హాస్పిటాలిటీ కోర్సుల కోసం ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ ఎంట్రన్స్ ప్రిపరేషన్ సాగించండిలా..
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాంపస్‌ల్లో ఈ కోర్సులో ప్రవేశాలకు వీలు కల్పించే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ) 2021కు నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ 2021 ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం...
న్యూవురికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్..
మ్యాథ్స్‌లో ప్రాథమిక నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అభ్యర్థులు హైస్కూల్ స్థాయిలోని మ్యాథమెటిక్స్‌పై పట్టు సాధించాలి. ప్రధానంగా శాతాలు, లాభ-నష్టాలు, నంబర్ సిస్టమ్, సగటు, కాలం-పని, సాధారణ వడ్డీ, బారు వడ్డీ, కాలం-వేగం-దూరం, నిష్పత్తులు, జామెట్రీ తదితర అంశాలను ప్రిపేరవ్వాలి. అనలిటికల్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి నిర్దిష్టంగా ఒక డేటాను విశ్లేషించగలిగే సామర్థ్యం, డేటాలోని సమాచారాన్ని క్రోడీకరించి ఇచ్చిన ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగే నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి. దీనికోసం గ్రాఫ్‌లు, పైచార్ట్‌లు, ఫ్లోచార్ట్‌లను రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తుండాలి.
రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్..
ఈ విభాగంలో అభ్యర్థుల్లోని సునిశిత పరిశీలన, తార్కిక విశ్లేషణా నైపుణ్యాలను పరీక్షిస్తారు. కాబట్టి అభ్యర్థులు మ్యాథమెటికల్ ఆపరేషన్స్, కోడింగ్-డీకోడింగ్, నంబర్ సిరీస్, బ్లడ్ రిలేషన్ తదితరాలపై పట్టు సాధించాలి. ఇందుకోసం ప్రిపరేషన్ సమయంలో ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అదేవిధంగా డేటా సఫీషియన్సీ, వెన్ డయాగ్రమ్స్‌ను ప్రాక్టీస్ చే యాలి.
జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్..
ఈ విభాగంలో అభ్యర్థులకు సామాజిక అంశాలు, సమకాలీన పరిణామాలపై ఉన్న అవగాహనను పరీక్షిస్తారు. ఇందులో ఎక్కువ మార్కులు పొందాలంటే.. హైస్కూల్ స్థాయిలోని చరిత్ర, రాజ్యాంగం, జాగ్రఫీ, ఎకనామిక్స్ పాఠ్యాంశాలను చదవాల్సి ఉంటుంది. హిస్టరీలో కీలక యుద్ధాలు-పర్యవసానాలు, స్వాతంత్య్రోద్యమం తదితరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జాగ్రఫీలో దేశంలోని ముఖ్యమైన ప్రదేశాలు, ఖనిజ వనరులు-అవి లభించే ప్రాంతాలు, నదులు, సరస్సులు, పర్వతాల గురించి అధ్యయనం చేయాలి. కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ఇతర పోటీ పరీక్షల మాదిరిగానే ముఖ్యమైన సదస్సులు, సమావేశాలు, వార్తల్లోని వ్యక్తులు, తాజా జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్..
పరీక్ష పరంగా ఇంగ్లిష్ విభాగం కీలకమైంది. గ్రామర్‌పై పట్టుసాధించడం ద్వారా ఇందులో ఎక్కువ మార్కులు సాధించొచ్చు. టెన్సెస్, ప్రిపోజిషన్స్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, యాంటానిమ్స్, సినానిమ్స్, సెంటెన్స్ ఫార్మేషన్, స్పాటింగ్ ద ఎర్రర్స్, సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్‌పై పట్టు సాధించాలి. దీనికోసం బేసిక్ గ్రామర్ పుస్తకాలను అధ్యయనం చేయడం లాభిస్తుంది. వార్తా పత్రికలు చదవడం, వాటిలోని కొత్త పదాలను తెలుసుకోవడం, ఆయా పదాలను ఉపయోగించే తీరును పరిశీలించాలి.
ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్..
ఇది ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈలో ప్రత్యేకమైన విభాగం. ఇందులో ప్రధానంగా అభ్యర్థికి ఆతిథ్య, పర్యాటక రంగాలపై ఉన్న ఆసక్తి, దృక్పథాలను పరీక్షిస్తారు. వాస్తవ సంఘటన లేదా ఏదైనా అంశాన్నిచ్చి దానిపై స్పందించమనే తరహాలో ప్రశ్నలు అడుగుతారు. ఆయా ప్రశ్నలు అభ్యర్థుల్లో ఎదుటి వారిని మెప్పించే తీరు, సందర్భానికి తగినట్లు వ్యవహరించే శైలిని పరీక్షిస్తాయి.
ఉపయోగపడే పుస్తకాలు..
- అరిహంత్ జనరల్ ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్
- వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ - ఆర్.ఎస్.అగర్వాల్
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- ఆర్.ఎస్.అగర్వాల్
- ఆప్టిట్యూడ్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్: హోటల్ మేనేజ్‌మెంట్-ఆర్.గుప్తా
ముఖ్య సమాచారం..
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేది: 10.05.2021
- పరీక్ష తేది: 12.06.2021
- పరీక్ష విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://nchmjee.nta.nic.in/
ఇంకా చదవండి: part 1: పక్కా కొలువుల సాధించేందుకు ఉపయోగపడే హాస్పిటాలిటీ కోర్సులకు.. ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ 2021 నోటిఫికేషన్ విడుదల..