Skip to main content

ఆర్‌ఐఈల్లో బీఈడీతో రూ.30వేల ప్రారంభ వేత‌నాలు.. ఎంట్ర‌న్స్ ఎగ్జామ్ స‌మాచారం ఇదే..!

ఎన్‌సీఈఆర్‌టీ పర్యవేక్షణలో బోధన సాగించే రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ క్యాంపస్‌లలో బీఈడీ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయి.

ఆర్‌ఐఈలకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని.. పలు విద్యాసంస్థలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్స్‌ను నిర్వహించి.. జాబ్‌ ఆఫర్స్‌ ఇస్తున్నాయి. వీటి ద్వారా ప్రారంభంలోనే సగటున రూ.30 వేల వేతనం లభిస్తోంది.

సీఈఈ–2021 ముఖ్య సమాచారం..
దరఖాస్తు విధానం: ఆర్‌ఐఈల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ కోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు తాము చేరాలనుకుంటున్న కోర్సును తెలియజేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా పరీక్షకు హాజరు కావాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జూన్‌ 30, 2021
అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: జూలై 10–జూలై 18, 2021
రాత పరీక్ష తేదీ: జూలై 18, 2021
తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు: విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్‌.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://cee.ncert.gov.in

ఇంకా చ‌ద‌వండి : part 1: ఇంటర్‌తోనే నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో బీఈడీ చేసే అవ‌కాశం.. ఎన్‌సీఈఆర్‌టీ సీఈఈ 2021 వివ‌రాలు ఇవే..

Published date : 05 Jun 2021 05:48PM

Photo Stories