ఐజీఎన్‌టీయూ, ఐఐటీటీఎంలో టూరిజం కోర్సుల ప్రవేశాలు.. దరఖాస్తుకు చివరి తేది ఇదే..
Sakshi Education
ప్రస్తుతం ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ(ఐజీఎన్‌టీయూ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్... సంయుక్తంగా 2021-2024 విద్యాసంవత్సరానికి దేశవ్యాప్తంగా బీబీఏ, ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నాయి.
అర్హత:
బీబీఏలో చేరేందుకు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలు 45 శాతం సాధిస్తే సరిపోతుంది. వయసు జులై1, 2021 నాటికి 22 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల వయో సడలింపు లభిస్తుంది.
ఎంబీఏలో చేరాలనుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వీరు మ్యాట్/క్యాట్/సీమ్యాట్/గ్జాట్/ జీమ్యాట్/ఏటీఎంఏలో అర్హత మార్కులు సాధించాలి. వయసు జులై 1, 2021 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: మే 21.2021
ఐజీఎన్‌టీయూ, ఐఐటీటీఎం సంయుక్తంగా నిర్వహించే ఐఐఏటీ పరీక్ష తేది: జూన్ 6, 2021
గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు జూన్ 14 నుంచి 18 తేదీల మధ్య జరుగుతాయి.
తుది జాబితా విడుదల: జూన్ 25, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://iittm.ac.in

పర్యాటక రంగం.. ముఖ్యాంశాలు
- కరోనా అనంతర కాలంలో గాడిన పడనున్న ట్రావెల్ అండ్ టూరిజం సెక్టార్.
- అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్న భారత పర్యాటక రంగం.
- ఏటా 40 లక్షల నుంచి 50 లక్షల మంది విదేశీ పర్యాటకులు.
- 2025 నాటికి సంఘటిత, అసంఘటిత విభాగాల్లో దాదాపు 40 లక్షల ఉద్యోగాలు.
- మానవ వనరుల కోణంలో డిమాండ్-సప్లయ్ మధ్య 40 శాతం వ్యత్యాసం.
- ఎన్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టూరిజం సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్.
- సంప్రదాయ డిగ్రీ ఉత్తీర్ణులకు చక్కటి ఉపాధి వేదికగా నిలుస్తున్న పర్యాటక రంగం.
- బ్యాచిలర్ స్థాయిలో బీబీఏ,బీబీఎంలో టూరిజం, ట్రావెల్ స్పెషలైజేషన్స్ కోర్సులు.
- పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ వంటి మాస్టర్ స్థాయి కోర్సుల్లోనూ టూరిజం, ట్రావెల్ మేనేజ్‌మెంట్ స్పెషలైజ్డ్ కోర్సులు.
- ఈ-వీసా,ఈ-టూరిస్ట్ వీసా, ఎకో టూరిజం, మెడికల్ టూరిజం వంటి విధానాలతో పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య.
- వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్(డబ్ల్యూటీటీసీ) అంచనా ప్రకారం-2028 నాటికి పర్యాటక, అనుబంధ రంగాల్లో కొత్తగా దాదాపు కోటి కొలువులు.
ఇంకా చదవండి: part 1: కొలువుల సాధనలో ముందజ ఉన్న పర్యాటకం.. 2024 వరకు 30 లక్షల వరకు ఉద్యోగాలు..!
Published date : 24 Feb 2021 02:51PM