Skip to main content

గేట్-2020 ఎగ్జామ్ రివ్యూ...

దేశవ్యాప్తంగా లక్షల మంది హాజరైన గేట్-2020 పరీక్ష ముగిసింది. ఇప్పుడు పరీక్షకు హాజరైన అభ్యర్థులంతా పేపర్ విశ్లేషణ, కటాఫ్ మార్కుల గురించి చర్చించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో.. ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఉపయోగపడేలా గేట్ పేపర్ల విశ్లేషణ..
 
 మెకానికల్.. పెరిగిన ఎంసీక్యూలు :

 ఈ పేపర్‌ను ఫిబ్రవరి 1న రెండు షిప్టు(స్లాట్)ల్లో నిర్వహించారు. ఎప్పట్లానేప్రశ్నప్రతంలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్(ఎంసీక్యూలు), న్యూమరికల్ ఆన్సర్ టైప్(ఎన్‌ఏటీ) ప్రశ్నలు అడిగారు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం ఎంసీక్యూల సంఖ్య పెరిగింది. ఒక మార్కు ప్రశ్నలు సులభం నుంచి మధ్యస్థంగా ఉండగా.. రెండు మార్కుల ప్రశ్నలు మధ్యస్థం నుంచి కఠినంగా ఉన్నాయి. ఇంజనీరింగ్ మ్యాథ్స్ అండ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు సరళంగా,తక్కువ వ్యవధిలో సాధించేవిగా ఉన్నాయి. రెండు స్లాట్స్‌ను పరిశీలిస్తే మ్యాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంజనీరింగ్ మ్యాథ్స్, థర్మోడైనమిక్స్ అండ్ అప్లికేషన్స్‌కు ఎక్కువ వెయిటేజీ దక్కింది. రెండో స్లాట్‌లో ప్రశ్నలు ఒకింత కాన్సెప్ట్యువల్‌గా ఉన్నాయి. రెండు మార్కుల ప్రశ్నలు పెద్దవిగా అడిగారు.
 
 ఈసీఈ.. అప్టిట్యూడ్ సులభం :
 ఈసీఈలో గతేడాదితో పోల్చితే ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నాయి. ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లిష్ విభాగం సులభంగా ఉంది. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఎంసీక్యూ, ఎన్‌ఏటీ ప్రశ్నలు దాదాపు సరిసమానంగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఎంసీక్యూల సంఖ్య ఎక్కువగా ఉంది. నెట్‌వర్క్స్‌లో సిద్ధాంతాలపై ప్రశ్నలు అడిగారు. 2-పోర్ట్ నెట్‌వర్క్స్, ఏసీ అనాలసిస్ అండ్ స్టేట్ ఈక్వేషన్స్, ఈడీసీ ప్రశ్నలన్నీ ఎంవోఎస్‌ఎఫ్‌ఈటీ, ఆప్టో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్ నుంచి వచ్చాయి. కంట్రోల్ సిస్టమ్స్‌లో ఆర్‌హెచ్ క్రైటీరియన్, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనాలసిస్, టైమ్ రెస్పాన్స్ అనాలసిస్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నుంచి ప్రశ్నలు వచ్చాయి. డిజిటల్, అనలాగ్, కమ్యూనికేషన్స్‌లో కోర్ కాన్సెప్టుల నుంచి ప్రశ్నలు అడిగారు. ఇంజనీరింగ్ మ్యాథ్స్ అండ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు సులభం నుంచి మధ్యస్థంగా ఉన్నాయి. వెయిటేజీ పరంగా జనరల్ ఆప్టిట్యూడ్, అనలాగ్, ఇంజనీరింగ్ మ్యాథ్స్, ఈడీసీలకు ప్రాధాన్యం దక్కింది.
 
 కెమికల్.. ప్రశ్నలు ట్రికీ :

 రెండు సెషన్ల పేపర్లు సులభం నుంచి మధ్యస్థంగా ఉన్నాయి. టెస్టు సిరీస్‌ల్లో ప్రాక్టీస్ చేసిన ప్రశ్నల్లో చాలా వరకు పరీక్షలో వచ్చాయి. పలు ట్రికీ ప్రశ్నలు అడిగారు. ఔట్ ఆఫ్ ది బాక్స్ ప్రశ్నలు 30-40 శాతం. ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్ ప్రశ్నల్లో ఎక్కువ శాతం టెస్టు సిరీస్‌ల నుంచే వచ్చాయి. ఎఫ్‌ఎం అండ్ ఎంవోలో బౌండరీ లేయర్, పాస్కల్స్ లా, పంప్, ఎంట్రీ లెంగ్త్, పవర్ నంబర్స్‌పై ప్రశ్నలు అడిగారు. థర్మోడైనమిక్స్‌లో మెకానికల్ ఈక్విలిబ్రియం, ఎక్స్‌టెంట్ ఆఫ్ రియాక్షన్, క్లాసికల్ థర్మోడైనమిక్స్, ప్యూర్ సబ్‌స్టెన్సెస్ నుంచి ప్రశ్నలు వచ్చాయి. పీడీఈ, పీడీసీ, మాస్ ట్రాన్స్‌ఫరెన్స్, కెమికల్ టెక్నాలజీపై ప్రశ్నలు ఎదురయ్యాయి. మాస్ ట్రాన్స్‌ఫరెన్స్ ప్రశ్నలు గతేడాది కంటే సులభంగా ఉన్నట్లు చెబుతున్నారు.
Published date : 15 Feb 2020 03:17PM

Photo Stories