Skip to main content

బీటెక్‌లో మంచి మార్కులు సాధించిన.. ఈ నైపుణ్యాలు లేకుంటే..

ఇంజనీరింగ్‌లో కరిక్యులంలో–ల్యాబ్‌ వర్క్‌ అవసరమైన ప్రతి సబ్జెక్ట్‌కు అందుకు సంబంధించి నిర్దిష్ట సమయం ప్రాక్టికల్స్‌కు కేటాయించాలనే నిబంధన ఉంది.

దీన్ని తప్పనిసరిగా పాటించాలి. దీనికి భిన్నంగా ల్యాబ్‌ వర్క్, ప్రాక్టికల్స్‌కు సమయం కేటాయించే బదులు.. థియరీపై పట్టు సాధించి మంచి మార్కులతో సర్టిఫికెట్‌ సొంతం చేసుకోవాలనే ఆలోచన సరికాదు. దీనివల్ల టాప్‌ మార్కులతో బీటెక్‌ పూర్తి చేసినప్పటికీ.. ప్రాక్టికల్‌ నైపుణ్యాలు లేకపోతే జాబ్‌ మార్కెట్లో నిరాశే ఎదురవుతుందని గమనించాలి.

కోడింగ్‌ స్కిల్స్‌..
ప్రస్తుతం బీటెక్‌లో చేరిన విద్యార్థులు..కోడింగ్‌ స్కిల్స్‌ నేర్చుకోవడంపై దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సీఎస్‌ఈ, ఈసీఈ, సీఎస్‌ఐటీ వంటి బ్రాంచ్‌ల విద్యార్థులు కోడింగ్‌ స్కిల్స్‌ పెంచుకునేందుకు గట్టిగా కృషి చేయాలి. వాస్తవానికి ఈ బ్రాంచ్‌ల విద్యార్థులకు కరిక్యులంలో భాగంగానే కోడింగ్‌ ఉంటుంది. కానీ.. చాలామంది విద్యార్థులు వీటిని ప్రాక్టికల్‌గా నేర్చుకునే అవకాశం లేక నైపుణ్యం పొందలేకపోతున్నారు. దీంతో బీటెక్‌ పూర్తి చేసుకున్నప్పటికీ.. కోడింగ్‌ స్కిల్స్‌ లేమితో ఉద్యోగ సాధనలో వెనుకబడుతున్నారు. పలు గణాంకాలు,సర్వేల ప్రకారం– ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణుల్లో కోడింగ్‌ స్కిల్స్‌ ఉన్న వారి సంఖ్య పది నుంచి పదిహేను శాతం మధ్యనే ఉంటోంది. వారికే కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. దీంతో మిగతా విద్యార్థులు ఉద్యోగాన్వేషణలో వెనుకంజలో ఉంటున్నారు.

మొదటి నుంచే అడుగులు..
కోడింగ్‌ నైపుణ్యాలు నేర్చుకునేందుకు బీటెక్‌ విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే అడుగులు వేయాలి. ముందుగా కోడింగ్‌ స్కిల్స్‌ సాధనకు దోహదం చేసే ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌పై పట్టు సాధించాలి. ముఖ్యంగా పైథాన్, జావా, జావా స్క్రిప్ట్, సీ, సీ++, పీహెచ్‌పీ, ఎస్‌క్యూఎల్, డేటాబేస్‌ వంటి లాంగ్వేజ్‌ నైపుణ్యాల సాధనకు కృషి చేయాలి. ఫలితంగా కోడింగ్‌కు సంబంధించిన నైపుణ్యం కూడా సొంతమవుతుంది.

ఇంకా చ‌ద‌వండి: part 5: విభిన్న మార్గాల ద్వారా.. కోడింగ్‌ స్కిల్స్‌ పెంచుకునేలా..

Published date : 04 Mar 2021 03:27PM

Photo Stories