అవే లాక్ అవుతాయి.
- ఏడు రౌండ్ల ప్రక్రియ: జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం ఏడు రౌండ్లలో జరుగుతుంది.
- సీటు అంగీకారం: సీటు పొందిన అభ్యర్థులు సీటు అంగీకార ఫీజును చెల్లించి (ఎస్‌బీఐ ఈ చలాన్/ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్/ఎస్‌బీఐ డెబిట్ కార్డ్).. నిర్దేశిత రిపోర్టింగ్ కేంద్రాల్లో తమ ధ్రువపత్రాల పరిశీలన జరిపించుకోవాలి.
- కేటాయించిన సీట్లు నచ్చని అభ్యర్థులు తదుపరి రౌండ్లలో పాల్గొనేందుకు వీలుగా స్లైడ్, ఫ్లోట్ ఆప్షన్ ఇచ్చుకోవాలి.
- ఇప్పటికే సీటును అంగీకరించిన విద్యార్థులు... ఆరో రౌండ్ వరకూ ఆ సీటు అంగీకారాన్ని ఉపసంహరించుకునే వీలుంది. అందుకోసం రిపోర్టింగ్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
- నిర్దేశిత గడువులోపు రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులు.. ప్రవేశం పొందే అవకాశాన్ని కోల్పో తారు. అంతేకాకుండా నిర్దేశిత గడువులోపు ప్రాథమ్యాలు ఇవ్వని విద్యార్థులు కూడా అడ్మిషన్ పొందలేరు. ప్రాథమ్యాలను ఒకసారి లాక్ చేశాక మళ్లీ మార్పులు చేర్పులకు అవకాశం ఉండదు.
- డ్యూయల్ రిపోర్టింగ్: ఐఐటీల నుంచి నిట్‌లకు, ఇతర ఇన్‌స్టిట్యూట్‌లకు.. అలాగే నిట్‌లు, ఇతర ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి ఐఐటీలకు సీటు కేటాయింపు జరిగినప్పుడు రెండు చోట్ల రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
జోసా 2019 కౌన్సెలింగ్ షెడ్యూల్ :
- జూన్ 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ... అభ్యర్థుల రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్ ముగుస్తుంది.
- జూన్ 27వ తేదీన మొదటి రౌండ్‌కు సీటు కేటాయింపు జరుగుతుంది.
- జూన్ 28 నుంచి జూలై 2వ తేదీ వరకూ అయిదు రోజుల పాటు ధ్రువపత్రాల పరిశీలన, రిపోర్టింగ్ సెంటర్‌లో రిపోర్ట్ చేసి.. సీటు అంగీకారం/ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది.
- జూలై 3న ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు.. రెండో రౌండ్‌కు సంబంధించి సీట్ల కేటాయింపు జరుగుతుంది.
- జూలై 4 నుంచి 5వ తేదీ వరకూ.. రెండో రౌండ్‌కు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన, రిపోర్టింగ్ సెంటర్‌కు వెళ్లి సీటు అంగీకారం/ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది.
- జూలై 6న ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు.. మూడో రౌండ్‌కు సీట్ల కేటాయింపు జరుగుతుంది.
- జూలై 7, 8 తేదీల్లో... మూడో రౌండ్‌కు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన, రిపోర్టింగ్ సెంటర్‌కు వెళ్లి సీటు అంగీకారం/ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది.
- జూలై 9న ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు.. నాలుగో రౌండ్‌కు సీట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది.
- జూలై 10, 11తేదీల్లో... నాలుగో రౌండ్‌కు ధ్రువపత్రాల పరిశీలన, రిపోర్టింగ్ సెంటర్‌కు వెళ్లి సీటు అంగీకారం/ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది.
- జూలై 12వ తేదీ.. అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు... అయిదో రౌండ్‌కు సీట్ల కేటాయింపు జరుగుతుంది.
- జూలై 13, 14 తేదీల్లో... అయిదో రౌండ్‌కు సంబంధించి ధ్రువ పత్రాల పరిశీలన, రిపోర్టింగ్ సెంటర్‌కు వెళ్లి సీటు అంగీకారం/ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది.
- జూలై 15వ తేదీ.. ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు... ఆరో రౌండ్‌కు సంబంధించి సీట్ల కేటాయింపు.
- జూలై 16, 17వ తేదీల్లో.. ఆరో రౌండ్‌కు ధ్రువపత్రాల పరిశీలన, రిపోర్టింగ్ సెంటర్‌కు వెళ్లి సీటు అంగీకారం/ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. ఐఐటీల్లో సీట్ల ఉపసంహరణకు ఇది చివరి రౌండ్
- జూలై 18వ తేదీ.. ఖాళీగా ఉన్న సీట్లు.. చివరి రౌండ్‌కు సీట్ల కేటాయింపు.
- జూలై 19వ తేదీ... ఐఐటీల్లో చివరి రౌండ్ ధ్రువపత్రాల పరిశీలన, రిపోర్టింగ్ సెంటర్/ప్రవేశం కల్పిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లో సీటు అంగీకార ప్రక్రియ.
- జూలై 19-23 వరకూ నిట్‌లు, ఇతర ఇన్‌స్టిట్యూట్స్‌కు సంబంధించి రిపోర్టింగ్ సెంటర్/ప్రవేశం కల్పిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లో సీటు అంగీకారం/ లేదా ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుంది.
https://josaa.nic.in/webinfocms/Public/home.aspx
జోసా 2019లో పాల్గొనే ఇన్‌స్టిట్యూట్స్, సీట్ల వివరాలు...
ఐఐటీల సంఖ్య: 23.
ఐఐటీల్లో నాలుగేళ్ల బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్ ప్రోగ్రామ్‌లో సీట్ల సంఖ్య: 13,589 (మహిళా సూపర్ న్యూమరరీ, ఈడ బ్ల్యూఎస్ కోటా అన్నీ కలుపుకొని).
| ఐఐటీ ఇన్‌స్టిట్యూట్ | సీట్లు |
1. | ఐఐటీ భువనేశ్వర్ | 419 |
2. | ఐఐటీ బాంబే | 1115 |
3. | ఐఐటీ మండి | 282 |
4. | ఐఐటీ ఢిల్లీ | 1061 |
5. | ఐఐటీ ఇండోర్ | 294 |
6. | ఐఐటీ ఖరగ్‌పూర్ | 1585 |
7. | ఐఐటీ మద్రాస్ | 967 |
8. | ఐఐటీ గాంధీనగర్ | 212 |
9. | ఐఐటీ పాట్నా | 361 |
10. | ఐఐటీ రూర్కీ | 1136 |
11. | ఐఐటీ ధన్‌బాద్ | 952 |
12. | ఐఐటీ రోపార్ | 346 |
13. | ఐఐటీ వారణాసి | 1346 |
14. | ఐఐటీ గువహతి | 795 |
15. | ఐఐటీ భిలాయ్ | 143 |
16. | ఐఐటీ గోవా | 150 |
17. | ఐఐటీ పాలక్కాడ్ | 181 |
18. | ఐఐటీ తిరుపతి | 203 |
19. | ఐఐటీ జమ్ము | 213 |
20. | ఐఐటీ ధార్వాడ్ | 137 |
21. | ఐఐటీ హైదరాబాద్ | 317 |
22. | ఐఐటీ జోధ్‌పూర్ | 352 |
23. | ఐఐటీ కాన్పూర్ | 1016 |
ఎన్‌ఐటీల సంఖ్య: 31
ఎన్‌ఐటీల్లో నాలుగేళ్ల బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్ ప్రోగ్రామ్‌లో కలిపి మొత్తం సీట్ల సంఖ్య: 21,142.
ట్రిపుల్ ఐటీల సంఖ్య: 25.
ట్రిపుల్ ఐటీల్లో మొత్తం సీట్లు: 4,713.
జీఎఫ్‌టీఐల సంఖ్య: 28.
జీఎఫ్‌టీఐల్లో మొత్తం సీట్ల సంఖ్య: 5,806
అదిరేటి ఐఐటీలు..!
ఐఐటీ గాంధీనగర్:
2008లో సబర్మతి నది ఒడ్డున ఏర్పాటైంది. ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధిత కోర్సులను అందించడంలో అత్యుత్తమంగా నిలుస్తోంది. కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లో బీటెక్, ఎంటెక్ కోర్సులను అందిస్తోంది. వీటితోపాటు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కాగ్నిటివ్ సైన్స్‌ల్లో ఎంఎస్సీ ప్రోగ్రామ్‌లో కూడా అడ్మిషన్ కల్పిస్తోంది. అంతేకాకుండా ఎంఏ ఇన్ సొసైటీ అండ్ కల్చర్‌నూ అందిస్తోంది. ఉన్నత విద్య పరంగా కెమికల్, బయోమెడికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఎర్త్‌సైన్స్, కాగ్నిటివ్ సైన్స్‌ల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో సైతం ఐఐటీ గాంధీనగర్ ప్రవేశం కల్పిస్తోంది. అదేవిధంగా ఇక్కడ లిటరేచర్, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, సోషియల్ ఎపిడిమియోలజీలోనూ పీహెచ్‌డీ చేసే వీలుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 24వ ర్యాంకు, మొత్తంగా 51వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitgn.ac.in
ఐఐటీ భువనేశ్వర్:
ఐఐటీ భువనేశ్వర్‌ను 2008లో ప్రారంభించారు. బీటెక్(సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెట్లర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్), డ్యూయల్ డిగ్రీ, ఎంటెక్, ఎంఎస్సీ, పీహెచ్‌డీ, ప్రోగ్రామ్స్‌ను ఆఫర్‌చేస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 17వ ర్యాంకు, మొత్తంగా 46వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitbbs.ac.in
ఐఐటీ మద్రాస్:
ఉన్నత సాంకేతిక విద్య, బేసిక్ అండ్ అప్లయిడ్ రీసెర్చ్ పరంగా దేశంలోనే అత్యుత్తమ, జాతీయ ప్రాధాన్యతా ఇన్‌స్టిట్యూట్‌గా గుర్తింపు పొందింది. దీన్ని 1959లో పశ్చిమ జర్మనీ సహకారంతో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 16 అకడెమిక్ డిపార్ట్‌మెంటులు, ఇంజనీరింగ్, ప్యూర్‌సైన్స్‌కు సంబంధించి పలు అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. వివిధ స్పెషలైజేషన్లతో బీటెక్, డ్యూయల్ డిగ్రీ, ఎంటెక్, ఎంఏ, ఎంబీఏ, ఎంఎస్సీ, ఈఎంబీఏ, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంతోపాటు మొత్తంగా మొదటి ర్యాంకు సొంతం చేసుకుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ టాపర్స్ బాగా ఆసక్తి చూపే ఇన్‌స్టిట్యూట్స్‌లో ఐఐటీ మద్రాస్ ముందుంటుంది.
వెబ్‌సైట్: www.iitm.ac.in
ఐఐటీ గువహటి:
1994లో ఆరో ఐఐటీగా గువహటిలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున ప్రారంభించారు. 1995 నుంచి అకడమిక్ ప్రోగ్రామ్స్‌ను ఆఫర్‌చేస్తోంది. ఈ ఐఐటీలో 11 డిపార్ట్‌మెంటులు, 5 ఇంటర్ డిసిప్లినరీ సెంటర్స్ ఉన్నాయి. బీటెక్(బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, మెకానికల్ ఇంజనీరింగ్); బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, ఎంఏ, మాస్టర్ ఆఫ్ డిజైన్, ఎంటెక్, ఎంఎస్, పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్‌చేస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 7వ ర్యాంకు, మొత్తంగా 9వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitg.ac.in
ఐఐటీ ఇండోర్:
ఐఐటీ ఇండోర్‌ను 2009లో ప్రారంభించారు. నూతనంగా ప్రారంభించిన 8 ఐఐటీల్లో ఇదొకటి. బీటెక్(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెట్లర్జికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్స్); ఎంటెక్, ఎంఎస్సీ, బీటెక్+ఎంటెక్, ఎంఎస్(రీసెర్చ్), పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 13వ ర్యాంకు పొందింది. రీసెర్చ్ విభాగం బలంగా ఉండటంతో ఐఐటీ ఇండోర్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటుతోంది.
వెబ్‌సైట్: www.iiti.ac.in
ఐఐటీ కాన్పూర్:
తొలి తరం ఐఐటీల్లో ఇదొకటి. మొదటి పదేళ్ల కాలంలో మిట్, కాలిఫోర్నియా, బెర్కలీ, ప్రిన్స్‌టన్ వంటి పది అమెరికా విశ్వవిద్యాలయాలు అకడమిక్ ప్రోగ్రామ్స్, రీసెర్చ్ ల్యాబ్స్ ఏర్పాటుకు సహకరించాయి. దీంతోపాటు భారత్‌లో కంప్యూటర్ కోర్సులను అందించిన తొలి ఇన్‌స్టిట్యూట్(1963)గా గుర్తింపు పొందింది. బీటెక్, బీఎస్(బ్యాచిలర్ ఆఫ్ సైన్స్), ఎంటెక్, ఎంఎస్, మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎంఎస్సీ, ఎంఎస్సీ-పీహెచ్‌డీ, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్, మల్టీడిసిప్లినరీ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 5వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitk.ac.in
ఐఐటీ ఖరగ్‌పూర్:
ఐఐటీలోకెల్ల్లా ప్రత్యేక స్థానం కలిగుంది. 1951లో దేశంలోనే తొలి ఐఐటీగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 19 అకడెమిక్ డిపార్ట్‌మెంట్‌లు, 8 మల్టిడిసిప్లినరీ సెంటర్లు, 13 ఎక్సలెన్స్ స్కూళ్లు, 25కు పైగా సెంట్రల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ యూనిట్లు ఉన్నాయి. బీటెక్, బీఆర్క్, అయిదేళ్ల డ్యూయల్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులను ఆఫర్‌చేస్తోంది. వీటితోపాటు లా, బిజినెస్ మేనేజ్‌మెంట్, డాక్టోరల్ కోర్సులను అందిస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 4వ ర్యాంకు, మొత్తంగా 5వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitkgp.ac.in
ఐఐటీ జోధ్‌పూర్:
2008లో ఐఐటీ కాన్పూర్ క్యాంపస్‌లో ఏర్పాటుచేశారు. అనంతరం జోధ్‌పూర్‌లోని తాత్కాలిక క్యాంపస్‌కు.. 2017లో 852 ఎకరాల్లో ఏర్పాటుచేసిన శాశ్వత క్యాంపస్‌కు ఐఐటీ జోధ్‌పూర్ తరలింది. బీటెక్(బయో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్), ఎంటెక్, ఎంఎస్సీ, ఎంఎస్సీ-ఎంటెక్, ఎంటెక్-పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది. ప్రస్తుతం బయోసెన్సైస్ అండ్ బయో ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్, మెట్లర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ వంటి వివిధ విభాగాల్లో కోర్సులను ఆఫర్‌చేస్తుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 50వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitj.ac.in
ఐఐటీ పాట్నా:
దీన్ని 2008లో ప్రారంభించారు. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, కెమికల్ బ్రాంచ్‌ల్లో బీటెక్ ప్రోగ్రామ్‌ను ఆఫర్‌చేస్తోంది. దీంతోపాటు మల్టిడిసిప్లినరీ స్ట్రీమ్స్(ఎనిమిది స్పెషలైజేషన్స్)తో ఎంటెక్‌ను ఆఫర్‌చేస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 22వ ర్యాంకు, మొత్తంగా 58వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitp.ac.in
ఐఐటీ హైదరాబాద్:
దీన్ని 2008లో ప్రారంభించారు. పరిశోధనలకు, ప్రచురణలకు పేరుగాంచింది. బీటెక్ (కెమికల్, సివిల్, సీఎస్‌ఈ, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ సైన్స్, మెటీరియల్ సైన్స్ అండ్ మెట్లర్జికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, మెకానికల్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), మాస్టర్ ఆఫ్ సైన్స్, ఎంటెక్ కోర్సును అందిస్తోంది. దీంతోపాటు సెన్సైస్, లిబరల్ ఆర్ట్స్‌లో రీసెర్చ్ డిగ్రీలను ఆఫర్ చేస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 8వ ర్యాంకు, మొత్తంగా 22వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iith.ac.in
ఐఐటీ బాంబే:
ఐఐటీల్లో దీనికుండే క్రేజ్ అంతా ఇంతా కాదు! జేఈఈ అడ్వాన్స్‌డ్ టాపర్లంతా కోరుకునే ఇన్‌స్టిట్యూట్ ఐఐటీ బాంబే. యునెస్కో, సోవియట్ యూనియన్‌ల సహకారంతో దేశంలోనే రెండో ఐఐటీగా 1958లో ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం 2018లో దీనికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా ఇచ్చింది. ఐఐటీ ముంబైలో 15 డిపార్ట్‌మెంట్‌లు, 20 మల్టిడిసిప్లినరీ సెంటర్లు, 1 స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఉన్నాయి. బీటెక్, డ్యూయల్ డిగ్రీ, నాలుగేళ్ల బీఎస్ ప్రోగ్రామ్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్, రెండేళ్ల ఎంఎస్సీ ప్రోగ్రామ్, ఎంఎస్సీ, పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్, ఎంటెక్/ఎంటెక్+పీహెచ్‌డీ(డుయల్ డిగ్రీ), మాస్టర్ ఆఫ్ డిజైన్, ఎంఫిల్, ఎంబీఏ, ఎంబీఏ(ఎగ్జిక్యూటివ్), ఎంఎస్సీ-పీహెచ్‌డీ, పీహెచ్‌డీ తదితర కోర్సులను అందిస్తోంది. ఐఐటీ బాంబే క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్(2019)లో 162 ర్యాంకు పొందింది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 3వ ర్యాంకు, మొత్తంగా 4వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitb.ac.in
ఐఐటీ ఢిల్లీ:
1961లో ప్రారంభించారు. ఐఐటీ ఢిల్లీలో 15 డిపార్ట్‌మెంట్‌లు, 11 మల్టిడిసిప్లినరీ సెంటర్లు, 5 ఎక్స్‌లెన్స్ స్కూల్స్, 14 ఎక్స్‌లెన్స్ సెంటర్లు ఉన్నాయి. బీటెక్, డ్యూయల్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, పీహెచ్‌డీ, ఎంటెక్, ఎంఎస్(ఆర్), ఎంబీఏ, ఎండీఈఎస్, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 2వ ర్యాంకు, మొత్తంగా 3వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitd.ac.in
ఐఐటీ రోపార్:
ఐఐటీ రోపార్‌ను 2008లో ప్రారంభించారు. తాత్కాలిక క్యాంపస్ నుంచి 2018లో శాశ్వత క్యాంపస్‌కు మారింది. 10 అకడెమిక్ డిపార్ట్‌మెంట్‌లు, ఒక మల్టీడిసిప్లినరీ సెంటర్ ఉన్నాయి. బీటెక్(సివిల్, కెమికల్, సీఎస్‌ఈ, ఎలక్ట్రికల్, మెకానికల్, మెట్లర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్), అయిదేళ్ల బీటెక్-ఎంటెక్ (మెకానికల్) డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్, ఎంటెక్, పీహెచ్‌డీ అందిస్తోంది. వీటితోపాటు హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్‌లో పీహెచ్‌డీకి అవకాశం కల్పిస్తోంది ఐఐటీ రోపార్. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 29వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్ : www.iitrpr.ac.in
ఐఐటీ మండి:
ఐఐటీ మండిని 2009లో ప్రారంభించారు. 2015లో శాశ్వత క్యాంపస్‌కు మారింది. కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ స్పెషలైజేషన్స్‌తో బీటెక్ ఆఫర్‌చేస్తోంది. వీటితోపాటు ఎంఎస్, పీహెచ్‌డీ, ఎంటెక్, ఎంఎస్సీ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 20వ ర్యాంకు, మొత్తంగా 44వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: students.iitmandi.ac.in
ఐఐటీ రూర్కీ:
యూనివర్సిటీ ఆఫ్ రూర్కీని 2001లో ఐఐటీగా మార్చారు. ఇంజనీరింగ్, టెక్నాలజీ, అప్లయిడ్ సెన్సైస్, మేనేజ్‌మెంట్‌లో అకడమిక్ ప్రోగ్రామ్స్‌ను ఆఫర్‌చేస్తోంది. బీటెక్(బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెట్లర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ ఫిజిక్స్); ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 6వ ర్యాంకు, మొత్తంగా 8వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitr.ernet.in
ఐఐటీ వారణాసి:
2012లో బనారస్ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌యూ)కి ఐఐటీ హోదా కల్పించారు. బీటెక్(సిరామిక్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సీఎస్‌ఈ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెట్లర్జికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ), అయిదేళ్ల డ్యూయల్ డిగ్రీ(బీటెట్-ఎంటెక్), రెండేళ్ల ఎంటెక్, ఎంఫార్మ్, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 11వ ర్యాంకు, మొత్తంగా 10వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: iitbhu.ac.in
ఐఐటీ జమ్మూ:
ఐఐటీ జమ్మూలో మొదటి బ్యాచ్ 82 మంది విద్యార్థులతో 2016లో ప్రారంభమైంది. కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెటీరియల్ సైన్స్, మెకానికల్ బ్రాంచ్‌లో బీటెక్‌ను అందిస్తోంది. దీంతోపాటు పలు స్పెషలైజేషన్లతో ఎంటెక్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ను ఆఫర్‌చేస్తోంది.
వెబ్‌సైట్: http://iitjammu.ac.in
ఐఐటీ పాలక్కాడ్:
ఐఐటీ పాలక్కాడ్‌లో 2015-16 విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించారు. ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్‌లో నడుస్తోంది. సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్‌సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లో బీటెక్ కోర్సును అందిస్తోంది. 2017లో ఎంఎస్(రీసెర్చ్), పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ను ప్రారంభించింది. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, హ్యూమానిటీస్ విభాగాల్లో ఈ కోర్సులను అందిస్తోంది.
వెబ్‌సైట్: iitpkd.ac.in
ఐఐటీ తిరుపతి:
ఐఐటీ తిరుపతిలో 2015-16 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించారు. దీనికి మద్రాస్ ఐఐటీ మెంటార్‌గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్‌లో నడుస్తోంది. ఇది కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ బ్రాంచ్‌ల్లో బీటెక్‌ను అందిస్తోంది. వీటితోపాటు ఎంటెక్, ఎంఎస్(రీసెర్చ్), ఎంఎస్సీ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ను ఆఫర్‌చేస్తోంది.
వెబ్‌సైట్: iittp.ac.in
ఐఐటీ గోవా:
ఐఐటీ గోవాను 2016లో ప్రారంభించారు. ప్రస్తుతం గోవా ఇంజనీరింగ్ కాలేజ్‌లో తాత్కాలిక క్యాంపస్‌లో కొనసాగుతోంది. దీనికి ఐఐటీ బాంబే మెంటార్‌గా వ్యవహరిస్తోంది. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో బీటెక్ కోర్సును అందిస్తోంది. దీంతోపాటు పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 87వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitgoa.ac.in
ఐఐటీ భిలాయ్:
ఐఐటీ భిలాయ్‌ను 2016లో ప్రారంభించారు. ప్రస్తుతం రాయ్‌పూర్‌లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలోని తాత్కాలిక క్యాంపస్‌లో కొనసాగుతోంది. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ స్ట్రీముల్లో బీటెక్‌ను అందిస్తోంది. అలాగే ఎంటెక్‌తోపాటు కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఫిజిక్స్‌లో ఎంఎస్సీ; కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, లిబరల్ ఆర్ట్స్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ను ఆఫర్‌చేస్తోంది.
వెబ్‌సైట్: www.iitbhilai.ac.in
ఐఐటీ ధార్వాడ్:
ఐఐటీ ధార్వాడ్‌ను 2016లో ప్రారంభించారు. దీనికి ఐఐటీ బాంబే మెంటార్‌గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్‌లో కొనసాగుతున్న ఐఐటీ శాశ్వత భవనాల నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం 500 ఎకరాలు కేటాయించింది. ప్రస్తుతం ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ స్ట్రీముల్లో బీటెక్‌ను అందిస్తోంది. దాంతోపాటు ఎంఎస్, పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.iitdh.ac.in
ఐఐటీ ధన్‌బాద్:
2016లో ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌ను ఐఐటీ ధన్‌బాద్‌గా మార్చారు. కెమికల్ అండ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్, మినరల్ ఇంజనీరింగ్, మెకానికల్, మైనింగ్ ఇంజనీరింగ్, మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, స్పెషలైజేషన్స్‌తో బీటెక్ ప్రోగ్రామ్‌ను ఆఫర్‌చేస్తోంది. దీంతోపాటు బీటెక్+ఎంటెక్, ఎంబీఏ డ్యూయల్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఎంఎస్సీ, ఎంఎస్సీ-టెక్, ఎంబీఏ, ఎంటెక్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. దీంతోపాటు బేసిక్ సెన్సైస్, సోషల్ సెన్సైస్, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పలు కోర్సులను అందిస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(2019) ఇంజనీరింగ్ విభాగంలో 15వ ర్యాంకు, మొత్తంగా 25వ ర్యాంకు పొందింది.
వెబ్‌సైట్: www.iitism.ac.in.
Published date : 19 Jun 2019 01:40PM