జేఈఈ మెయిన్-2020 (ఏప్రిల్)లో విజయం సాధించే మార్గాలు..?
Sakshi Education
దేశంలో లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడే పరీక్ష జేఈఈ మెయిన్!తెలుగు రాష్ట్రాల్లో చాలామంది విద్యార్థులు స్కూలు స్థాయి నుంచే జేఈఈ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. దీన్ని బట్టే మన విద్యార్థులకు జేఈఈ ఎంత ప్రత్యేకమైందో చెప్పొచ్చు. అలాంటి కీలకమైన జేఈఈ మెయిన్-2020 తొలి సెషన్(జనవరి) ఫలితాలను ఎన్‌టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో జేఈఈ జనవరి సెషన్ ఫలితాల సరళి.. విజేతలు అనుసరించిన ప్రిపరేషన్ వ్యూహాలు, కటాఫ్ మార్కుల అంచనాతోపాటు.. ఏప్రిల్ సెషన్‌కుఅనుసరించాల్సిన ప్రిపరేషన్ ప్రణాళికపై ప్రత్యేక కథనం...!
జేఈఈ మెయిన్:
ఎన్‌ఐటీ, ఐఐఐటీ, సీఎఫ్‌టీఐల్లోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలతోపాటు జేఈఈ అడ్వాన్స్‌కు అర్హులను ఎంపిక చేసే పరీక్షే.. జేఈఈ మెయిన్. దీన్ని ఎన్‌టీఏ ఏటా రెండు సార్లు నిర్వహిస్తోంది. రెండు సెషన్స్‌లో అభ్యర్థి పొందిన అత్యుత్తమ స్కోరు ఆధారంగా జేఈఈ మెయిన్ తుది ర్యాంకును ప్రకటిస్తారు. ఒక సెషన్‌లో మాత్రమే పాల్గొన్న వారికి సదరు స్కోరు ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారు. తొలి సెషన్‌కు(బీటెక్/బీఈ) మొత్తం 9,21,261 మంది దరఖాస్తు చేసుకోగా... పరీక్షకు 8,69,010 మంది హాజరయ్యారు. కాగా, తాజా ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అనేక మంది మంచి పర్సంటైల్ సాధించారు.
కటాఫ్ మార్కులు:
ఎన్‌టీఏ ఏప్రిల్ సెషన్ ఫలితాలతోపాటు జేఈఈ మెయిన్-2020 క్వాలిఫయింగ్ కటాఫ్ మార్కులను వెల్లడిస్తుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యేందుకు పొందాల్సిన కనీస మార్కులను క్వాలిఫయింగ్ కటాఫ్ మార్కులుగా పేర్కొంటే... పార్టిసిపేటింగ్ ఇన్‌స్టిట్యూట్స్(ఎన్‌ఐటీ, జీఎఫ్‌ఐటీ)లల్లో ప్రవేశానికి పొందాల్సిన కనీస మార్కులను అడ్మిషన్ కటాఫ్ మార్కులుగా పేర్కొంటారు. ప్రతి రౌండ్(సీట్ల కేటాయింపు) అనంతరం జోసా అడ్మిషన్ కటాఫ్ మార్కులను ప్రకటిస్తుంది.
కటాఫ్ నిర్ణయించే అంశాలు..
ఏప్రిల్ సెషన్‌కు హాజరవ్వాలనుకుంటున్న అభ్యర్థులు ముందుగా జనవరి సెషన్‌లో చేసిన పొరపాట్లను విశ్లేషించుకోవాలి. ఆ తప్పులు మళ్లీ జరక్కుండా ఉండేందుకు మాక్ టెస్టులు, గత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ప్రధానంగా కాన్సెప్ట్ అవగాహన లేని టాపిక్స్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
బేసిక్స్‌పై పట్టు :
జేఈఈ తొలి సెషన్ ప్రశ్నపత్రాలు, ఫలితాల సరళిని చూసినా లేదా టాపర్స్‌గా నిలిచిన వారు పేర్కొంటన్న అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నా... జేఈఈ మొదటి సెషన్(జనవరి)లో బేసిక్స్ కీలకంగా వ్యవహరించాయని తెలుస్తోంది. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్‌కు సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను క్షుణ్నంగా చదివిన వారు మెరుగైన ర్యాంకులు సొంతం చేసుకున్నారు. కాబట్టి ఏప్రిల్ సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తించి బేసిక్స్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే జేఈఈ మెయిన్‌కి సంబంధించి కేవలం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదివితేనో... రిఫరెన్స్‌గా తీసుకుంటేనో ఆశించిన విజయం లభిస్తుందనే గ్యారంటీ లేదు. కాబట్టి వాటితోపాటు ప్రామాణిక పుస్తకాలను ఫాలో అవ్వాలి. అలాగే కాన్సెప్టుల పట్ల అవగాహన కలిగుండాలి.
రోజుకు పది గంటలు!
జేఈఈ సిలబస్ విస్తృతంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు రోజుకు 10 నుంచి 12 గంటల పాటు ప్రిపరేషన్ సాగించాలి. ప్రిపరేషన్ సమయంలో మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. అలాగే రోజూ వ్యాయామం చేయడం వల్ల మెదడుకు చురుకుదనంతోపాటు వెన్నెముక సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
ఎక్కువ మంది చదివినవి..
జనవరి సెషన్‌లో మంచి ర్యాంకులు సొంతం చేసుకున్నవారిలో ఎక్కువ మంది చదివిన పుస్తకాల వివరాలు..
జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 31 ఎన్‌ఐటీలు, 28 ఐఐఐటీలు, 28 సీఎఫ్‌టీఐలలో ప్రవేశాలు కల్పిస్తారు.
జేఈఈ మెయిన్ 2019 కటాఫ్:
జేఈఈ మెయిన్ 2020 కటాఫ్ అంచనా..
98 పర్సంటైల్ దాటితే...!
ఏప్రిల్ సెషన్ రాయడం మంచిదేనా...? ఏ స్కోరు వచ్చిన వారు జేఈఈ అడ్వాన్స్‌కు ప్రిపరేషన్ ప్రారంభించొచ్చు...? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. జనవరి సెషన్‌లో 98 పర్సంటైల్ కంటే తక్కువ వచ్చిన వారికి కోరుకున్న నిట్‌లో నచ్చిన స్పెషలైజేషన్‌లో సీటు దక్కే అవకాశాలు తక్కువ...! కాబట్టి ఆయా విద్యార్థులు ఏప్రిల్ సెషన్‌కు సన్నద్ధం కావడంపై దృష్టిపెట్టాలి. అలాగే 98 పర్సంటైల్ కంటే ఎక్కువ వచ్చిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. బోర్డు పరీక్షలను బ్యాలెన్స్ చేస్తూ జేఈఈ పరీక్షలకు సన్నద్ధమడంపై విద్యార్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
- ఆర్.కేదారేశ్వర్, విజన్ 40

- అందుబాటులో ఉన్న మొత్తం సీట్లు
- పరీక్ష క్లిష్టత స్థాయి
- పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య
- సదరు కోర్సుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య
- అన్ని సెషన్లను పరిశీలిస్తే పేపర్ 1 సరళి జేఈఈ మెయిన్ జనవరి సెషన్ క్లిష్టత మధ్యస్థంగా ఉంది.
- విద్యార్థులు, నిపుణుల అభిప్రాయంలో ఫిజిక్స్ విభాగం కఠినంగా ఉంది. మ్యాథ్స్, కెమిస్ట్రీల క్లిష్టత మధ్యస్థంగా ఉంది. ఫిజిక్స్‌లో వీట్‌స్టోన్ బ్రిడ్జ్, రెసిస్టెన్స్, రే ఆప్టిక్స్, వేవ్స్ నుంచి ప్రశ్నలు అడిగారు. ఫిజిక్స్‌లో ఫార్ములా బేస్డ్ ప్రశ్నలు అడిగారు.
- మ్యాథ్స్‌లో ట్రిగనోమెట్రీ, ఆల్‌జీబ్రా అండ్ కంటిన్యుటీ, డిఫ్రెన్షియబిలిటీ, ఇంటిగ్రేషన్, కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ప్రశ్నలు వచ్చాయి. క్యాల్కులస్ నుంచి అడిగిన ప్రశ్నలు సులభంగా ఉండగా, ఆల్‌జీబ్రా ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నాయి.
- కెమిస్ట్రీ విభాగం సులభంగా ఉంది. మార్కోనికోవ్, యాంటీ మార్కోనికోవ్ రియాక్షన్,ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్స్, థర్మల్ ఎక్స్‌పాన్షన్, కోఆర్డినేట్ కాంపౌండ్స్ నుంచి ప్రశ్నలు వచ్చాయి.
- ఎన్‌సీఈఆర్‌టీ ఇంటర్ పుస్తకాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ప్రత్యేకించి ఎన్‌సీఈఆర్‌టీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం సిలబస్‌కు ప్రాధాన్యత లభించింది.
- జేఈఈ మెయిన్ పరంగా అనేక మంది విద్యార్థులు పరీక్ష హాల్లోకి వెళ్లే ముందు ప్రశ్నలు, ఫార్ములాలు, కాన్సెప్టులను డిస్కస్ చేస్తుంటారు. ఈ సంవత్సరం కూడా అనేక మంది ఇదే తరహా పొరపాటు చేశారు. ఫలితంగా అనవసర ఆందోళనకు గురై పరీక్షలో కొన్ని తప్పిదాలు చేసినట్లు తెలుస్తోంది.
- పరీక్షలో చాలా మంది పేపర్‌ను ఆసాంతం చదివి... ఆ తర్వాత తక్కువ పదాలు ఉన్న ప్రశ్నలనే మొదటగా అటెంప్ట్ చేస్తున్నారు. లాంగ్ క్వశ్చన్స్ కష్టంగా ఉంటాయనే భావనే దీనికి ప్రధాన కారణంగా ఉంది..! అయితే లాంగ్ క్వశ్చన్స్ అన్నీ కష్టంగా ఉండాలనే రూలేమీ లేదు. కొన్ని ప్రశ్నలు సులభంగా ఉంటాయి. వాస్తవానికి షార్ట్ క్వశ్చన్స్‌నే ట్రికీగా అడుగుతారు. కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించి.. తదనుగుణంగా వ్యవహరించాలి.
- పరీక్ష జరుగుతుండగా కొంతమంది విద్యార్థులు రెండుమూడుసార్లు వాష్‌రూమ్‌కు వెళ్తుంటారు. దీనివల్ల ఐదు నుంచి ఆరు ప్రశ్నలు అటెంప్ట్ చేసే సమయం వృథా అవుతుంది. కాబట్టి సదరు అలవాట్లు ఉన్న అభ్యర్థులు పరీక్షకు ముందు డ్రైపూట్స్ తీసుకోవడం మంచిది.
ఏప్రిల్ సెషన్‌కు హాజరవ్వాలనుకుంటున్న అభ్యర్థులు ముందుగా జనవరి సెషన్‌లో చేసిన పొరపాట్లను విశ్లేషించుకోవాలి. ఆ తప్పులు మళ్లీ జరక్కుండా ఉండేందుకు మాక్ టెస్టులు, గత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ప్రధానంగా కాన్సెప్ట్ అవగాహన లేని టాపిక్స్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
బేసిక్స్‌పై పట్టు :
జేఈఈ తొలి సెషన్ ప్రశ్నపత్రాలు, ఫలితాల సరళిని చూసినా లేదా టాపర్స్‌గా నిలిచిన వారు పేర్కొంటన్న అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నా... జేఈఈ మొదటి సెషన్(జనవరి)లో బేసిక్స్ కీలకంగా వ్యవహరించాయని తెలుస్తోంది. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్‌కు సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను క్షుణ్నంగా చదివిన వారు మెరుగైన ర్యాంకులు సొంతం చేసుకున్నారు. కాబట్టి ఏప్రిల్ సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తించి బేసిక్స్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే జేఈఈ మెయిన్‌కి సంబంధించి కేవలం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదివితేనో... రిఫరెన్స్‌గా తీసుకుంటేనో ఆశించిన విజయం లభిస్తుందనే గ్యారంటీ లేదు. కాబట్టి వాటితోపాటు ప్రామాణిక పుస్తకాలను ఫాలో అవ్వాలి. అలాగే కాన్సెప్టుల పట్ల అవగాహన కలిగుండాలి.
రోజుకు పది గంటలు!
జేఈఈ సిలబస్ విస్తృతంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు రోజుకు 10 నుంచి 12 గంటల పాటు ప్రిపరేషన్ సాగించాలి. ప్రిపరేషన్ సమయంలో మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. అలాగే రోజూ వ్యాయామం చేయడం వల్ల మెదడుకు చురుకుదనంతోపాటు వెన్నెముక సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
ఎక్కువ మంది చదివినవి..
జనవరి సెషన్‌లో మంచి ర్యాంకులు సొంతం చేసుకున్నవారిలో ఎక్కువ మంది చదివిన పుస్తకాల వివరాలు..
- ఫిజిక్స్: హెచ్.సీ వెర్మ,
- మ్యాథమెటిక్స్: కాలేజ్ మెటీరియెల్స్, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు
- ఆర్గానిక్ కెమిస్ట్రీ: చిత్తరంజన్ భక్త, ప్రభాత్‌కుమార్ పుస్తకాలు.
- పైన పేర్కొన్న వాటితోపాటు తరగతులకు హాజరవడం, ఎన్‌సీఆఆర్‌టీ ఇంటర్మీడియెట్ పుస్తకాలను చదవడం చేయాలి.
జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 31 ఎన్‌ఐటీలు, 28 ఐఐఐటీలు, 28 సీఎఫ్‌టీఐలలో ప్రవేశాలు కల్పిస్తారు.
ఇన్‌స్టిట్యూట్ | సీట్లు |
ఐఐటీలు | 13,376 |
ఎన్‌ఐటీలు | 17,967 |
ఐఐఐటీలు | 4,023 |
సీఎఫ్‌టీఐలు | 4,683 |
జేఈఈ మెయిన్ 2019 కటాఫ్:
కేటగిరీ | కటాఫ్ స్కోర్(పేపర్ 1) |
కామన్ ర్యాంక్ లిస్ట్(సీఆర్‌ఎల్) | 89.75 |
జనరల్(ఈడబ్ల్యూఎస్) | 78.21 |
ఓబీసీ(ఎన్‌సీఎల్) | 74.31 |
ఎస్సీ | 54.01 |
ఎస్టీ | 44.33 |
జేఈఈ మెయిన్ 2020 కటాఫ్ అంచనా..
కామన్ ర్యాంక్ లిస్ట్(సీఆర్‌ఎల్) | 88-91 |
జనరల్(ఈడబ్ల్యూఎస్) | 77-80 |
ఓబీసీ(ఎన్‌సీఎల్) | 73-76 |
ఎస్సీ | 53-56 |
ఎస్టీ | 43-46 |
98 పర్సంటైల్ దాటితే...!
ఏప్రిల్ సెషన్ రాయడం మంచిదేనా...? ఏ స్కోరు వచ్చిన వారు జేఈఈ అడ్వాన్స్‌కు ప్రిపరేషన్ ప్రారంభించొచ్చు...? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. జనవరి సెషన్‌లో 98 పర్సంటైల్ కంటే తక్కువ వచ్చిన వారికి కోరుకున్న నిట్‌లో నచ్చిన స్పెషలైజేషన్‌లో సీటు దక్కే అవకాశాలు తక్కువ...! కాబట్టి ఆయా విద్యార్థులు ఏప్రిల్ సెషన్‌కు సన్నద్ధం కావడంపై దృష్టిపెట్టాలి. అలాగే 98 పర్సంటైల్ కంటే ఎక్కువ వచ్చిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. బోర్డు పరీక్షలను బ్యాలెన్స్ చేస్తూ జేఈఈ పరీక్షలకు సన్నద్ధమడంపై విద్యార్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
- ఆర్.కేదారేశ్వర్, విజన్ 40
Published date : 05 Feb 2020 01:50PM