ఇకపై లా యూనివర్సిటీలకు..న్యాక్ గుర్తింపు తప్పనిసరి..
హెచ్‌ఈసీఐ నుంచి లీగల్ ఎడ్యుకేషన్‌ను మినహాయించడం వల్ల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యాకు న్యాయ విద్యకు సంబంధించి పూర్తి పర్యవేక్షణ, నియం త్రణ అధికారాలు కల్పించినట్లు కాదని పలువురు పేర్కొంటు న్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. న్యాయ శాస్త్రంలో డిగ్రీ తీసుకున్న తర్వాత న్యాయవాద వృత్తికి సంబంధించిన అంశాలు, నిబంధనలపైనే దృష్టిపెట్టాలంటున్నారు. ఇప్పటివరకు యూజీసీ పర్యవే క్షణలోనే కొనసాగుతున్న లీగల్ ఎడ్యుకేషన్‌ను బీసీఐ పరిధిలోకి తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విదేశీ ఎల్‌ఎల్‌ఎం..
విదేశాల్లో ఏడాది వ్యవధిలో ఉండే ఎల్‌ఎల్‌ఎం కోర్సులు.. దేశంలోని రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు తత్సమానం కావని కూడా బీసీఐ పేర్కొంది. దీంతో ఎల్‌ఎల్‌ఎంను ఏడాది వ్యవధిలోనే పూర్తి చేయొచ్చనే ఉద్దేశంతో విదేశాల్లో చదువుకున్న వారు బీసీఐ తాజా నిర్ణయంతో నిరాశకు గురవుతున్నారు.
ఇంకా చదవండి: part 5: ఈ కోర్సుల రెండేళ్లు అయితే.. ప్రయోజనాలు, ప్రతికూలతలు ఇలా..