Skip to main content

కేంద్ర బడ్జెట్ 2021-22

కరోనా వైరస్ విజృంభణతో మునుపెన్నడు చూడని సంక్షోభాన్ని భారత్ ఎదుర్కొంది. సాధారణ జన జీవనం అస్తవ్యస్తమైంది. ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో 2021- 22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కరోనా సృష్టించిన విధ్వంసంతో అస్తవ్యస్తమైన వ్యవస్థలను గాడిన పెట్టడంతో పాటు, భవిష్యత్తులో విశ్వ యవనికపై భారత పతాకాన్ని రెపరెపలాడించే ఆర్థిక ప్రణాళికను దేశప్రజల ముందుంచారు. స్వల్పకాలం ఊరట కల్పించే పథకాల ప్రకటన కన్నా దీర్ఘకాలంలో దేశాభివృద్ధికి బాటలు వేసే వ్యవస్థీకృత కార్యక్రమాలపై ఈ బడ్జెట్‌లో దృష్టి పెట్టారు.


తొలిసారిగా
స్వతంత్ర భారతావనిలో తొలిసారిగా 2021 ఏడాది కాగిత రహిత (పేపర్‌లెస్) బడ్జెట్ ప్రవేశ పెట్టారు. కరోనా ముప్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక మంత్రి సంప్రదాయ బాహీఖాతాను వదిలి దేశీయ ట్యాబ్‌లో చూసి బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. బడ్జెట్‌కి సంబంధించిన వివరాలు, ప్రతులను indiabudget.gov.in పోర్టల్, యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌లో ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.

ఆరు కీలక రంగాలు పునాదులుగా...
ఆరు కీలక రంగాలు పునాదులుగా 2021-22 బడ్జెట్‌ను రూపొందించామని ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. ఆరు రంగాలు ఇవే..

 1. స్వాస్థ భారత్
 2. పెట్టుబడులు- మౌలిక సదుపాయాలు
 3. సమగ్ర సమ్మిళిత పురోగతి(సమ్మిళిత వృద్ధి)
 4. మానవ వనరుల అభివృద్ధి
 5. సృజనాత్మకత- పరిశోధన-అభివృద్ధి
 6. కనీస ప్రభుత్వం- గరిష్ట పాలన


ఎనిమిది అంశాలపై ప్రధానంగా దృష్టి...
దేశమే ముందు(నేషన్ ఫస్ట్) అనే సంకల్పంలో భాగంగా 2021-22 బడ్జెట్‌కు ఎనిమిది ప్రాధాన్య రంగాలను గుర్తించినట్లు మంత్రి నిర్మల తెలిపారు. ఆ ఎనిమిది అంశాలు ఇవే...

 1. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం
 2. బలమైన మౌలిక వసతుల కల్పన
 3. 3 స్వాస్థ భారత్,(ఆరోగ్య భారత్)
 4. సుపరిపాలన
 5. యువతకు ఉపాధి అవకాశాలు
 6. అందరికీ విద్య
 7. మహిళా సాధికారత
 8. సమ్మిళిత వృద్ధి


బడ్జెట్ స్వరూపం(అంకెలు రూ. కోట్లలో)

మొత్తం బడ్జెట్ 34,83,236
రెవెన్యూ వసూళ్లు 17,88,424
మూలధన వసూళ్లు 16,94,812
మొత్తం వసూళ్లు 34,83,236
రెవెన్యూ లోటు 11,40,576
ద్రవ్య లోటు 15,06,812


రూపాయి రాక (అంకెలు పైసల్లో)

రుణేతర మూలధన వసూళ్లు 5
ఇతర అప్పులు 36
పన్నేతర ఆదాయం 6
కస్టమ్స్ 3
జీఎస్టీ 15
కార్పొరేషన్ ట్యాక్స్ 13
కేంద్ర ఎక్సైజ్‌ సుంకాలు 8
ఆదాయపు పన్ను 14


రూపాయి పోక (అంకెలు పైసల్లో)

కేంద్ర ప్రాయోజిత పథకాలు 9
సబ్సిడీలు 9
రక్షణ రంగం 8
వడ్డీ చెల్లింపులు 20
పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా 16
ఫైనాన్స్ కమిషన్, బదిలీలు 10
కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలు 13
ఇతర ఖర్చులు 10
పింఛన్లు 5

 


ఇదీ బడ్జెట్ సమగ్ర స్వరూపం (అంకెలు రూ.కోట్లలో)

 

 

 

2019-2020 వాస్తవ కేటాయింపులు

2020-2021 బడ్జెట్ అంచనాలు

2020-2021 సవరించిన అంచనాలు

2021-2022 బడ్జెట్ అంచనాలు

1. రెవెన్యూ వసూళ్లు(2+3)

16,84,059

20,20,926

15,55,153

17,88,424

2. పన్ను ఆదాయం

13,56,902

16,35,909

13,44,501

15,45,396

3. పన్నేతర ఆదాయం

3,27,157

3,85,017

2,10,652

2,43,028

4. మూలధన వసూళ్లు (5+6+7)

10,02,271

10,21,304

18,95,152

16,94,812

5. రుణాల రికవరీ

18,316

14,967

14,497

13,000

6. ఇతర వసూళ్లు

50,304

2,10,000

32,000

1,75,000

7. అప్పులు, ఇతరత్రా వసూళ్లు

9,33,651

7,96,337

18,48,655

15,06,812

8. మొత్తం వసూళ్లు (1+4)

26,86,330

30,42,230

34,50,305

34,83,236

9. మొత్తం వ్యయం (10+13)

26,86,330

30,42,230

34,50,305

34,83,236

10. రెవెన్యూ ఖాతా

23,50,604

26,30,145

30,11,142

29,29,000

11. వడ్డీ చెల్లింపులు

6,12,070

7,08,203

6,92,900

8,09,701

12. మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు

1,85,641

2,06,500

2,30,376

2,19,112

13. మూలధన ఖాతా

3,35,726

4,12,085

4,39,163

5,54,236

14. రెవెన్యూ లోటు (10-1)

6,66,545

6,09,219

14,55,989

11,40,576

15. నికర రెవెన్యూలోటు
(14-12)

4,80,904

4,02,719

12,25,613

9,21,464

16. ద్రవ్య లోటు {9-(1+5+6)}

9,33,651

7,96,337

18,48,655

15,06,812

17. ప్రాథమిక లోటు (16-11)

3,21,581

88,134

11,55,755

6,97,111


ధరలు పెరిగేవి, తగ్గేవి...
రిఫ్రిజిరేటర్ల నుంచి మొదలుకొని, ఏసీలు, ఎల్‌ఈడీ లైట్లు, మొబైల్ ఫోన్ల ధరలకు రెక్కలు రానున్నాయి. ఎందుకంటే వీటి తయారీలో వినియోగించే విడిభాగాల దిగుమతులపై తాజా బడ్జెట్‌లో సుంకాలు పెంచారు. బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ధరలు పెరిగేవి, తగ్గే వాటి వివరాలు ఇవి..

ధరలు పెరిగేవి..

 

ఉత్పత్తులు ప్రస్తుత సుంకం (%) పెరిగిన తర్వాత (%)
రిఫ్రిజిరేటర్, ఎయిర్‌కండీషనర్ల కంప్రెషర్స్ 12.5 15
ఎల్‌ఈడీ ల్యాంప్‌లు, విడిభాగాలు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్‌లు 5 10
సోలార్ ఇన్వర్ట్‌లు 5 20
సోలార్ లాంతర్లు 5 15
ముడి సిల్క్ 10 15
కాటన్ 0 5
మొబైల్ ఫోన్ల విడిభాగాలు: పీఈబీఏ, కెమెరా మాడ్యూల్, కనెక్టర్లు, బ్యాక్ కవర్, సైడ్‌కీలు, మొబైల్ ఫోన్ చార్జర్ విడిభాగాలు 0 2.5
ఆటోమొబైల్ టఫెండ్ గ్లాస్, వైండ్‌స్క్రీన్ వైపర్లు, సిగ్నలింగ్ ఎక్విప్‌మెంట్ 10 15
లిథియం అయాన్ బ్యాటరీ ముడి పదార్థాలు 0 2.5
ఇంక్ క్యాట్రిడ్జెస్, ఇంక్ స్ప్రే నాజిల్ 0 2.5
ఫినిష్డ్ (తుది) తోలు ఉత్పత్తులు 0 10
కట్, పాలిష్డ్ సింథటిక్ స్టోన్స్ 7.5 15


ధరలు తగ్గేవి..

ఉత్పత్తులు ప్రస్తుత సుంకం (%) తగ్గిన తర్వాత (%)
దిగుమతి నైలాన్ ఫైబర్ 7.5 5
బంగారం, వెండి 12.5 7.5
ముడి బంగారం 11.85 6.9
ముడి వెండి 11 6.1
ప్లాటినమ్ 12.5 10
వైద్య ఉపకరణాలు (అంతర్జాతీయ
సంస్థలు దిగుమతి చేసుకునేవి)
5(హెల్త్‌సెస్) 0


ముఖ్య రంగాలు/పథకాలు/శాఖలు-కేటాయింపులు

రంగం/శాఖ/పథకం కేటాయింపులు(రూ. కోట్లలో)
వ్యవసాయం, అనుబంధ రంగాలు 1,48,301
గ్రామీణాభివృద్ధి 1,31,519
విద్యా రంగం 93,224
మధ్యాహ్న భోజన పథకం 11,500
గిరిజన సంక్షేమం 7,524
నైపుణ్యాభివృద్ధి 3000
సమగ్ర శిక్ష అభియాన్ 31,050.16
ఆరోగ్య రంగం 2,23,846
ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 71,268.77
కోవిడ్ వ్యాక్సిన్ కోసం 35,000
సాంఘిక న్యాయం, సాధికారత శాఖ 11,689
మెనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 4,810.77
కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ 1,005
రక్షణ రంగం 4,78,000
పౌర విమానయాన శాఖ 3,224
యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ 2596.14
ప్రభుత్వ రంగ బ్యాంకులు 20,000
సింగరేణి కాలరీస్ 2,500
జనగణన 3,726
సముద్ర అధ్యయన మిషన్ 4,000
భారత్ నెట్ 7000
మౌలిక వసతుల ప్రాజెక్టులు 5,54000
రోడ్లు, ఉపరితల రవాణా శాఖ 1,18,101
రైల్వే శాఖ 1,10,055
శాస్త్ర, సాంకేతిక శాఖ 14,793.66
అంతిరిక్ష విభాగం 13,949
హోం మంత్రిత్వ శాఖ 1,66,547
పర్యాటక శాఖ 2,026
పీఎం కిసాన్ పథకం 65,000
ఉపాధి హామీ(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) 73,000
స్వచ్చ భారత్ రెండో దశ 12,294
జల్ జీవన్ మిషన్ 50,011
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన 3,600
ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) 15,000
ప్రధానమంత్రి ఆవాస్ యోజన్( పీఎంఏవై) 19,500
ఆత్మ నిర్భర్ స్వాస్థ్య యోజన 64,180
పొరుగు దేశాలకు సాయం 7,100
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతవరణ శాఖ 2,869.93

 

వ్యవసాయం, అనుబంధ రంగాలు
nirmala వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేయడం, రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు కొనసాగుతాయని మంత్రి నిర్మల తెలిపారు. ఈ మేరకు 2021-22 బడ్జెట్ వ్యవసాయ రంగానికి తగని కేటాయింపులు జరిపినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రుణాల లక్ష్యంలో ఈ సంవత్సరం 10 శాతం పెంపును ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఈ పెంపుతో రైతులకు రూ. 16.5 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు అందుబాటులో ఉంటాయన్నారు.


nirmala ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ విస్తరణ...
వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తుల విలువ, ఎగుమతులను పెంచేందుకు ప్రస్తుతం అమలు చేస్తున్న ఆపరేషన్ గ్రీన్ స్కీమ్‌ను మరింత విస్తరిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పథకం కేవలం టమాటాలు, బంగాళదుంప, ఉల్లిపాయలకు మాత్రమే వర్తిస్తూండగా.. మరో 22 ఉత్పత్తుల (త్వరగా నశించిపోయేవి)ను పథకంలో చేర్చనున్నారు.

ముఖ్యాంశాలు...

 

 • పంటల ఉత్పత్తి వ్యయానికి 1.5 రెట్లు ఎక్కువగా మద్దతు ధర ఇచ్చేందుకు తగిన మార్పులు.
 • వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు 2021-22 బడ్జెట్‌లో మొత్తం రూ.1,31,531 కోట్లు కేటాయింపు. ఇందులో రూ.1,23,017.57 కోట్లు వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉపయోగించుకుంటుంది. మిగిలిన రూ.8,513 కోట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కోసం వినియోగిస్తారు.
 • పీఎం-కిసాన్ కార్యక్రమానికి రూ.65,000 కోట్లు కేటాయింపు.
 • పంట నిల్వకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కొత్తగా ప్రతిపాదించిన అగ్రి సెస్ మొత్తం వినియోగం.
 • స్వమిత్వ పథకంలో భాగంగా 1.8 లక్షల మంది రైతులు ప్రాపర్టీ పట్టాలు పొందారు.
 • వ్యవసాయ మార్కెట్లకు ఇకపై అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అందుబాటులో ఉంటుంది.
 • మరో వెయి్య మండీలను ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్(ఈ-నామ్)లో చేర్పు.
 • దేశంలోని విశాఖపట్నం, చెన్నై, కొచ్చి, పారాదీప్, పెటువఘాట్ ఫిషింగ్ హార్బర్‌లను ‘ఎకనమిక్ యాక్టివిటీ హబ్స్’గా ఆధునీకరణ.
 • నదీతీరాల్లో, జలమార్గాల్లోనూ మత్స్య సంపద కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు.
 • తమిళనాడులో సముద్రపు నాచు పెంపకానికి ఓ కేంద్రం ఏర్పాటు.
 • ఇతర దిగుమతులతో పాటు పెట్రోలు, డీజిల్‌లపై కూడా అగ్రి సెస్ విధింపు. లీటరు పెట్రోలుపై రూ. 2.5ను, లీటరు డీజిల్‌పై రూ. 4ను అగ్రిసెస్‌గా విధింపు.

గ్రామీణ భారతం
nirmala కరోనా మహమ్మారి దెబ్బకు తీవ్రంగా కుదేలైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోంది. తాజా బడ్జెట్‌ల గ్రామీణాభివృద్ధి, ఫ్లాగ్‌షిప్ పథకాలకు పెద్దపీట వేసింది. ముఖ్యంగా తాగునీరు, స్వచ్ఛ భారత్, ఇళ్ల నిర్మాణానికి దండిగా నిధులు వెచ్చించారు.

nirmala గామీణాభివృద్ధికి పథకాలకు ఇలా...
 • 2021-22 కేటాయింపు: రూ.1,31,519 కోట్లు (9.5 శాతం పెంపు)
 • 2020-21 కేటాయింపు: రూ.1,20,148 కోట్లు (సవరించిన అంచనా: రూ.1,97,377 కోట్లు)


జాతీయ ఉపాధి హామి పథకం...

 • 2021-22 కేటాయింపు: రూ. 73,000 కోట్లు (19 శాతం పెంపు)
 • 2020-21 కేటాయింపు: రూ. 61,500 కోట్లు (సవరించిన అంచనా: రూ. 1,11,500 కోట్లు)
 • 2019-20లో సగటు రోజు కూలీ రూ.182 ఉండగా, దీన్ని 2020-21 ఏప్రిల్ 1 నుంచి 10 శాతం పెంపుతో రూ.200కు చేర్చారు.
 • మొత్తం 708 జిల్లాలు, 7,092 బ్లాక్‌లు, 2,68,561 గ్రామ పంచాయితీల్లో ఈ పథకం అమలవుతోంది.
 • 2021 జనవరి 29 నాటికి ఈ పథకం కింద 14.82 కోట్ల జాబ్ కార్డులు జారీ కాగా, ఇందులో చురుకై న జాబ్ కార్డుల సంఖ్య 9.25 కోట్లు. 28.72 కోట్ల మంది కార్మికులు జాబితాలో ఉండగా, 14.4 కోట్ల మంది కార్మికులు చురుగ్గా ఉపాధి పొందుతున్నారు.


దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన...

 • 2021-22 కేటాయింపు: రూ. 3,600 కోట్లు (20 శాతం తగ్గింపు, కానీ సవరించిన అంచనా ప్రకారం 125 శాతం పెంపు)
 • 2020-21 కేటాయింపు: రూ.4,500 కోట్లు (సవరించిన అంచనా: రూ.2,000 కోట్లు)


ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై)...

 • 2021-22 కేటాయింపు: రూ. 15,000 కోట్లు (30% తగ్గింపు) (9.5% పెంపు)
 • 2020-21 కేటాయింపు: రూ. 19,500 కోట్లు (సవరించిన అంచనా రూ.13,706 కోట్లు)
 • 2000 సంవత్సరంలో పీఎంజీఎస్‌వై పథకం ఆరంభం నుంచి 2021 జనవరి 20 నాటికి 1,70,034 గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించారు.
 • మొత్తం 7,47,990 కిలోమీటర్ల పొడవైన పక్కా రోడ్లకు ఆమోదం లభించగా, 6,43,999 కిలోమీటర్ల రోడ్లను నిర్మించారు.
 • ప్రస్తుత ప్రాజెక్టులను రాష్ట్రాల భాగస్వామ్యంతో పూర్తి చేయాలంటే 2025 నాటికి ఏటా రూ.19,000 కోట్లు అవసరం అవుతాయి.


స్వచ్ఛ భారత్(గ్రామీణం) రెండో దశ...

 • 2021-22 కేటాయింపు: రూ. 12,294 కోట్లు (మారలేదు, కానీ సవరించిన అంచనా ప్రకారం 76% పెంపు)
 • 2020-21 కేటాయింపు: రూ.12,294 కోట్లు (సవరించిన అంచనా: రూ.7,000 కోట్లు)
 • 2019 నాటికి 10 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది.
 • రెండో దశ స్వచ్ఛ భారత్‌ను 2020 ఫిబ్రవరి 19న ప్రారంభించారు. 2024-25 వరకు ఇది కొనసాగుతుంది. ఇందుకు రూ.1.4 లక్షల కోట్లను కేటాయించనున్నారు.


ప్రధానమంత్రి ఆవాస్ యోజన్( పీఎంఏవై)...

 • 2021-22 కేటాయింపులు: రూ. 19,500 కోట్లు (మారలేదు)
 • 2020-21 కేటాయింపులు: రూ.19,500 కోట్లు
 • 2019 నాటికి గ్రామాల్లో కోటి పక్కా ఇళ్ల నిర్మాణం జరిగింది. 2022 నాటికి మరో 1.95 లక్షల ఇళ్లు నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.


జల్ జీవన్ మిషన్...

 • 2021-22 కేటాయింపులు: 50,011 కోట్లు (335 శాతం పెంపు)
 • 2020-21 కేటాయింపులు: రూ.11,500 కోట్లు
 • స్వచ్ఛమైన తాగునీటిని అందరికీ అందించేందుందుకు 2019-20లో జల్ జీవన్ మిషన్‌ను ప్రకటించారు.
 • 2024 నాటికి గ్రామీణ కుటుంబాలన్నింటికీ (హర్ ఘర్ జల్) తాగునీటిని (హ్యాండ్ పంపులు, కుళాయిలు ఇతరత్రా మార్గాల్లో) అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం మొత్తం రూ.3.6 లక్షల కోట్లను వెచ్చించనున్నారు.


భారత్ నెట్...

 • 2021-22 కేటాయింపు: రూ. 7,000 కోట్లు (17 శాతం పెంపు)
 • 2020-21 కేటాయింపు: రూ.6,000 కోట్లు (సవరించిన అంచనా: రూ.5,500 కోట్లు)
 • భారత్ నెట్ కింద 2021 జనవరి 15 నాటికి మొత్తం 1.63 లక్షల గ్రామ పంచాయతీలకు 4.87 లక్షల కిలోమీటర్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు.


ఆరోగ్య రంగం
nirmalaకరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆరోగ్య రంగంలో స్వావలంబన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికే పెద్ద పీట వేసింది. కోవిడ్-19 వ్యాక్సిన్‌కు కేటాయించిన రూ. 35 వేల కోట్లు సహా మొత్తంగా రూ. 2, 23, 846 లక్షల కోట్లను కేటాయించింది. ఇది ఈ రంగానికి గత సంవత్సరంలో కేటాయించిన మొత్తం కన్నా 137 శాతం అధికం. ఆత్మ నిర్భర భారత్ పునాదుల్లో ఆరోగ్య భారత్ అత్యంత కీలకమైనదని నిర్మలమ్మ చెప్పారు. 2020-21 సంవత్సరంలో ఆరోగ్య రంగంలో బడ్జెట్ అంచనాలు రూ.94,452 కోట్లు కాగా, 2021-22లో అంచనాలు రూ.2 లక్షల 23 వేల 846 కోట్లు.

మరోవైపు ఇన్నాళ్లూ అమల్లో ఉన్న సప్లిమెంటరీ న్యూట్రిషియన్ ప్రోగ్రామ్, పోషణ్ అభియాన్ కార్యక్రమాల్ని కలిపేసి మిషన్ పోషణ్ 2.0 కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారు. దీని కింద 112 జిల్లాల్లో పోషకాహారాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటారు.

ముఖ్యాంశాలు...

 • కోవిడ్-19 వ్యాక్సిన్‌కు రూ. 35 వేల కోట్లు కేటాయింపు.
 • ఆత్మనిర్భర్ స్వాస్థ్య యోజన పథకం కోసం రూ. 64,180 కోట్లు
 • ఆరోగ్య రంగంలో పరిశోధనల కోసం రూ. 2,663 కోట్లు కేటాయింపు
 • ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు రూ. 71,268.77కోట్లు


ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన...
జాతీయ ఆరోగ్య మిషన్ కాకుండా మరో కొత్త ఆరోగ్య పథకాన్ని తాజా బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. ‘‘ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన’’ పేరిట వస్తున్న ఈ పథకం కోసం 64 వేల కోట్లు కేటాయించింది. వచ్చే ఆరేళ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు. ప్రాథమిక, మాధ్యమిక, ప్రాంతీయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఈ పథకం ద్వారా ఏమేం చేస్తారంటే...

 • ఆరోగ్య శ్రేయస్సు కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఏర్పాటు
 • గ్రామీణ ప్రాంతాల్లో 17,788, పట్టణ ప్రాంతాల్లో 11,024 ఆరోగ్య, సంరక్షణ కేంద్రాల ఏర్పాటు
 • కొత్తగా నాలుగు ప్రాంతాల్లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఫర్ వైరాలజీ
 • ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి 15 హెల్త్ ఎమర్జెన్సీ సెంటర్లు, రెండు మొబైల్ ఆస్పత్రులు
 • దేశవ్యాప్తంగా ప్రతీ జిల్లాలో ప్రజారోగ్య ల్యాబ్స్, 11 రాష్ట్రాల్లో బ్లాక్ స్థాయిలో 3,382 ప్రజారోగ్య కేంద్రాల ఏర్పాటు
 • నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ), దానికి అనుబంధంగా పనిచేసే అయిదు శాఖల్ని మరింత పటిష్టపరచడం
 • ప్రస్తుతం ఉన్న 33 ప్రజారోగ్య కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటుగా కొత్తగా 17 కేంద్రాల ఏర్పాటు
 • ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా ప్రాంతం కోసం ప్రాంతీయ పరిశోధనా కేంద్రం ఏర్పాటు
 • తొమ్మిది బయో సేఫ్టీ లెవల్ త్రీ ల్యాబొరేటరీల ఏర్పాటు

విద్యా రంగం nirmala
నూతన జాతీయ విద్యా విధానంలో వివరించిన విద్యా సంస్కరణల మేరకు మానవ వనరుల (పాఠశాల, ఉన్నత విద్యా రంగం) రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి నిర్మల తెలిపారు. మానవ వనరుల విభాగంలో మూలధనం పెంచడంలో భాగంగా చదువు, నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వెల్లడించారు. 2021-2022 బడ్జెట్‌లో పాఠశాల విద్యకు రూ.54,873.66 కోట్లు, ఉన్నత విద్యకు రూ.38,350.65 కోట్లు.. మొత్తంగా విద్యా రంగానికి రూ.93,224.31 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు.

nirmala పాఠశాల విద్య...
 • కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో ప్రతిపాదించిన సంస్కరణల ప్రకారం దేశ వ్యాప్తంగా 15,000 నమూనా పాఠశాలలు ఏర్పాటు.
 • స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ-ప్రైవేట్ క్రీడాకారులు, ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్రాల భాగస్వామ్యంతో దేశ వ్యాప్తంగా 100 కొత్త సైనిక్ పాఠశాలలు ఏర్పాటు.
 • సైనిక్ పాఠశాలలను రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్స్ సొసైటీ స్థాపించి, నిర్వహిస్తోంది. దేశంలో ప్రస్తుతం 30కి పైగా సైనిక్ పాఠశాలలు ఉన్నాయి.


ఉన్నత విద్య

 • స్టాండర్డ్ (ప్రామాణిక) - సెట్టింగ్ (అమరిక), అక్రెడిటేషన్ (గుర్తింపు), రెగ్యులేషన్ (నియంత్రణ), ఫండింగ్ (నిధులు) కోసం నాలుగు వేర్వేరు విభాగాల ఏర్పాటుతో అంబ్రెల్లా స్ట్రక్చర్‌లో భారతదేశ ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు కోసం చట్టం రూపకల్పన
 • -లద్దాఖ్‌లోని లేహ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు.


ఎస్సీ, ఎస్టీల సంక్షేమం

 • గిరిజన సంక్షేమ గురుకుల విద్య కోసం దేశంలో 750 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు.
 • ఈ తరహా స్కూలు నిర్మాణానికి గతంలో రూ.20 కోట్లు ఇస్తుండగా ఈ బడ్జెట్‌లో రూ.38 కోట్లు కేటాయింపు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఒక్కో స్కూలు నిర్మాణానికి రూ.48 కోట్లు కేటాయింపు.


ముఖ్యాంశాలు...

 • దేశంలోని తొమ్మిది నగరాల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ క్లస్టర్ ఏర్పాటు. ఇది విద్యా సంస్థల మధ్య సమన్వయం, స్వయం ప్రతిపత్తి, సమష్టి వృద్ధికి దోహద పడుతుంది.
 • 10 + 2 నిర్మాణాన్ని 5 + 3 + 3 + 4 గా మార్చడంతో పాటు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో కనీసం 5వ తరగతి వరకు బోధన.
 • కేంద్రీయ విద్యాలయాలకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.6,800 కోట్ల కేటాయింపులు.
 • మధ్యాహ్న భోజన పథకం కోసం రూ.11,500 కోట్ల కేటాయింపు.
 • నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (ఎన్‌ఏటీఎస్) కింద ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీ అభ్యర్థుల్లో నైపుణ్య శిక్షణ కోసం రూ.3000 కోట్లు కేటాయింపు. నైపుణ్యం, సాంకేతికత బదిలీ కోసం జపాన్ సహకారంతో శిక్షణ.
 • నైపుణ్య అర్హతలు, అంచనా, ధ్రువీకరణ, సర్టిఫికేషన్ కోసం యూఏఈ సహకారం.
 • కోవిడ్-19 నేపథ్యంలోనూ 30 లక్షల మందికి పైగా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు డిజిటల్‌గా శిక్షణ. 2021-22లో 56 లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలన్నది లక్ష్యం. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్‌‌స అండ్ టీచర్స్ ఫర్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ (నిస్తా) ద్వారా శిక్షణ.
 • పరీక్షలు, రొటీన్ లెర్నింగ్‌కు ప్రాధాన్యత తగ్గించి.. విశ్లేషణాత్మక నైపుణ్యం, నిజ జీవిత పరిస్థితుల ఆధారంగా విద్యార్థులను పరీక్షించడం.
 • వినికిడి లోపం ఉన్న పిల్లల కోసం, దేశ వ్యాప్తంగా భారతీయ సంకేత భాష ఆధారంగా జాతీయ, రాష్ట్ర పాఠ్యాంశాల అభివృద్ధి.


మౌళిక వసతుల రంగం nirmala
మౌలిక వసతుల రంగంలో పెట్టుబడుల కల్పన కోసం 2021-22 బడ్జెట్‌లో ఏకంగా రూ. 5.54 లక్షల కోట్లను ఆర్థికమంత్రి కేటాయించారు. ఇందులో ప్రధానంగా రూ. 1.18 లక్షల కోట్లు రోడ్‌‌స అండ్ హైవే రంగానికి, రూ. 1.08 కోట్లు రైల్వే రంగానికి కేటాయించారు. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ ఏర్పడేందుకు, ఉపాధి కల్పనకు ఈ నిధులు ఉపయోగపడతాయని తెలిపారు. ఇందుకు అదనంగా అవసరమైన నిధులను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సాధిస్తామన్నారు.

ముఖ్యాంశాలు...

 • వ్యూహాత్మక రంగంలో లేని ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాల ఉపసంహరణ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లు, కొత్తగా విధించిన అగ్రి సెస్ ద్వారా రూ. 30 వేల కోట్లు సమీకరించాలి.
 • దేశీయ టెక్స్‌టైల్స్ రంగం అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా దేశవ్యాప్తంగా రానున్న మూడేళ్లలో ఏడు ‘మెగా టెక్స్‌టైల్స్ ఇన్‌వెస్ట్‌మెంట్ పార్క్’లను ఏర్పాటు చేయాలి.

భారతీయ రైల్వే nirmala
రైల్వే కోసం 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.1,10,055 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రూ.1,07,100 కోట్లు మూలధన వ్యయంగా పేర్కొన్నారు. 2020-21 సవరించిన బడ్జెట్ (రూ.1.11 లక్షల కోట్లు) కంటే ఇది తక్కువే.

పదేళ్ల ప్రణాళిక...
2030 కల్లా భవిష్యత్ అవసరాలకు తగిన (ఫ్యూచర్ రెడీ) రైల్వే వ్యవస్థను సృష్టించడం ప్రధాన లక్ష్యంగా భారత జాతీయ రైలు ప్రణాళిక 2030కి రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా.. మేక్ ఇన్ ఇండియా వ్యూహానికి ఊతం ఇచ్చేలా పరిశ్రమల రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు వీలుగా.. 2022 జూన్ కల్లా తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు (డీఎఫ్‌సీ) ప్రారంభించాలని నిర్ణయించారు.

ఖరగ్‌పూర్ - విజయవాడ...
ఈస్ట్ డీఎఫ్‌సీలో భాగంగా 2021-22లో సోన్‌నగర్-గోమోహ్ సెక్షన్‌ను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)లో చేపడతారు. ఆ తర్వాత గోమోహ్-డాంకుని సెక్షన్ చేపడతారు. భవిష్యత్తులో ఖరగ్‌పూర్ - విజయవాడ ఈస్ట్ కోస్ట్ కారిడార్‌ను, భూసావాల్ - ఖరగ్‌పూర్ - డాంకుని ఈస్ట్ వెస్ట్ కారిడార్, అలాగే ఇటార్సీ - విజయవాడ నార్త్ సౌత్ కారిడార్‌ను చేపడతారు.

ముఖ్యాంశాలు...
 • 2020 అక్టోబర్ 1 నాటికి 41,548 రూట్ కిలోమీటర్లు (ఆర్‌కేఎం)గా ఉన్న బ్రాడ్ గేజ్ రూట్ విద్యుద్దీకరణ 2021 చివరి నాటికి 46,000 రూట్ కిలోమీటర్లకు (72 శాతం)చేరుకుంటుంది. 2023 కల్లా 100 శాతం విద్యుద్దీకరణ పూర్తవుతుంది.
 • పర్యాటక రూట్లలో మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణాలకు వీలుగా ఆకర్షణీయంగా డిజైన్ చేసిన విస్టా డోమ్ ఎల్‌హెచ్‌బీ రైల్వే కోచ్‌లను ప్రవేశపెట్టనున్నారు.
 • మానవ తప్పిదాల కారణంగా రైళ్లు ఢీకొనడం వంటి ప్రమాదాలు నివారించేందుకు దేశీయంగా డిజైన్ చేసిన ఆటోమేటిక్ వ్యవస్థ ప్రవేశపెట్టనున్నారు.
 • చెన్నై మెట్రో కోసం రూ.63,246 కోట్లు, బెంగళూరు మెట్రోకు రూ.14,788 కోట్లు, కొచ్చి మెట్రో రైల్వేకు రూ. 1,957.05 కోట్లు, నాగ్‌పూర్ మెట్రోకు రూ.5,976 కోట్లు, నాసిక్ మెట్రోకు రూ.2,092 కోట్లు కేటాయింపు.


రహదారులు, ఉపరితల రవాణా
రహదారులు, ఉపరితల రవాణాకు 2021-22 బడ్జెట్‌లో ూ.1,18,101 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.1,08,230 కోట్లు మూలధనం కింద కేటారయించారు. గతేడాది ఉపరితల రవాణాకు రూ.91,823 కోట్లు కేటాయించగా సవరించిన అనంతరం రూ.1.01 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఆర్థిక ఏడాది హైవే కారిడార్ల అభివృద్ధిని ప్రాధాన్యత కింద చేపడతామన్నారు.

ఫ్లాగ్ షిప్ కారిడార్లు / ఎక్స్‌ప్రెస్ వేస్..

 • ఢిల్లీ - ముంబై ఎక్స్‌ప్రెస్ వే: మిగిలిన 260 కి.మీ పనులు 2021 మార్చి 31లోగా కేటాయింపు.
 • బెంగళూరు - చెన్నై ఎక్స్‌ప్రెస్ వే: 278 కి.మీ. మేర నిర్మాణం, 2021-22లో పనులు ప్రారంభమవుతాయి.
 • కాన్పూర్ - లక్నో ఎక్స్‌ప్రెస్ వే: జాతీయ రహదారి 27కి ప్రత్యామ్నాయంగా 63 కి.మీ. మేర ఎక్స్‌ప్రెస్ వే పనులను 2021--22లో చేపడతారు.
 • ఢిల్లీ - డెహ్రాడూన్ ఆర్థిక కారిడార్: 210 కి.మీ పొడవైన ఆర్థిక కారిడార్ నిర్మాణ పనులు 2021--22లో మొదలవుతాయి.
 • రాయ్‌పూర్ - విశాఖపట్టణం కారిడార్: చత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా 464 కి.మీ. పొడవైన కారిడార్ నిర్మాణ పనులను ప్రస్తుత ఆర్థిక సంవత్సంలోనే కేటాయిస్తారు. 2021-22లో పనులు ప్రారంభమవుతాయి.
 • చెన్నై - సేలం కారిడార్: 277 కి.మీ. పొడవైన ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ పనులు 2021-22లో మొదలవుతాయి.
 • అమృత్‌సర్ - జామ్‌నగర్ : 2021-22లో పనులు ప్రారంభమవుతాయి.
 • ఢిల్లీ - కాట్రా : 2021-22లో నిర్మాణ పనులు ప్రారంభం.


ముఖ్యాంశాలు...

 • తమిళనాడులో 3,500 కి.మీ మేర జాతీయ రహదారుల కోసం రూ.1.03 లక్షల కోట్లు
 • కేరళలో 1,100 కి.మీ. జాతీయ రహదారుల కోసం రూ.65,000 కోట్లు
 • పశ్చిమ బెంగాల్‌లో 675 కి.మీ. జాతీయ రహదారుల కోసం రూ.25,000 కోట్లు
 • అసోంలో మూడేళ్లలో 1,300 కి.మీ. జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.34,000 కోట్లు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.19,000 కోట్లతో జరుగుతున్న జాతీయ రహదారుల పనులకు ఇది అదనం.
 • కొత్తగా నిర్మాణం చేపట్టే 4, 6 వరుసల రహదారుల్లో అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం అమలు


రక్షణ రంగం nirmala
2021-22 బడ్జెట్ రక్షణ శాఖకు రూ.4.78 లక్షల కోట్లు కేటాయించారు. దీన్ని గత ఏడాది (రూ.4.71 లక్షల కోట్లు) తో పోల్చుకుంటే స్వల్పంగా 1.4 శాతం పెరిగింది. ఇది స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1.63 శాతం. 2021-22 ఏడాది రక్షణ బడ్జెట్‌లో మూలధన వ్యయం రూ.1,35,060 కోట్లుగా మంత్రి నిర్మల తెలిపారు. ఇందులో కొత్త ఆయుధాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, యుద్ధ నౌకలు ఇతర మిలటరీ సామగ్రి కొనుగోలు ఖర్చును కూడా కలిపారు.


గత పదేళ్లలో బడ్జెట్ రక్షణ ఇలా..

ఆర్థిక ఏడాది (అంకెలు రూ. లక్షల కోట్లలో)

2011-12

1.64

2012-13

1.93

2013-14

2.03

2014-15

2.29

2015-16

2.46

2016-17

3.40

2017-18

3.59

2018-19

4.04

2019-20

4.31

2020-21

4.71

 

సైన్స్ అండ్ టెక్నాలజీ

 

 1. 2021-22 కేటాయింపులు రూ.14,793.66
 2. 2020-21 కేటాయింపులు రూ.11,551.86

శాస్త్ర, సాంకేతిక శాఖకు కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో రూ.14,793.66 కోట్లు కేటాయించింది. 2020-21 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే ఇది 20 శాతం అధికం. అలాగే ఎర్త్ సెన్సైస్ శాఖకు ప్రత్యేకంగా రూ.1,897.13 కోట్లు కేటాయించారు.

డీప్ ఓషన్ మిషన్...
దేశంలో ‘డీప్ ఓషన్ మిషన్’ను ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఇందుకోసం ఐదేళ్లలో రూ.4,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. సముద్రాలపై అధ్యయనం, సర్వే, సముద్రాల్లోని జీవవైవిధ్యాన్ని పరిరక్షించడమే ఈ ప్రాజెక్టు ఉదేశం.

అంతరిక్ష విభాగానికి రూ.13,949 కోట్లు
అంతరిక్ష విభాగానికి కేంద్రం తాజా బడ్జెట్‌లో రూ.13,949 కోట్లు కేటా యించింది. ఈ మొత్తంలో రూ.700 కోట్లను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ రంగ సంస్థ ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’కు కేటాయించారు.

హోం శాఖకు రూ.1,66,547 కోట్లు
కేంద్ర హోంశాఖకు 2021-22 బడ్జెట్‌లో రూ. 1,66,547 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోల్చితే ఇది 11.48 శాతం అధికం. ఇందులో మెజారిటీ నిధులు కేంద్ర సాయుధ బలగాల నిర్వహణకు, జనగణనకు సంబంధించిన కార్యకలాపాలకు వినియోగించనున్నారు.

ద్రవ్యలోటు
nirmala2021-22 ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ఆదాయ-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు అంచనాలను 9.5 శాతానికి (స్థూల దేశీయోత్పత్తి- జీడీపీలో) సవరిస్తున్నట్లు బడ్జెట్ పేర్కొంది. 2020-21 బడ్జెట్ ప్రకారం 3.5 శాతం వద్ద (రూ. రూ.7.96 లక్షల కోట్లు) కట్టడి చేయాలన్నది లక్ష్యం. అయితే ఆదాయాలు పడిపోవడం, జీడీపీ క్షీణత వంటి అంశాల నేపథ్యంలో డిసెంబర్ నాటికే ఈ మొత్తం రూ.11,58,469 కోట్లకు (వార్షిక బడ్జెట్ అంచనాల్లో 145.5 శాతానికి అప్) పెరగడం తాజా సవరణ నేపథ్యం.

ఇక రానున్న ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 6.8 శాతానికి కట్టడి చేయాలన్నది బడ్జెట్ లక్ష్యమని వివరించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళతామని ఆర్థికమంత్రి భరోసాను ఇచ్చారు. 2019-20లో ద్రవ్యలోటు 4.6 శాతంగా ఉంది. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం- 2021-22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి.

ముఖ్యమైన అంశాలు

 • బంగారం, వెండి, డోర్ బార్లపై 2.5 శాతం, యాపిల్స్‌పై 35 శాతం, కాబూలీ శనగలపై 30 శాతం, సాధారణ శనగలపై 50 శాతం, బఠానీలపై 10 శాతం అగ్రి సెస్ విధింపు.
 • 2020-21 ద్రవ్యలోటు 9.5 శాతం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతంగా లెక్కింపు.
 • 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు ఇన్‌కంట్యాక్స్ రిటర్న్స్ సమర్పించాల్సిన పనిలేదు. బ్యాంకులే టీడీఎస్ మినహాయిస్తాయి.
 • ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేసేవారు 2014లో 3.31 కోట్లు ఉంటే.. ఆ సంఖ్య 2020కి 6.48 కోట్లకు పెరిగింది.
 • బీమాలో ఎఫ్‌డీఐ 49 శాతం నుంచి 74 శాతానికి పెంపు
 • డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లుగా నిర్ణయం.
 • ఆదాయపన్ను చెల్లింపు శ్లాబుల్లో ఎలాంటి మార్పుల్లేవ్
 • బీపీసీఎల్, ఐడీబీఐ మరో రెండు పీఎస్‌యూ బ్యాంకులు, ఓ బీమా కంపెనీ ప్రైవేటీకరణ
 • కాలం చెల్లిన వాహనాలను స్వచ్ఛందంగాతుక్కు కింద వదిలించు కునేందుకు ప్రత్యేక పాలసీ
 • లీటర్ పెట్రోల్‌పై రూ.2.5, లీటర్ డీజిల్‌పై రూ.4 చొప్పున అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్(ఏఐడీసీ) విధింపు
 • కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు రూ.2,869.93 కోట్లు కేటాయింపులు.
 • వాయుకాలుష్య నివారణకు రూ.3,100 కోట్లు కేటాయింపులు
 • మెగా ఇన్వెస్ట్‌మెంట్ టెక్స్‌టైల్ పార్కులు (మిత్ర) పథకం కింద వచ్చే మూడేళ్లలో ఏడు టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు.
 • మైనార్టీ వ్యవహారాల శాఖకు రూ. 4,810.77 కోట్లు కేటాయింపు.
 • ఈవీఎంల కొనుగోలుకు రూ.1,005 కోట్లు
 • జమ్మూకశ్మీర్‌కు రూ.30,757 కోట్లు కేటాయింపు
 • లద్ధాఖ్‌కు రూ.5,958 కోట్లు కేటాయింపు
 • దేశంలో పరిశోధనలు, ఆవిష్కరణలకు 2021 బడ్జెట్ పెద్దపీట వేసింది. జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాల్లో రాబోయే ఐదేళ్లకు గాను 50,000 కోట్ల రూపాయలను కేటాయించారు.
 • పాలన, ప్రభుత్వ విధివిధానాలకు సంబంధించిన విషయాలు, దేశంలోని ప్రధాన భాషల్లో అందుబాటులో ఉంచేందుకు నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ (ఎన్‌టీఎల్‌ఎం) ఏర్పాటు.
 • సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు సముద్ర గర్భంలో పరిశోధనలకు ఐదేళ్లకు గాను రూ.4,000 కోట్లు కేటాయింపు.
 • పోర్చుగీసు నుంచి రాష్ట్ర విముక్తి ఉత్సవాల్లో భాగంగా, గోవా డైమండ్ జూబ్లీ ఉత్సవాల నిర్వహణ కోసం రూ. 300 కోట్లు కేటాయింపు.
 • బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ప్రతిపాదనలు కనిపించలేదు.
 • డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించేందుకు రూ. 1,500 కోట్లు కేటాయింపు.
 • ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) నిర్దేశిత స్థాయిలో మూలధన నిబంధనలను పాటించేందుకు వీలుగా రూ. 20,000 కోట్లు అదనపు మూలధనం సమకూర్చేలా బడ్జెట్‌లో ప్రతిపాదనలు
 • మార్కెట్ రుణ సమీకరణల లక్ష్యం రూ.12.05 లక్షల కోట్లు.
 • కేంద్ర మూలధన వ్యయాలు రూ.5.54 లక్షల కోట్లు.
 • 20 ఏళ్లు దాటిన వాహనాలు తుక్కుకే: వ్యక్తిగత వాహనాలు 25 ఏళ్లు, కమర్షియల్‌ వాహనాలు 15 ఏళ్లుగా నిర్ధారణ
 • మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు
 • ఇన్వెస్టర్ రక్షణ కోసం కొత్త ఇన్వెస్టర్ ఛార్టర్ ఏర్పాటు
 • ఎన్నారై పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు సరికొత్త వ్యూహం రూప‌క‌ల్పన‌
  బడ్జెట్‌ ప్రసంగం

 
Published date : 11 Aug 2021 05:54PM

Photo Stories