ఇంటర్ + ఎంసెట్ రెండింట్లోనూ విజయం సాధించండిలా...
Sakshi Education
తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఎంసెట్ తేదీలు వెలువడే అవకాశముంది.మరోవైపు ఇంటర్మీడియెట్ పరీక్షలు దగ్గరపడుతున్నాయి. దీంతో రెండింటినీ సమన్వయం చేసుకొనే విషయంలో విద్యార్థులు ఒకింత ఒత్తిడికి లోనవుతున్నారు.
స్పష్టత, ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తే.. రెండింట్లోనూ విజయం సాధించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్, ఇంటర్ అభ్యర్థులకు ఉపయోగపడేలా ఇంటర్+ ఎంసెట్ ఉమ్మడి ప్రిపరేషన్ గెడైన్స్..
ఎంసెట్‌తో కోర్సులు:
ఎంసెట్(ఎంపీసీ) ర్యాంకు ద్వారా ప్రధానంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. దీనితోపాటు బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీటెక్ (బయోటెక్నాలజీ), బీటెక్ (డెయిరీ టెక్నాలజీ),బీటెక్(ఫుడ్ టెక్నాలజీ), బీఫార్మసీ(బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ), ఫార్మ్-డి(డాక్టర్ ఆఫ్ ఫార్మసీ) తదితర కోర్సుల్లోనూ అడ్మిషన్ పొందొచ్చు.
పరీక్ష స్వరూపం :
ఎంసెట్‌ను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. మూడు గంటల వ్యవధిలో మొత్తం 160 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది.
ఇంజనీరింగ్ స్ట్రీమ్:
సబ్జెకు్ట ప్రశ్నలు
మ్యాథమెటిక్స్ ............... 80
ఫిజిక్స్ ......................... 40
కెమిస్ట్రీ ......................... 40
మొత్తం ........................ 160
మ్యాథమెటిక్స్.. 50శాతం వెయిటేజీ :
ఎంపీసీ విద్యార్థులకు ఇంజనీరింగ్‌కు సంబంధించి జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్ వంటి పలు పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మందికి ఇంజనీరింగ్‌లో ప్రవేశం కల్పించే పరీక్ష ఎంసెట్. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు సమాన వెయిటేజీ ఉంటుంది. కానీ, ఎంసెట్ లో ఒక్క మ్యాథమెటిక్స్‌కే 50 శాతం వెయిటేజీ ఉంది. కాబట్టి విద్యార్థులు ఎంసెట్ కోణంలో మ్యాథ్స్‌పై ఎక్కువ సమయం వెచ్చించాలి. మ్యాథ్స్ సిలబస్ పరంగా ఎన్‌సీఈఆర్‌టీ, స్టేట్ సిలబస్‌కు వ్యత్యాసం లేదు. కాబట్టి జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలకు సాగించిన ప్రిపరేషన్.. అటు ఇంటర్ పరీక్షలకు, ఇటు ఎంసెట్ పరీక్షలకు సైతం ఉపయోగపడుతుంది.
ముఖ్య చాప్టర్లు :

- ఇంటర్ మ్యాథ్స్ సిలబస్‌ను ఆల్‌జీబ్రా, క్యాల్కులస్, జామెట్రీ, వెక్టార్ ఆల్‌జీబ్రా, ట్రిగనోమెట్రీగా విభజించొచ్చు. విద్యార్థులు బోర్డు పరీక్షల కోసం లిమిట్స్ అండ్ కమ్యూనిటీ, డిఫరెన్షియేషన్, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్స్, డిఫెనైట్ ఇంటెగ్రల్, డిఫెరెన్షియెల్ ఈక్వేషన్స్‌పై ఫోకస్ పెట్టాలి. జామెట్రీ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ఇందులో 2డీ, 3డీ జామెట్రీ, లోకస్, ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, స్ట్రెయిట్ లైన్స్, సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, ఎల్లిప్స్, డెరైక్షన్ కొసైన్స్, డెరైక్షన్ రేషియోస్, ప్లేన్ తదితరాలు కీలక అంశాలు.
- ఎంసెట్ పరంగా ఆల్‌జీబ్రాను కీలక చాప్టర్‌గా చెప్పొచ్చు. దీన్నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ఫంక్షన్లు, మ్యాథమెటికల్ ఇండక్షన్, మ్యాట్రిసెస్, కాంప్లెక్స్ నంబర్స్, డిమోవియర్స్ థీరమ్, క్వాట్రాడిక్ ఎక్స్‌ప్రెషన్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, బైనామియల్ థీరమ్ తదితరాలపై ఫోకస్ పెట్టాలి. ట్రిగనోమెట్రి నుంచి 10-15 ప్రశ్నలు అడుగుతున్నారు. ట్రిగనోమెట్రి రేషియోస్ అప్‌టు ట్రాన్స్‌ఫర్మేషన్స్, ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వెర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, హైపర్‌బోలిక్ ఫంక్షన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగల్ టాపిక్స్‌ను సమగ్రంగా అధ్యయనం చేయాలి. వెక్టర్ ఆల్‌జీబ్రా నుంచి ఐదు లేదా ఆరు ప్రశ్నలు వస్తున్నాయి. అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, మెజర్స్ ఆఫ్ డిస్పెర్షన్ అండ్ ప్రాబబిలిటీలో మెజర్స్ ఆఫ్ డిప్రెషన్, ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్‌పై పట్టుసాధించాలి. అభ్యర్థులు సూత్రాలపై పట్టుసాధించాలి. త్రికోణమితిలో సూత్రాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకొని సరైన చోట అన్వయించగలిగేలా ప్రిపరేషన్ సాగించాలి. దీంతోపాటు వేగం, కచ్చితత్వంపై దృష్టిసారించాలి.
ప్రాక్టీస్ ముఖ్యం :
బోర్డు పరీక్షలయినా, ఎంసెట్ అయినా మ్యాథమెటిక్స్‌లో ఎక్కువ మార్కులు సాధించాలంటే.. ప్రాక్టీస్ తప్పనిసరి. షార్ట్‌కట్ నైపుణ్యాలను పెంచుకుంటే.. ఎంసెట్ పరంగా విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. విద్యార్థులు ప్రతి చాప్టర్‌లోని సినాప్సిస్‌పై పట్టు సాధించాలి. ఎంసెట్‌లో 50 నుంచి 60 ప్రశ్నలు నేరుగా అడుగుతారు. కాబట్టి గత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. బోర్డు పరీక్షలకు నెల రోజుల ముందు వరకు ఎంసెట్ ప్రిపరేషన్‌కు రోజూ రెండు నుంచి మూడు గంటల సమయం కేటాయించాలి. -ఎం.ఎన్.రావు, శ్రీ చైతన్య విద్యాసంస్థలు
ఫిజిక్స్ :
ఎంసెట్‌లో అత్యధికంగా హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఈ చాప్టర్ నుంచి దాదాపు పది ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దీని తర్వాత వర్క్ ఎనర్జీ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, లాస్ ఆఫ్ మోషన్, మోషన్ ఇన్ ఎ ప్లేన్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నటిజం చాప్టర్ల నుంచి ఐదు లేదా ఆరు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. గ్రావిటేషన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఆసిలేషన్స్, వేవ్స్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియెల్ అండ్ కెపాసిటెన్స్ చాప్టర్ల నుంచి నాలుగు ప్రశ్నల చొప్పున అడిగే వీలుంది. వీటి తర్వాత వెయిటేజీ పరంగా వరుసగా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్, రే ఆప్టిక్స్, ఆల్టర్నేటింగ్ కరెంట్, వేవ్ ఆప్టిక్స్, మోషన్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, డ్యూయెల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మేటర్, న్యూక్లియై, సెమికండక్టర్ ఎలక్ట్రానిక్స్‌పై దృష్టిపెట్టాలి.
మెకానిక్స్‌పై ఫోకస్ :
ఎంసెట్ ప్రిపరేషన్ పరంగా విద్యార్థులు మెకానిక్స్‌పై ఫోకస్ పెట్టాలి. పరీక్షలో అత్యధిక వెయిటేజీ దీనికే దక్కుతోంది. తర్వాత ఎలక్ట్రిసిటీ, మోడ్రన్ ఫిజిక్స్ పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎంసెట్ మల్టిపుల్ చాయిస్ విధానంలో జరుగుతుంది. బోర్డు పరీక్షలకు సంబంధించి డిస్క్రిప్టివ్ తరహాలో ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది. బోర్డు పరీక్షలకు ప్రిపేరయ్యే సమయంలో బిట్‌లు అడిగేందుకు ఆస్కారం ఉన్న అంశాన్ని గుర్తించి దాన్ని ప్రత్యేకంగా నోట్ చేసుకోవడం లాభిస్తుంది.
-టి.పావని, ఎన్‌ఆర్‌ఐ విద్యాసంస్థలు
కెమిస్ట్రీ :

- ఫిజికల్ కెమిస్ట్రీలో సొల్యూషన్స్ చాప్టర్ నుంచి ప్రధానంగా ప్రాబ్లమ్ బేస్డ్ ప్రశ్నలు అడుగుతున్నారు. దీంతోపాటు రౌల్ట్స్‌లా, ఐడియల్, నాన్ ఐడియల్ సొల్యూషన్స్, సాల్యుబిలిటీ, మొలారిటీ, మొలాలిటీ, వేపర్ ప్రెజర్ ఆఫ్ లిక్విడ్ సొల్యూషన్స్ తదితరాలపై దృష్టిపెట్టాలి. సాలిడ్‌స్టేట్‌లో క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్, ఎక్స్‌రే క్రిస్టలోగ్రఫీ,బ్యాండ్ థియరీ ఆఫ్ మెటల్స్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, ఎలక్ట్రో కెమిస్ట్రీ చాప్టర్స్‌లో నెర్ట్స్ ఈక్వేషన్‌పై ప్రాబ్లమ్ బేస్డ్ ప్రశ్నలు, ఎలక్ట్రాలసిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌పై ఫోకస్ పెట్టాలి.
- IA,IIA,II-IA,IVA గ్రూపు మూలకాలు, బాయిలింగ్, మెల్టింగ్ పాయింట్లు, ఎలక్ట్రోపాజిటివిటీ, ఎలక్ట్రోనెగిటివిటీ, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్, స్టాండర్డ్ రిడక్షన్, పొటెన్షియల్ వాల్యూమ్ టాపిక్స్‌పై దృష్టిపెట్టాలి. II-IA గ్రూపులో బోరాక్స్, డైబోరేన్ స్ట్రక్చర్, ప్రిపరేషన్, ప్రాపర్టీస్, IVA గ్రూపులో డైమండ్, రాఫైట్ స్ట్రక్చర్లు, సిలికాన్ల గురించి క్షుణ్నంగా చదవాలి. వీటితోపాటు డీ, ఎఫ్-బ్లాక్ ఎలిమెంట్లు, స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ, వెస్పర్ థియరీ తదితరాలపై ఫోకస్ పెట్టాలి.
- ఆర్గానిక్ కెమిస్ట్రీని జనరల్, హైడ్రోకార్బన్లు, హాలో కాంపౌండ్లుగా విభజించుకొని చదవాలి. ఇందులో హైడ్రోకార్బన్లు, ఆల్కీన్లు, ఆల్కైన్లు, హోమోజినైజేషన్, రియాక్షన్ విత్ బేయర్స్ రియేజెంట్, హాలోజన్, ఎస్‌ఎల్ మెకానిజమ్స్, యాసిడ్ స్ట్రెంత్ ఆఫ్ ఫీనాల్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, అమైన్స్‌పై దృష్టిపెట్టాలి. పరీక్ష సమయం దగ్గరపడుతుందనగా బయోమాలిక్యుల్స్, గ్లూకోస్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ స్ట్రక్చర్లు, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఎగ్జాంపుల్స్‌పై దృష్టిపెట్టడం లాభిస్తుంది.
- ఎంసెట్ పరంగా కెమిస్ట్రీని ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీలుగా విభజించుకొని చదవాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీని ఎంత బాగా ప్రిపేరైతే అంత మంచి ర్యాంకు వస్తుంది. కాబట్టి దానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఇనార్గానిక్ తర్వాత వెయిటేజీ పరంగా వరుసగా ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీలు నిలుస్తాయి. కెమిస్ట్రీ అంటే సహజంగా చాలామందికి తెలియని భయం ఉంటుంది. కాని ఆ భావనను పక్కనబెట్టి ప్రిపేరైతే కెమిస్ట్రీలోనూ మంచి మార్కులు పొందొచ్చు.
Published date : 24 Dec 2019 02:54PM