హాస్పిటాలిటీ కోర్సులు చదవాలనుకుంటే.. ఉండాల్సిన అర్హతలివే..
2021 జూలై 1 నాటికి జనరల్, ఓబీసీ విద్యార్థులు 25 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 28ఏళ్ల వయసు ఉండాలి. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్న వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
బీఎస్సీ-హెచ్‌హెచ్‌ఏలో ప్రవేశం..
ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈలో అభ్యర్థులు సాధించిన ర్యాంక్ ఆధారంగా.. ఆయా విద్యాసంస్థల్లో మూడేళ్ల ‘బీఎస్సీ-హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్’(బీఎస్సీ-హెచ్‌హెచ్‌ఏ) కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఇందులో అభ్యర్థుల ఆసక్తిని బట్టి ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బేవరేజెస్ సర్వీస్, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్ అండ్ హౌస్ కీపింగ్ వంటి విభాగాలు ఎంచుకోవచ్చు. వీటితోపాటు హోటల్ అకౌంటెన్సీ, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఫెసిలిటీ ప్లానింగ్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్, టూరిజం మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్ వంటి స్పెషలైజేషన్స్ కూడా పూర్తి చేయవచ్చు.
ఇంకా చదవండి: part 3: ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ ఎంట్రన్స్ పరీక్ష విధానం ఇలా..