Skip to main content

గేట్, ఈఎస్‌ఈప్రిలిమ్స్ ఒకేలా.. ప్రిపరేషన్ టిప్స్ తెలుసుకోండిలా..

గేట్, ఈఎస్‌ఈ ప్రిలిమ్స్ పరీక్ష దాదాపు ఒకే విధంగా ఉంటాయి. రెండు పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలోనే నిర్వహిస్తారు. గేట్‌లో కొన్ని స్వల్ప సమాధాన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
  • ఈఎస్‌ఈ ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లలో 500 మార్కులకు జరుగుతుంది. వీటిలో పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ పేపర్. కాగా, పేపర్-2 అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌పై ఉంటుంది. ఈఎస్‌ఈ ప్రిలిమినరీ పరీక్షనే స్టేజ్-1ఎగ్జామ్‌గా కూడా పేర్కొంటారు. మెయిన్‌ను స్టేజ్-2 ఎగ్జామ్‌గా పిలుస్తారు.
  • పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఉండే మెయిన్/స్టేజ్-2 ఎగ్జామ్‌లో అభ్యర్థులు తాము దరఖాస్తులో పేర్కొన్న సబ్జెక్ట్‌పై రెండు పేపర్లకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఒక్కో పేపర్‌కు మూడు వందల మార్కులు చొప్పున మొత్తం ఆరు వందల మార్కులకు మెయిన్/స్టేజ్-2 పరీక్ష జరుగుతుంది.
  • మెయిన్/స్టేజ్-2 పరీక్షలో నిర్దిష్ట కటాఫ్ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు స్టేజ్-3 పేరిట 200 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు.
  • ఇందులోనూ విజయం సాధించి తుది జాబితాలో నిలిస్తే ఇండియన్ రైల్వేస్, టెలికం, డిఫెన్స్, బోర్డర్ రోడ్ ఇంజనీరింగ్ సర్వీసెస్, సెంట్రల్ వాటర్ వర్క్స్, డిఫెన్స్ సర్వీసెస్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తదితర పదికి పైగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఎ-లెవల్ హోదాతో ఇంజనీర్ ఉద్యోగం ఖరారవుతుంది.
ఇంకా చదవండి: part 3: గేట్, ఈఎస్‌ఈ పరీక్ష ప్రిపరేషన్ ఎలా ఉండాలి?
Published date : 19 Nov 2020 05:13PM

Photo Stories