ఐఐపీఎస్‌లో చదివిన వారికి అంతర్జాతీయంగా అవకాశాలు.. రిక్రూట్‌మెంట్ చేసుకొనే కంపెనీలు ఇవే..
Sakshi Education
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్) కోర్సుల్లో చేరి.. విజయవంతంగా చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనడంలో సందేహం లేదు.
ఇక్కడ విద్యనభ్యసించినవారు ఐక్యరాజ్యసమితి, యునిసెఫ్, యూఎన్‌డీపీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, ఇండియన్ హెల్త్ యాక్షన్ ట్రస్ట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, మెకన్సే అండ్ కంపెనీ, టిస్, రిలయన్స్ ఫౌండేషన్, మ్యాజిక్ 9 వంటి సంస్థలు అవకాశాలు కల్పిస్తున్నాయి. గతేడాది ఇక్కడ చదివినవారికి నూరుశాతం ప్లేస్‌మెంట్స్ లభించినట్టు ఐఐపీఎస్ ప్రకటించింది.
ముఖ్య సమాచారం:
ముఖ్య సమాచారం:
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరి తేది: 18.03.2021
- పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్(పీడీఎఫ్)కు 2021 జూలై 1వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- ఆయా కోర్సులకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ తేది: 2021 ఏప్రిల్ 10.
- వివరాలు, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు వెబ్‌సైట్: https://www.iipsindia.ac.in/
Published date : 13 Mar 2021 02:46PM