ఇంటర్ + జేఈఈ టాప్ స్కోర్‌కు సరైనా మార్గాలు ఇలా...
Sakshi Education
ఇంటర్మీడియెట్ పరీక్షల్లో వచ్చిన మార్కులు.. ఇంటర్ సబ్జెక్టులపై సాధించిన పట్టు.. ప్రతిష్టాత్మక ఐఐటీలు, నిట్‌లల్లో సీటు సొంతం చేసుకోవడంలో కీలకం! నిట్‌లు, ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ-మెయిన్, జేఈఈ- అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో టాప్ స్కోర్‌కూ మార్గం.. ఇంటర్!! 2020 విద్యా సంవత్సరానికి సంబంధించి.. జేఈఈ-మెయిన్-2020 (1) పరీక్ష జనవరిలో.. జేఈఈ-మెయిన్-2020(2) పరీక్ష ఏప్రిల్‌లో జరగనుంది. మరోవైపు మార్చిలో ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ సైతం విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ మరికొద్ది రోజుల్లోనే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలకానుంది. ఈ నేపథ్యంలో.. ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు ఇటు ఇంటర్ పరీక్షలతోపాటు అటు జేఈఈ మెయిన్‌కు సన్నద్ధమవడమెలాగో తెలుసుకుందాం...
ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల్లో అధిక శాతం మంది.. జేఈఈ-మెయిన్ జనవరికి దరఖాస్తు చేసుకున్నారు. మరికొంతమంది జేఈఈ-మెయిన్ ఏప్రిల్ పరీక్షకూ సన్నద్ధమవుతున్నారు. ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన మార్కులు సాధించడంతోపాటు జేఈఈ-మెయిన్‌లోనూ టాప్ స్కోర్ సొంతమయ్యేలా ప్రిపరేషన్ ప్రారంభించారు. ఇంటర్మీడియెట్ సబ్జెక్ట్‌లలో పొందిన నైపుణ్యం ఆధారంగా ఇటు ఇంటర్ పరీక్షల్లో.. అటు జేఈఈ-మెయిన్‌లోనూ మెరుగైన ప్రతిభ చూపే అవకాశముంది. అంతేకాకుండా జేఈఈ మెయిన్ తర్వాత.. ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు కూడా ఇంటర్+జేఈఈ మెయిన్ ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది. ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు సబ్జెక్ట్‌లను చదివే విషయంలో, టైమ్ మేనేజ్‌మెంట్‌లో, ప్రాక్టీస్ పరంగానూ ప్రత్యేక వ్యూహం అనుసరించాలని సబ్జెక్ట్ నిపుణులు సూచిస్తున్నారు.
ఉమ్మడి ప్రిపరేషన్ :
అన్వయం ప్రధానం :
ప్రాక్టీస్ కీలకం :
ఇంటర్, జేఈఈ-మెయిన్‌కు ప్రాక్టీస్ ప్రధానం. ప్రతిరోజు తాము చదివిన సబ్జెక్టుకు సంబంధించి.. ప్రశ్నలు అడిగే అవకాశమున్న అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. జేఈఈ-మెయిన్ సిలబస్‌లో ఎక్కువ అంశాలు ఇంటర్మీడియెట్ మొదటి, ద్వితీయ సంవత్సరం సిలబస్ నుంచే ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఆయా చాప్టర్‌లకు సంబంధించి మొదటి సంవత్సరం అంశాలను కూడా ఎప్పటికప్పుడు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. మొదటి సంవత్సరం టాపిక్స్‌ను, రెండో సంవత్సరం అంశాలతో అనుసంధానం చేసుకుంటూ అభ్యసనం సాగించాలి. ఫలితంగా సంబంధిత చాప్టర్‌పై పూర్తి స్థాయిలో పట్టు చిక్కుతుంది. తద్వారా ప్రశ్నను ఏ రూపంలో అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.
న్యూమరికల్ ప్రశ్నలు :
జేఈఈ-మెయిన్-2020 పరీక్షలో మార్పులు చేశారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ల్లో ప్రతి సబ్జెక్ట్ నుంచి అయిదు చొప్పున న్యూమరికల్ ప్రశ్నలు అడుగనున్నారు. కాబట్టి విద్యార్థులు అనువర్తిత దృక్పథంతో అధ్యయనం చేయడంతోపాటు ఆయా సబ్జెక్ట్‌ల్లో న్యూమరిక్స్ ఆధారంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
మాక్ టెస్ట్‌లు, ప్రీ-ఫైనల్ టెస్ట్‌లు :
ఇంటర్, జేఈఈ-మెయిన్ ఉమ్మడి ప్రిపరేషన్‌లో భాగంగా మాక్ టెస్ట్‌లకు హాజరవడం కలిసొస్తుంది. ఇంటర్ ప్రీ-ఫైనల్ టెస్ట్‌లు రాయడం, వాటి ఫలితాలను విశ్లేషించుకోవడం ఉపయుక్తం. ముఖ్యంగా ఏప్రిల్ సెషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ వ్యూహాన్ని అమలు చేయాలి. జనవరి సెషన్‌కు హాజరయ్యే వారికి ప్రస్తుతం దాదాపు నెలరోజుల సమయం అందుబాటులో ఉంది. ఈ సమయంలో వీరు అధిక సమయాన్ని పునశ్చరణకు, వీక్లీ టెస్ట్‌లకు, మాక్ టెస్ట్‌లకు కేటాయించాలి. ఇలా చేయడం వల్ల ఇంటర్ పరీక్షలతోపాటు, జేఈఈ-మెయిన్‌లోనూ మెరుగైన ప్రతిభ చూపే అవకాశం లభిస్తుంది.
టైమ్ మేనేజ్‌మెంట్ :
ఉమ్మడి ప్రిపరేషన్‌లో టైమ్ మేనేజ్‌మెంట్ ఎంతో ముఖ్యం. ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ చదివే లా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్‌కు కనీసం రెండు గంటల సమయం కేటాయించాలి. సులభమైన అంశాలకు కొంత తక్కువ సమయంలోనే పూర్తిచేసుకోవాలి. అలాగే అంతకుముందు రోజు చదివిన అంశాలను పునశ్చరణ చేసుకునేందుకు కనీసం పది నిమిషాలు కేటాయించాలి. ప్రతి రోజు ఇలా నిర్దిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ సాగిస్తే.. ఏక కాలంలో రెండు పరీక్షలకు సన్నద్ధత లభిస్తుంది.
ఉమ్మడి ప్రిపరేషన్.. ముఖ్యాంశాలు
ఇంటర్మీడియెట్, జేఈఈ-మెయిన్ ముఖ్య తేదీలు:
ఉమ్మడి ప్రిపరేషన్ :
- ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల్లో తలెత్తే సందేహం.. ఒకే సమయంలో ఇంటర్, జేఈఈ-మెయిన్ పరీక్షలకు ప్రిపరేషన్ సాధ్యమేనా? అనేది! వాస్తవానికి డిసెంబర్ రెండో వారం నాటికి విద్యార్థులు ఇంటర్మీడియెట్ సిలబస్‌ను పూర్తి చేసుకుంటారు. జేఈఈ-మెయిన్ జనవరి సెషన్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు డిసెంబర్ నుంచి ఇంటర్మీడియెట్+జేఈఈ- మెయిన్‌లో ఉన్న ఉమ్మడి సిలబస్ అంశాల పునశ్చరణకు అధిక సమయం కేటాయించాలి. తద్వారా జేఈఈ-మెయిన్ జనవరి సెషన్‌లో మంచి స్కోర్ సాధించేందుకు అవకాశం ఉంటుంది.
- జేఈఈ-మెయిన్ ఏప్రిల్ సెషన్‌పైనే దృష్టి పెట్టిన విద్యార్థులు.. డిసెంబర్‌లో ఇంటర్ సిలబస్ పూర్తిచేసుకొని.. ఫిబ్రవరి రెండో వారం వరకూ జేఈఈ-మెయిన్‌కు ప్రిపరేషన్ కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తర్వాత పూర్తి సమయం ఇంటర్ పరీక్షలకే కేటాయించాలి. ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాత జేఈఈ-మెయిన్ ఏప్రిల్ సెషన్ కోసం రివిజన్‌తోపాటు, మాక్ టెస్ట్‌లను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఫలితంగా జేఈఈ-మెయిన్ ఏప్రిల్‌లో మంచి స్కోర్ సాధించే వీలుంటుంది.
అన్వయం ప్రధానం :
- ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఆయా సబ్జెక్ట్‌లను అప్లికేషన్ ఓరియెంటేషన్(అన్వయ దృక్పథం)తో ప్రిపరేషన్ సాగించాలి. తద్వారా ఇంటర్ సబ్జెక్ట్‌లపై పూర్తిస్థాయి అవగాహన ఏర్పడుతుంది. ప్రధానంగా ఆయా సబ్జెక్ట్‌ల బేసిక్ కాన్సెప్ట్స్‌పై పట్టు సాధించాలి. వాటిని వాస్తవ పరిస్థితులతో అన్వయం చేసుకుంటూ చదవాలి. అదేవిధంగా ఫిబ్రవరిలో నిర్వహించే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలపై దృష్టిపెట్టడం ద్వారాఅప్లికేషన్ ఓరియెంటేషన్ అలవరచుకోవచ్చు. చదివే సమయంలో ముఖ్యమైన ఫార్ములాలు, కీ పాయింట్స్‌ను షార్ట్ నోట్స్‌గా రూపొందిం చుకోవాలి. ఇది ఇంటర్‌తోపాటు, జేఈఈ-మెయిన్.. రివిజన్‌కు ఉపకరిస్తుంది.
- జేఈఈ-మెయిన్ జనవరి సెషన్‌కు హాజరై ఆశించిన స్థాయిలో రాయని విద్యార్థులు.. ఏప్రిల్ సెషన్ కోసం సన్నద్ధత ప్రారంభించాలి. జనవరి సెషన్ ‘కీ’ ఆధారంగా, తమ ఆన్సర్ షీట్లను పరిశీలించుకోవాలి. తద్వారా తాము ఇంకా పట్టు సాధించాల్సిన అంశాలను గుర్తించి వాటిపై దృష్టి పెట్టాలి. ఇంటర్ స్థాయిలో ఒక్కసారి కూడా చదవకుండా.. కొత్తగా చదవాల్సినవి ఏమైనా ఉంటే.. వాటిని పక్కన పెట్టేయాలి. ఇప్పటివరకు చదివి తమకు పట్టున్న టాపిక్స్‌నే ఒకటికి నాలుగుసార్లు చదవాలి.
ప్రాక్టీస్ కీలకం :
ఇంటర్, జేఈఈ-మెయిన్‌కు ప్రాక్టీస్ ప్రధానం. ప్రతిరోజు తాము చదివిన సబ్జెక్టుకు సంబంధించి.. ప్రశ్నలు అడిగే అవకాశమున్న అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. జేఈఈ-మెయిన్ సిలబస్‌లో ఎక్కువ అంశాలు ఇంటర్మీడియెట్ మొదటి, ద్వితీయ సంవత్సరం సిలబస్ నుంచే ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఆయా చాప్టర్‌లకు సంబంధించి మొదటి సంవత్సరం అంశాలను కూడా ఎప్పటికప్పుడు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. మొదటి సంవత్సరం టాపిక్స్‌ను, రెండో సంవత్సరం అంశాలతో అనుసంధానం చేసుకుంటూ అభ్యసనం సాగించాలి. ఫలితంగా సంబంధిత చాప్టర్‌పై పూర్తి స్థాయిలో పట్టు చిక్కుతుంది. తద్వారా ప్రశ్నను ఏ రూపంలో అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.
న్యూమరికల్ ప్రశ్నలు :
జేఈఈ-మెయిన్-2020 పరీక్షలో మార్పులు చేశారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ల్లో ప్రతి సబ్జెక్ట్ నుంచి అయిదు చొప్పున న్యూమరికల్ ప్రశ్నలు అడుగనున్నారు. కాబట్టి విద్యార్థులు అనువర్తిత దృక్పథంతో అధ్యయనం చేయడంతోపాటు ఆయా సబ్జెక్ట్‌ల్లో న్యూమరిక్స్ ఆధారంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
మాక్ టెస్ట్‌లు, ప్రీ-ఫైనల్ టెస్ట్‌లు :
ఇంటర్, జేఈఈ-మెయిన్ ఉమ్మడి ప్రిపరేషన్‌లో భాగంగా మాక్ టెస్ట్‌లకు హాజరవడం కలిసొస్తుంది. ఇంటర్ ప్రీ-ఫైనల్ టెస్ట్‌లు రాయడం, వాటి ఫలితాలను విశ్లేషించుకోవడం ఉపయుక్తం. ముఖ్యంగా ఏప్రిల్ సెషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ వ్యూహాన్ని అమలు చేయాలి. జనవరి సెషన్‌కు హాజరయ్యే వారికి ప్రస్తుతం దాదాపు నెలరోజుల సమయం అందుబాటులో ఉంది. ఈ సమయంలో వీరు అధిక సమయాన్ని పునశ్చరణకు, వీక్లీ టెస్ట్‌లకు, మాక్ టెస్ట్‌లకు కేటాయించాలి. ఇలా చేయడం వల్ల ఇంటర్ పరీక్షలతోపాటు, జేఈఈ-మెయిన్‌లోనూ మెరుగైన ప్రతిభ చూపే అవకాశం లభిస్తుంది.
టైమ్ మేనేజ్‌మెంట్ :
ఉమ్మడి ప్రిపరేషన్‌లో టైమ్ మేనేజ్‌మెంట్ ఎంతో ముఖ్యం. ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ చదివే లా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్‌కు కనీసం రెండు గంటల సమయం కేటాయించాలి. సులభమైన అంశాలకు కొంత తక్కువ సమయంలోనే పూర్తిచేసుకోవాలి. అలాగే అంతకుముందు రోజు చదివిన అంశాలను పునశ్చరణ చేసుకునేందుకు కనీసం పది నిమిషాలు కేటాయించాలి. ప్రతి రోజు ఇలా నిర్దిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ సాగిస్తే.. ఏక కాలంలో రెండు పరీక్షలకు సన్నద్ధత లభిస్తుంది.
ఉమ్మడి ప్రిపరేషన్.. ముఖ్యాంశాలు
- డిసెంబర్ చివరి నాటికి జేఈఈ మెయిన్ సిలబస్, ఇంటర్మీడియెట్ రెండు సంవత్సరాల సిలబస్‌లోని ఉమ్మడి అంశాల ప్రిపరేషన్ పూర్తి చేయాలి.
- జేఈఈ-మెయిన్ జనవరి సెషన్‌కు హాజరవుతున్న విద్యార్థులు చివరి రెండు వారాలు పునశ్చరణ, మాక్ టెస్ట్‌లకు కేటాయించాలి.
- ఏప్రిల్ సెషన్‌కు హాజరయ్యే విద్యార్థులు.. జేఈఈ మెయిన్ సిలబస్‌లో మాత్రమే ఉన్న అంశాలపై దృష్టి సారించాలి.
- ఫిబ్రవరి నుంచి పూర్తిగా ఇంటర్మీడియెట్ పరీక్షలకే సమయం కేటాయించాలి. ఆ తర్వాత మెయిన్ ఏప్రిల్ సెషన్‌పై దృష్టి పెట్టాలి.
- ప్రిపరేషన్ సమయంలో సొంత నోట్స్, షార్ట్ కట్ ఫార్ములాలను రూపొందించుకోవాలి. వీటి ఆధారంగా రివిజన్ చేయాలి.
- ప్రతిరోజు ఇంటర్‌తో పాటు జేఈఈ మెయిన్ ప్రిపరేషన్‌కు కొంత సమయం కేటాయించుకోవాలి.
- రోజు కనీసం ఆరు గంటలు మెయిన్, ఇంటర్మీడియెట్ అంశాల ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
ఇంటర్మీడియెట్, జేఈఈ-మెయిన్ ముఖ్య తేదీలు:
- తెలంగాణలో మార్చి 5, 2020 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు.
- గత రెండేళ్ల షెడ్యూల్‌ను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనూ మార్చి మొదటి వారంలోనే ఇంటర్ పరీక్షలు ప్రారంభయ్యే అవకాశం.
- జనవరి 6-11, 2020 మధ్యలో జేఈఈ-మెయిన్-2020 జనవరి సెషన్ పరీక్షలు.
- ఏప్రిల్ 3-9, 2020 మధ్యలో జేఈఈ-మెయిన్-2020 ఏప్రిల్ సెషన్ పరీక్షలు.
ప్రతి చాప్టర్‌ను కచ్చితంగా చదవాలి.. మ్యాథమెటిక్స్: ఈ సబ్జెక్టులో రెండు సంవత్సరాల సిలబస్‌కు సంబంధించి ప్రతి చాప్టర్‌ను కచ్చితంగా చదవాలి. ఇందులో 3-డి జామెట్రీ; కో ఆర్డినేట్ జామెట్రీ; వెక్టార్ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్; కాంప్లెక్స్ నెంబర్స్; పారాబోలా; ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ముఖ్యమైనవి. వీటితోపాటు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్, బైనామియల్ థీరమ్, లోకస్ అంశాలను కనీసం ఒక్కసారైనా పూర్తి చేసే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. - ఆర్. కేదారేశ్వర్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నిపుణులు |
పట్టు సాధిస్తే.. మంచి మార్కులు మీ సొంతం: ఫిజిక్స్: న్యూమరికల్ అప్లికేషన్ అప్రోచ్ ప్రధానంగా ఉండే ఫిజిక్స్‌లో.. ఎలక్ట్రో డైనమిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెఎం అండ్ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. సెంటర్ ఆఫ్ మాస్, మొమెంటం అండ్ కొలిజన్; సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్ అండ్ స్ట్రింగ్ వేవ్స్‌పై పట్టు సాధిస్తే.. మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. ప్రిపరేషన్ సమయంలోనే ఆయా అంశాల ప్రాథమిక భావనలను వాస్తవ పరిస్థితులతో అన్వయించుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. - సీహెచ్.రామకృష్ణ, ఫిజిక్స్ సబ్జెక్ట్ నిపుణులు |
ఈ సజ్జెక్ట్ కొంత సులభమే...కానీ కెమిస్ట్రీ: విద్యార్థులు కొంత సులభంగా భావించే సబ్జెక్ట్ కెమిస్ట్రీ. ఇందులో అడిగే ప్రశ్నలు కెమికల్ బాండింగ్, పిరియాడిక్ టేబుల్, బ్రేకింగ్‌ల మూలాలపై అవగాహనను తెలుసుకునే విధంగా ఉంటున్నాయి. కాబట్టి విద్యార్థులు మోల్ కాన్సెప్ట్, కో ఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి. - డి.కె.ఝా, కెమిస్ట్రీ సబ్జెక్ట్ నిపుణులు |
Published date : 02 Dec 2019 04:25PM