ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైతే ఇంటర్ నుంచి పీజీ వరకూ...చివరి తేదీ ఇదే
Sakshi Education
పదోతరగతి చదువుతున్న విద్యార్థులంతా నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్
(ఎన్‌టీఎస్‌ఈ)ను ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఇందులో ప్రతిభ చూపడం ద్వారా ఇంటర్ నుంచి పీజీ వరకూ.. స్కాలర్‌షిప్‌ను అందుకునే అవకాశం ఉంటుంది.
అందుకే ఏటా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) నిర్వహించే ఎన్‌టీఎస్‌ఈ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఎన్‌టీఎస్‌ఈ ప్రకటన వెలువడిన నేపథ్యంలో.. స్కాలర్‌షిప్స్ వివరాలు, అర్హతలు, దరఖాస్తు, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకుందాం...
దేశవ్యాప్తంగా మొత్తం స్కాలర్‌షిప్‌లు: 2000
తెలుగు రాష్ట్రాల్లో స్కాలర్‌షిప్‌ల సంఖ్య:ఆంధ్రప్రదేశ్: 263; తెలంగాణ: 216.
-ఈ సంఖ్యను ప్రతి మూడేళ్లకోసారి రివైజ్ చేస్తారు.
ఎన్‌టీఎస్‌ఈ ఎంపిక ప్రక్రియలో ప్రతిభ చూపిన వారికి స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఇంటర్, డిగ్రీ, పీజీ, డాక్టోరల్ స్థాయి వరకూ.. స్కాలర్‌షిప్ పొందొచ్చు. ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరిన వారికీ స్కాలర్‌షిప్‌లు లభిస్తాయి. ఎన్‌టీఎస్‌ఈ స్కాలర్‌షిప్స్‌తో విద్యార్థులకు ఆర్థిక చేయూతతోపాటు మరిన్ని ఉపయోగాలు ఉంటాయి.
ఉపకార వేతనం :
ఇంటర్మీడియెట్ విద్యార్థులకు నెలకు రూ.1250; అలాగే డిగ్రీ, పీజీ విద్యార్థులకు నెలకు రూ.2000 ఉపకార వేతనం లభిస్తుంది. అదే విధంగా పీహెచ్‌డీలో చేరిన విద్యార్థులకు యూజీసీ నిబంధనలకు మేరకు స్కాలర్‌షిప్ అందుతుంది.
అదనపు ప్రయోజనాలు..

- ఎన్‌టీఎస్‌ఈకి ప్రిపేరవడం ద్వారా ఇతర అకడెమిక్, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఎన్‌టీఎస్‌ఈ స్కాలర్స్ జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్ తదితర పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధిస్తున్నారు.
- ఎన్‌టీఎస్‌ఈ స్కాలర్స్‌కు దేశంలోని టాప్ కాలేజీలు ఆహ్వానం పలుకుతున్నాయి. పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఎన్‌టీఎస్‌ఈ స్కాలర్స్ కోసం సీట్లను రిజర్వ్ చేస్తున్నాయి.
- స్టడీ అబ్రాడ్ పరంగా విద్యార్థులకు ఇది అదనపు అర్హతగా ఉపయోగపడుతుంది.
- ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాల పరంగా ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంటుంది.
ఎంపిక విధానం :
ఎన్‌టీఎస్‌ఈ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. తొలి దశలో సంబంధిత రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతాలు పరీక్ష నిర్వహిస్తాయి. తర్వాతి దశలో ఎన్‌సీఈఆర్‌టీ జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహిస్తుంది.
రాష్ట్ర స్థాయిలో...
రాష్ట్రాలు తమ రాష్ట్ర పరిధిలో స్టేట్ లెవెల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్‌ను జరుపుతాయి. అందులో ప్రతిభ చూపిన వారిని ఎన్‌సీఈఆర్‌టీ నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష(ఎన్‌టీఎస్‌ఈ)కు సిఫార్సు చేస్తారు. పరీక్షకు సంబంధించిన అర్హతలను ఆయా రాష్ట్రాలు నిర్ణయించుకొనే వెసులుబాటు ఉంది. రాష్ట్ర స్థాయి పరీక్షను ఏటా నవంబరు మొదటి ఆదివారం నిర్వహిస్తారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ స్కూల్స్‌తోపాటు గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులంతా రాష్ట్ర స్థాయి పరీక్షకు హాజరవ్వొచ్చు. పరీక్షలకు సంబంధించిన ప్రకటన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్, దినపత్రికల్లో వస్తుంది. అందుకు అనుగుణంగా విద్యార్థులు దరఖాస్తు ఫారం నింపి.. సంబంధిత అధికారికి(ఎస్‌ఎల్‌వో) పంపాల్సి ఉంటుంది.
పరీక్ష విధానం :
రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో జరిగే.. రెండు దశల పరీక్ష విధానం ఒకే తరహాలో ఉంటుంది. ప్రతి దశలో జరిగే పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే మొదటి దశలో.. పేపర్–1లో తొలుత మెంటల్ ఎబిలిటీ టెస్టు(మ్యాట్)ను 100 ప్రశ్నలు– 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. అదే విధంగా స్కాలస్టిక్ అప్టిట్యూడ్ టెస్టు(శాట్)ను రెండో పేపర్‌గా నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం 100 మార్కులకు– 100 ప్రశ్నలు అడుగుతారు. సైన్స్ నుంచి 40, మ్యాథమెటిక్స్ నుంచి 20, సోషల్ సైన్స్ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం రెండు గంటలు. ప్రశ్నపత్రాలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. n జాతీయ స్థాయిలో జరిపే రెండో దశ పరీక్షలోనూ పేపర్1, పేపర్2.. మొదటి దశ పేపర్ల తరహాలోనే ఉంటాయి. కాని ప్రశ్నల క్లిష్టత స్థాయి అధికంగా ఉంటుంది. ప్రశ్న పత్రాలు ఇంగ్లిష్/ హిందీ/ తెలుగు తదితర భాషల్లో ఉంటాయి. రాష్ట్ర స్థాయి పరీక్షలో ఎంపికైన వారికి జూన్ 13, 2021న జాతీయ స్థాయిలో పరీక్ష ఉంటుంది.
నిర్దిష్ట సిలబస్ లేదు :
పరీక్షకు సంబంధించి నిర్దిష్ట సిలబస్ అంటూ లేదు. పరీక్ష తొమ్మిది, పదోతరగతి స్థాయిల్లో ఉంటుంది. మ్యాట్, శాట్‌లకు సంబంధించి మాదిరి ప్రశ్నపత్రాలు ఎన్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
కనీస మార్కులు..
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 32 శాతం, జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 40 శాతం మార్కులను కనీస ఉత్తీర్ణతగా నిర్ణయించారు. రెండు పేపర్లలో వేర్వేరుగా అర్హత సాధించిన వారినే పరిగణనలోకి తీసుకుంటారు. రెండు పేపర్లలో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ లేదు. రాష్ట్ర స్థాయి పరీక్ష ఫలితాలను జనవరి/ఫిబ్రవరిల్లో వెల్లడిస్తారు.
ముఖ్య సమాచారం..
ఎన్‌టీఎస్‌ఈ–ఏపీ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: నవంబరు 6, 2020
రాష్ట్ర స్థాయి పరీక్ష తేది: డిసెంబరు 13.
ఎన్‌టీఎస్‌ఈ– తెలంగాణ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: నవంబరు 12
వెబ్‌సైట్‌లు: ఆంధ్రప్రదేశ్: www.bse.ap.gov.in/NTSE.aspx
తెలంగాణ: https://bse.telan-gana.gov.in/NTSE.aspx

Published date : 29 Oct 2020 12:53PM