Skip to main content

జేఈఈ-అడ్వాన్స్‌డ్-2021 పరీక్ష గతంలో మాదిరిగానే!

జేఈఈ-అడ్వాన్స్‌డ్-2021 పరీక్ష విధానం గురించి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

గతేడాది మాదిరిగానే పరీక్ష ప్యాట్రన్ ఉండొచ్చని సబ్జెక్ట్ నిపుణులు అంటున్నారు. గత సంవత్సరం ఆన్‌లైన్ విధానంలో(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) రెండు పేపర్లు(పేపర్-1, పేపర్-2)గా జేఈఈ-అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించారు. గతేడాది ప్రతి పేపర్ 54 ప్రశ్నలు, 198 మార్కులు చొప్పున మొత్తం రెండు పేపర్లు కలిపి 396 మార్కులకు పరీక్ష జరిగింది. ప్రతి పేపర్‌లోనూ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 18 చొప్పున ప్రశ్నలు అడిగారు. ఈ ఏడాది కూడా ఇదే తీరులో పరీక్ష జరిగే అవకాశం ఉందంటున్నారు.

అనుసంధానం చేసుకుంటూ..
జేఈఈ-అడ్వాన్స్‌డ్ తేదీ ఖరారైన నేపథ్యంలో.. అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను ముమ్మరం చేయాలని సబ్జెక్ట్ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అభ్యర్థులు జేఈఈ-అడ్వాన్స్‌డ్ కంటే ముందు నిర్వహించే జేఈఈ-మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణత కోసం కృషి చేస్తున్న విషయం తెలిసిందే. జేఈఈ-మెయిన్ ప్రిపరేషన్‌ను, అడ్వాన్స్‌డ్ ప్రిపరేషన్‌ను అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగడం మేలు చేస్తుంది.

ఇంకా చదవండి: part 5: జేఈఈ-మెయిన్ నాలుగు సార్లు.. అడ్వాన్స్‌డ్ మాత్రం ఒకసారే!

Published date : 18 Jan 2021 02:58PM

Photo Stories