జాతీయ స్థాయిలో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లో ఫార్మసీలో పీజీ చేయాలనుకునే వారికి అవకాశం.. జీప్యాట్-2021 నోటిఫికేషన్ విడుదల..
జాతీయ స్థాయిలో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (ఎంఫార్మసీ) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష.. గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్టు (జీప్యాట్). తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. జీప్యాట్-2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. జీప్యాట్ నోటిఫికేషన్ వివరాలు, జీప్యాట్‌తో ప్రయోజనాలు.. అర్హతలు, ప్రవేశాలు కల్పించే ఇన్‌స్టిట్యూట్స్‌లు, పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ.. ప్రిపరేషన్ ప్రణాళిక..
వందల్లో ఇన్‌స్టిట్యూట్‌లు..
జీప్యాట్ స్కోర్‌తో దేశవ్యాప్తంగా 800కు పైగా ఇన్‌స్టిట్యూట్‌ల్లో ప్రవేశం పొందొచ్చు. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు ఎంఫార్మసీలో ప్రవేశాలకు జీప్యాట్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అభ్యర్థులు జీప్యాట్ స్కోరు ఆధారంగా సదరు ఇన్‌స్టిట్యూట్‌లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఇన్‌స్టిట్యూట్ జీప్యాట్ స్కోరుకు సంబంధించి కటాఫ్ మార్కులను ప్రకటిస్తుంది.
అర్హత..
జీప్యాట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఫార్మసీలో బ్యాచిలర్ డి గ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బీఫార్మసీ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం..
జీప్యాట్ ఆన్‌లైన్ విధానం(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లో జరుగుతుంది. పరీక్ష సమయం మూడు గంటలు. ఎగ్జామ్‌ను రెండు సెషన్స్‌లో నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు; మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ప్రశ్నపత్రం మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.
విభాగం ప్రశ్నల సంఖ్య మార్కులు
విభాగం | ప్రశ్నల సంఖ్య | మార్కులు |
ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ | 38 | 152 |
ఫార్మాస్యూటిక్స్ | 38 | 152 |
ఫార్మకోగ్నసీ | 10 | 40 |
ఫార్మకాలజీ | 28 | 112 |
ఇతర సబ్జెక్టులు | 11 | 44 |
మొత్తం | 125 | 500 |
ఇంకా చదవండి: part 2: జీప్యాట్-2021 నోటిఫికేషన్ విడుదల.. ప్రిపరేషన్ టిప్స్ ఇవిగో..