Skip to main content

జీప్యాట్-2021 నోటిఫికేషన్ విడుదల..పిపరేషన్ టిప్స్ ఇవిగో..

ఎన్‌టీఏ-జీప్యాట్ నిర్వహణ చేపట్టక ముందు ప్రశ్నపత్రం ఒకింత సులభంగా ఉండేది. కొన్ని ప్రశ్నలు సైతం పునరావృతం అవుతుండేవి.

కానీ, ప్రస్తుతం ప్రశ్న పత్రం అంచనాకు అందడంలేదని విద్యార్థులు, నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి అభ్యర్థులు సిలబస్‌లోని అన్ని అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

విభాగాలు-అధ్యయనం..
ఫార్మకోగ్నసీ..

  1. ఇది పూర్తిగా థియరీతో కూడిన విభాగం. అభ్యర్థులు పాఠ్యాంశాలను క్షుణ్నంగా చదివి షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చివరి దశ ప్రిపరేషన్‌లో ప్రయోజనం ఉంటుంది. గత ప్రశ్నపత్రాల్లో సెన్న(సెన్నోసైడ్), మార్ఫిన్, వింకా డ్రగ్స్ గురించి అడిగారు. కాబట్టి ఆయా డ్రగ్స్‌కు సంబంధించిన భావనలు, విధానాలు, ప్రభావాలు, ఉపయోగాల గురించి అధ్యయనం చేయాలి.
  2. కీ టాపిక్స్: గ్లైకోసైడ్స్, ఆల్కలాయిడ్స్, వాలటైల్ ఆయిల్స్, రెసిన్స్, టానిన్స్, కార్బొహైడ్రేట్స్, టిష్యూ కల్చర్, హెర్బల్ డ్రగ్స్.
  3. బుక్స్: సీకే కొకటే ఫార్మకోగ్నసీ బుక్, ట్రీస్ అండ్ ఇవాన్స్ కంప్లీట్ గైడ్ ఫర్ ఫార్మకోగ్నసీ.


ఫార్మకాలజీ..
అభ్యర్థుల్లో ఎక్కువ మందికి ఫార్మకాలజీ విభాగంపై ఆసక్తి ఉంటుంది. జీప్యాట్ లో దీనికి అధిక వెయిటేజీ దక్కుతోంది. ఇందులో డ్రగ్ ఇంటరాక్షన్, మెకానిజమ్స్, డ్రగ్స్-సైడ్ ఎఫెక్ట్స్(బాడీ పెయిన్స్ వంటి సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా)ను అధ్యయనం చేయాలి. డ్రగ్స్‌ను సంక్షిప్త నామాల్లో గుర్తుంచుకొనేందుకు డ్రగ్స్ వర్గీకరణ పాఠ్యాంశం ఉపయోగపడుతుంది.

  1. కీ టాపిక్స్: అంకాలజీ(కీమోథెరపీ డ్రగ్స్, నూతన టెక్నాలజీలు తదితరం), న్యూరో ఫార్మకాలజీ, అరుదైన వ్యాధులు, కార్డియోవస్కులర్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్.
  2. బుక్: కె.డి.త్రిపాఠీ ఎసెన్షియల్ ఆఫ్ మెడికల్ ఫార్మకాలజీ.


ఫార్మాస్యూటికల్ అనాలసిస్..

  1. ఇతర విభాగాలతో పోల్చితే కొంత సులభంగా ఉంటుంది ఫార్మాస్యూటికల్ అనాలసిస్. దీనికి సంబంధించి భావనలను అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వీలైనన్ని ఎక్కువ సమస్యలు సాధించాలి. ఫార్ములాలను నోట్ చేసుకోవాలి.
  2. కీలక టాపిక్స్: యూవీ, ఐఆర్, ఎన్‌ఎంఆర్, మాస్ స్పెక్ట్రోస్కోపీ, క్రొమాటోగ్రఫీ, పోలరోగ్రఫీ అండ్ పొలారిమెట్రీ, ఫ్లేమ్ ఫోటోమీటర్, కండక్టోమెట్రీ, ఆంపెరోమెట్రీ, పొటెన్షిమోమెట్రీ.
  3. బుక్స్: చత్వాల్ స్పెక్ట్రోస్కోపీ అండ్ టైట్రేషన్, రెమింగ్టన్ క్రొమాటోగ్రఫీ


ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ..

  1. ఈ విభాగంలో ప్రశ్నలు ప్రాథమికంగా ఉంటాయి. కాన్సెప్టులపై అవగాహనతో సదరు ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు. ముఖ్యంగా ఈ విభాగంలో కర్బన రసాయన శాస్త్రంపై దృష్టిపెట్టాలి. ఎలక్ట్రోఫిలిక్, న్యూక్ట్రోఫిలిక్ రియాక్షన్స్, ఇంటర్మీడియెట్ రియాక్షన్స్‌ను అధ్యయనం చేయాలి.
  2. కీ టాపిక్స్: ఎస్‌ఏఆర్ ఆఫ్ స్టెరాయిడ్స్, నామ్‌నిక్లేచర్ అండ్ కెమికల్ మొయిటీ ఆఫ్ ది మెడికల్ డ్రగ్స్.
  3. బుక్స్: మారిస్ బోయిడ్ బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎస్.ఎన్.పాండే మెడికల్ కెమిస్ట్రీ


ఫార్మాస్యూటిక్స్..
జీప్యాట్‌కు హాజరయ్యే అభ్యర్థులందరికీ ఈ విభాగం అత్యంత కీలకం. దీని అధ్య యనాన్ని రసాయనాలు, టాబ్లెట్ల సూత్రీకరణతో మొదలుపెట్టాలి. సూక్ష్మజీవులను హతమార్చే(స్టెరిలైజేషన్) నైపుణ్యాలు, న్యూమరికల్ ప్రాబ్లమ్స్‌పై ప్రధానంగా దృష్టిపెట్టాలి.

  1. కీ టాపిక్స్: ఫార్మాస్యూటికల్ న్యాయమీమాంస-విలువలు, సర్ఫేస్ అండ్ ఇంటర్ ఫేషియల్ ఫినామినా, రియాలజీ, కైనటిక్స్ అండ్ డ్రగ్స్ స్టెబిలిటీ, బయోఫార్మాటిక్స్ అండ్ ఫార్మకోకైనటిక్స్.
  2. బుక్: లీబర్‌మ్యాన్ అండ్ లచ్‌మ్యాన్ ది థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫార్మసీ.


జనరల్ టిప్స్..

  1. ఏటా స్పెక్ట్రోస్కోపీ-మాస్ స్పెక్ట్రోస్కోపీ, యూవీ, ఐఆర్, ఎన్‌ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ నుంచి 6-8 ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఆయా చాప్టర్లను క్షుణ్నంగా చదవాలి.
  2. క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్, షెడ్యూల్స్ ఆఫ్ డ్రగ్స్ చాప్టర్లకు వేర్వేరు నోట్సు రాసుకోవాలి. హెర్బల్ డ్రగ్స్‌పై ఏటా మూడు నుంచి నాలుగు ప్రశ్నలు వస్తున్నాయి.
  3. పతి సంవత్సరం జీప్యాట్‌లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సంఖ్య పెరుగుతోంది. కాబట్టి అభ్యర్థులు ప్రాబ్లమ్స్‌ను తేలిగ్గా తీసుకోరాదు.
  4. బయోఫార్మాస్యూటిక్స్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, అలిగేషన్ మెథడ్, డోస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ బాడీ వెయిట్ అండ్ ఏజ్ టాపిక్స్‌పై ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతున్నారు.
  5. గత ప్రశ్నపత్రాలు, మాక్ టెస్టులకు హాజరవ్వడం ద్వారా జీప్యాట్ ప్యాట్రన్‌పై అవగాహన ఏర్పడుతుంది.
  6. పాత ప్రశ్నపత్రాల పరిశీలన ద్వారా ఏయే టాపిక్స్‌కు ఎక్కువ వెయిటేజీ లభిస్తుందనే విషయంపై అవగాహనకు రావొచ్చు.


ఇంకా చదవండి: part 3: జీప్యాట్-2021లో ఈ స్కోరు సాధిస్తే.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో సీటుతో పాటు రూ.12 వేల స్కాలర్‌షిప్ పక్కా..

Published date : 07 Jan 2021 06:11PM

Photo Stories