ఆన్‌లైన్ లెర్నింగ్ ,డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌కు చక్కటి మార్గాలు..
Sakshi Education
వ్యక్తిగత, ఆర్థిక కారణాలతో రెగ్యులర్ విధానంలో ఉన్నతవిద్యా కోర్సుల్లో చేరలేకపోయిన వారికి చక్కటి మార్గం.. డిస్టెన్స్ ఎడ్యుకేషన్. డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌తోపాటు స్వయం, ఎన్‌పీటీఈఎల్, మూక్స్ వంటిఆన్‌లైన్ లెర్నింగ్
మార్గాలపైనా విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం వివిధ విశ్వవిద్యాలయాలు దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటనలు విడుదల చేస్తున్న నేపథ్యంలో.. దూర విద్య తీరుతెన్నులతోపాటు ఆన్‌లైన్ లెర్నింగ్ గురించి తెలుసుకుందాం...
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ :
రెగ్యులర్ విధానంలో ఉన్నత విద్య కోసం కాలేజీకి వెళ్లలేని వారి ఆదరణ పొందుతున్న అభ్యసన విధానం.. డిస్టెన్స్ ఎడ్యుకేషన్. అందుకే ప్రస్తుతం ప్రతి యూనివర్సిటీలోనూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విభాగాలున్నాయి. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కోర్సులు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. కాంటాక్ట్ క్లాస్‌లకు హాజరవడం.. వార్షిక పరీక్షలు రాసి ఉత్తీర్ణులై సర్టిఫికెట్ అందుకోవడం.. స్థూలంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్వరూపం.
అన్ని యూనివర్సిటీల్లో..
దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ రెగ్యులర్ కోర్సులతోపాటు బ్యాచిలర్ , మాస్టర్ కోర్సులే కాకుండా ఎంబీఏ, పీజీడీఎం తదితర మేనేజ్‌మెంట్ కోర్సులు సైతం దూరవిద్య విధానంలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో చేరిన వారికి ముందుగా సెల్ఫ్ స్టడీ మెటీరియల్ అందించడం, కోర్సు స్వరూపాన్ని బట్టి 25 శాతం మార్కుల మేరకు ఇంటర్నల్ అసైన్‌మెంట్లు, 75 శాతం మార్కులకు వార్షిక పరీక్షలు నిర్వహించడమనే విధానంఅమలవుతోంది.
కాంటాక్ట్ క్లాస్‌లు :
దూరవిద్య విధానంలో చేరిన విద్యార్థులకు ఏటా కొన్ని రోజులపాటు కాంటాక్ట్ క్లాసులు జరుగుతాయి. యూనివర్సిటీల ప్రొఫెసర్లు, లెక్చరర్లు సబ్జెక్టులను బోధిస్తారు. ఈ క్లాస్‌ల వ్యవధి 12-30 రోజులుంటుంది. చాలామందికి ఈ కొద్ది రోజులు కూడా తరగతులకు హాజరు కాలేని పరిస్థితి. దీంతో విద్యార్థులు సందేహాలను నేరుగా నివృత్తి చేసుకునే అవకాశం లభించదు. నిర్దిష్ట హాజరు శాతం తప్పనిసరి అని పేర్కొంటున్నప్పటికీ.. ఆశించిన ఫలితం రావడం లేదు.
నిబంధనలు కఠినంగా...
దూరవిద్యలో కాంటాక్ట్ క్లాసులు, అసైన్‌మెంట్లు, పరీక్షలు తదితరాలపై వస్తున్న విమర్శలను పరిగణనలోకి తీసుకున్న యూజీసీ.. నిబంధనలను కఠినతరం చేస్తోంది. ప్రతి యూనివర్సిటీ వర్చువల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేయాలని.. అలాగే విద్యార్థులు ‘స్వయం’, మూక్స్ ద్వారా ఆన్‌లైన్ పాఠాలు వినాలనే నిబంధనలను రూపొందిస్తోంది. ఇప్పటికే వివిధ యూనివర్సిటీలు ఆన్‌లైన్‌లో మెటీరియల్‌ను అందుబాటులో ఉంచుతున్నప్పటికీ.. వాటిని ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య 30 శాతంలోపే ఉంటోందని కేపీఎంజీ సంస్థ గతేడాది నిర్వహించిన సర్వేలో తేలింది.
కోర్సుల ఎంపికలో జాగ్రత్త :
దూరవిద్యలోని కోర్సుల ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి. ముఖ్యంగా ప్రాక్టికల్ ఓరియెంటేషన్ ఉండే కోర్సుల్లో చేరకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ పరంగా ఉపయుక్తమైన కోర్సును ఎంచుకోవాలంటున్నారు.
ఇగ్నో ముందంజం :
డిస్టెన్‌స ఎడ్యుకేషన్ కోర్సులు అందించడంలో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూ నివర్సిటీ-ఇగ్నో ముందంజలో ఉంది. ఇది అనేక డిగ్రీ, మాస్టర్‌స, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లు అందిస్తోంది. అలాగే ఆయా కోర్సుల్లో ఇంటర్నల్ అసైన్‌మెంట్స్‌లో ఉత్తీర్ణత వంటి కచ్చితమైన నిబంధనలు అమలు చేస్తోంది. ఇగ్నో చూపిన బాటలో ఇప్పుడిప్పుడే వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ టు బి యూనివర్సిటీలు, రాష్ట్రాల స్థాయిలో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్న వర్సిటీలు పయనిస్తున్నాయి.
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ :
ప్రస్తుత ఆధునిక సాంకేతిక ప్రపంచంలో తరచు వినిపిస్తున్న మాట.. ఆన్ లెర్నింగ్ లేదా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్. ఇప్పటికే మూక్స్, స్వయం, ఎన్‌పీటీఈఎల్ వంటి ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్స్‌కు విద్యార్థుల నుంచి మంచి స్పందన వస్తోంది. రెగ్యులర్ లేదా డిస్టెన్‌స విధానంలో ఆయా కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈ ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా సబ్జెక్టు నిష్ణాతులు రూపొందించిన వీడియోలు వీక్షించడం ద్వారా నైపుణ్యాలు పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. దేశంలోని నాక్(నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సెల్) గుర్తింపు ఉన్న యూనివర్సిటీలు ఆన్‌లైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా కోర్సులు అందించేలా కొత్త నిబంధనలకు రూపకల్పన జరుగుతోంది. కనీసం 15శాతం యూనివర్సిటీల్లో ఈ ఆన్‌లైన్ కోర్సులను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రి ఇటీవల ప్రకటించారు. ఈ విధానంలో అభ్యసనం ఆన్‌లైన్లో జరుగుతుంది. కంప్యూటర్, ఇంటర్నెట్ ఉంటే చాలు... ఇంట్లోనే కూర్చొని కోరుకున్న కోర్సు పూర్తిచేసి డిగ్రీ సర్టిఫికెట్ పొందొచ్చు.
‘స్వయం’తో అనుసంధానం :
లైవ్ లెక్చర్స్, ప్రీ రికార్డెడ్ లెక్చర్స్ అందుబాటులో ఉండటం ఆన్‌లైన్ విధానం ప్రత్యేకత. నిర్దిష్ట సమయంలో సంబంధిత ప్రొఫెసర్ లేదా మెంటార్‌తో ఆన్‌లైన్లో లైవ్ చాట్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఆయా ఆన్‌లైన్ కోర్సులను స్వయం (స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్- లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్), మూక్స్ వంటి వాటితో అనుసంధానం చేయనున్నారు. ఇందులో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు... కోర్సు పూర్తయ్యాక నిర్వహించే సెల్ఫ్ అసైన్‌మెంట్ ఆన్‌లైన్ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. అందులో పొందిన మార్కులు/క్రెడిట్స్‌ను తుది మార్కుల జాబితాలో కలుపుతారు. ఇలాంటి నిబంధనల కారణంగా అభ్యర్థులు కచ్చితంగా ఆయా సబ్జెక్టులపై అవగాహన పొందుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో విద్యార్థులు వర్చువల్ లెక్చర్స్ వినేందుకు కొన్ని సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. వీటిలో ఇంటర్నెట్, ఏవీ టూల్స్, స్కైప్ ముఖ్యమైనవి. ప్రొఫెసర్లు, మెంటార్లను నేరుగా సంప్రదించేందుకు స్కైప్ ఎంతో ఉపయోగపడుతుంది.
తాజా ట్రెండ్స్..

- కేపీఎంజీ సర్వే ప్రకారం- 2021 నాటికి 8 రెట్లు పెరగనున్న ఆన్‌లైన్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ విధానం.
- డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. తర్వాతి స్థానాల్లో బీఈడీ, ఎంఈడీ తదితర కోర్సులున్నాయి.
- గతేడాది కోర్స్‌ఎరా ఆన్‌లైన్ లెర్నింగ్‌లో నమోదు చేసుకున్న భారత విద్యార్థుల సంఖ్య 13 లక్షలు.
- ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏఐఎస్‌హెచ్‌ఈ) నివేదిక ప్రకారం- ఉన్నతవిద్య నమోదులో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాటా 11.45 శాతం.
- యూనివర్సిటీల పరిధిలోని మొత్తం ఎన్‌రోల్‌మెంట్స్‌లో 57.6 శాతం డిస్టెన్స్ విధానంలో ఉండటం గమనార్హం.
భవిష్యత్తు కోసమే.. దూరవిద్యకు ఆదరణ ఏటా పెరుగుతోంది. ఈ విధానంలో వివిధ కోర్సుల్లో చేరుతున్నవారు నైపుణ్యాలు పెంచుకునేందుకు స్వీయ అభ్యసనమే ఆధారమనే వాస్తవాన్ని గుర్తించి, దానికి అనుగుణంగా అడుగులేయాలి. విద్యార్థులకు మెరుగైన అభ్యసన వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో మార్పులు వస్తున్న మాట నిజమే. ఈ దిశగా మేము కూడా చర్యలు తీసుకుంటున్నాం. - ప్రొఫెసర్ బి.మోహిని, డెరైక్టర్, ఎస్‌డీఈ, ఏయూ. |
Published date : 17 Feb 2018 05:41PM