Skip to main content

ఈ నెల 29న ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ -2020 ఎగ్జామ్.. సమాచారం ఇదిగో..

ఆతిథ్య రంగంలో స్థిరపడాలనుకొనేవారికి బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు చక్కటి మార్గమని చెప్పొచ్చు.

 ఈ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ జారుుంట్ ఎంట్రెన్‌‌స ఎగ్జామినేషన్(ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ)- 2020 ఈ నెల 29న జరగనుంది. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా ప్రిపరేషన్, ఎగ్జామ్ డే టిప్స్‌తోపాటు కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుందాం..

 హోటల్ మేనేజ్‌మెంట్ జేఈఈ..

 దేశవ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (ఐహెచ్‌ఎం) క్యాంపస్‌ల్లో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశానికి జాతీయ స్థారుులో నిర్వహించే పరీక్షే ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ. 10+2/ఇంటర్ అర్హతతో ఈ పరీక్షకు హాజరుకావచ్చు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఐహెచ్‌ఎంలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఇన్‌స్టిట్యూట్స్‌లో హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తారుు. 

 
ఐహెచ్‌ఎం..

ఆతిథ్య రంగానికి సుశిక్షితులైన మానవ వనరులను అందించేందుకు కేంద్ర పర్యాటక శాఖ.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లను(ఐహెచ్‌ఎం) ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 21 ఐహెచ్‌ఎంలు ఉండగా, వాటిలో దాదాపు 6,395 సీట్లున్నాయి. న్యూఢిల్లో పీఎస్‌యూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐహెచ్‌ఎంలో 90 సీట్లున్నాయి. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో 25, ప్రైవేటుసెక్టార్‌లో 24 హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. కేంద్రం ఆధీనంలోని ఐహెచ్‌ఎం క్యాంపస్‌ల్లోని సీట్లను కామన్ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తారు. కాగా, మిగతా ఇన్‌స్టిట్యూట్ లు మాత్రం ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈలో ర్యాంకు ఆధారంగా వేర్వేరుగా కౌన్సెలింగ్ జరిపి.. ప్రవేశాలను ఖరారు చేస్తాయి. 

 పరీక్ష స్వరూపం..

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈని ఐదు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు ఉంటారుు. తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.

సాయుధ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేది ఇదే..

విభాగం                                                                        ప్రశ్నలు

 న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్             30

 రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్                                        30

 జనరల్ నాలెడ్‌‌జ అండ్ కరెంట్ అఫైర్స్                               30

 ఇంగ్లిష్ లాంగ్వేజ్                                                              60

 ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్                                           50

 మొత్తం ప్రశ్నలు                                                          200

ప్రిపరేషన్..

  •  మ్యాథ్స్‌లో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన మాదిరి ప్రశ్నలను సాధించాలి.
  •  మ్యాథమెటికల్ ఆపరేషన్‌‌స, కోడింగ్-డీకోడింగ్, నంబర్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, శాతాలు, లాభనష్టాలు, నంబర్ సిస్టమ్, సగటు, కాలం-పని, సాధారణ వడ్డీ, బారు వడ్డీ, వేగం, దూరం, నిష్పత్తులు, జామెట్రీల్లోని సూత్రాలను క్విక్ రివ్యూ చేయాలి.
  •  గాఫ్‌లు, పైచార్ట్‌లు, ఫ్లోచార్ట్‌లను ప్రాక్టీస్ చేయాలి.
  •  సామాజిక, సమకాలీన పరిణామాలపై అవగాహనను పరీక్షించుకోవాలి. హైస్కూల్ స్థాయిలో చరిత్ర, రాజ్యాంగం, జాగ్రఫీ, ఎకనామిక్స్ ముఖ్యాంశాలను మరోసారి పునశ్చరణ చేయాలి. 
  •  కీలక యుద్ధాలు-పర్యవసనాలు,స్వాతంత్య్రోద్యమంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. కరెంట్ అఫైర్స్‌లో ముఖ్య సదస్సులు, సమావేశాలు, వార్తల్లోని వ్యక్తులు, తాజా అంతర్జాతీయ అంశాల(కరోనా సమాచారం)పై దృష్టిసారించాలి. 
  •  ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో టెన్సెస్, ప్రిపోజిషన్‌‌స, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, యాంటానిమ్స్, సినానిమ్స్, సెంటెన్‌‌స ఫార్మేషన్, స్పాటింగ్ ద ఎర్రర్స్, సీక్వెన్‌‌స ఆఫ్ వర్డ్స్‌పై పట్టుతో ఎక్కువ మార్కులు సాధించొచ్చు.

 ఎగ్జామ్ డే టిప్స్..

  •  పరీక్ష మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందు సెంటర్‌కు చేరుకునే ప్రయత్నం చేయాలి. 
  •  పరీక్ష హాల్‌లోకి ప్రవేశించాక.. ఇచ్చిన ప్రశ్నపత్రాన్ని ఆసాంతం చదవాలి. తద్వారా పరీక్ష క్లిష్టతపై అవగాహనకు వస్తుంది.
  •  తొలుత తేలిక ప్రశ్నలతో మొదలుపెట్టి అనంతరం మధ్యస్థ, కఠిన ప్రశ్నలను సాధించాలి. 
  •  హా    నిర్దేశించిన సమయం కంటే అరగంట ముందు పరీక్షను ముగించేలా వ్యవహరించాలి. ఫలితంగా చివరి అరగంట సమాధానాలను చెక్ చేసుకోవచ్చు. 

 సిబీఎస్‌ఈ సిలబస్ కుదింపు.. విద్యార్థుల భవిష్యత్తుకు అనుకూలమా.. ప్రతికూలమా..?! 

 
ఉపాధి వేదికలు, అవకాశాలు..
  •  బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును పూర్తిచేసిన అభ్యర్థులకు అవకాశాలు అనేకం. ముఖ్యంగా..
  • హోటల్స్, అనుబంధ విభాగాలు 
  • కిచెన్, హౌజ్ కీపింగ్ మేనేజ్‌మెంట్ 
  • గెస్ట్/కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ 
  • ఇండియన్ నేవీ హాస్పిటాలిటీ సర్వీసెస్ 
  • హాస్పిటల్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ కేటరింగ్ 
  • ఫ్యాకల్టీ ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్/ఫుడ్ క్రాఫ్ట్స్ మేనేజ్‌మెంట్ 
  • మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ 
  • రైల్వే హాస్పిటాలిటీ అండ్ కేటరింగ్ సర్వీసెస్ 
  • స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్స్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. స్వయం ఉపాధి దిశగా కూడా ప్రయత్నించొచ్చు. 

 ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ  2020 ముఖ్య సమాచారం..

  •   పరీక్షతో ప్రయోజనం: బీఎస్సీ(హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్)లో ప్రవేశం
  •   ఇన్‌స్టిట్యూట్స్: 21 సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, 25 స్టేట్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, 01 పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్, 24 ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్‌లలో ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ 2020 స్కోర్‌తో ప్రవేశం లభిస్తుంది. 
  • పరీక్ష నిర్వహణ సంస్థ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ).
  • ఎన్‌సీహెచ్‌ంఎ జేఈఈ 2020 పరీక్ష తేది: 29.08.2020
  • పరీక్ష విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.
  • పరీక్ష సమయం: మూడు గంటలు(మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు..
  • పరీక్ష రాసేందుకు అర్హత: 10+2/ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
  • వయసు: 01.07.2020 నాటికి 25ఏళ్ల లోపు ఉండాలి. 
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్/సికింద్రాబాద్/రంగారెడ్డి, కరీంనగర్. 
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://nchmjee.nta.nic.in
Published date : 26 Aug 2020 03:58PM

Photo Stories