Skip to main content

ఇంజనీరింగ్‌లో కొత్త కోర్సు బ్లాక్ చైన్ టెక్నాలజీ.. విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తి..

ఇంజనీరింగ్‌లో కొత్తగా ప్రవేశ పెట్టిన మరో కోర్సు.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ. సైబర్ నేరాలను అరికట్టడానికి ఆయా వ్యవస్థలపై పనిచేసే నిపుణులు ఎప్పటికప్పుడు నూతన పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ఇందులో భాగంగా వచ్చిందే బ్లాక్‌చైన్ టెక్నాలజీ. ఆర్థికపరమైన లావాదేవీలల్లో పారదర్శకతను పెంచేవిధంగా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ఆన్‌లైన్ ఆధారంగా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. రానున్న కాలంలో బ్లాక్ చైన్ టెక్నాలజీలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.
  • బ్లాక్‌చైన్ టెక్నాలజీ అంటే: బ్లాక్‌చైన్ టెక్నాలజీ అనేది ఒక పట్టిష్టమైన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ. వ్యక్తులు, వ్యవస్థల మధ్య జరిగే ఆర్థిక సహ ఇతర కార్యకలాపాల సమాచారానికి కట్టుదిట్టమైన భద్రను కల్పించే రక్షణ కవచం ఇది. ఎంతటి సైబర్ హ్యాకర్లైనా దొంగలించేందుకు వీలులేకుం డా ఉండే డిస్ట్రిబ్యూటెడ్ నెట్‌వర్క్ ఇది. దీని ద్వారా ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సర్వర్లలో సమాచారం నిక్షిప్తం చేసి.. ఇతరులు దానిని దొంగిలించకుండా భద్రత కల్పిస్తారు.
  • కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్‌లో బ్లాక్‌చైన్ టెక్నాలజీ కోర్సు వ్యవధి నాలుగేళ్లుగా ఉంటుంది. కోర్సులో భాగంగా బ్లాక్‌చైన్‌టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ, బ్లాక్‌చైన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లపై లోతైన అవగాహన కల్పిస్తారు. అలాగే సాలిడిటీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ క్లౌడ్ ప్లాట్‌ఫాం,ఎథెరియం,బిట్ కాయిన్ క్రిప్టోకరెన్సీల గురించి అవగాహన కలిగించే విధంగా కోర్సు ఉంటుంది.
  • జాబ్ ప్రొఫైల్: ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు బ్లాక్‌చైన్ డెవలపర్, బ్లాక్‌చైన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, బ్లాక్‌చైన్ ఎస్‌ఐ పార్టనర్ డెవలప్‌మెంట్ మేనేజర్, బిట్‌కాయిన్ క్రిప్టోకరెన్సీ డెవలపర్, బ్లాక్‌చైన్ ప్రిన్సిపల్ ప్రోగ్రామ్ మేనేజర్, బిజినెస్ అనలిటిక్స్ అసోసియేట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.
  • ఉద్యోగాలు: ఈ కోర్సు పూర్తిచేసిన వారు ఐబీఎం, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్, వీసా వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు.
  • వేతనాలు: బ్లాక్‌చైన్ నిపుణులకు ప్రారంభంలో వార్షిక వేతనం రూ.5 లక్షల వరకు ఉంటుంది. అనుభవం, నైపుణ్యం ఆధారంగా ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి.
ఇంకా చదవండి:part 3: ప్రపంచాన్నే కుగ్రామంగా మార్చిన ఇంటర్నెట్.. ఉద్యోగావ‌కాశాలు అందుకునేలా ఇంజనీరింగ్‌లో కొత్త కోర్సు ప్రారంభం..!
Published date : 17 Nov 2020 04:37PM

Photo Stories