Skip to main content

ఈ విధానం ద్వారా స్థాయికి అనుగుణంగా సర్టిఫికెట్..

అకడమిక్ క్రెడిట్ బ్యాంక్ విధానం ద్వారా విద్యార్థులు తాము ఏదైనా ఒక కోర్సులో చేరి.. దాన్ని పూర్తి చేసుకున్న స్థాయికి అనుగుణంగా సర్టిఫికెట్ పొందొచ్చు.

జాతీయ విద్యా విధానం-2020లో ఉన్నత విద్యను 10+2+4 విధానంలో అందించాలని.. బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను నాలుగేళ్ల వ్యవధిలో నిర్వహించాలని పేర్కొన్న విషయం తెలిసిందే. విద్యార్థుల అవసరాలు, ఆసక్తి అనుగుణంగా ఎర్లీ ఎగ్జిట్‌కు కూడా అవకాశం కల్పించాలని సిఫార్సు చేశారు. ఇలాంటి సందర్భంలో విద్యార్థులు ఏ సంవత్సరంలో కోర్సు మానేశారో.. ఆ వ్యవధికి అనుగుణంగా సర్టిఫికెట్లు అందించనున్నారు. డిగ్రీలో చేరిన ఏడాది తర్వాత మానేస్తే.. సర్టిఫికేషన్.. రెండేళ్ల తర్వాత మానేస్తే అడ్వాన్స్‌డ్ డిగ్రీ.. మూడేళ్ల తర్వాత మానేస్తే బ్యాచిలర్ డిగ్రీ..నాలుగేళ్ల తర్వాత మానేస్తే రీసెర్చ్ సర్టిఫికెట్లు ఇవ్వనున్నారు.

బ్యాచిలర్ ఆఫ్ లిబరల్ ఎడ్యుకేషన్..
అకడమిక్ క్రెడిట్ బ్యాంక్ విధానంలో విద్యార్థులకు లభించనున్న మరో ప్రయోజనం.. బ్యాచిలర్ ఆఫ్ లిబరల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్‌ను పొందే అవకాశం. ఈ విధానంలో విద్యార్థులు తమ డొమైన్‌తో సంబంధం లేకుండా.. తమకు ఆసక్తి ఉన్న కోర్సులను ఎంచుకోవచ్చు. నిర్దిష్ట క్రెడిట్స్‌ను సొంతం చేసుకొని.. సంబంధిత డిగ్రీ సర్టిఫికెట్ పొందేందుకు ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో విద్యార్థులకు బ్యాచిలర్ ఆఫ్ లిబరల్ ఎడ్యుకేషన్ పేరిట సదరు యూనివర్సిటీ డిగ్రీని అందిస్తుంది.


ఇంకా చదవండి: part 6: అకడమిక్ క్రెడిట్ బ్యాంక్ ప్రకారం.. క్రెడిట్స్‌కి గరిష్టంగా ఎన్నెళ్లా వ్యాలిడిటీ ఉంటుందో తెలుసా?

Published date : 17 Feb 2021 02:02PM

Photo Stories