Skip to main content

చదువు పూర్తి చేసుకున్న వారిలో 18 శాతం మందికి మాత్రమే ఉన్న కోడింగ్ స్కిల్స్.. నైపుణ్యాలు పెంచుకునే మార్గమిదిగో..

కోడింగ్ నైపుణ్యాలున్న వారి కోసం కంపెనీల అన్వేషణ! కోడింగ్ స్కిల్స్ ఉంటే.. రెడ్ కార్పెట్ వెల్‌కమ్ పలుకుతున్న సంస్థలు! ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్న మాటలివి!!

వాస్తవానికి కోడింగ్ అనేది .. సాఫ్ట్‌వేర్,ఐటీ రంగంలో.. కొలువుకు కీలకం! కాని కోర్సులు పూర్తి చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య లక్షల్లో ఉంటే.. కోడింగ్ స్కిల్స్ సొంతం చేసుకునేది చాలా తక్కువ మంది మాత్రమే! దాంతో జాబ్ మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్టు కోడర్‌‌స అందుబాటులో లేరని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం డిమాండ్ పెరుగుతున్న కోడింగ్ స్కిల్స్.. లభిస్తున్న ఉద్యోగ అవకాశాలు.. కోడింగ్ నైపుణ్యాలు పెంచుకోవడానికి అందుబాటులో ఉన్న మార్గాల గురించి తెలుసుకుందాం...

ఇండస్ట్రీ 4.0లో కోడింగ్ స్కిల్స్ కీలకంగా మారుతున్నాయి. ఈ నైపుణ్యాలున్న మానవ వనరులను నియమించుకునేందుకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ.. మన టెక్నికల్ కోర్సుల విద్యార్థుల్లో 15శాతం నుంచి 18శాతం మందిలోనే కోడింగ్ నైపుణ్యాలు ఉంటున్నట్లు వివిధ సర్వేలు పేర్కొంటున్నాయి. విద్యార్థులకు కోడింగ్ ప్రాధాన్యం, అవసరం తెలిసినా.. వాటిని అందిపుచ్చుకునే మార్గాలు తెలియక అవకాశాలకు దూరమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కోడింగ్ అంటే..
కోడింగ్ అంటే.. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను వినియోగిస్తూ నిర్దిష్టంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి.. మనం కోరుకున్న విధంగా కంప్యూటర్ పనిచేసేలా చూడటమే! సరళమైన భాషలో చెప్పాలంటే.. కోడింగ్ అనేది మనం కంప్యూ టర్‌కు ఇచ్చే ఆదేశాలు (ఇన్‌స్ట్రక్షన్స్)! కోడింగ్ ద్వారా కంప్యూటర్లు మనం కోరుకున్న విధులు నిర్వర్తించేలా చేస్తారు. ప్రస్తుతం కోడింగ్ స్క్రిప్ట్ ఆధారంగా నిర్దిష్టంగా ఒక బ్రౌజర్‌లో లక్షిత వినియోగదారులు, క్లయింట్లకు సులువుగా సేవలందిస్తున్నారు. నేడు అన్ని రంగాల్లోనూ ఐటీ ఆధారిత సేవలు విస్తృతమవుతుండటంతో కోడింగ్ నైపుణ్యాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. సంస్థలు కోడింగ్ నిపుణులకు ఎర్రతివాచీ పరుస్తున్నాయి.

ఇంకా చదవండి: part 2: ఐటీ కొలువుల్లో అధిక శాతం కోడింగ్ ప్రొఫైల్స్‌లోనే..

Published date : 06 Feb 2021 02:50PM

Photo Stories