అప్రెంటీస్‌షిప్ అందుకునేమార్గాలు...
Sakshi Education
ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్సులు, ఐటీఐ ట్రేడ్స్, పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల వరకు ఇప్పుడు అందరికీ అత్యంత అవసరం..
ఎంప్లాయబిలిటీ స్కిల్స్. కార్పెంటరీ, లేత్ మెషిన్ టెక్నిషియన్ వంటి కోర్సులు మొదలు.. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్.. ఇలా.. కోర్సు ఏదైనా.. జాబ్ రెడీ స్కిల్స్ ఉంటేనే కొలువు! మరి.. ఈ జాబ్ రెడీ స్కిల్స్, ఎంప్లాయబిలిటీ నైపుణ్యాలు అందుకునేందుకు మార్గం.. అప్రెంటీస్‌షిప్. అప్రెంటీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుంటే.. ఉద్యోగ సాధనలో ముందు వరుసలో ఉన్నట్లే! భారతీయ రైల్వేతోపాటు పలు విభాగాల్లో అప్రెంటీస్ నోటిఫికేషన్‌లు వెలువడుతున్న నేపథ్యంలో అప్రెంటీషిప్‌తో ప్రయోజనాలు, అందుకునేందుకు మార్గాలు...
అప్రెంటీస్ శిక్షణ :
ఇటీవల కాలంలో కంపెనీలు సర్టిఫికెట్ల కంటే నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో జాబ్‌రెడీ స్కిల్స్ కోసం అప్రెంటీస్‌షిప్ తప్పనిసరిగా మారింది. ప్రభుత్వం కూడా అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఆ క్రమంలో విద్యార్థులకు అప్రెంటీస్‌షిప్ శిక్షణ అందించేందుకు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (డీజీఈటీ), నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీసీ) ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాయి.
ఎన్‌ఏపీఎస్.. వినూత్నం
నేషనల్ అప్రెంటీస్ ప్రమోషన్ స్కీమ్ (ఎన్‌ఏపీఎస్).. కంపెనీలు అప్రెంటీస్ ట్రైనీలను ఎక్కువ సంఖ్యలో నియమించుకునేలా ప్రోత్సహించేందుకు 2006లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పథకమిది. సంస్థలు అప్రెంటీస్ ట్రైనీలను నియమించుకునే విషయంలో వారికి ఇవ్వాల్సిన స్టైపెండ్, ఇతర ఆర్థిక వ్యయాలను పరిగణనలోకి తీసుకొని కొంత వెనుకంజ వేస్తుంటాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం .. ఇటు ఇండస్ట్రీ వర్గాలకు.. అటు అప్రెంటీస్ ట్రైనీలకు అనుకూలంగా ఉండేలా రూపొందించిన పథకమే ఎన్‌ఏపీఎస్. దీని ప్రకారం అప్రెంటీస్ ట్రైనీకి సదరు శిక్షణ వ్యవధిలో ఇచ్చే స్టైపెండ్‌లో 25 శాతాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. దీంతోపాటు అప్రెంటీస్‌షిప్‌నకు శిక్షణనిచ్చే క్రమంలో ఒక సంస్థకు అయ్యే వ్యయంలో కూడా 25 శాతాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. అంటే.. స్టైపెండ్, ఇతర వ్యయాల పరంగా సంస్థలు భరించాల్సిన మొత్తం ఖర్చులో 50 శాతం కేంద్రమే ఇస్తుంది. ఇలాంటి ప్రోత్సాహకాల ద్వారా అప్రెంటీస్ అవకాశాలు పెంచి.. 2016-20 మధ్య కాలంలో 50 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యం.
ఆన్‌లైన్ అనుసంధానం :
విద్యార్థులు ఎన్‌ఏపీఎస్ వెబ్‌సైట్ ద్వారా అప్రెంటీస్ ట్రైనింగ్ అవకాశాలు అందుబాటులో ఉన్న సంస్థల వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే సంస్థలు కూడా ఇదే వెబ్‌సైట్ ద్వారా.. అప్రెంటీస్ ట్రైనీ అవకాశాలు కోరుతూ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న విద్యార్థుల వివరాలు సేకరించొచ్చు.
పూర్తి వివరాలకు: www.apprenticeship.gov.in
డీజీఈటీ మరో ముఖ్య మార్గం :
డీజీఈటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అప్రెంటీస్‌షిప్ స్కీమ్ ప్రకారం విద్యార్థులు తమ అర్హతల ఆధారంగా ఇంటర్మీడియెట్, డిప్లొమా, ఐటీఐ, ఇంజనీరింగ్ వంటి సాంకేతిక కోర్సులకు సంబంధించి అప్రెంటీస్ శిక్షణ అవకాశాలను అన్వేషించే అవకాశముంది.
అభ్యర్థుల విద్యార్హతల ఆధారంగా అప్రెంటీస్ ట్రైనీలను నాలుగు రకాలుగా వర్గీకరించారు. అవి..
1. ట్రేడ్ అప్రెంటీస్: ఐటీఐ అర్హతతో ట్రేడ్ అప్రెంటీస్‌గా చేరొచ్చు. శిక్షణ కనీసం 6 నెలల నుంచి సంవత్సరం ఉంటుంది. 259 ట్రేడ్‌లలో అప్రెంటీస్ చేయొచ్చు. వీరికి నెలకు రూ.2500 వరకూ అందుతుంది.
2. టెక్నీషియన్ అప్రెంటీస్: పాలిటెక్నిక్ డిప్లొమా అర్హతతో అప్రెంటీస్ ట్రైనీలను టెక్నిషియన్ అప్రెంటీస్‌లుగా పేర్కొంటారు. వీరికి శిక్షణ ఒక ఏడాది ఉంటుంది. 125 సబ్జెక్టుల్లో శిక్షణ పొందొచ్చు. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.3542 స్టైపెండ్ లభిస్తుంది.
3. టెక్నీషియన్ (ఒకేషనల్): పదో తరగతి తర్వాత వృత్తివిద్యా కోర్సుల్లో ఉత్తీర్ణత ద్వారా అప్రెంటీస్‌లుగా ఎంపికైన వారిని టెక్నీషియన్ (ఒకేషనల్)గా పిలుస్తారు. వీరికి నెలకు రూ.2758 చొప్పున స్టైపెండ్ అందిస్తారు.
4. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ: ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు సంబంధిత రంగంలో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీగా చేరొచ్చు. వీరికి స్టైపెండ్ రూపంలో రూ.4984 లభిస్తుంది.
డీజీఈటీ నిబంధనల ప్రకారం పారిశ్రామిక సంస్థలు తప్పనిసరిగా అప్రెంటీస్ ట్రైనీలను నియమించుకోవాలి. ఈ మేరకు ఒక సంస్థ మొత్తం ఉద్యోగుల్లో కనిష్టంగా మూడు శాతం, గరిష్టంగా పది శాతానికి సమానమైన సంఖ్యలో అప్రెంటీస్ ట్రైనీలను నియమించుకోవచ్చు. నిర్దిష్ట వ్యవధిలోని అప్రెంటీస్ ట్రైనింగ్ పూర్తిచేశాక.. అభ్యర్థులకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ ట్రేడ్ టెస్ట్ పేరుతో పరీక్ష నిర్వహిస్తుంది. ఈ ట్రేడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే అప్రెంటీస్‌షిప్ సర్టిఫికెట్ చేతికందుతుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.dget.nic.in
హెచ్‌ఆర్‌డీ ఆధ్వర్యంలో...
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం బోర్డ్స్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ పేరుతో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. దీనిద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులు 130 విభాగాల్లో అప్రెంటీస్‌షిప్ శిక్షణ పొందే అవకాశముంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.mhrdnats.gov.in
పీఎంకేవీవై.. మరో మార్గం
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ప్రకారం అభ్యర్థులు తమ ప్రాంతంలోని అధీకృత శిక్షణ కేంద్రంలోనే శిక్షణ పొందొచ్చు. దీన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి రూ.1000, రూ.2 వేల వరకు ఆర్థిక ప్రోత్సాహం లభిస్తోంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: pmkvyofficial.org
సర్టిఫికెట్‌తో మరిన్ని అవకాశాలు...
సంస్థల్లో అప్రెంటీస్ శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఎన్‌సీవీటీ, డీజీఈటీలు నిర్వహించే ట్రేడ్ టెస్ట్‌లలో ఉత్తీర్ణత సాధిస్తే... ఉద్యోగావకాశాలను చేజిక్కించుకోవడంలో మరింత ముందంజలో నిలుస్తారు. ఎంట్రీ లెవల్‌లోనే ఐటీఐ విద్యార్థులకు రూ.12వేల నుంచి రూ.15 వేలు; డిప్లొమా విద్యార్థులకు రూ.15వేల నుంచి రూ.18 వేల మధ్యలో వేతనం లభిస్తుంది. అప్రెంటీస్ ట్రైనీలను నియమించుకునే విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలు ముందుంటున్నాయి.

Published date : 03 Jul 2018 06:19PM