ఐఐటీల్లో పెరగనున్న సీట్లు.. నైపుణ్యాలు పెంచడమే లక్ష్యంగా..
Sakshi Education
ఐఐటీల్లో కొత్త ప్రోగ్రామ్‌ల్లో దాదాపు వేయి నుంచి 1200 సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఐఐఎంలలో నాలుగు వందల నుంచి అయిదు వందల సీట్లు అదనంగా లభించే వీలుంది. ఈడబ్ల్యూఎస్ కోసం కేటాయించే సూపర్ న్యూమరరీ సీట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. ఈ మొత్తం సీట్లు మరో అయిదు నుంచి పది శాతం పెరగొచ్చు.
కొత్త ప్రోగ్రామ్‌లు.. ముఖ్యాంశాలు..
- ఆధునిక అవసరాలు, సాంకేతికతకు సరితూగేలా కొత్త ప్రోగ్రామ్‌లు.
- మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్.
- బీటెక్, బీటెక్+ఎంటెక్, బీఎస్+ఎంఎస్ విధానంలో కోర్సులు.
- జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు.
- ఐఐటీలు, ఐఐఎంలలో పెరగనున్న సీట్లు
- ఆన్‌లైన్ విధానంలో ఆధునిక సాంకేతిక కోర్సులు
ఈ నైపుణ్యాలు పెంచడమే..
ఐఐటీల్లో కొత్త ప్రోగ్రామ్‌ల ప్రధాన ఉద్దేశం.. విద్యార్థులకు రియల్ టైమ్ ఇండస్ట్రీ నైపుణ్యాలను అందించడమే! దీంతోపాటు ఇంటర్ డిసిప్లినరీ విధానంలో బహుళ నైపుణ్యాలు సొంతంచేసుకునేలా తీర్చిదిద్దనున్నారు. తద్వారా విద్యార్థులు తమ కోర్ అంశాలే కాకుండా.. ఇతర విభాగాల్లోనూ నైపుణ్యాలు పొందగలుగుతారు. ఫలితంగా భవిష్యత్తులో అవకాశాలు అందుకోవడంలో ముందుంటారు.
–ప్రొ‘‘బీఎస్ మూర్తి, డైరెక్టర్, ఐఐటీ–హైదరాబాద్
ఇంకా చదవండి : part 1 : ఆధునిక నైపుణ్యాలు అందించేలా.. ఐఐటీలు, ఐఐఎంల్లో కొత్త కోర్సులు.. !
Published date : 24 Jun 2021 01:44PM