Skip to main content

ఇస్రో ఎస్ఏసీ దరఖాస్తుల పొడిగింపు

అహ్మదాబాద్లోని ఎస్ఏసీ(స్పేస్ అప్లికేషన్ సెంటర్)లో 55 పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) పొడిగించింది.
దరఖాస్తులకు చివరి తేదీని తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. ఇస్రో ఎస్ఏసీలో శాస్త్రవేత్తలు, టెక్నికల్ అసిస్టెంట్లు, టెక్నీషియన్ బీ, డ్రాఫ్ట్స్మన్ బీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు తేది 3 ఏప్రిల్2020గా ఉండేది. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా ఈ తేదీని పొడిగించారు.
  • పోస్టులు: సైంటిస్ట్/ఇంజనీర్–21, టెక్నికల్ అసిస్టెంట్–06, టెక్నీషియన్ గ్రేడ్ బి – 25, డ్రాఫ్ట్మన్ – 03.
  • అర్హతలు: ఆయా పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్, ఎంఎస్సీ, డిప్లొమా, ఇంటర్, ఐటీఐ అర్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయసు: సైంటిస్ట్/ఇంజనీర్–ఎస్డీ(ఎలక్ట్రానిక్స్) పోస్టులకు వయోపరిమితి లేదు. కాని సైంటిస్ట్/ ఇంజనీర్–ఎస్సీ (ఫిజిక్స్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, స్ట్రక్చరల్ అండ్ ఎలక్ట్రికల్), టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్), టెక్నీషియన్ బీ(ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్లంబర్, కార్పెంటర్, కెమికల్ అండ్ ఎలక్ట్రీషియన్స్), డ్రాఫ్ట్మన్ బీ(మెకానికల్) పోస్టులకు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి.
  • మరిన్ని వివరాలకు వెబ్సైట్: https://www.sac.gov.in/vyom.careers.jsp
Published date : 23 Apr 2020 06:30PM

Photo Stories