గేట్-2021కి 8 లక్షల మందికి పైగా హాజరు..కటాఫ్ పెరగనుందా?!
అంతేకాకుండా మహారత్న, నవరత్న, మినీరత్న హోదాలు పొందిన పబ్లిక్ సెక్టార్ యూనిట్స్(పీఎస్‌యూ)లోనూ.. ఎంట్రీ లెవల్‌లో.. ఇంజనీర్ ట్రైనీ, ట్రైనీ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌ల భర్తీ కూడా గేట్ స్కోరే ఆధారంగానే జరుగుతోంది! తాజాగా.. గేట్-2021 పరీక్షలు ముగిశాయి. ఇప్పుడు పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో మెదిలే సందేహం.. ఐఐటీల్లో ప్రవేశానికి కటాఫ్ ఎంత ఉండొచ్చు?! పీఎస్‌యూలకు ఎంత స్కోర్ ఉంటే ఇంటర్వ్యూ కాల్ వస్తుంది?! ఈ నేపథ్యంలో.. గేట్-2021 విశ్లేషణ, కటాఫ్స్, మలిదశలో ఐఐటీలు, పీఎస్‌యూలు అనుసరించే విధానాలపై ప్రత్యేక కథనం..
గేట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోదు. మెరుగైన స్కోర్ ఉంటేనే ఐఐటీల్లో ఎంటెక్‌లో అడ్మిషన్ లభిస్తుంది. పీఎస్‌యూ జాబ్స్‌కు ఇంటర్వ్యూ కాల్ రావాలన్నా.. బెస్ట్ స్కోర్ సొంతం చేసుకోవాల్సిందే! ఐఐటీల్లో ఎంటెక్, పీఎస్‌యూల్లో జాబ్స్ కోసం మలిదశ ఎంపిక ప్రక్రియలో భాగంగా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో నెగ్గాల్సి ఉంటుంది.
8 లక్షల మందికిపైగా హాజరు..
గేట్-2021లో గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం పరీక్షకు నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరిగింది. మొత్తం 27 పేపర్లలో ఫిబ్రవరి (ఈ నెల) 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పలు స్లాట్లలో జరిగిన గేట్ పరీక్షకు 8,82,684 మంది హాజరయ్యారు. ఈ సంఖ్య గత ఏడాదితో పోల్చితే 20వేలకు పైగానే ఉంది. ఈ సంవత్సరం మహిళా అభ్యర్థుల సంఖ్య సైతం పెరగడం మరో విశేషం. మొత్తం అభ్యర్థుల్లో మహిళల సంఖ్య 2,88,379గా నమోదైంది. గతేడాది కంటే ఈ సంఖ్య పది వేలకు పైగానే ఉంది. అదే విధంగా ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టిన హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్‌కు 14,196 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇంకా చదవండి: part 2: గేట్‌లో ఉండే వాటిలో టాప్-5 పేపర్లు ఇవే.. వీటిలోనే అత్యధికంగా హాజరయిన అభ్యర్థులు..