ఐసెట్-2019
Sakshi Education
తెలుగు రాష్ట్రాలు ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు(ఐసెట్) ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఎంసెట్ తర్వాత అత్యధిక మంది హాజరయ్యే ప్రవేశ పరీక్ష ఐసెట్.
తాజాగా ఏపీ ఐసెట్ నోటికేషన్ వెలువడింది. త్వరలోనే తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఐసెట్ పరీక్ష తీరుతెన్నులు, ఉత్తమ ర్యాంకు సాధించడానికి నిపుణుల ప్రిపరేషన్ టిప్స్...
200 మార్కులు :
ఐసెట్ ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.
అనలిటికల్ ఎబిలిటీ:
మ్యాథమెటికల్ ఎబిలిటీ :
కమ్యూనికేషన్ ఎబిలిటీ :
ఇందులో వొకాబ్యులరీ నుంచి 10 ప్రశ్నలు, ఫంక్షనల్ గ్రామర్ నుంచి 15 ప్రశ్నలు, బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ నుంచి 10 ప్రశ్నలు, రీడింగ్ కాంప్రెహెన్షన్ నుంచి 15 ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో వెర్బల్ ఎబిలిటీ నుంచే 40 ప్రశ్నలు వస్తాయి. కాబట్టి దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
అర్హత :
ఐసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ. ఫైనలియర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం మార్కులు, రిజర్వేషన్ వర్గాలకు 45 శాతం మార్కులు ఉండాలి. ఎంసీఏ అభ్యర్థులు ఇంటర్‌లో మ్యాథ్‌స చదివి ఉండాలి.
ముఖ్య సమాచారం
టీఎస్ ఐసెట్-2019 :
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: మార్చి 7 నుంచి.
దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 29.(అపరాధ రుసుం లేకుండా)
టీఎస్ ఐసెట్ తేదీలు: మే 23, 24.
ఏపీ ఐసెట్-2019 :
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 27.
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 27(అపరాధ రుసుం లేకుండా).
ఏపీ ఐసెట్ నిర్వహణ: ఏప్రిల్ 26.
సమయం చాలా కీలకం..
ఐసెట్‌ను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. 150 నిమిషాల్లో 200 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. అంటే.. ప్రతి ప్రశ్నకు 45 సెకన్ల సమయం అందుబాటులో ఉంది. అభ్యర్థులకు ఇది ఓ రకంగా ఓ సవాలని చెప్పొచ్చు. తేలిగ్గా ఉన్న ప్రశ్నలను త్వరగా పూర్తిచేసి.. క్లిష్టమైన ప్రశ్నలపై ఎక్కువ సమయం వెచ్చించడం లాభిస్తుంది. పరీక్ష రోజు సమయ నిర్వహణ అభ్యర్థి ప్రిపరేషన్, ప్రతిభలపై ఆధారపడి ఉంటుంది. గతంలో అడిగిన ప్రశ్నలను సాధన చేస్తే.. అనలిటికల్ విభాగంలో మంచి మార్కులు సాధించొచ్చు. మ్యాథమెటికల్ విభాగంలో 50 ప్రశ్నలకు తగ్గకుండా సమాధానాలు గుర్తించగలిగితే మంచి ర్యాంకు సొంతమవుతుంది. అభ్యర్థులు చివరి 30 నిమిషాలను కమ్యూనికేషన్ వొకాబ్యులరీ విభాగానికి కేటాయించాలి. అభ్యర్థి మొత్తంగా 140-150 ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించగలిగితే 100లోపు ఐసెట్ ర్యాంకు సొంతమవుతుంది.
- ఎ.హరికృష్ణ సాగర్, సబ్జెక్ట్ నిపుణులు.
200 మార్కులు :
ఐసెట్ ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.
విభాగం | ప్రశ్నలు |
అనలిటికల్ ఎబిలిటీ | 75 |
మ్యాథమెటికల్ ఎబిలిటీ | 75 |
కమ్యూనికేషన్ ఎబిలిటీ | 50 |
మొత్తం | 200 |
అనలిటికల్ ఎబిలిటీ:
- పరీక్షలో తొలుత అనలిటికల్ ఎబిలిటీ విభాగం ఉంటుంది. ఇందులో రీజనింగ్ అంశాలుంటాయి. సీక్వెన్సెస్ అండ్ సిరీస్ నుంచి 10 ప్రశ్నలు, కోడింగ్-డీకోడింగ్ నుంచి 10 ప్రశ్నలు, అనాలజీ నుంచి 10 ప్రశ్నలు, డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 10 ప్రశ్నలు, ఆడ్ మ్యాన్ ఔట్ నుంచి 5 ప్రశ్నలు, అరేంజ్‌మెంట్స్ నుంచి 10 ప్రశ్నలు, డేటా సఫిషియెన్సీ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి.
- డేటా సఫిషియెన్సీలో ప్రశ్నతోపాటు రెండు స్టేట్‌మెంట్లు ఇస్తారు. ఇవి సదరు ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనేందుకు సరిపోతాయా లేదా అని అభ్యర్థి చూడాల్సి ఉంటుంది. సీక్వెన్సెస్ అండ్ సిరీస్‌లో లెటర్లు, నంబర్లను సిరీస్‌గా ఇస్తారు. ఇచ్చిన సిరీస్‌లోని ముందు పదాన్ని పరిశీలించి తర్వాతి పదాన్ని కనుగొనాల్సి ఉంటుంది.
- అనాలజీలో ఒక స్థిర జత, ఒక తెలియని(అన్‌నోన్) జత ఇస్తారు. అభ్యర్థులు స్థిర జతలోని ఎలిమెంట్ల(లెటర్లు, నంబర్లు) మధ్య ఉన్న సంబంధాన్ని అర్థంచేసుకొని..దాన్ని అన్వయించి తెలియని పదాన్ని కనుగొనాల్సి ఉంటుంది.
- ఆడ్ మ్యాన్ ఔట్‌లో.. ప్రశ్నలో నాలుగు ఆప్షన్లు ఇచ్చి భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించమంటారు. డేటా అనాలసిస్ ప్రశ్నల్లో సమాచారాన్ని టేబుల్ లేదా చార్ట్ రూపంలో ఇస్తారు. అభ్యర్థి సదరు సమాచారాన్ని పరిశీలించి కింద ఇచ్చే అయిదు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.
- కోడింగ్-డీకోడింగ్‌లో పారాగ్రాఫ్, ఇండివిడ్యువల్ టైప్ ప్రశ్నలు అడుగుతారు. పారాగ్రాఫ్ ప్రశ్నల్లో ఆల్ఫాబెట్‌కు సంబంధించిన కోడింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. దాని ఆధారంగా సదరు ఆల్ఫాబెట్‌ను కోడ్ చేయాల్సి ఉంటుంది. అనుబంధంగా అయిదు ప్రశ్నలు అడుగుతారు.
- డేట్, టైమ్ అండ్ అరేంజ్‌మెంట్‌లో క్యాలెండర్ ఆధారిత, ట్రైన్ అరైవల్, డిపార్చర్ టైమింగ్స్, షెడ్యూల్ ఆధారిత, బ్లడ్ రిలేషన్, సీటింగ్ అరేంజ్‌మెంట్ ప్రశ్నలు అడుగుతారు.
మ్యాథమెటికల్ ఎబిలిటీ :
- మ్యాథమెటికల్ ఎబిలిటీ విభాగంలో అర్థమెటిక్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు, ఆల్ జీబ్రా, జ్యామెట్రికల్ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలు, స్టాటిస్టికల్ ఎబిలిటీ నుంచి 10 ప్రశ్నలు వస్తాయి.
- అర్థమెటిక్ ఎబిలిటీలో నంబర్లు-ఆపరేషన్లు, లాభ-నష్టాలు, శాతాలు, సరాసరి, భాగస్వామ్యాలు, టైమ్-వర్క్, ట్రైన్స్, వాల్యూమ్, ఫిగర్స్, షేప్స్‌పై ప్రశ్నలు అడుగుతారు.
- స్టాటిస్టికల్ ఎబిలిటీలో మీన్, మోడ్, మీడియన్, స్టాండర్డ్ డీవియేషన్, ప్రాబబిలిటీ ప్రశ్నలు వస్తాయి.
కమ్యూనికేషన్ ఎబిలిటీ :
ఇందులో వొకాబ్యులరీ నుంచి 10 ప్రశ్నలు, ఫంక్షనల్ గ్రామర్ నుంచి 15 ప్రశ్నలు, బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ నుంచి 10 ప్రశ్నలు, రీడింగ్ కాంప్రెహెన్షన్ నుంచి 15 ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో వెర్బల్ ఎబిలిటీ నుంచే 40 ప్రశ్నలు వస్తాయి. కాబట్టి దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
అర్హత :
ఐసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ. ఫైనలియర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం మార్కులు, రిజర్వేషన్ వర్గాలకు 45 శాతం మార్కులు ఉండాలి. ఎంసీఏ అభ్యర్థులు ఇంటర్‌లో మ్యాథ్‌స చదివి ఉండాలి.
ముఖ్య సమాచారం
టీఎస్ ఐసెట్-2019 :
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: మార్చి 7 నుంచి.
దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 29.(అపరాధ రుసుం లేకుండా)
టీఎస్ ఐసెట్ తేదీలు: మే 23, 24.
ఏపీ ఐసెట్-2019 :
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 27.
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 27(అపరాధ రుసుం లేకుండా).
ఏపీ ఐసెట్ నిర్వహణ: ఏప్రిల్ 26.
సమయం చాలా కీలకం..
ఐసెట్‌ను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. 150 నిమిషాల్లో 200 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. అంటే.. ప్రతి ప్రశ్నకు 45 సెకన్ల సమయం అందుబాటులో ఉంది. అభ్యర్థులకు ఇది ఓ రకంగా ఓ సవాలని చెప్పొచ్చు. తేలిగ్గా ఉన్న ప్రశ్నలను త్వరగా పూర్తిచేసి.. క్లిష్టమైన ప్రశ్నలపై ఎక్కువ సమయం వెచ్చించడం లాభిస్తుంది. పరీక్ష రోజు సమయ నిర్వహణ అభ్యర్థి ప్రిపరేషన్, ప్రతిభలపై ఆధారపడి ఉంటుంది. గతంలో అడిగిన ప్రశ్నలను సాధన చేస్తే.. అనలిటికల్ విభాగంలో మంచి మార్కులు సాధించొచ్చు. మ్యాథమెటికల్ విభాగంలో 50 ప్రశ్నలకు తగ్గకుండా సమాధానాలు గుర్తించగలిగితే మంచి ర్యాంకు సొంతమవుతుంది. అభ్యర్థులు చివరి 30 నిమిషాలను కమ్యూనికేషన్ వొకాబ్యులరీ విభాగానికి కేటాయించాలి. అభ్యర్థి మొత్తంగా 140-150 ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించగలిగితే 100లోపు ఐసెట్ ర్యాంకు సొంతమవుతుంది.
- ఎ.హరికృష్ణ సాగర్, సబ్జెక్ట్ నిపుణులు.
Published date : 28 Feb 2019 04:39PM