Skip to main content

ఇంటర్‌తోనే ఐటీ కొలువు చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ అవకాశం మీకోసమే..

ఇంటర్ పూర్తయిందా.. వెంటనే ఐటీ కొలువులో చేరాలనుందా.. కానీ, ఉన్నత విద్య కూడా కొనసాగించాలనుకుంటున్నారా ?! మీలాంటి విద్యార్థులకు సరితూగే కొలువుల కోర్సే.. హెచ్‌సీఎల్ అందిస్తున్న టెక్‌బీ ఎర్లీ కెరియర్ ప్రోగ్రామ్. ఇందులో చేరితే అనుభవంతోపాటు కొలువూ సొంతమవుతుంది. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పట్టా అందుకునే అవకాశం కూడా ఉంటుంది. తాజాగా టెక్‌బీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. సదరు కోర్సు ప్రత్యేకత, దరఖాస్తుకు కావాల్సిన అర్హతలు, ఎంపిక ప్ర్రక్రియ తదితరాల గురించి పూర్తి సమాచారం..

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్.. గ్రాడ్యుయేట్లు, ఇంటర్ విద్యార్థులకు ఉపయోగపడేలా పలు ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. తాజాగా హెచ్‌సీఎల్ ఐటీ ఇంజనీర్ కోర్సుకు నోటిఫికేషన్ విడుదలైంది. హెచ్‌సీఎల్ టెక్‌బీ.. ఇంటర్ పూర్తయిన వెంటనే ఫుల్‌టైమ్ జాబ్ చేయాలనుకొనే అభ్యర్థుల కోసం రూపకల్పన చేసిన ప్రోగ్రామ్. హెచ్‌సీఎల్‌లో ఎంట్రీ లెవల్ కొలువుల భర్తీకి అవసరమైన నైపుణ్యాలపై అభ్యర్థులకు 12 నెలల శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్‌లో ఫుల్ టైమ్ ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఈ సమయంలో ఉద్యోగం చేస్తూనే అభ్యర్థులు బిట్స్-పిలానీ, సస్త్ర యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించొచ్చు. టెక్‌బీ ప్రోగ్రామ్‌కు ఎంపికైన విద్యార్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ.10000 స్టైపెండ్ చెల్లిస్తారు. అనంతరం పూర్తిస్థాయి ఉద్యోగులుగా నియమితులైన తర్వాత రూ. 2 లక్షల-2.20 లక్షల వార్షిక వేతనం అందుతుంది.

అర్హత..
l 2019, 2020లో ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. అలాగే 2021లో ఇంటర్ పూర్తి చేసుకోనున్న/ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
l అభ్యర్థి ఇంటర్‌లో మ్యాథమెటిక్స్ లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్‌ను చదివుండాలి.

ఫీజు..

  • పోగ్రామ్ ఫీజు ట్యాక్స్‌లతో కలిపి రూ.2.20 లక్షల వరకు ఉంటుంది.
  • అభ్యర్థులకు బ్యాంకు రుణ సదుపాయం కల్పిస్తారు.
  • విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా ఆర్థిక ప్రోత్సాహం అందిస్తారు.
  • శిక్షణ సమయంలో 90 శాతం కంటే ఎక్కువ మార్కులు పొందిన వారికి 100 శాతం ఫీజు మాఫీ చేస్తారు. అలాగే 85-90 శాతం మార్కులు పొందిన వారికి 50 శాతం ఫీజు మాఫీ చేస్తారు.

ఇంకా చ‌ద‌వండి: part 2: ఇంటర్‌తోనే టెక్‌బీ పోగ్రామ్.. రూ.2 లక్షలకు పైగా వార్షిక వేతనంతో ఉద్యోగం..

Published date : 15 Feb 2021 03:01PM

Photo Stories