బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో ‘పీహెచ్‌డీ’...దరఖాస్తు చేయండిలా..
దీన్ని గుర్తించిన ఆలిండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ), అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లు.. సంయుక్తంగా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నాయి. ఇందులో ప్రవేశాల కోసం జనవరి 23న నిర్వహించనున్న రీసెర్చ్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్టు(ఆర్‌మ్యాట్) 2021 దరఖాస్తు గడువును ఏఐఎంఏ తాజాగా ఈనెల(జనవరి) 18 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా ఆర్‌మ్యాట్- 2021 గురించి పూర్తి సమాచారం...
అర్హతలు :
- మేనేజ్‌మెంట్ లేదా అనుబంధ సబ్జెక్టులైన కామర్స్, హ్యుమానిటీస్, సైన్స్, లా, ఇంజనీరింగ్‌ల్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసుండాలి లేదా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన పీజీడీఎం/ పీజీడీఐటీఎం డిగ్రీలను 55శాతం మా ర్కులతో ఉత్తీర్ణులవ్వాలి.
- చార్టెడ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ తదితర ప్రొఫెషనల్ డిగ్రీలను 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూ ట్స్‌లో ఐదేళ్ల టీచింగ్ అనుభవం కలిగిన, మేనేజీ రియల్ స్థాయిలో ఐదేళ్ల పని అనుభవం కలిగిన వారు సైతం ఆర్‌మ్యాట్ దరఖాస్తుకు అర్హులు.
పరీక్ష విధానం :
- ఆర్‌మ్యాట్ ప్రశ్నపత్రం మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ఈ పరీక్ష ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ విధానం(ఐబీటీ)లో జరుగుతుంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రశ్నపత్రంలో రీసెర్చ్ ఫండమెంటల్స్‌అండ్ అటిట్యూడ్, బేసిక్స్‌ఆఫ్ మేనేజ్‌మెంట్ ఉంటాయి.
- ఆర్‌మ్యాట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ప్రవేశాలను ఖరారు చేస్తారు.
సిలబస్ ఇలా..
బేసిక్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో..
- ఫంక్షన్స్ ఆఫ్ మేనేజర్స్ ఇన్ బిజినెస్ ఆర్గనైజేషన్స్
- మీనింగ్ పవర్ అండ్ అథారిటీ
- మేనేజీరియల్ స్కిల్స్ అండ్ లెవల్స్
- ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూ మన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్-రిక్రూట్‌మెంట్
- ఫంక్షన్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్స్
- ట్రైనింగ్ అండ్ అప్రైజల్
- కాన్సెప్ట్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్
8. ఫంక్షన్స్ ఆఫ్ మార్కెటింగ్ మేనేజర్స్
- ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్స్
- బేసిక్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్
- ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజర్స్
- గ్లోబలైజేషన్ ఆఫ్ బిజినెస్
- బ్యాలెన్స్ షీట్స్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్
- స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ టెక్నిక్స్
- ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేషన్స్ మేనేజర్స్
- ఎలిమెంట్స్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్స్
- స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ టెక్నిక్స్
- ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేషన్స్ మేనేజర్స్
- ఎలిమెంట్స్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్ మెంట్
- ఇన్వెంటరీ కాస్ట్స్ అండ్ సింపుల్ మోడల్స్ తదితర అంశాలు ఉంటాయి.
రీసెర్చ్ ఫండమెంటల్స్ అండ్ అటిట్యూడ్..
- స్టెప్స్ ఇన్ రీసెర్చ్
- డెసిషనల్ అండ్ రీసెర్చ్ ప్రాబ్లమ్స్
- టైప్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఫోర్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ యూజ్డ్ ఫర్ డేటా కలెక్షన్
- ప్రైమరీ అండ్ సెకండరీ డేటా
- టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ మెథడ్స్
- డేటా ఇంటర్‌ప్రిటేషన్
- పాపులేషన్ అండ్ శాంపిల్
- లాజికల్ రీజనింగ్
- మెథడ్స్ ఆఫ్ డేటా కలెక్షన్
- రీసెర్చ్ అండ్ టీచింగ్ ఆప్టిట్యూడ్
- టైప్స్ ఆఫ్ వేరియబుల్స్
- ఓవర్‌వ్యూ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా
- రీసెర్చ్ ఎథిక్స్ అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 18.01.2021
పూర్తిచేసిన దరఖాస్తు ఫారం స్వీకరణకు చివరి తేది: 20.01.2021
ఆర్‌మ్యాట్ 2021 పరీక్ష తేది : 23.01.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.aima.in/content/testing-and-assessment/rmt/phd-rmat