జీప్యాట్-2020 పరీక్ష విధానం, ప్రిపరేషన్ గెడైన్స్
Sakshi Education
మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (ఎంఫార్మసీ) కోర్సులో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష..గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్టు (జీప్యాట్). ఈ పరీక్షలో ప్రతిభ చూపడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఫార్మసీ కళాశాలల్లో ఎంఫార్మసీ కోర్సులో చేరే అవకాశం లభిస్తుంది. నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ).. జీప్యాట్-2020కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో... జీప్యాట్ నోటిఫికేషన్ వివరాలు, ప్రిపరేషన్ ప్రణాళిక...
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు :
గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్/సికింద్రాబాద్/రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్.
ప్రిపరేషన్ ఇలా..
గతంలో ఐఐటీలు గేట్‌తోపాటు జీప్యాట్‌ను నిర్వహించినప్పుడు ప్రశ్నపత్రం ఒకింత సులభంగా ఉండేది. కొన్ని ప్రశ్నలు సైతం పునరావృతం అవుతుండేవి. కానీ, ప్రస్తుతం ప్రశ్న పత్రం అంచనాకు అందకుండా తయారైంది. కాబట్టి అభ్యర్థులు సిలబస్‌లోని అన్ని అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
సిలబస్ విభాగాలు :
ఫార్మకోగ్నసీ:ఇది పూర్తిగా థీయరీతో కూడిన విభాగం. అభ్యర్థులు పాఠ్యాంశాలను క్షుణ్నంగా చదివి షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చివరి దశ ప్రిపరేషన్ పరంగా ప్రయోజనం ఉంటుంది. గత ప్రశ్నపత్రాల్లో సెన్న(సెన్నోసైడ్), మార్ఫిన్, వింకా డ్రగ్స్ గురించి అడిగారు. కాబట్టి ఆయా డ్రగ్స్‌కు సంబంధించిన భావనలు, విధానాలు, ప్రభావాలు, ఉపయోగాల గురించి అధ్యయనం చేయాలి.
ఇందులో కీ టాపిక్స్: గ్లైకోసైడ్స్, ఆల్కలాయిడ్స్, వాలటైల్ ఆయిల్స్, రెసిన్స్, టానిన్స్, కార్బొహైడ్రేట్స్, టిష్యూ కల్చర్, హెర్బల్ డ్రగ్స్.
చదవాల్సిన బుక్స్: సీకే కొకటే ఫార్మకోగ్నసీ బుక్, ట్రీస్ అండ్ ఇవాన్స్ కంప్లీట్ గైడ్ ఫర్ ఫార్మకోగ్నసీ.
ఫార్మకాలజీ: అభ్యర్థుల్లో ఎక్కువ మందికి ఈ విభాగంపై ఆసక్తి ఉంటుంది. జీప్యాట్-2019లో దీనికి అధిక వెయిటేజీ దక్కింది. ఇందులో డ్రగ్ ఇంటరాక్షన్, మెకానిజమ్స్, డ్రగ్స్-సైడ్ ఎఫెక్ట్స్(బాడీపెయిన్స్ వంటి సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా)ను అధ్యయనం చేయాలి. డ్రగ్స్‌ను సంక్షిప్త నామాల్లో గుర్తుంచుకొనేందుకు డ్రగ్స్ వర్గీకరణ పాఠ్యాంశం ఉపయోగపడుతుంది.
ఇందులో ముఖ్యమైన టాపిక్స్: అంకాలజీ (కీమోథెరపీ డ్రగ్స్, నూతన టెక్నాలజీలు తదితరం), న్యూరోఫార్మకాలజీ, అరుదైన వ్యాధులు, కార్డియోవస్కులర్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్.
చదవాల్సిన పుస్తకాలు: కె.డి.త్రిపాఠీ ఎస్సెన్షియల్ ఆఫ్ మెడికల్ ఫార్మకాలజీ.
ఫార్మాస్యూటికల్ అనాలసిస్: ఇది ఇతర విభాగాలతో పోల్పితే సులభంగా ఉంటుంది. దీనికి సంబంధించి భావనలను అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వీలైనన్ని ఎక్కువ సమస్యలు సాధించాలి. ఫార్ములాలను నోట్ చేసుకోవాలి.
ముఖ్యమైన టాపిక్స్: యూవీ, ఐఆర్, ఎన్‌ఎంఆర్, మాస్ స్పెక్ట్రోస్కోపీ, క్రొమాటోగ్రఫీ, పోలరోగ్రఫీ అండ్ పొలారిమెట్రీ, ఫ్లేమ్ ఫోటోమీటర్, కండక్టోమెట్రీ, ఆంపెరోమెట్రీ, పొటెన్షిమోమెట్రీ.
చదవాల్సిన బుక్స్: చత్వాల్ స్పెక్ట్రోస్కోపీ అండ్ టైట్రేషన్, రెమింగ్టన్ క్రొమాటోగ్రఫీ.
ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ: ఈ విభాగంలో ప్రశ్నలు ప్రాథమికంగా ఉంటాయి. కాన్సెప్టులపై అవగాహనతో సదరు ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు. ముఖ్యంగా ఈ విభాగంలో కర్బన రసాయన శాస్త్రంపై దృష్టిపెట్టాలి. ఎలక్ట్రోఫిలిక్, న్యూక్ట్రోఫిలిక్ రియాక్షన్స్, ఇంటర్మీడియెట్ రియాక్షన్స్‌ను అధ్యయనం చేయాలి.
ప్రధానమైన టాపిక్స్: ఎస్‌ఏఆర్ ఆఫ్ స్టెరాయిడ్స్, నామ్‌నిక్లేచర్ అండ్ కెమికల్ మొయిటీ ఆఫ్ ది మెడికల్ డ్రగ్స్.
చదవాల్సిన బుక్స్: మారిస్ బోయిడ్ బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎస్.ఎన్.పాండే మెడికల్ కెమిస్ట్రీ.
ఫార్మాస్యూటిక్స్: జీప్యాట్‌కు హాజరయ్యే అభ్యర్థులందరికీ ఈ విభాగం అత్యంత కీలకం. దీని అధ్యయనాన్ని రసాయనాలు, టాబ్లెట్ల సూత్రీకరణతో మొదలుపెట్టాలి. సూక్ష్మజీవులను హతమార్చే(స్టెరిలైజేషన్) నైపుణ్యాలు, న్యూమరికల్ ప్రాబ్లమ్స్‌పై ప్రధానంగా దృష్టిపెట్టాలి.
ముఖ్యమైన టాపిక్స్: ఫార్మాస్యూటికల్ న్యాయమీమాంస-విలువలు, సర్ఫేస్ అండ్ ఇంటర్ ఫేషియల్ ఫినామినా, రియాలజీ, కైనటిక్స్ అండ్ డ్రగ్స్ స్టెబిలిటీ, బయోఫార్మాటిక్స్ అండ్ ఫార్మకోకైనటిక్స్.
చదవాల్సిన బుక్స్: లీబర్‌మ్యాన్ అండ్ లచ్‌మ్యాన్ ది థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫార్మసీ
ఎగ్జామ్ టిప్స్..
ముఖ్యతేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: నవంబర్ 30, 2019
ఫీజు చెల్లించేందుకు చివరితేదీ: డిసెంబర్ 1, 2019
పరీక్ష తేదీ: జనవరి 28, 2020
ఫలితాలు వెల్లడి: ఫిబ్రవరి 7, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: gpat.nta.nic.in
800కు పైగా కాలేజీలు..
జీప్యాట్-2020లో 800కు పైగా ఇన్‌స్టిట్యూట్‌లు పాల్గొంటున్నాయి. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు ఎంఫార్మసీ ప్రవేశాలకు సంబంధించి జీప్యాట్ స్కోరును పరిగణలోకి తీసుకుంటాయి. అభ్యర్థులు ముందుగా జీప్యాట్ స్కోరు ఆధారంగా ఆయా ఇన్‌స్టిట్యూట్‌లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఇన్‌స్టిట్యూట్ జీప్యాట్ స్కోరుకు సంబంధించి కటాఫ్ మార్కులను ప్రకటిస్తుంది. సదరు వివరాల కోసం ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
అర్హత :
జీప్యాట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఫార్మసీలో బ్యాచిలర్ డి గ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బీఫార్మసీ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. బీటెక్ ఫార్మాస్యుటికల్ అండ్ ఫైన్ కెమికల్ టెక్నాలజీ/తత్సమాన కోర్సుల విద్యార్థులు దరఖాస్తుకు అనర్హులు.
వయసు :
జీప్యాట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి వయోపరిమితి నిబంధన లేదు.
ఫీజు :
జనరల్, ఆర్థికంగా వెనుకబడిన జనరల్, ఓబీసీ(నాన్ క్రీమిలేయర్) కేటగిరీల పురుష అభ్యర్థులకు రూ.1600, మహిళలకు రూ.800, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్‌జెండర్ కేటగిరీ అభ్యర్థులకు రూ.800.
పరీక్ష విధానం :

- జీప్యాట్ గతేడాది మాదిరిగానే ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రం మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది.
- ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయించారు.
- ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు :
గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్/సికింద్రాబాద్/రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్.
ప్రిపరేషన్ ఇలా..
గతంలో ఐఐటీలు గేట్‌తోపాటు జీప్యాట్‌ను నిర్వహించినప్పుడు ప్రశ్నపత్రం ఒకింత సులభంగా ఉండేది. కొన్ని ప్రశ్నలు సైతం పునరావృతం అవుతుండేవి. కానీ, ప్రస్తుతం ప్రశ్న పత్రం అంచనాకు అందకుండా తయారైంది. కాబట్టి అభ్యర్థులు సిలబస్‌లోని అన్ని అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
సిలబస్ విభాగాలు :
ఫార్మకోగ్నసీ:ఇది పూర్తిగా థీయరీతో కూడిన విభాగం. అభ్యర్థులు పాఠ్యాంశాలను క్షుణ్నంగా చదివి షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చివరి దశ ప్రిపరేషన్ పరంగా ప్రయోజనం ఉంటుంది. గత ప్రశ్నపత్రాల్లో సెన్న(సెన్నోసైడ్), మార్ఫిన్, వింకా డ్రగ్స్ గురించి అడిగారు. కాబట్టి ఆయా డ్రగ్స్‌కు సంబంధించిన భావనలు, విధానాలు, ప్రభావాలు, ఉపయోగాల గురించి అధ్యయనం చేయాలి.
ఇందులో కీ టాపిక్స్: గ్లైకోసైడ్స్, ఆల్కలాయిడ్స్, వాలటైల్ ఆయిల్స్, రెసిన్స్, టానిన్స్, కార్బొహైడ్రేట్స్, టిష్యూ కల్చర్, హెర్బల్ డ్రగ్స్.
చదవాల్సిన బుక్స్: సీకే కొకటే ఫార్మకోగ్నసీ బుక్, ట్రీస్ అండ్ ఇవాన్స్ కంప్లీట్ గైడ్ ఫర్ ఫార్మకోగ్నసీ.
ఫార్మకాలజీ: అభ్యర్థుల్లో ఎక్కువ మందికి ఈ విభాగంపై ఆసక్తి ఉంటుంది. జీప్యాట్-2019లో దీనికి అధిక వెయిటేజీ దక్కింది. ఇందులో డ్రగ్ ఇంటరాక్షన్, మెకానిజమ్స్, డ్రగ్స్-సైడ్ ఎఫెక్ట్స్(బాడీపెయిన్స్ వంటి సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా)ను అధ్యయనం చేయాలి. డ్రగ్స్‌ను సంక్షిప్త నామాల్లో గుర్తుంచుకొనేందుకు డ్రగ్స్ వర్గీకరణ పాఠ్యాంశం ఉపయోగపడుతుంది.
ఇందులో ముఖ్యమైన టాపిక్స్: అంకాలజీ (కీమోథెరపీ డ్రగ్స్, నూతన టెక్నాలజీలు తదితరం), న్యూరోఫార్మకాలజీ, అరుదైన వ్యాధులు, కార్డియోవస్కులర్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్.
చదవాల్సిన పుస్తకాలు: కె.డి.త్రిపాఠీ ఎస్సెన్షియల్ ఆఫ్ మెడికల్ ఫార్మకాలజీ.
ఫార్మాస్యూటికల్ అనాలసిస్: ఇది ఇతర విభాగాలతో పోల్పితే సులభంగా ఉంటుంది. దీనికి సంబంధించి భావనలను అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వీలైనన్ని ఎక్కువ సమస్యలు సాధించాలి. ఫార్ములాలను నోట్ చేసుకోవాలి.
ముఖ్యమైన టాపిక్స్: యూవీ, ఐఆర్, ఎన్‌ఎంఆర్, మాస్ స్పెక్ట్రోస్కోపీ, క్రొమాటోగ్రఫీ, పోలరోగ్రఫీ అండ్ పొలారిమెట్రీ, ఫ్లేమ్ ఫోటోమీటర్, కండక్టోమెట్రీ, ఆంపెరోమెట్రీ, పొటెన్షిమోమెట్రీ.
చదవాల్సిన బుక్స్: చత్వాల్ స్పెక్ట్రోస్కోపీ అండ్ టైట్రేషన్, రెమింగ్టన్ క్రొమాటోగ్రఫీ.
ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ: ఈ విభాగంలో ప్రశ్నలు ప్రాథమికంగా ఉంటాయి. కాన్సెప్టులపై అవగాహనతో సదరు ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు. ముఖ్యంగా ఈ విభాగంలో కర్బన రసాయన శాస్త్రంపై దృష్టిపెట్టాలి. ఎలక్ట్రోఫిలిక్, న్యూక్ట్రోఫిలిక్ రియాక్షన్స్, ఇంటర్మీడియెట్ రియాక్షన్స్‌ను అధ్యయనం చేయాలి.
ప్రధానమైన టాపిక్స్: ఎస్‌ఏఆర్ ఆఫ్ స్టెరాయిడ్స్, నామ్‌నిక్లేచర్ అండ్ కెమికల్ మొయిటీ ఆఫ్ ది మెడికల్ డ్రగ్స్.
చదవాల్సిన బుక్స్: మారిస్ బోయిడ్ బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎస్.ఎన్.పాండే మెడికల్ కెమిస్ట్రీ.
ఫార్మాస్యూటిక్స్: జీప్యాట్‌కు హాజరయ్యే అభ్యర్థులందరికీ ఈ విభాగం అత్యంత కీలకం. దీని అధ్యయనాన్ని రసాయనాలు, టాబ్లెట్ల సూత్రీకరణతో మొదలుపెట్టాలి. సూక్ష్మజీవులను హతమార్చే(స్టెరిలైజేషన్) నైపుణ్యాలు, న్యూమరికల్ ప్రాబ్లమ్స్‌పై ప్రధానంగా దృష్టిపెట్టాలి.
ముఖ్యమైన టాపిక్స్: ఫార్మాస్యూటికల్ న్యాయమీమాంస-విలువలు, సర్ఫేస్ అండ్ ఇంటర్ ఫేషియల్ ఫినామినా, రియాలజీ, కైనటిక్స్ అండ్ డ్రగ్స్ స్టెబిలిటీ, బయోఫార్మాటిక్స్ అండ్ ఫార్మకోకైనటిక్స్.
చదవాల్సిన బుక్స్: లీబర్‌మ్యాన్ అండ్ లచ్‌మ్యాన్ ది థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫార్మసీ
ఎగ్జామ్ టిప్స్..
- ఏటా స్పెక్ట్రోస్కోపీ-మాస్ స్పెక్ట్రోస్కోపీ, యూవీ, ఐఆర్, ఎన్‌ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ నుంచి 6-8 ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఆయా చాప్టర్లను క్షుణ్నంగా చదవాలి.
- క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్, షెడ్యూల్స్ ఆఫ్ డ్రగ్స్ చాప్టర్లకు ప్రత్యేకంగా నోట్స్ అవసరం. హెర్బల్ డ్రగ్స్‌పై ఏటా మూడు నుంచి నాలుగు ప్రశ్నలు వస్తున్నాయి.
- ఏటా జీప్యాట్‌లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సంఖ్య పెరుగుతోంది. కాబట్టి అభ్యర్థులు ప్రాబ్లమ్స్‌ను తేలిగ్గా తీసుకోరాదు.
- బయోఫార్మాస్యూటిక్స్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, అలిగేషన్ మెథడ్, డోస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ బాడీ వెయిట్ అండ్ ఏజ్ టాపిక్స్‌పై ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతున్నారు.
- గత ప్రశ్నపత్రాలు, మాక్ టెస్టులకు హాజరవ్వడం ద్వారా జీప్యాట్ ప్యాట్రన్‌పై అవగాహన ఏర్పడుతుంది.
- పాత ప్రశ్నపత్రాల పరిశీలన ద్వారా ఏయే టాపిక్స్‌కు ఎక్కువ వెయిటేజీ లభిస్తుందనే విషయంపై అంచనాకు రావొచ్చు.
సిలబస్‌ను అనుసరించాలి.. జీప్యాట్ అనగానే చాలా మంది విద్యార్థులు బీఫార్మసీ సిలబస్‌ను మొత్తం బట్టీ పడుతుంటారు. అలా కాకుండా ఎన్‌టీఏ పేర్కొన్న సిలబస్‌ను అనుసరిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. 130-140 స్కోరు సాధిస్తే... తెలుగు రాష్ట్రాల్లోని మంచి కాలేజీల్లో సీటు లభించే అవకాశముంది. దీంతోపాటు నెలకు రూ.12,000 స్కాలర్‌షిప్ అందుతుంది. - సత్యనారాయణ, హైదరాబాద్ అకాడమీ |
ముఖ్యతేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: నవంబర్ 30, 2019
ఫీజు చెల్లించేందుకు చివరితేదీ: డిసెంబర్ 1, 2019
పరీక్ష తేదీ: జనవరి 28, 2020
ఫలితాలు వెల్లడి: ఫిబ్రవరి 7, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: gpat.nta.nic.in
Published date : 29 Nov 2019 01:32PM