జామ్-2020
Sakshi Education
ఐఐటీల్లో ఎంఎస్సీ, జాయింట్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ, ఎంఎస్సీ-పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ చదవాలనుకుంటున్నారా.. ఐఐఎస్సీలో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో చేరాలనుందా.. అయితే మీ లక్ష్యం.. జాయింట్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ (జామ్)నే కావాలి..! ఇందులో సత్తా చాటిన విద్యార్థులకు ప్రతిష్టాత్మక ఐఐఎస్సీ, ఐఐటీల్లో ఉన్నతవిద్య చదవాలనే కల సాకారమవుతుంది.
తాజాగా జామ్-2020 ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో జామ్ 2020 ముఖ్యతేదీలు, ప్రవేశ ప్రక్రియ, పరీక్ష తీరుతెన్నులపై కథనం...
జామ్ జాతీయస్థాయిలో జరిగే పరీక్ష. జామ్ 2020ను ఐఐటీ కాన్పూర్ నిర్వహించనుంది. ఇందులో సాధించిన స్కోరు ఆధారంగా దేశంలోని 23 ఐఐటీలతోపాటు ప్రతిష్టాత్మక ఐఐఎస్సీలో ప్రవేశం లభిస్తుంది. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీలు), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్‌లు), షిబ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఈఎస్‌టీ), పంజాబ్‌లోని ఎస్‌ఎల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ తదితరాల్లో జామ్ స్కోరు ఆధారంగా ప్రవేశాలు కల్పించే అవకాశముంది.
కోర్సులు..
ఐఐటీలు ఆఫర్‌చేస్తున్న కోర్సులు: ఎంఎస్సీ (రెండేళ్లు), జాయింట్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ, ఎంఎస్సీ-పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ, ఎంఎస్సీ-ఎంఎస్(రీసెర్చ్)/పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ, పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ పోగ్రామ్స్.
ఐఐఎస్సీ: ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ పోగ్రామ్స్.
అర్హతలు:
జనరల్, ఓబీసీ అభ్యర్థులకు సంబంధిత డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.
టెస్ట్ పేపర్లు :
బయోటెక్నాలజీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, జియాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, బయలాజికల్ సెన్సైస్.
పరీక్ష విధానం :
జామ్‌ను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రాలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. ప్రశ్న పత్రంలో మూడు సెక్షన్లు.. సెక్షన్-ఏ, సెక్షన్-బీ, సెక్షన్-సీ ఉంటాయి. సెక్షన్ ఏలో 30 ప్రశ్నలు, సెక్షన్ బీలో 10 ప్రశ్నలు, సెక్షన్ సీలో 20 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 60 ప్రశ్నలతో 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు. సెక్షన్ ఏలో ఒక మార్కు ప్రశ్నల్లో ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల్లో కోత ఉంటుంది. అలాగే సెక్షన్ ఏలోనే 2 మార్కుల ప్రశ్నలకు ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు లభిస్తే.. ప్రతి తప్పు సమాధానానికి 2/3 మార్కుల్లో కోత ఉంటుంది. సెక్షన్ బీలో నెగిటివ్ మార్కింగ్ విధానంలేదు. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు కేటాయిస్తారు. సెక్షన్ సీలో 10 ఒక మార్కు ప్రశ్నలు, మరో పది 2 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఈ సెక్షన్‌లో కూడా నెగిటివ్ మార్కింగ్ విధానంలేదు. జామ్ పరీక్షలో మూడు రకాల ప్రశ్నలు అడుగుతారు. అవి.. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ (ఎంసీక్యూ), మల్టిపుల్ సెలక్షన్ క్వశ్చన్స్ (ఎంఎస్‌క్యూ), న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ (ఎన్‌ఏటీ).
ప్రిపరేషన్ టిప్స్ :
జామ్ జాతీయస్థాయిలో జరిగే పరీక్ష. ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐటీలు, ఐఐఎస్సీలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి గట్టి పోటీ ఉంటుంది. కాబట్టి ఈ పరీక్షలో విజయం సాధించాలంటే.. సాధ్యమైనంత ముందుగానే ప్రిపరేషన్ ప్రారంభించాలి. ప్రతిరోజూ సిలబస్‌లోని అంశాలను అధ్యయనం చేస్తూ.. ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది. ప్రతి సబ్జెక్టుకు, అంశానికి ప్రత్యేకంగా సమయం కేటాయించుకొని చదివేలా టైమ్‌టేబుల్ రూపొందించుకోవాలి. ఆయా అంశాలను చదువుతూ షార్ట్ నోట్స్, లాంగ్ నోట్స్ సిద్ధం చేసుకోవాలి. ఇది పరీక్ష ముందు వేగంగా రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా జామ్ అధికారిక సైట్‌లో పేర్కొన్న సిలబస్‌ను, పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి.. ముఖ్యమైన, ఎక్కువ వెయిటేజీ ఉన్న టాపిక్స్‌కు అధిక సమయం కేటాయించుకోవాలి. పరీక్ష కోణంలో ప్రాధాన్య అంశాల జాబితా రాసుకోవాలి. వాటిని రోజూ చదువుతుండాలి. ఆయా టాపిక్స్‌పై అందుబాటులో ఉన్న ప్రతి ప్రశ్నను వేగంగా సాధించేలా నిత్యం ప్రాక్టీస్ చేస్తుండాలి. జామ్ పరీక్షలో విజయానికి ఏకైక మార్గం ప్రాక్టీస్ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పాత పేపర్లు, మోడల్ పేపర్లను సేకరించుకొని నిత్యం ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోవాలి.
కౌన్సెలింగ్ :
జామ్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో కామన్ అడ్మిషన్ పోర్టల్ (జేఓఏపీఎస్) ద్వారా కౌన్సెలింగ్‌లో పాల్గొనాలి. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
జామ్ 2019 కటాఫ్ మార్కులు :
జామ్ షెడ్యూల్ :
జామ్‌ను 2020, ఫిబ్రవరి 9న రెండు సెషన్స్‌లో నిర్వహిస్తారు.
సెషన్ 1: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.
టెస్ట్ పేపర్లు: బయోటెక్నాలజీ(బీటీ), ఫిజిక్స్(పీహెచ్), మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్(ఎంఎస్).
సెషన్ 2: మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు.
టెస్ట్ పేపర్లు: మ్యాథమెటిక్స్ (ఎంఏ), కెమిస్ట్రీ(సీవై), జియాలజీ (జీజీ).
దరఖాస్తు ప్రక్రియ...
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 5, 2019.
దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబర్ 8, 2019.
జామ్ 2020 పరీక్ష తేదీ: ఫిబ్రవరి 9, 2020.
ఫలితాల వెల్లడి: మార్చి 20, 2020.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం.
దరఖాస్తు ఫీజు :
జనరల్, ఓబీసీ కేటగిరీ: రూ.1500, రెండు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకుంటే రూ.2100.
ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ: రూ.750, రెండు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకుంటే రూ.1050.
మహిళలు: రూ.750, రెండు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకుంటే 1050.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://jam.iitk.ac.in

సబ్జెక్టు | జనరల్ | ఓబీసీ(ఎన్‌సీఎల్) | ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ |
మ్యాథమెటిక్స్ | 22.96 | 20.66 | 11.48 |
కెమిస్ట్రీ | 20.31 | 18.28 | 10.15 |
ఫిజిక్స్ | 24.99 | 22.49 | 12.49 |
జామ్ షెడ్యూల్ :
జామ్‌ను 2020, ఫిబ్రవరి 9న రెండు సెషన్స్‌లో నిర్వహిస్తారు.
సెషన్ 1: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.
టెస్ట్ పేపర్లు: బయోటెక్నాలజీ(బీటీ), ఫిజిక్స్(పీహెచ్), మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్(ఎంఎస్).
సెషన్ 2: మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు.
టెస్ట్ పేపర్లు: మ్యాథమెటిక్స్ (ఎంఏ), కెమిస్ట్రీ(సీవై), జియాలజీ (జీజీ).
దరఖాస్తు ప్రక్రియ...
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 5, 2019.
దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబర్ 8, 2019.
జామ్ 2020 పరీక్ష తేదీ: ఫిబ్రవరి 9, 2020.
ఫలితాల వెల్లడి: మార్చి 20, 2020.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం.
దరఖాస్తు ఫీజు :
జనరల్, ఓబీసీ కేటగిరీ: రూ.1500, రెండు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకుంటే రూ.2100.
ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ: రూ.750, రెండు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకుంటే రూ.1050.
మహిళలు: రూ.750, రెండు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకుంటే 1050.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://jam.iitk.ac.in
Published date : 10 Aug 2019 11:45AM