ఆర్కిటెక్చర్ @ నాటా
Sakshi Education
నాటా.. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్(బీఆర్క్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష. 2019-2020 విద్యా సంవత్సరానికి సంబంధించి నాటా-2019కు నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ సంవత్సరం నుంచి ది కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్(సీఓఏ).. నాటాను ఏటా రెండుసార్లు నిర్వహించనుంది. నాటాలో పొందే స్కోర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపుపొందిన ఆర్కిటెక్చర్ కళాశాలల్లో బీఆర్క్ కోర్సులో చేరొచ్చు.
కోర్సు పేరు: బీఆర్క్(బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్).
కోర్సు వ్యవధి: ఐదేళ్లు
అర్హతలు : మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో, మొత్తంగా కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 2019, జులై 31 నాటికి 17 ఏళ్లు నిండాలి.
పరీక్ష విధానం :
ఉపాధి మార్గాలు..
బీఆర్క్ పూర్తిచేసిన వారికి ఇటీవల కాలంలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కోర్సు పూర్తిచేసుకున్న అభ్యర్థులు ప్రైవేటు రంగంతోపాటు ప్రభుత్వ రంగంలోనూ జాబ్స్ సొంతం చేసుకోవచ్చు. టౌన్ ప్లానింగ్, మౌలిక వసతుల సముదాయాలు, రియల్ ఎస్టేట్ వెంచర్స్ వంటి వాటిల్లో అవకాశాలను పొందొచ్చు. ఆర్కిటెక్చర్ డిజైన్ సంస్థలు, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ సేవల కంపెనీలు, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, అర్బన్ డవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ వంటి వాటిల్లో అవకాశాలు పొందొచ్చు. దాంతోపాటు ప్రైవేట్ రంగంలోని నిర్మాణ సంస్థల్లోనూ అవకాశాలు లభిస్తాయి. సొంతంగా ఆర్కిటెక్చర్ కన్సల్టెంట్‌గా కూడా ఉపాధి పొందొచ్చు. ఏదైనా సంస్థలో కొంత కాలం పనిచేసి అనుభవం సొంతం చేసుకున్నాక.. సొంతంగా కన్సల్టెంట్ లుగా కెరీర్ ప్రారంభించొచ్చు.
ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్‌లో దరఖాస్తు తేదీలు: మొదటిసారి పరీక్షకు దరఖాస్తులు: 2019, జనవరి 24 నుంచి మార్చి 11 వరకు.
రెండోసారి పరీక్షకు దరఖాస్తులు: 2019, జనవరి 24 నుంచి జూన్ 12 వరకు.
పరీక్ష కేంద్రాలు : తెలంగాణలో హైదరాబాద్, వరంగల్; ఏపీలో గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
మొదటి పరీక్ష తేదీ: 2019, ఏప్రిల్ 14.
ఫలితాలు విడుదల: 2019, మే 3.
రెండోసారి జరిగే పరీక్ష తేదీ: 2019, జూలై 7.
ఫలితాలు విడుదల: 2019 జూలై 21.
పరీక్ష ఫీజు: రూ.1800(ఎస్సీ/ఎస్టీలకు రూ.1500)
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.nata.in

- నాటా మొత్తం 200 మార్కులకు ఉంటుంది. ఇందులో 2 భాగాలు, పార్ట్-ఎ, పార్ట్-బి ఉంటాయి.
- పార్ట్-ఎకు 120 మార్కులు కేటాయించారు. ఈ విభాగాన్ని 60 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 20 ప్రశ్నలు, జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 40 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. అంటే.. మ్యాథ్స్ 40 మార్కులకు, జనరల్ అప్టిట్యూడ్‌కు 80 మార్కులకు ఉంటుంది. ఇది ఆన్‌లైన్ పరీక్ష.
- పార్ట్-బి డ్రాయింగ్ పరీక్ష. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఏ4 సైజు పేపర్‌పై రెండు ప్రశ్నలకు డ్రాయింగ్స్ గీయాలి. ఒక్కో ప్రశ్నకు 40 మార్కుల చొప్పున మొత్తం 80 మార్కులకు డ్రాయింగ్ పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు రెండు సెక్షన్లలో విడివిడిగా కనీసం 25 శాతం మార్కులు సాధిస్తే అర్హత లభిస్తుంది.
- జూలై 7న నిర్వహించే పరీక్ష కూడా ఇదే విధానంలో ఉంటుంది. మెరుగైన ర్యాంకు కోసం లేదా మొదటిసారి పరీక్ష రాయలేని వారు రెండోసారి జరిగే పరీక్షకు హాజరుకావచ్చు.
- పార్ట్-ఏలోని మ్యాథ్స్, జనరల్ ఆప్టిట్యూడ్ విభాగాల్లో... ప్యూర్ మ్యాథ్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఆల్జీబ్రా, లాగారిథమ్స్, మాట్రిసెస్, ట్రిగనామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, 3 డెమైన్షనల్ కోఆర్డినేట్ జామెట్రీ, థియరీ ఆఫ్ క్యాలికులస్, అప్లికేషన్ ఆఫ్ క్యాలికులస్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ అధ్యాయాల నుంచి మ్యాథ్స్ సెక్షన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. జనరల్ ఆప్టిట్యూడ్ సెక్షన్‌లో.. మ్యాథమెటికల్ రీజనింగ్, సెట్స్ రిలేషన్‌స, ఆర్కిటెక్చర్ అండ్ నిర్మాణాలకు సంబంధించిన ఆబ్జెక్ట్స్, డ్రాయింగ్‌కు సంబంధిన ప్రశ్నలు అడుగుతారు. వీటితోపాటు జాతీయ, అంతర్జాతీయ ఆర్కిటెక్ట్స్, ప్రఖ్యాత ఆర్కిటెక్చరల్ క్రియేషన్‌స మీద జనరల్ అవేర్‌నెస్ ప్రశ్నలు ఉంటాయి. అనలిటికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ(విజువల్, న్యూమరికల్,వెర్బల్)పై కూడా ప్రశ్నలు ఎదురవుతాయి.
- పార్ట్ బీ డ్రాయింగ్ టెస్ట్‌లో అభ్యర్థిలోని సృజనాత్మకతను పరీక్షించే విధంగా డ్రాయింగ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో నిర్ణీత ఆకారం లేదా వస్తువును అభ్యర్థి ముందుంచి.. దాని ఆధారంగా ఊహాశక్తితో డ్రాయింగ్ వేయమంటారు. ఒక వస్తువును పలు కోణాల్లో చిత్రించమనడం, నిర్ణీత ఆకారానికి ఆకట్టుకునే రంగులు వేయడం వంటి ప్రశ్నలు ఎదురవుతాయి. నిజ జీవితంలో ఎదురైన సంఘటనలను ఊహించుకుంటూ.. వాటికి సంబంధించిన పెన్సిల్ చిత్రాలను గీయమంటారు. ఈ పేపర్ వాల్యూయేషన్‌ను ఒకరి కంటే ఎక్కువ ఎగ్జామినర్లు చేస్తారు. వారు ఇచ్చిన మార్కులను సగటు చేసి తుది మార్కులు కేటాయిస్తారు. అంతిమంగా ఈ సెక్షన్ అభ్యర్థి డ్రాయింగ్ నైపుణ్యాలు, ఊహ శక్తి, పరిశీలన దృక్పథాన్ని అంచనా వేసే పరీక్ష.
- ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం.. పొడవైన వంతెన బోగిబీల్.. మలేషియాలోని ఆకాశహర్య్మాలు పెట్రోనాస్ ట్విన్ టవర్స్.. దుబాయ్‌లోని జేడబ్ల్యూ మారియట్ మార్క్విస్.. ఆధునిక ఎయిర్‌పోర్టు టర్మినల్స్.. అందమైన స్టేడియాల నిర్మాణం.. ఇలా ఒకటేమిటి ఎన్నో అద్భుతమైన కట్టడాలు, నిర్మాణాలు, వంతెనలు, టవర్స్‌కు ఆద్యులు ఆర్కిటెక్చర్ ఇంజనీర్లు. పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు, విశాలమైన హోటల్స్, భారీ ఆసుపత్రుల డిజైన్, నిర్మాణంలో ఆర్కిటెక్చర్లు ప్రధాన పోషిస్తారు. సుందరమైన డిజైన్లతో వెలుస్తున్న కట్టడాలు, నిర్మాణాల వెనక సివిల్ ఇంజనీర్లతో పాటు ప్రధాన పాత్ర ఆర్కిటెక్టుదే. ఇటీవల కాలంలో సృజనాత్మక ఆర్కిటెక్టులకు డిమాండ్ కనిపిస్తుంది.
- క్లయింట్లకు నచ్చిన విధంగా కట్టడాలను ప్లాన్ గీయడం, అందరూ మెచ్చే రూపమివ్వడం ఆర్కిటెక్చర్ ఇంజనీర్ల ప్రధాన విధి. నిర్మాణ ప్లాన్ రూపొందించడం.. నిర్మాణం ప్రారంభించడం కోసం సంబంధిత శాఖల అనుమతులు.. సివిల్ ఇంజనీర్లు, సర్వేయర్లు తదితర నిపుణుల బృందంతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది.
- ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ ఔత్సాహికులకు సృజనాత్మకత, పరిశీలన జ్ఞానం, విశ్లేషణ నైపుణ్యాలు, మ్యాథమెటికల్ ఎబిలిటీ, డ్రాయింగ్ స్కిల్స్ ఉండాలి. ఈ రంగంలో వస్తున్న మార్పులను నిరంతరం అందిపుచ్చుకునే నేర్పు సొంతం చేసుకోవాలి.
ఉపాధి మార్గాలు..
బీఆర్క్ పూర్తిచేసిన వారికి ఇటీవల కాలంలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కోర్సు పూర్తిచేసుకున్న అభ్యర్థులు ప్రైవేటు రంగంతోపాటు ప్రభుత్వ రంగంలోనూ జాబ్స్ సొంతం చేసుకోవచ్చు. టౌన్ ప్లానింగ్, మౌలిక వసతుల సముదాయాలు, రియల్ ఎస్టేట్ వెంచర్స్ వంటి వాటిల్లో అవకాశాలను పొందొచ్చు. ఆర్కిటెక్చర్ డిజైన్ సంస్థలు, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ సేవల కంపెనీలు, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, అర్బన్ డవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ వంటి వాటిల్లో అవకాశాలు పొందొచ్చు. దాంతోపాటు ప్రైవేట్ రంగంలోని నిర్మాణ సంస్థల్లోనూ అవకాశాలు లభిస్తాయి. సొంతంగా ఆర్కిటెక్చర్ కన్సల్టెంట్‌గా కూడా ఉపాధి పొందొచ్చు. ఏదైనా సంస్థలో కొంత కాలం పనిచేసి అనుభవం సొంతం చేసుకున్నాక.. సొంతంగా కన్సల్టెంట్ లుగా కెరీర్ ప్రారంభించొచ్చు.
ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్‌లో దరఖాస్తు తేదీలు: మొదటిసారి పరీక్షకు దరఖాస్తులు: 2019, జనవరి 24 నుంచి మార్చి 11 వరకు.
రెండోసారి పరీక్షకు దరఖాస్తులు: 2019, జనవరి 24 నుంచి జూన్ 12 వరకు.
పరీక్ష కేంద్రాలు : తెలంగాణలో హైదరాబాద్, వరంగల్; ఏపీలో గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
మొదటి పరీక్ష తేదీ: 2019, ఏప్రిల్ 14.
ఫలితాలు విడుదల: 2019, మే 3.
రెండోసారి జరిగే పరీక్ష తేదీ: 2019, జూలై 7.
ఫలితాలు విడుదల: 2019 జూలై 21.
పరీక్ష ఫీజు: రూ.1800(ఎస్సీ/ఎస్టీలకు రూ.1500)
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.nata.in
Published date : 29 Jan 2019 02:35PM