ఇంటర్‌తోనే టెక్‌బీ పోగ్రామ్.. రూ.2 లక్షలకు పైగా వార్షిక వేతనంతో ఉద్యోగం..
Sakshi Education
హెచ్‌సీఎల్ టెక్‌బీ.. ఇంటర్ పూర్తయిన వెంటనే ఫుల్‌టైమ్ జాబ్ చేయాలనుకొనే అభ్యర్థుల కోసం రూపకల్పన చేసిన ప్రోగ్రామ్. హెచ్‌సీఎల్‌లో ఎంట్రీ లెవల్ కొలువుల భర్తీకి అవసరమైన నైపుణ్యాలపై అభ్యర్థులకు 12 నెలల శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్‌లో ఫుల్ టైమ్ ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఈ సమయంలో ఉద్యోగం చేస్తూనే అభ్యర్థులు బిట్స్-పిలానీ, సస్త్ర యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించొచ్చు. టెక్‌బీ ప్రోగ్రామ్‌కు ఎంపికైన విద్యార్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ.10000 స్టైపెండ్ చెల్లిస్తారు. అనంతరం పూర్తిస్థాయి ఉద్యోగులుగా నియమితులైన తర్వాత రూ. 2 లక్షల-2.20 లక్షల వార్షిక వేతనం అందుతుంది.
శిక్షణ..
- హెచ్‌సీఎల్ టెక్‌బీ ప్రోగ్రామ్.. అభ్యర్థులను హెచ్‌సీఎల్ ప్రాజెక్ట్స్‌పై పనిచేసేందుకు సన్నద్ధులను చేస్తుంది.
- ఫౌండేషన్ ట్రైనింగ్‌లో భాగంగా.. ప్రొఫెషనల్ ఐటీ ఉద్యోగిగా మారేందుకు అవసరమైన ఐటీ ఫండమెంటల్స్‌ను బోధిస్తారు.
- అభ్యర్థులకు కంపెనీ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ యాక్సెస్ లభిస్తుంది. ఇందులో కంపెనీ విధులకు సంబంధించిన చర్చలు, ఆన్‌లైన్ అసెస్‌మెంట్లు, అసైన్‌మెంట్స్, కేస్ బేస్డ్ సబ్‌మిషన్స్ ఉంటాయి. అభ్యర్థులు టెక్నాలజీ సర్వీసెస్‌కు సంబంధించిన ఐటీ సర్టిఫికెట్ పొందవచ్చు.
ఉద్యోగ వివరాలు..
- శిక్షణను పూర్తి చేసుకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్‌లో ఫుల్ టైమ్ ఉద్యోగిగా అవకాశం కల్పిస్తారు.
- ఆఫర్ అందుకున్నవారు దేశంలోని హెచ్‌సీఎల్ క్యాంపస్‌ల్లో అప్లికేషన్ అండ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ సపోర్ట్, డిజైన్ ఇంజనీర్ విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
- హెచ్‌సీఎల్ హెల్త్‌కేర్ బెనిఫిట్స్, మెడికల్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ఇన్సూరెన్స్, హెల్త్ చెకప్స్ తదితర సౌకర్యాలు ఉంటాయి.
- బెనిఫిట్ బాక్స్ ప్రోగ్రామ్ కింద డిస్కౌంట్స్, ఇతర ఆఫర్స్‌ను అందుకోవచ్చు.
ఇంకా చదవండి: part 3: హెచ్‌సీఎల్ టెక్‌బీ పోగ్రామ్‌తో ఉద్యోగంతోపాటు ఉన్నత విద్యకు అవకాశం.. వివరాలు తెలుసుకోండిలా..
Published date : 15 Feb 2021 02:53PM